నవవధువు ఆత్మహత్య
కోరుట్ల: పట్టణంలోని ఆనంద్‌నగర్‌కు చెందిన దావనపల్లి మాధురి(23) అనే నవవధువు శనివారం రాత్రి తన పుట్టింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..పట్టణానికి చెందిన దావనపల్లి గంగాధర్–సుజాత కూతురు మాధురికి గతేడాది నవంబర్‌లో మల్యాల మండల కేంద్రానికి చెందిన బొట్ల శ్రీధర్‌తో వివాహం జరిగింది.
నెలరోజుల క్రితం మాదురికి అత్తవారింట్లో గొడవలు జరగడంతో పుట్టిం టికి వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిం ది. ఆదివారం ఉదయం మెట్‌పల్లి డీఎస్పీ మల్లారెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, తహసీల్దార్ మధు, ఎస్సై కృష్ణకుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.మృతురాలి తల్లి సుజాత ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.