
ప్రతీకాత్మక చిత్రం
మైలార్ దేవ్‌పల్లిలో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్త వేధింపులు తాళలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవ్‌పల్లిలో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్త వేధింపులు తాళలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌తో కవితకు వివాహం జరిగింది.
పెళ్లయిన కొన్ని రోజులకే భర్త తన అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటి పోటి మాటలు భరించలేక కవిత తనువు చాలించింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అశ్లీల చిత్రాలకు బానిసై నా భర్త..