పెళ్లైన మరుసటి రోజే వధువు...
అన్నానగర్: వివాహం జరిగిన మరుసటి రోజే నూతన వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం ఆనైమలైలో చోటుచేసుకుంది. కోవై జిల్లా ఆనైమలై సమీపంలో ఉన్న దివాన్‌సా. పుదూరైకి చెందిన మణికంఠన్. ఇతని కుమారుడు విజయ్ (21) కూలీ. ఇతనికి అదే ప్రాంతంలో ఉన్న జీవా (19) అనే అమ్మాయికి గత 28వ తేదీ మీనాక్షిపురంలో వివాహం జరిగింది. మరుసటి రోజు జీవా అమ్మమ్మ కమల ఇంట్లో పెళ్లి మరవలి జరిగింది. అనంతరం మరుసటి రోజు మంగళవారం జీవా భర్త విజయ్ ఇంటికి వెళ్లింది.
ఈ క్రమంలో అక్కడ స్నానం చేయడానికి వెళ్లిన జీవా అరగంట అయినా బయటికి రాలేదు. దీంతో బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా కొత్త జీవా చీరతో ఉరి వేసుకుని వేలాడుతుంది. విషమ స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్న ఆమెను వెంటనే పొల్లాచ్చిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ జీవా మృతి చెందింది. ఆనైమలై ఎస్‌ఐ వల్లియమ్మాల్, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.