
పందిట్లో కొబ్బరి కళ...
ఎంపిక
పెళ్లిలో నవ వధువు కొబ్బరిబొండాం చేతపట్టి పందిట్లో అడుగు పెడుతుంది. పచ్చని కళ పందిరంతా పరుచుకుంటుంది. పెళ్లిలో ప్రతిదీ కళగా కనిపించాలనుకునేవారు కొబ్బరిబొండాలు కూడా ఆకర్షణీయంగా ఉండాలని ముచ్చటపడుతున్నారు. గతంలో చమ్కీ డిజైన్లను ఇష్టపడేవారు. ఇప్పుడు కుందన్, ముత్యాల వర్క్ కోసం పోటీపడుతున్నారు. ధరించిన దుస్తులకు మ్యాచింగ్ డిజైన్ కోరుకుంటున్నారు. పెయింటింగ్స్ కావాలంటున్నారు. పువ్వులను అలంకరించాలనుకుంటున్నారు. పెళ్లి పందిట్లో కళగా కనిపిస్తున్న కొబ్బరిబొండాల డిజైన్లలో కొన్ని ఇవి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళకూ ఇలాంటివి అనుసరించి చూడండి.
- కల్పన, పెళ్లి పూలజడ నిర్వాహకురాలు,www.pellipoolajada/facebook.com