
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరాకాల ప్రేయసి జయ భరద్వాజ్‌ను చాహర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 1న వీరిద్దరి వివాహం జరగనుంది. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే మ్యాచ్ సందర్భంగా దీపక్ చాహర్ తన ప్రేయసి జయ భరద్వాజ్ కి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన జయ భరద్వాజ్ ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది.
కాగా వీరిద్దరి వివాహనికి సంబంధించిన ఆహ్వన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్‌ను సీఎస్‌కే రూ.14 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి చాహర్ దూరమయ్యాడు. త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు చాహర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
చదవండి: IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి!