
మణికొండ, హైదరాబాద్: వివాహం అయిన ఏడు రోజులకే ఓ నవవధువు మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన ఉదంతం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాలీమందిర్ వద్ద మూడు రోజుల క్రితం జరిగింది. అతని చర్యను తను నివసిస్తున్న బస్తీవాసులే వ్యతిరేకించి, అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించిన సంఘటన సోమవారం లంగర్‌హౌస్‌లో కలకలం సృష్టించింది. వివరాలివీ... నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాలీ మందిర్ వద్ద నివసిస్తున్న ఓ యువతి గతంలో లంగర్‌హౌస్‌లో నివసించే అరవింద్ అనే యువకుడిని ప్రేమించింది.
తల్లితండ్రులు ఏడు రోజుల క్రితం ఆమెకు అత్తాపూర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం చేశారు. ప్రియుడితో కొనసాగిన ప్రేమాయణంతో ఆమె మూడు రోజుల క్రితం అతని వెంట వెళ్లిపోయింది. దాంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తమ కూతురు కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. అది విచారణ కొనసాగుతున్న క్రమంలోనే సోమవారం విషయం లంగర్‌హౌస్‌లోని అతని బస్తీలో తెలిసింది. దాంతో స్థానికులు అతను చేసిన చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. బస్తీలో అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.
Hyderabad: కేంద్రంగానే ఉగ్ర చరిత్ర!
Comments
Please login to add a commentAdd a comment