పెళ్లైన ఐదురోజులకే నవ వధువు అదృశ్యం | bride missing after five days of marriage | Sakshi
Sakshi News home page

పెళ్లైన ఐదురోజులకే నవ వధువు అదృశ్యం

Published Fri, Jun 19 2015 12:39 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

bride missing after five days of marriage

రంగారెడ్డి: పెళ్లి జరిగిన ఐదు రోజులకే పెళ్లి కూతురు అదృశ్యమైన సంఘటన జిల్లాలోని కుల్కచర్ల మండల పరిధిలోని తిర్మాలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబికులు తెలిపిన వివరాల ప్రకారం తిల్మాలాపూర్ గ్రామానికి చెందిన రాములు, జయమ్మల కూతురు పద్మ (19) ఈ నెల 11న మహబుబ్‌గనర్ జిల్లా మిడ్జిల్ మండలం వలబ్‌నగర్ కు చెందిన భగవంత్‌గౌడ్‌తో వివాహం జరిపించారు.వివాహాం అయిన తరువాత ఐదో రోజు పెళ్లి తంతులో భాగంగా పందిరి కొమ్మ తీయడానికి పెళ్లి కూతురు ఇంటికి ఈ నెల 17న వచ్చారు.

అదే రోజు సాయంత్రం నుంచి పెళ్లి కూతురు కనిపించకుండ పోయిందని పెళ్లి కూతురు కుటుంబికులు తెలిపారు.అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కూడ అదే రోజు నుంచి కనిపించడం లేదని అ యువకుడు పై అనుమానం ఉందని గురువారం అమ్మాయి తల్లి జయమ్మ పోలీసులకు పిర్యాదు చేసింది. జయమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement