New bride
-
రూ.5 కోట్ల కట్నం సరిపోలేదట.. బెజవాడలో నవవధువుకు వేధింపులు
సాక్షి, విజయవాడ: రూ.5 కోట్లు కట్నం ఇచ్చారు.. అయినా సరిపోలేదంటూ వివాహం జరిగిన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని ఆ వధువు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. విజయవాడ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పని చేస్తున్న చెరుకూరి లక్ష్మణరావు కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక రాయచూర్‌లోకి చెందిన ప్రసన్నకుమార్ కుమార్తె లక్ష్మి కీర్తనకి అజయ్‌తో పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి ముందు నగదు, స్థిరాస్థులు, బంగారం, వెండి మొత్తం కలిపి సుమారు రూ.5 కోట్లు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 7న రాయచూర్‌లో కీర్తన, అజయ్ వివాహం ఘనంగా జరిగింది. అయితే, వివాహం జరిగిన రెండు రోజులకే లక్ష్మి కీర్తనకి కట్నం వేధింపులు మొదలయ్యాయి. మరో రూ.50 లక్షలు తేవాలంటూ అజయ్, లక్ష్మణరావు వేధింపులకు గురిచేశారు. కట్నం కోసం నవ వధువును తండ్రి, కొడుకులు బంధించడంతో... టార్చర్ భరించలేక.. భవానీపురం పోలీసు స్టేషన్లో నవవధువు ఫిర్యాదు చేసింది. -
ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని..
మల్యాల(చొప్పదండి): కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు కాటికి చేరింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తన చావుకు తానే కారణమని తనువు చాలించింది. ‘తాను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు.. నన్ను ఎవరూ ఏమీ అనలేదు.. నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు. అందుకే వెళ్లిపోతున్నా..’ అంటూ చేతిపై రాసుకుని ఓ నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో విషాదం నింపింది. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పానుటి భాగ్యలక్ష్మీకి ఇదే మండలం మ్యాడంపల్లికి చెందిన ఉదయ్‌కిరణ్‌తో గతనెల 18న వివాహమైంది. అప్పటి నుంచి ఇద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఈనెల 3న భాగ్యలక్ష్మీని తల్లిదండ్రులు పుట్టినింటికి తీసుకొచ్చారు. బుధవారం తల్లిదండ్రులు మల్యాల వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భాగ్యలక్ష్మీ బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని ఎస్సై సందర్శించారు. సంఘటనపై వివరాలు సేకరించారు. భాగ్యలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. -
విద్యుదా ఘాతానికి గురై మహిళ మృతి
అడ్డగుట్ట: స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లిన నవ వధువు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరి«ధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ షాహీద్ పాషా తెలిపిన మేరకు.. లాలాపేటలోని ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన మౌనిక(26)కు నాచారం లోని చిలుకనగర్ ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. శనివారం మౌనిక తండ్రి తన కూతురు, అల్లుడిని ఆర్యనగర్‌లోని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆల్లుడు రమేష్ రాత్రి వరకు ఉండి భోజనం చేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం మౌనిక స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లి బోర్‌కు మోటర్ ఆన్ చేసింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురై పెద్ద కేకలు వేసి పడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు బాత్రూమ్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా వారికి కూడా షాక్ కొడుతుండడంతో వెంటనే మెయిన్ ఆఫ్ చేసి మౌనికను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బోర్ మోటర్‌కు సంబంధించిన వైర్లు తెగిపోయి ఉన్నాయని, సరిగా టేప్ కూడా వేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్‌కు గురై ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రీట్మెంట్ నెపంతో నవ వధువుపై నకిలీ బాబా లైంగిక దాడికి పాల్పడ్డాడు. హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బండ్లగూడ ప్రాంతంలోని బజార్ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవ వధువు కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించిన బాబా.. అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. విషయం బయటికి పొక్కడంతో నకిలీ బాబా పరారయ్యాడు. అత్తమామలకు విషయం చెప్పినా స్పందన లేకపోగా, ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో బంధించారు. తల్లిదండ్రుల సహాయంతో భవాని నగర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు సైతం న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. నకిలీ బాబాకు బండ్లగూడ పోలీసులు సహకరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. చదవండి: అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలి అదృశ్యం.. ఏం జరిగింది? -
భర్త స్నేహితునితో నవ వివాహిత జంప్
కర్ణాటక: రెండు నెలల క్రితం వివాహమైన యువతి భర్త స్నేహితునితో పరారైన ఘటన బెంగళూరులో జరిగింది. రాజరాజేశ్వరినగరకు చెందిన రమేశ్‌కు రెండు నెలల క్రితం ఓ యువతితో పెళ్లయింది. కొత్త సంసారం సాఫీగా సాగుతోంది. అయితే ఈ నెల 12న ఉదయం రమేశ్ స్నానం చేయడానికి వెళ్లాడు. ఇంతలో నవ వధువు బట్టలు, డబ్బులు సర్దుకుని బాత్ రూం, ఇంటికి తాళం వేసుకొని స్నేహితునితో కలిసి వెళ్లిపోయింది. అతి కష్టం మీద బయటకు వచ్చిన రమేశ్ జరిగిన విషయాన్ని ఆర్‌ఆర్‌నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుడు కార్తీక్‌తో వెళ్లిపోయిందని తెలిపాడు. పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. -
నవ వధువు ఆత్మహత్య.. పెళ్లయిన కొన్ని రోజులకే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవ్పల్లిలో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్త వేధింపులు తాళలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌తో కవితకు వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త తన అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటి పోటి మాటలు భరించలేక కవిత తనువు చాలించింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అశ్లీల చిత్రాలకు బానిసై నా భర్త.. -
ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కుటుంబసభ్యులతో కలసి ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్న నవ వధువు కనిపించకుండా పోయింది. అనంతపురం మూడో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన మాదేశ్వరికి రామగిరికి చెందిన ఓ యువకుడితో మూడు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులతో కలసి అనంతపురం బస్టాండుకు మాదేశ్వరి చేరుకుంది. ఆ సమయంలో తాను అత్తింటికి వెళ్లనంటూ మాదేశ్వరి తెలపడంతో తల్లిదండ్రులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత బాత్రూంకు వెళుతున్నట్లు చెప్పిన మాదేశ్వరి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు బస్టాండు, ఆ పరిసర ప్రాంతాలు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి -
పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఏడుపు ఒక్కటే తక్కువ!
ఫేస్బుక్ ప్రేమ ఎంత పనిచేసింది. ఎన్నో ఆశలతో ఆమెతో కొత్త జీవితం ప్రారంభిలానుకున్న వరుడికి పెళ్లైన కాసేపటికే గుండె బద్దలయ్యే నిజం తెలిసింది. వధువు అంత పనిచేస్తుందని అతను కలలో కూడా అనుకొని ఉండడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీకి ఒడిశాలోని పఢా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా 15 రోజులకే ప్రేమగా మారింది. దీంతో మే 24న జాజ్పుర్లోని ఛండీఖోల్లో మేఘనను అలోక్ కలిశాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో, వీరి గురించి కుటుంబ సభ్యులకు చెప్పి వారిని ఒప్పించారు. అనంతరం వీరిద్దరికీ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. కాగా, అదే రోజు సాయంత్రం వరుడి ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ అతిథి వరుడికి పెద్ధ షాకిచ్చాడు. పెళ్లికూతురును మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వధువు(అతని) పేరు మేఘన కాదు మేఘనాథ్ అని, అతను తమకు దగ్గరి బంధువే చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న కుబుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు.. అతడిని చితకబాదుడు. గ్రామస్తులు కూడా ఫేక్ వధువును పట్టుకుని కొట్టారు. అనంతరం అతను అబ్బాయి అని తెలిశాక పొడవాటి జుట్టును కత్తిరించారు. అనంతరం మేఘనాథ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా పెళ్లి పెటాకులు కావడంతో వరుడి హృదయం ముక్కలైంది. ఇది కూడా చదవండి: అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!.. వరుడు షాక్ -
‘నేను చనిపోతా.. నన్ను బలవంతంగా పంపుతున్నారు’
ఎమ్మిగనూరు రూరల్(కర్నూలు జిల్లా): మండలంలోని కె.తిమ్మాపురం గ్రామంలో సోమవారం రాత్రి బావిలో పడి నవ వధువు చాకలి రేణుక(19) ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాసులు కుమారుడు చాకలి వీరేష్‌కు వెల్దుర్తికి చెందిన వెంకటేష్ కుమార్తె రేణుకతో 2022 ఫిబ్రవరి 3న వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచి దిగాలుగా ఉండేదని తెలుస్తోంది. ఉగాది పండుగకు పుట్టింటికి వెళ్లి సోమవారం ఉదయం భర్త ఇంటికి వచ్చింది. పుట్టింటి నుంచి తల్లిదండ్రులతో కాకుండా ఒక్కటే బస్సుకు వచ్చింది. తన తండ్రికి కూడా నేను చనిపోతాను, నన్ను బలవంతంగా పంపుతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: Viral Video: ఎంతపనైపాయే.. దొంగతనానికి వచ్చి.. గోడ కన్నంలో.. అయితే భర్త ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను మా ఊరికి వెళ్తానని చెబుతుండటంతో రేపు వెళ్దువులే అని వారు సర్ది చెప్పారు. రాత్రి అందరూ ఇంట్లో ఉండగా ఆమె ఉన్నట్లుండి బయటకు వెళ్లటంతో అనుమానం వచ్చి భర్త, కుటుంబ సభ్యులు కూడా అనుసరించారు. వాళ్లను తప్పించుకొని టీఎస్ కూళ్లూరు రోడ్డులో ఉండే బావిలో దూకింది. అటుగా వచ్చిన వీరేష్ కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ఇప్పుడే మీ కోడలు ఇటుగా వెళ్లిందని చెప్పటంతో అనుమానం వచ్చి బావి దగ్గరకు వెళ్లారు. బావిలో చాలా సేపు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం రూరల్ పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయంపై రూరల్ ఎస్ఐ సునీల్‌కుమార్‌ను సంప్రదించగా మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వారు వస్తే విచారించి కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
ఆ ఊరికి రైలొచ్చిందోచ్!... పట్టాలపై వెళ్తున్న గూడ్స్ రైలు!
రామాయంపేట(మెదక్): మెదక్–అక్కన్నపేట మధ్య మొదటిసారిగా శనివారం గూడ్స్ రైలు నడిచింది. పట్టాల మధ్యన కంకరను గూడ్స్‌లో తరలించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మండలంలోని అక్కన్నపేట స్టేషన్ నుంచి నాలుగైదు కిలోమీటర్ల మేర పట్టాలపై కంకరపరిచారు. గూడ్స్‌లో కంకరను ఇక్కడికి తరలించారు. క్లియరెన్స్ రాకపోవడంతో సదరు గూడ్సును రెండు గంటలపాటు అక్కన్నపేట స్టేషన్లోనే నిలిచి పోయింది. సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే గూడ్స్ కదిలింది. నూతనంగా నిర్మించిన బ్రిడ్జిల వద్ద రైలు నెమ్మదిగా వెళ్లింది. అంతకుముందు రైలు ఎదుట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
పెళ్లికి ముందే తన కలను నెరవేర్చుకున్న నూతన వధువు
భోపాల్: ఈ మధ్య పెళ్లిళ్లు వెరైటీగా జరగడం చూస్తున్నాం. ఆ మధ్య పెళ్లి జరిగిన తర్వాత ఊరేగింపులో వధువు 'బుల్లెట్టు బండెక్కి' అనే పాటకు వరుడు, బంధువులందరి ముందే డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడం చూసాం. అలాంటి ఘటనే మరొకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది. అయితే ఇక్కడ మాత్రం వధువు పెళ్లి మండపానికి స్కూటర్‌పై వచ్చింది. వధువు స్కూటర్‌పై ఒంటరిగా వస్తే అందులో వింతేముంది? తను వచ్చింది ఒంటరిగా కాదు.. తనకు కాబోయే భర్త అంటే పెళ్లి కొడుకుని తన స్కూటీ వెనుక సీటుపై కూర్చోబెట్టుకొని పెళ్లి మండపానికి తీసుకొచ్చింది. అయితే ఈఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ నగరంలో జరిగింది. వధువు పేరు నీలు దమామి. నీముచ్ సిటీలో నివసించే బాల్ముకాంద్‌కుమార్తె నీలుకు మానస టౌన్‌కు చెందిన అర్జున్‌తో ఈ జనవరి 16న వివాహం జరిగింది. అయితే వీరి పెద్దలు వివాహ వేదికను దగ్గరలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. దాంతో వధువు నీలు ఇంటి నుంచి కల్యాణ మండపానికి తన స్కూటర్‌పై వెళ్లాలని ముచ్చటపడింది. ఇక అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అంగీకరించారు. ఇంకేముందు తల్లిదండ్రులు కూడా పర్మిషన్ ఇవ్వడంతో తన కాబోయే భర్తను స్కూటీపై కూర్చొబెట్టుకొని పెళ్లి దుస్తుల్లో ఇద్దరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మొదట వీరిని చూసి ఆశ్చర్యపోయిన బంధువులు తర్వాత వాళ్ళకి పూలమాలలు వేసి బ్యాండ్ మేళం నడుమ కల్యాణ వేదిక దగ్గరకు తీసుకెళ్లారు. -
పెళ్లి దుస్తుల్లోనే విగతజీవిగా ప్రవళిక.. పాడె మోసిన ఎమ్మెల్యే ఆనంద్
సాక్షి, వికారాబాద్: వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయిన సంఘటనతో మోమిన్‌పేట, రావులపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. మోమిన్‌పేటకు చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవళికను మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి ఇచ్చి శుక్రవారం వివాహం జరిపించారు. ఆదివారం ఉదయం తమ బంధువులతో కలిసి మోమిన్‌పేటకు వచ్చిన నవాజ్‌రెడ్డి విందు ముగించుకుని సాయంత్రం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంత చెప్పినా వినకుండా కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి వాహనాన్ని వాగు దాటించే ప్రయ త్నం చేశాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో నవ వధువుతో పాటు పెళ్లి కొడుకు రెండో సోదరి శ్వేత మృతిచెందారు. బాలుడు శశాంక్‌రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ సహాయక చర్యల్లో ఎమ్మెల్యే.. పెళ్లి కారు వాగులో కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ఉదయమే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. వాగు ప్రవాహం, బురద నీటిలో నాలుగు కిలోమీటర్లు నడిచారు. వధవు ప్రవళిక, పెళ్లి కొడుకు అక్క శ్వేత మృతదేహాలు దొరకడంతో స్వయంగా పాడెకట్టి, ఒడ్డుకు చేర్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మోమిన్‌పేటలో ప్రవళిక అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవళిక పెళ్లి దుస్తుల్లోనే విగత జీవిగా కనిపించడం అందరినీ కంటతడి పెట్టించింది. నవ వధువు తల్లిదండ్రులు రోధించిన తీరు కలచివేసింది. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సబితా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు ప్రమాదంలో మృతి చెందిన నవ వధువు ప్రవళిక కుటుంబాన్ని, రావులపల్లిలో వరుడు నవాజ్ రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆమెతోపాటు చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మేతుకు ఆనంద్ ఉన్నారు. అదే విధంగా శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు పడే సమయంలో రోడ్లపై, కల్వర్టుల వద్ద వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు వెల్లడించారు. డ్రైవర్ బతికే ఉండు.. వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి ఆదివారం రాత్రే ప్రమాదం నుంచి బయటపడ్డాడని డీఎస్పీ సంజీవరావు తెలిపారు. మర్పల్లి పీఎస్‌లో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరదలో కొట్టుకుపోయిన కారు కిలోమీటర్ దూరం వెళ్లి, చెట్టు కొమ్మలకు తట్టుకుని ఆగిందన్నారు. ఈ సమయంలో డ్రైవర్ కారులో నుంచి నీటిలో దూకి, ఈదుకుంటూ వెళ్లి రెండు గంటల పాటు చెట్టు కొమ్మలు పట్టుకుని ఉన్నాడన్నారు. వరద తగ్గిన తర్వాత అర్ధరాత్రి ఒడ్డుకు చేరుకున్నట్లు తెలిపారు. ఎవరైనా తనకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని భయపడి అదే రాత్రి అంరాద్కుర్దు గ్రామానికి వెళ్లి బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు స్పష్టంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి రాఘవేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుడి దుర్మరణం మోమిన్‌పేట మండల పరిధిలోని ఏన్కతలకు చెందిన శామల వెంకటయ్య(60) ఆదివారం గ్రామానికి చెందిన శ్రీనివాస్, సాయిలతో కలిసి కారులో కౌకుంట్లకు బయలుదేరారు. తిరిగి వచ్చే క్రమంలో శంకర్పల్లి మండలం కొత్తపల్లి వద్ద కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. గ్రామస్తుల సహకారంతో శ్రీనివాస్, సాయి ప్రాణాలతో బయటపడగ వెంకటయ్యమృతి చెందాడు. సోమవారం ఏన్కతలలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. -
విషాదం: వరదలో కొట్టుకుపోయిన కారు.. నవవధువు గల్లంతు
మర్పల్లి, శంకర్పల్లి, నవాబుపేట: వేర్వేరు సంఘటనల్లో ఏడుగురు వ్యక్తులు వరద ఉధృతిలో గల్లంతయ్యారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైలారం బాల్‌రెడ్డి కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో గత శుక్రవారం వివాహం జరిగింది. ఆదివారం విందు కోసం మోమిన్‌పేట వెళ్లిన వధువు బంధువులు సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. మధ్యలో తిమ్మాపూర్ సమీపంలోని వాగు దాటేక్రమంలో ప్రవాహ తీవ్రతను అంచనా వేయని డ్రైవర్ కారును అలాగే ముందుకు తీసుకెళ్లాడు. బయటపడిన వరుడు, సోదరి దీంతో వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇందులో వధువు, వరుడితో పాటు పెళ్లికూతురు సోదరి, వరుడి అక్క, చెల్లి, ఓ చిన్నారి, డ్రైవర్ ఉన్నారు. వరదలో గల్లంతైన వారిలో వరుడు, ఆయన సోదరి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. మరో సంఘటనలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని వాగులో కారు గల్లంతైంది. చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన సాయి, వినోద్, రమేశ్, శ్రీనివాస్, వెంకటయ్య కలసి పని నిమిత్తం ఎన్కేపల్లికి వచ్చి తిరిగి కౌకుంట్లకు వెళుతుండగా వాగులో వీరి వాహనం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు బయటపడగా.. వెంకటయ్య(75) గల్లంతయ్యాడు. అంత్యక్రియలకు వెళ్లివస్తూ.. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులిమామిడి వద్ద చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ భార్యతో కలసి ఆదివారం ఉదయం బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంగారెడ్డి వెళ్లాడు. సాయం త్రం 7 గంటలకు గ్రామం వద్దకు చేరుకోగా ఊరు శివారులో ని వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో భార్య నాగరాణిని ఒడ్డుపై దింపి శ్రీనివాస్ వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే వరద ఉధృతితో అతను బైక్‌తో పాటు కొట్టుకుపోయాడు. కళ్లెదుటే కొట్టుకుపోతున్న భర్తను చూసిన నాగరాణి కాపాడమంటూ గట్టిగా అరిచినా, వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రయోజనం లేకుండాపోయింది. కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు గంటకుపైగా.. చండూరు: నల్లగొండ జిల్లా చం డూరు మండలం శిర్దేపల్లి వాగులో ఆదివారం రాత్రి దయానంద్, శ్రీను, కిరణ్ అనే ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. గంటకుపైగా నీటిలోనే ఉండిపోయిన వారిని స్థానికులు, పోలీసులు రక్షించారు. -
నవ వధువు ఆత్మహత్య
ముదిగుబ్బ: అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే అర్ధాంతరంగా తనువు చాలించింది. పోలీసులు తెలిపిన మేరకు...ముదిగుబ్బ మండలం మల్లమకొట్టాలకు చెందిన శ్రీరాములు, సరళమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్న పెద్ద కుమార్తె సాదిక (20)కు మూడు నెలల క్రితం బుక్కపట్నం మండలం కృష్ణాపురం నివాసి కేశవతో వివాహమైంది. పెళ్లి సమయంలో 12 తులాల బంగారు నగలు, రూ.5 లక్షలు వరకట్నం కింద ఇచ్చారు. కదిరిలోని ఎస్బీఐ (యోగి వేమన)లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ.. తన భార్యను కృష్ణాపురంలో తల్లిదండ్రుల వద్ద ఉంచి, వారానికి ఒకసారి మాత్రమే వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో అదనపు కట్నం కింద మూడు తులాల బంగారు నగలు, డబ్బు తీసుకురావాలంటూ అత్త కొండమ్మ, ఆడపడచు, ఆమె భర్తతో పాటు కేశవ కూడా వేధించేవాడంటూ తల్లిదండ్రులకు సాదిక ఫోన్ చేసి చెప్పింది. చదవండి: వ్యాపారి హత్య కేసులో కోగంటి సత్యంకు రిమాండ్ ఈ నెల 22న ఆదివారం సెలవు కావడంతో కేశవ.. కృష్ణాపురం వెళ్లాడు. ఆ సమయంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను కొట్టి పుట్టింటికి పంపాడు. మంగళవారం ఉదయం సాదిక తమ పొలానికి వెళ్లి, తండ్రి శ్రీరాములుకు ఫోన్ చేసింది. తన భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేకపోతున్నానని, జీవితంపై విరక్తితో బావిలో దూకి చనిపోతున్నట్లు చెప్పింది. తండ్రి వారిస్తున్నా వినలేదు. దీంతో అతను వెంటనే పొలంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే బావిలో సాదిక మృతదేహం తేలియాడుతోంది. సమాచారం అందుకున్న పట్నం ఎస్ఐ సాగర్, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. సంఘటనా స్థలాన్ని కదిరి ఇన్చార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి, నల్లమాడ సీఐ యల్లమరాజు, తహసీల్దార్ కరుణాకర్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపారు. చదవండి: మైనర్ బాలిక కిడ్నాప్.. నోటిలో గుడ్డలు కుక్కి .. -
విషాదం: పెళ్లైన వారానికే నవ వధువు ఆత్మహత్య
మధురపూడి(తూర్పుగోదావరి): ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన కోరుకొండ మండలం గాదరాడలో సోమవారం సంచలనం రేపింది. ఈ నెల 29న సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన అశ్విని స్వాతి(19)కి గాదరాడకు చెందిన కనుమరెడ్డి అశోక్‌తో వివాహం జరిగింది. అత్తవారు కొత్తగా కట్టుకున్న ఇంటిలో రెండు రోజుల క్రితం గృహ ప్రవేశం కూడా చేసింది. ఇంతలో ఏమైందో ఏమో ఆ కొత్త ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్‌జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పరిసరాలను పరిశీలించారు. మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మూడేళ్ల క్రితమే ఈ వివాహం చేసేందుకు పెద్దలు అంగీకారం కుదుర్చుకున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే అశోక్ 5వ తరగతి వరకే చదువుకోగా, 7వ తరగతి వరకు చదివిన స్వాతి మైనార్టీ తీరే వరకు ఆగారు. ఈ పెళ్లి ఇష్టం లేక స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. -
విషాదం: పెళ్లైన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్(కర్నూలు జిల్లా): వివాహమైన 20 రోజులకే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పార్లపల్లి గ్రామానికి చెందిన మాదన్న, నయోమిల కుమార్తె ఎస్. అనురాధ గ్రామ వలంటీర్‌గా పనిచేస్తుంది. ఈ యువతికి ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బంధువు కిరణ్‌కు ఈ ఏడాది మే 24వ తేదీన వివాహమైంది. పెళ్లైన వారం రోజుల తర్వాత వలంటీర్‌గా సేవలందించేందుకు అనురాధ పార్లపల్లికి చేరుకుంది. ఆదివారం తల్లిదండ్రులు చర్చికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చర్చి నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా కనిపించిన కుమార్తెను చూసి బోరున విలపించారు. తమ కుమార్తెకు కొన్నాళ్లుగా కడుపునొప్పి ఉందని, నయం కాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలు కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ సునీల్‌కుమార్ గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. పోస్టుమార్ట్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు వైద్యుడి కుటుంబంలో ఊహించని విషాదం -
మూడు వారాల కింద పెళ్లి.. పాలల్లో మత్తు మందు కలిపి
లక్నో: పెళ్లి జరిగిన మూడు వారాలకు కట్టుకున్న భర్తకు, అత్తింటివారికి మత్తు మందు ఇచ్చిన కొత్త కోడలు పట్టుచీరలు, నగలతో పరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని బాహ్ సిటీలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బాహ్ సిటీకి చెందిన ఉపేంద్ర (22)కు ఈ నెల 7న శాలిని (20)తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన మూడు వారాల పాటు శాలిని తన భర్త, అత్తింటి వారితో బాగానే కలిసిపోయినట్లు నటించింది. కాగా సోమవారం రాత్రి భర్తకు, అత్తమామలకు పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చింది. వాళ్లు ఆ పాలు తాగి మత్తులోకి జారుకోగానే ఇంట్లో విలువైన నగలు, బట్టలు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. కాగా ఉదయం నిద్ర లేచి చూసేసరికి శాలిని ఇంట్లో కనిపించలేదు.దీంతో ఉపేంద్ర, అతని తల్లిదండ్రులు ఇళ్లుతో పాటు చట్టుపక్కల వెతికినా ఆమె జాడ తెలియలేదు. అనుమానం వచ్చి ఇంట్లోని బీరువా తీసి చూడగా అందులోని విలువైన నగలు, చీరలు మాయమయ్యాయి. దాంతో కొత్త కోడలే ఈ పని చేసిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఉపేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు -
విషాదం: పెళ్లయినా 12 రోజులకే..
సాక్షి, కృష్ణా జిల్లా: బాపులపాడు మండలం మల్లవల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయినా 12 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. రాజేశ్వరి అనే నవ వధువు బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వగ్రామం మైలవరం సమీపంలోని గణపవరం కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రాజేశ్వరిని లాక్డౌన్ సమయంలో చదువు మాన్పించి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఇష్టం లేని వివాహం చేశారనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విశాఖ ప్రేమోన్మాది కేసులో 'మిస్టరీ') -
నవ వధువుపై గ్యాంగ్‌రేప్
కురుక్షేత్ర: ఓ నవవధువుకు మత్తుమందు ఇచ్చిన అత్తారింటివారు.. ఆమెపై ఓ తాంత్రికుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ‘మీ కుమార్తె మానసికస్థితి సరిగ్గా లేదు’ అంటూ అమ్మాయి తండ్రికి సమాచారం అందించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హరియాణాలోని యమునానగర్ జిల్లాలో చోటుచేసుకుంది. యమునానగర్ పట్టణంలో ఉంటున్న ఓ యువకుడికి కురుక్షేత్రకు చెందిన యువతితో ఈ నెల 12న వివాహమైంది. ఆమె అత్తారింటిలో అడుగుపెట్టగానే ఓ తాంత్రికుడిని కుటుంబ సభ్యులు రప్పించారు. అనంతరం యువతిచేత ఓ ద్రవాన్ని తాగించారు. ఆమె స్పృహ కోల్పోగానే భర్త అన్నయ్యతో పాటు ఆడపడుచు భర్త అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించిన తాంత్రికుడు.. కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె దుస్తులను తగలబెట్టారు. తనపై జరిగిన దారుణాన్ని కుమార్తె తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఈ కుట్రలో పెళ్లికుమారుడి తల్లి, చెల్లెలు కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తొలుత జీరో ఎఫ్ఐఆర్(బదిలీ చేయగలిగే ఎఫ్ఐఆర్)ను నమోదుచేసిన కురుక్షేత్ర పోలీసులు.. యమునానగర్ పోలీస్‌స్టేషన్‌కు దాన్ని బదిలీచేశారు. -
ఒకరితో పెళ్లి.. ఇంకొకరితో..
జయపురం : మన పురాణాల ప్రకారం స్త్రీని దేవతలా కొలిచే పుణ్యభూమి మనది, ఆడదంటే ఆదిపరాశక్తి అని నమ్మే కర్మభూమి మనది. అందుకే మన దేశంలో ఉత్తమ ఇల్లాలు అంటే కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభలా ఉండాలి అంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భారత సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నాయి. సనాతన సాంప్రదాయాలకు నిలయమైన మనదేశంలో పాశ్చాత్య దేశాల సాంస్కృతి విస్తరిస్తోంది. సంప్రదాయం ప్రకారం అగ్ని సాక్షిగా జరిగే వివాహాన్ని కొందరు అవహేళన చేస్తున్నారు. వేదమంత్రాల మధ్య కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నారు. కొన్నిచోట్ల కట్టుకున్న భర్తే కాలయముడవుతుంటే ఈ విషయంలో తామేమి తక్కువ కాదనట్టు మహిళలు కూడా వ్యవహరిస్తున్నారు. ఒకరితో తాళి కట్టించుకుని అతడితో రెండు రోజులు గడిపి, ప్రేమించిన మరో వ్యక్తి చేయిపట్టుకొని అతడితో ఐదు దినాలు ఉండి, ఇంకొక వ్యక్తితో ఓ మహిళ జంప్ అయింది. ఇటువంటి సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం.. కథల్లో చదువుతూ ఉంటాం... కానీ కొరాపుట్‌లో ఇటువంటి సంఘటనే జరిగి ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. మన భారతీయ సాంప్రదాయంలో వివాహం అతి పవిత్రమైనది. తాళి కట్టిన భర్తతో నూరేళ్లు కలిసి ఉండి అటు పుట్టింటికి ఇటు మెట్టినింటికి పేరుతెచ్చేది వివాహిత. అందుకే మనం వివాహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఒక సారి మెడలో మూడు ముళ్లు పడితే ఆ బంధాన్ని తుంచేందుకు ఏ స్త్రీ సాహసించదు. అంతే కాదు తాళి బొట్టును ప్రాణం కన్నా మిన్నగా భావిస్తారు. తాళిబొట్టును ఎగతాళి చేసే మహిళలను సమాజం గౌరవించదు సరికదా ఆమెను అపవిత్రాలుగా పరిగణిస్తుంది. అటువంటిది ఒక మహిళ పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకొని అత్తవారి ఇంటిలో అడుగుపెట్టి తాళికట్టిన భర్తతో రెండు రోజులు గడిపింది. తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసి అతడి వెంట మరో ఏడగులు వేసింది. ఇతడితో కేవలం ఐదు రోజులు గడిపిన ఆమె మరో వ్యక్తితో జంప్ అయినట్టు కొరాపుట్ జిల్లాలో చర్చనీయమైంది. దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూల దండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండవ భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
భర్తను చంపేందుకు బావతో కలిసి కుట్ర
వరంగల్ , రఘునాథపల్లి : బావతో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని పెళ్లయిన ఆరు నెలలకే భర్త ను కడతేర్చాలని చూసింది ఓ ప్రబుద్ధురాలు. తన అక్క భర్తతో కలిసి తన భర్తను హత్య చేసేందుకు ఆమె చేసిన కుట్ర పోలీసుల విచారణలో బయటపడింది.జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఏసీపీ వెంకటేశ్వరాబు కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ఎంబరి పోషయ్య పెద్ద కూతురు గాయత్రికి విజయవాడకు చెందిన పత్తి శ్రీనుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది.దీంతో పోషయ్య చిన్నకూతురు జ్యోతి అప్పుడప్పుడు విజయవాడలోని అక్క ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో తన బావ శ్రీనుతో ఆమెకు శారీరక సంబంధం ఏర్పడింది. ఆరు నెలల క్రితం జ్యోతికి రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లికి చెందిన గాజుల రాజుతో వివా హమైంది. అయినప్పటికీ తనకు ఈ పెళ్లి ఇష్టం లే దని నీతో ఉంటానని జ్యోతి తన బావతో చెప్పేది. మూడు నెలల్లో 1500 కాల్స్.. రాజుతో ఇంకా ఎన్నాళ్లు ఉండాలి.. ఆయన్ని చంపు అని జ్యోతి తరచూ బావ శ్రీనుతో ఫోన్లో మాట్లాడేది. మూడు నెలలుగా పత్తి శ్రీనుతో 1500 సార్లు ఫోన్లో మాట్లాడింది. జ్యోతి కోరికపై రాజును ఎలాగైనా చంపాలని శ్రీను ప్లాన్ వేశాడు.ఇందులో భాగంగా మే 20న విజయవాడ నుంచి అశ్వరావుపల్లికి చేరుకొని ఊరు చివర పొదల్లో మరుగుదొడ్డి శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ దాచాడు. అదే నెల 27న విజయవాడలో పేపర్ ఫ్యాక్టరీలో పని చేసే సాడి వెంకటదుర్గారావు, మరో బాలుడికి రూ.20 వేలు ఇస్తానని సుపారీ మాట్లాడుకుని వారితో గ్రామానికి వచ్చాడు. ఆ రోజు రాజు ఆచూకీ లభించకపోవడంతో తిరిగి వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 3న పొలాల వద్ద రాజు గొర్రెలను మేపుతుండగా గుర్తించిన శ్రీను తాను పొదల్లో దాచుకొని వెంకటదుర్గారావు, బాలుడికి యాసిడ్ బాటిల్ ఇచ్చి పంపాడు.ఇద్దరు రాజు ముఖంపై యాసిడ్ పోసి గొంతునులిపి చంపేందుకు యత్నిస్తుండగా సమీపంలో ఉన్న గొర్రెల కాపరులు గుర్తించి కేకలు వేయడంతో పారి పోయారు. ఈ ఘటనలో గాయపడిన రాజు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. జ్యోతి సెల్‌ఫోన్ కాల్‌డేటా, గ్రామంలోసి సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితులను సులభంగా గుర్తించారు. రఘునాథపల్లి బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుట్ర, హత్యాయత్నం సెక్షన్ల కింద జ్యోతి, శ్రీను, వెంకటదుర్గారావుపై కేసు నమోదు చేశారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరగా ఛేదించిన జనగామ రూరల్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్సై రంజిత్‌రావును ఏసీపీ అభినందించారు. -
కాళ్ల పారాణి ఆరకముందే..
సాక్షి, విశాఖపట్నం : ఆ నవ వధువు జీవితం మూణ్ణాళ్ల ముచ్చటైంది. కాళ్ల పారాణి ఆరకముందే మృత్యు ఒడికి చేరింది. భార్యభర్తల నడుమ వచ్చిన చిన్నపాటి గొడవకే ఉరివేసుకుందని భర్త చెబుతుండగా, భర్తే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను చంపేశాడని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఎల్బి పురం గ్రామానికి చెందిన నవ వధువు పర్రె సంధ్య(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన పర్రె కొండబాబు, ఈశ్వరమ్మల కుమారుడు రాజుకు, చోడవరం మండలం నరసయ్యపేట గ్రామానికి చెందిన గంట్ల అప్పారావు, క్రిష్ణవేణిల కుమార్తె సంధ్యకు నాలుగు నెలల క్రితం పెళ్లయింది. రాజు విశాఖలో స్టీల్‌ప్లాంటులో ప్రవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. గాజువాకలో అద్దె ఇంట్లో రాజు, సంధ్య కొత్త కాపురం పెట్టారు. శనివారం సాయంత్రం భార్యభర్తల మధ్య కొద్దిపాటి గొడవ జరిగిందని, గొడవ జరిగిన వెంటనే తాను ఇంటి నుంచి బయటకెళ్లి వచ్చేసరికి సంధ్య ఫ్యాన్‌కు ఊరేసుకొని కనిపించిందని రాజు చెబుతున్నాడు. స్థానికుల సాయంతో సంధ్యను కిందికి దించి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ప్రవేటు ఆస్పత్రికి తరలించామని, అయితే వైద్యులు కేజిహెచ్‌కు తరలించాలని సూచించగా, ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయిందని తెలిపాడు. శనివారం రాత్రి సంధ్య మృతదేహాన్ని స్వగ్రామం ఎల్బి పురం తీసుకొచ్చి అత్తమామలకు ఈ విషయం తెలిపాడు. నాలుగు నెలలకే తన కుమార్తె చావు కబురు వినడంతో సంధ్య తల్లిదండ్రులు భోరున విలపించారు. సంధ్య ఒంటిపైన గాయాలు, చేయి విరిగినట్టు ఉండడంతో భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కుమార్తెను అదనపు కట్నం కోసం అల్లుడే చంపేశాడని ఆగ్రహం చెందడమే కాక రాజుపై, అతని తల్లిదండ్రులపైన దాడికి దిగారు. బుచ్చెయ్యపేట పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని గాజువాక పోలీసులకు అప్పగించారు. గాజువాకలో సంఘటన జరగడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు మృతురాలి తల్లిదండ్రులకు తెలిపి సంధ్య మృత దేహాన్ని విశాఖ కేజిహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
తొలిరాత్రి భార్యకు చిత్రహింసలు...
-
తొలిరాత్రి భార్యకు చిత్రహింసలు.. అతనికి పటుత్వ పరీక్ష!
చిత్తూరు: నవవధువు శైలజపై దాడిచేసి దారుణంగా హింసించిన కేసులో.. నిందితుడు రాజేశ్‌కు లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు బుధవారం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పోలీసులు ఉపాధ్యాయుడైన రాజేశ్‌పై పలు అభియోగాలు మోపారు. లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించిన అనంతరం ఆ పరీక్షల ఆధారంగా మరిన్ని అభియోగాలు మోపాలని భావిస్తున్నారు. అయితే, రాజేశ్ ఒప్పుకుంటేనే అతనికి లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించాలని కోర్టు సూచించింది. కాగా, రాజేశ్ తండ్రిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తొలిరాత్రినాడే రాజేశ్ నవవధువు శైలజపై దాడి చేసి.. తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. పెళ్లిరోజు ఈ దంపతులకు తొలిరాత్రి ఏర్పాటుచేశారు. అయితే, తాను సంసారానికి పనికిరానని, ఈ విషయం బయట చెప్పవద్దని రాజేశ్ తొలిరాత్రి శైలజను కోరినట్టు తెలిసిందే. దీంతో శైలజ బయటకురాగా.. కుటుంబసభ్యులు ఆమెను మళ్లీ గదిలోకి పంపించారు. తన బండారాన్ని బయటపెట్టడంతో ఆగ్రహించిన రాజేశ్ తొలిరాత్రే శైలజను అత్యంత క్రూరంగా హింసించి చితకబాదాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలిరాత్రే భర్త చేతిలో చిత్రహింసలు ఎదుర్కొన్న శైలజ ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
నవవధువు అనుమానాస్పద మృతి
బనశంకరి : నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... మండ్య జిల్లా మద్దూరుకు చెందిన హర్షిత (25), బెంగళూరు చిక్కలసంద్రకు చెందిన చేతన్‌కు ఇచ్చి ఈనెల ఒకటిన వివాహం జరిగింది. హర్షిత నగరంలోని కాల్సెంటర్లో ఉద్యోగం చేస్తూ పీజీలో ఉంటోంది. భర్త చేతన్ కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల హనీమూన్‌కు వెళ్లిన దంపతులు బుధవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. గురువారం ఉదయం చేతన్ బయటకు వెళ్లిన సమయంలో హర్షిత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపు అనంతరం ఇంటికి వచ్చిన చేతన్ విషయం గుర్తించి హర్షితను ఆస్పత్రికి తరలించారు. అనంతరం హర్షిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. తమ కుమార్తెను చేతన్ కుటుంబ సభ్యులే హత్యచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రికార్డు చీర.. తెచ్చింది పెద్ద తంటా!
రికార్డు పొడవైన చీరను ధరించానని నవ వధువు మురిసిపోయింది. అంగరంగ వైభవంగా వివాహం జరిగిందని ఇరు కుటుంబాల సభ్యులు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ రికార్డు చీరే ఓ నవ దంపతులకు చిక్కులు తెచ్చిపెట్టింది. అంతపెద్ద చీరను విద్యార్థినులు మండుటెండలో పట్టుకుని నిల్చోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దంపతులతో పాటు ఇందుకు కారకులైన కొందరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ వివాదాస్పద వివాహం శ్రీలంకలోని కాండీలో జరిగింది.పెళ్లిలో నవ వధువు 3.2 కిలోమీటర్ల చీర ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఆ చీరను పట్టుకుని వధువుకు సాయం చేసేందుకు ఓ స్కూలుకు చెందిన 250 మంది విద్యార్థి నులు మండుటెండలో నిలబడ్డారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ అథారిటీ (ఎన్సీపీఏ) అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఎన్సీపీఏ చైర్మన్ మారిని డే లివేరా మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పిల్లలు, విద్యార్థులను ఇలాంటి పనులకు వాడుకోవడం తప్పన్నారు. విద్యార్థులను ఇలా కష్టాలకు గురిచేసే వారికి దాదాపు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ వివాహానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సందర్భంగా సెంట్రల్ ప్రావిన్స్ సీఎం శరత్ ఎకనాయక మాట్లాడుతూ.. శ్రీలంకలో ఓ వధువు ధరించిన అతిపెద్ద చీర ఇదేనంటూ కితాబివ్వడం విమర్శలకు కేంద్ర బిందువైంది. -
పెళ్లైన మరుసటి రోజే వధువు...
అన్నానగర్: వివాహం జరిగిన మరుసటి రోజే నూతన వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం ఆనైమలైలో చోటుచేసుకుంది. కోవై జిల్లా ఆనైమలై సమీపంలో ఉన్న దివాన్‌సా. పుదూరైకి చెందిన మణికంఠన్. ఇతని కుమారుడు విజయ్ (21) కూలీ. ఇతనికి అదే ప్రాంతంలో ఉన్న జీవా (19) అనే అమ్మాయికి గత 28వ తేదీ మీనాక్షిపురంలో వివాహం జరిగింది. మరుసటి రోజు జీవా అమ్మమ్మ కమల ఇంట్లో పెళ్లి మరవలి జరిగింది. అనంతరం మరుసటి రోజు మంగళవారం జీవా భర్త విజయ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ స్నానం చేయడానికి వెళ్లిన జీవా అరగంట అయినా బయటికి రాలేదు. దీంతో బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా కొత్త జీవా చీరతో ఉరి వేసుకుని వేలాడుతుంది. విషమ స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్న ఆమెను వెంటనే పొల్లాచ్చిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ జీవా మృతి చెందింది. ఆనైమలై ఎస్ఐ వల్లియమ్మాల్, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లైన మూడు రోజులకే..
మఠంపల్లి(సూర్యాపేట): వివాహాం తరువాత మండలంలోని మట్టపల్లి వద్దనున్న శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శంచుకునేందుకు నవ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. కృష్ణా నదిలో స్నానానికి దిగిన నవ వధువు ప్రమాదవశాత్తూ మృతిచెందింది. హుజూర్నగర్ మండలం నేరేడుచర్లకు చెందిన దీపిక(23)కు మిర్యాలగూడ మండలం ఆలగడపకు చెందిన సాయి అనే యువకుడితో మూడు రోజుల క్రితం వివాహాం జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి నర్సింహస్వామిని దర్శించుకుని నదిలోకి దంపతులు స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నవ వధువు మునిగిపోయింది. బంధువులు వెంటనే ఆప్రమతమై వెలికి తీశారు. కొన ఊపిరితో ఉన్న దీపికను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. పెళ్లికుతురు దీపిక మరణించడంతో నేరేడుచర్ల, ఆలగడప గ్రామాల్లో విషాదం నెలకొంది. -
పెళ్లయిన ఐదు రోజులకే పాడె కట్టిండు
రోకలితో తలపై కొట్టి పరారైన భర్త... ఖిల్లాఘనపురం: కాళ్ల పారాణి ఆరనేలేదు.. ఇంటి ముందు పెళ్లిపందిరి తీయకముందే అత్తారింటికి కాపురానికి వచ్చిన ఓ నవ వధువు కట్టుకున్నవాడి చేతిలో బలైంది. కడ దాకా తోడుంటానని పంచభూతాల సాక్షిగా ఐదురోజుల క్రితమే పెళ్లాడిన భార్యను భర్త రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ సంఘ టన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురంలో ఆది వారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాగనమోని బాలయ్య, సత్యమ్మల పెద్ద కుమారుడు రాగనమోని ఆంజ నేయులుకు పెద్దమందడికి చెందిన ఆరెపల్లి గొల్ల వెంకటయ్య కూతురు పారిజాత అలియాస్ నీలవతి (18)తో ఈ నెల 12న వివాహం జరిగింది. భర్తతో కాపురం చేసేందుకు పారిజాత ఘనపురం వచ్చింది. ఆదివారం రాత్రి భోజనం చేస్తున్న సమ యంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆంజనేయులు గదిలో ఉన్న రోకలిబండతో భార్య తలపై మోదాడు. పారిజాత తలకు తీవ్ర గాయమై రక్త స్రావం కావడంతో తేరుకున్న భర్త తాను చనిపోతానని, ఈ బతుకువద్దంటూ ఇంటి వెనక గోడ దూకి పక్కనే ఉన్న గుట్టల్లోకి వెళ్లాడు. రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొన ఊపిరితో ఉన్న పారిజాతను అత్తమామలు గమనించి చుట్టు పక్కల వారి సహాయంతో మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. మృతురాలి తండ్రి ఆరెపల్లి గొల్ల వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తకోట సీఐ శ్రీనివాసులు తెలిపారు. అడిగిన వెంటనే అన్నం పెట్టలేదనే కోపంతో తన కూతురిని కొట్టి చంపాడని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. -
నవవధువు ఆత్మహత్య
కోరుట్ల: పట్టణంలోని ఆనంద్‌నగర్‌కు చెందిన దావనపల్లి మాధురి(23) అనే నవవధువు శనివారం రాత్రి తన పుట్టింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..పట్టణానికి చెందిన దావనపల్లి గంగాధర్–సుజాత కూతురు మాధురికి గతేడాది నవంబర్‌లో మల్యాల మండల కేంద్రానికి చెందిన బొట్ల శ్రీధర్‌తో వివాహం జరిగింది. నెలరోజుల క్రితం మాదురికి అత్తవారింట్లో గొడవలు జరగడంతో పుట్టిం టికి వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిం ది. ఆదివారం ఉదయం మెట్పల్లి డీఎస్పీ మల్లారెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, తహసీల్దార్ మధు, ఎస్సై కృష్ణకుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.మృతురాలి తల్లి సుజాత ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కట్నం వేధింపులకు నవ వధువు బలి
-
నవ వధువుపై ఘాతుకం
వంగలమడుగు (అడ్డతీగల) : ఏజెన్సీలోని అడ్డతీగల మండలం వంగలమడుగు గ్రామంలో గురువారం నవ వధువుపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కత్తిపూడి గ్రామానికి చెందిన ప్రశాంతి(19)కి ఈ నెల 19న ఏలేశ్వరానికి చెందిన వడ్రంగి పనిచేసే అలుకోజి శివతో వివాహమైంది. కాగా గురువారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కుంటుండగా.. ఓ దుండగుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను తండ్రి కవులూరి చక్రం, భర్త శివ 108లో అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 80 శాతంపైగా శరీరం కాలిపోవడంతో అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు న్యాయమూర్తికి సమాచారమిచ్చిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వంగలమడుగులో తన నానమ్మ ఉందని, తనకు అన్నీ నానమ్మే అని అల్లుడు శివ అనడంతో బుధవారం మధ్యాహ్నం అక్కడకు తీసుకువెళ్లామని తండ్రి చక్రం వివరించాడు. తనపై ఎవరో కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వేశారంటూ ప్రశాంతి తన వద్దకు వచ్చి పడిపోయిందని పేర్కొన్నాడు. బాధితురాలి నుంచి న్యాయమూర్తి సి.సురేష్ వాగ్మూలం నమోదు చేశారు. అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై టి.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు అదృశ్యం
మారేడుపల్లి: భర్తతో కలిసి నగరానికి వచ్చిన ఓ నవ వధువు కనిపించకుండాపోయింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన వేముల క్రాంతి కిరణ్‌కు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన జ్యోతితో గత నెలలో వివాహమైంది. క్రాంతి కిరణ్ సికింద్రాబాద్‌లో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లేందుకు భార్యతో కలిసి ఆదివారం జూబ్లీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్టాండ్‌కు వచ్చాక జ్యోతి వాష్ రూంకు వెళ్తానని చెప్పి తిరిగిరాలేదు. దీంతో భర్త, బంధువులు చుట్టుపక్కల వారిని వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్త క్రాంతికిరణ్ మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పెళ్లైన ఐదురోజులకే నవ వధువు అదృశ్యం
రంగారెడ్డి: పెళ్లి జరిగిన ఐదు రోజులకే పెళ్లి కూతురు అదృశ్యమైన సంఘటన జిల్లాలోని కుల్కచర్ల మండల పరిధిలోని తిర్మాలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబికులు తెలిపిన వివరాల ప్రకారం తిల్మాలాపూర్ గ్రామానికి చెందిన రాములు, జయమ్మల కూతురు పద్మ (19) ఈ నెల 11న మహబుబ్గనర్ జిల్లా మిడ్జిల్ మండలం వలబ్నగర్ కు చెందిన భగవంత్గౌడ్తో వివాహం జరిపించారు.వివాహాం అయిన తరువాత ఐదో రోజు పెళ్లి తంతులో భాగంగా పందిరి కొమ్మ తీయడానికి పెళ్లి కూతురు ఇంటికి ఈ నెల 17న వచ్చారు. అదే రోజు సాయంత్రం నుంచి పెళ్లి కూతురు కనిపించకుండ పోయిందని పెళ్లి కూతురు కుటుంబికులు తెలిపారు.అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కూడ అదే రోజు నుంచి కనిపించడం లేదని అ యువకుడు పై అనుమానం ఉందని గురువారం అమ్మాయి తల్లి జయమ్మ పోలీసులకు పిర్యాదు చేసింది. జయమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు. -
నవ వధువు ఆత్మహత్య
మధురానగర్ : కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు కానరాని లోకాలకు చేరుకుంది. అయోధ్యనగర్ లోటస్ల్యాండ్మార్క్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోటస్‌ల్యాండ్ మార్క్ ఎనిమిదో బ్లాక్ వద్ద రోడ్డుపై ఓ యువతి మృతదేహం పడి ఉంది. ఆ ప్రాంతంలో నివాసం ఉండే 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానికులతో కలిసి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఆమె వడదెబ్బకు చనిపోయి ఉంటుందని భావించారు. సింగ్‌నగర్ ఎస్ఐ ఇంద్రశ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ నాయక్ సిబ్బందితో వచ్చి మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు తీవ్రగా యత్నించారు. ఫలితం లేకపోవటంతో లోటస్ల్యాండ్మార్క్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఆ యువతి 8వ బ్లాకు లోపలికి వెళ్లడం, ఐదో అంతస్తు నుంచి కిందకు పడిపోవటం కనిపించాయి. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం.. ఎస్.వెంకటేశ్వరరావు రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. లోటస్ ల్యాండ్ మార్క్ ఎనిమిదో బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె సౌజన్య(25)కు ఈనెల 20వ తేదీన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో వివాహం చేశారు. సౌజన్య కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే. దంపతులిద్దరూ హైద్రాబాద్‌లోనే ఉంటున్నారు. వెంకటేశ్వరరావు దంపతులు వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెనాలి వెళ్లారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో సౌజన్య ఎనిమిదో బ్లాకులోకి వెళ్లింది. అనంతరం ఐదో అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ చూస్తున్న సమయంలో వెంకటేశ్వరరావు దంపతులు తెనాలి నుంచి తిరిగి వచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటేశ్వరరావు వద్ద నుంచి సౌజన్య భర్త ఫోన్ నంబరును పోలీసులు తీసుకుని కాల్ చేశారు. తన భార్య డ్యూటీకి వెళ్లిందని, తానుకూడా డ్యూటీలో ఉన్నానని చెప్పారు. కుమార్తె మృతదేహం వద్ద వెంకటేశ్వరరావు దంపతులు విలపిస్తున్న తీరు చూపరుల కంట తడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుల్లా సేవలు సౌజన్య చనిపోయినప్పటినుంచి రాత్రి వరకు 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానికులతో కలిసి ఘటనాస్థలిలోనే ఉన్నారు. పోలీసులు మృతురాలి వివరాలు తెలుసుకోవటంలో అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు. సౌజన్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ప్రియుడి సహా పట్టుబడ్డ నూతన వధువు
హొసూరు : గత నెల 28న 20 పౌన్ల నగలు, రూ. 5 వేలు నగదుతో అదృశ్యమైన నూతన వధువును సూళగిరి పోలీసులు ప్రియునితో సహా పట్టుకున్నారు. వివరాల మేరకు సూళగిరి సమీపంలోని మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్(23)కు బేరికె సమీపంలోని గురునైపల్లి గ్రామానికి చెందిన శశికళ(19)తో ఫిబ్రవరి 23న పెళ్లి జరిగింది. ఈ తరుణంలో మార్చి 28వ తేదీ శశికళ 20 పౌన్ల నగలు, రూ. 5వేలు అదృశ్యమైయ్యింది. ఈ ఘట నపై భర్త చంద్రశేఖర్ సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరుణంలో శశికళ గురునైపల్లి గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి (25) ఇంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు గురునైపల్లి గ్రామానికి చేరుకొని క్రిష్ణమూర్తి ఇంట్లో ఉన్న శశికళను అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో శశికళ 10వ తరగతి చదువుతున్న సమయంలో క్రిష్ణమూర్తితో పరిచయం ఏర్పడి ప్రేమించుకొన్నారు. ఈ విషయంపై శశికళ తన తల్లితండ్రులకు తెలిపింది. వారు ఈ పెళ్లికి నిరాకరించి మాదరసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌తో పెళ్లి జరిపించారని, తర్వాత ఫోన్‌ద్వారా క్రిష్ణమూర్తితో మాట్లాడిన శశికళ తనను భర్త ఇంటి నుంచి తీసుకెళ్లమని మొరపెట్టుకోవడంతో మాదరసనపల్లిలోని వినాయక దేవాల యానికి రమ్మని క్రిష్ణమూర్తి.. శశికళను తీసుకెళ్లినట్లు పోలీ సుల విచారణలో తేలింది. పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి హొసూరు కోర్టులో హాజరుపరచనున్నారు. -
కట్నం కోసం వ్యభిచారం చేయమంటున్నారు...
హెచ్ఆర్సీని ఆశ్రయించిన నవవధువు అఫ్జల్‌గంజ్: వ్యభిచారం చేసి అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్తమామల నుంచి రక్షణ కల్పించాలని ఓ నవవధువు హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి 2015 జనవరి 28 లోగా నివేదిక అందించాలని మల్కాజిగిరి ఏసీపీకి హెచ్ఆర్సీ సభ్యులు మిర్యాల రామారావు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధితురాలు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఫీర్జాదిగూడకు చెందిన యువతి (27), అవినాష్సింగ్లకు ఈ ఏడాది మే 24న పెళ్లైంది. రూ.4 లక్షల నగదు, 11 తులాల బంగారు నగలు, కిలో వెండి, బైక్ కానుకలుగా ఇచ్చారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే అవినాష్సింగ్తో పాటు అతని తల్లిదండ్రులు రూపాఠాకూర్,అమృత్‌సింగ్ అదనపు కట్నంగా రూ.10 లక్షలు తేవాలని బాధితురాలిని వేధించడం మొదలుపెట్టారు. పెళ్లైనప్పటి నుంచీ ఒక్క రోజు కూడా భర్త తనను భార్యగా చూడలేదని, సంసారం కూడా చేయలేదని ఆమె వాపోయింది. మీ తల్లిదండ్రులు అదనపు కట్నం ఇవ్వకపోతే.. వ్యభిచారం చేసైనా నువ్వు డబ్బు తీసుకురావాలని వేధించారని, నాకు మద్దతుగా మాట్లాడిన వారితో వివాహేతర సంబంధం అంటగట్టడంతో పాటు తనకు బలవంతంగా కన్యత్వ పరీక్ష చేయించారని ఆమె వాపోయింది. పగటిపూట తన తండ్రి వద్ద, రాత్రి తన వద్ద పడుకోవాలని భర్త కొద్ది రోజులుగా బలవంతం చేస్తున్నాడని బాధితురాలు కన్నీరుపెట్టుకుంది. వారి వేధింపులు తాళలేక నవంబర్ 3న మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఇప్పుడు హెచ్ఆర్సీని ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది. -
నవవధువు కుడికాలే ఎందుకు పెట్టాలి?
నివృత్తం పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చాక కుడికాలు లోపల పెట్టి రమ్మని వధువుకు చెబుతూ ఉంటారు పెద్దలు. ఎడమకాలు పెడితే అశుభాలు జరుగుతాయని అంటారు. దీనికి సాక్ష్యంగా రామాయణంలో హనుమంతుడిని చూపిస్తుంటారు. సీతను అన్వేషిస్తూ లంకకు చేరుకున్న హనుమంతుడు, కావాలని తన ఎడమకాలును మొదట ఆ నేలమీద మోపుతాడు. కుడిపాదం పెడితే రావణాసురుడికి సకల శుభాలు కలుగుతాయనీ, తాను వైరానికే సిద్ధపడి వచ్చాను కాబట్టి ఎడమ పాదం పెట్టడమే మంచిదనీ భావించి అలా చేస్తాడు. అంటే... గొడవకు సిద్ధపడి వచ్చేవారు ఎడమ పాదమే మోపుతారని తెలుస్తోంది. శుభం జరగాలని కోరుకునేవారు ఎవరైనా కూడా కుడి పాదమే మోపాలని అర్థమవుతోంది. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు... ఒక అడవిలో ఓ గాడిద ఉండేది. అది కడుపు నిండా తిండి మేస్తూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండేది. ఓసారి దానికి ఇంకో గాడిద కనిపించింది. ‘నిన్నిక్కడ ఎప్పుడూ చూళ్లేదు, అడవికి కొత్తగా వచ్చావా’ అనడిగింది మొదటి గాడిద. ‘లేదు, మా యజమానీ, నేనూ పట్నం వెళ్లి మా ఊరికి తిరిగొస్తున్నాం, దారిలో ఇక్కడ ఆగాం’ అని చెప్పింది రెండో గాడిద. అక్కడితో ఆపకుండా... ‘ఇక్కడ అడవిలో ఏం బతుకుతావ్, మా ఊరిలో చాలా బాగుంటుంది, నాతో రా’ అంటూ దాన్ని రెచ్చగొట్టింది. అది నమ్మి ఇది కూడా దాని వెనుక బయలుదేరింది. తీరా అక్కడికెళ్లాక యజమాని ఇద్దరితో చాకిరీ చేయించసాగాడు. పైగా తిండి సరిగ్గా పెట్టేవాడు కాదు. దాంతో... అడవిలోనే ఉంటే తిండయినా దొరికేది కదా అని కన్నీళ్లు పెట్టుకుందా గాడిద. ఈ కథను అనుసరించే పై సామెత పుట్టుకొచ్చింది. -
నవ వధువు దారుణ హత్య
నందికొట్కూరురూరల్: నందికొట్కూరు పట్టణంలో ఓ నవ వధువు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగు చూసింది. రాళ్లతో కొట్టి చంపి..ముఖంపై పెట్రోలు పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హతమార్చారు. తెల్లవారుజామున పొలాలకు వెళ్లే కూలీలు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలు పట్టణానికి చెందిన శివమ్మ(18)గా నిర్ధారించారు. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన శ్రీను, లక్ష్మి దంపతుల కూతురు శివమ్మకు గత నెల 25న ఉండవెళ్లి గ్రామానికి చెందిన సురేష్‌తో వివాహం చేసి అత్తారింటికి పంపించారు. వారం రోజుల క్రితం తల్లిదండ్రులు కూతురు, అల్లుడిని పుట్టింటికి పిలుచుకొని వచ్చారు. అదివారం ఉదయం బహిర్భుమికి వెళ్లిన శివమ్మ తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు బంధువుల ఇళ్లలో గాలించిన ఆచూకీ లభించకపోవడంతో అదే కాలనీకి చెందినదావీదుపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహానికి ముందు శివమ్మ దావీదు అనే యువకుడ్ని ప్రేమించడంతో అతనికి తమ కూతురును ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో దావీదు తమ కూతురును మాయమాటలు చెప్పి ఎక్కడికైన తీసుకెళ్లి ఉంటాడని వారు ఆరోపించారు. మంగళవారం పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తుండగానే బుధవారం శివమ్మ శవమై కనిపించింది. కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. తమ కూతురుకు దావీదు హత్య చేసి ఉంటాడని తల్లితండ్రులు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ పట్టణ శివారు పొలాల్లో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన స్థలాన్ని డీఎస్పీ నరసింహారెడ్డి పరిశీలించారు. నిందితుడిని గుర్తించేందుకు ఆధారాలు సేకరిం చారు. శివమ్మ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
'గొంతునులిమారు, వారిని వదలకూడదు'
విశాఖపట్నం: పెందుర్తి సింహపురి లే అవుట్లో ఓ దారుణం జరిగింది. ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవవధువు ఆత్మహత్యాయత్నం చేసిందని బంధువులు చెబుతున్నారు. అయితే అత్తింటివారే వేధింపులకు గురి చేసి గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారని, వారిని వదిలపెట్టకూడదని నవవధువు మేఘావతి బంధువులు ఆందోళనకు దిగారు. మేఘావతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె అపస్మారక స్థితిలో ఉంది. స్థానికుల కథనం ప్రకారం మేఘావతికి నెల క్రితమే పెళ్లి అయింది. వివాహ సమయంలో కట్నకానుకలు బాగానే ఇచ్చారు. అయినా అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయని మేఘావతి బంధువులు చెబుతున్నారు. తీవ్రజ్వరమంటూ అత్తింటివారు మేఘావతిని ఆస్పత్రిలో చేర్పించారు. అత్తింటివారే మేఘావతిని పీకనులిమి చంపేందుకు ప్రయత్నించారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. వారు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మేఘావతి భర్త, అత్త, బావలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలిస్తుండగా అమ్మాయి తరఫు బంధువులు అడ్డుకున్నారు. దాంతో ఆస్పత్రివద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
పందిట్లో కొబ్బరి కళ...
ఎంపిక పెళ్లిలో నవ వధువు కొబ్బరిబొండాం చేతపట్టి పందిట్లో అడుగు పెడుతుంది. పచ్చని కళ పందిరంతా పరుచుకుంటుంది. పెళ్లిలో ప్రతిదీ కళగా కనిపించాలనుకునేవారు కొబ్బరిబొండాలు కూడా ఆకర్షణీయంగా ఉండాలని ముచ్చటపడుతున్నారు. గతంలో చమ్కీ డిజైన్లను ఇష్టపడేవారు. ఇప్పుడు కుందన్, ముత్యాల వర్క్ కోసం పోటీపడుతున్నారు. ధరించిన దుస్తులకు మ్యాచింగ్ డిజైన్ కోరుకుంటున్నారు. పెయింటింగ్స్ కావాలంటున్నారు. పువ్వులను అలంకరించాలనుకుంటున్నారు. పెళ్లి పందిట్లో కళగా కనిపిస్తున్న కొబ్బరిబొండాల డిజైన్లలో కొన్ని ఇవి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళకూ ఇలాంటివి అనుసరించి చూడండి. - కల్పన, పెళ్లి పూలజడ నిర్వాహకురాలు,www.pellipoolajada/facebook.com -
నవ వధువు బలవన్మరణం
కుల్కచర్ల, న్యూస్‌లైన్: ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి.. తమ్ముళ్లను బాగా చదివించండి. నా భర్త చాలా మంచోడు.. నాకు జీవితంపై విరక్తి కలిగింది. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు..’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ నవవధువు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కుల్కచర్ల మండలం చాకల్‌పల్లిలో ఆదివారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకల్‌పల్లికి చెందిన యాదమ్మ(20)ను అదే మండలంలోని విఠలాపూర్ గ్రామానికి చెందిన బంధువు శ్రీనివాస్‌కిచ్చి మూడు నెలల క్రితం వివాహం చేశారు. యాదమ్మ మహబూబ్‌నగర్ జిల్లా నవాపేట్‌లోని గీతాంజలి డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతుండగా శ్రీనివాస్ మహబూబ్‌నగర్‌లో ఐటీఐ చేస్తున్నాడు. దంపతులు చాకల్‌పల్లిలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి భార్యాభర్తలు ఇంట్లో భోజనం చేసి నిద్రపోయారు. శ్రీనివాస్ శనివారం ఉదయం లేచి చూడగా భార్య కనిపించలేదు. గ్రామంతోపాటు బంధువుల వద్ద ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో ఆదివారం ఉదయం చాకల్‌పల్లి చెరువులో యాదమ్మ మృతదేహం కన్పించింది. మృతురాలి తల్లి మాణెమ్మ సమాచారంతో పోలీసులు చెరువులోంచి మృతదేహాన్ని వెలికితీయించి పరిశీలించారు. ఇంట్లో పంచనామా చేయగా యాదమ్మ పుస్తకంలో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని, తన భర్త చాలా మంచోడంటూ అందులో పేర్కొంది. దంపతులు అన్యోన్యంగా ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు యాదమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మాణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సలీం తెలిపారు.