
పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బుక్ మార్క్ చేసుకోదగిన అతిపెద్ద ఫ్యాషన్ ట్రెండ్స్ ఈ ఏడాది మనల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయం, ఆధునిక ధోరణులను కలబోసి మన ముందుకు తీసుకువచ్చాయి. వధువుల కోర్సెట్ చోళీలు, భారతీయ సంప్రదాయ నేత చీరలు, పలుచటి మేలి ముసుగులు, ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా కనిపించాయి. పెళ్ళిళ్లకు ముందే బుక్ మార్క్ చేసుకోదగిన పెళ్లికూతురుట్రెండ్స్‌లో ప్రధానంగా కనిపించిన జాబితాను చెక్ చేద్దాం..
భారతీయ చేనేత
క్లాసిక్ ఇండియన్ చేనేత పునరుజ్జీవనాన్ని మనం గమనించి తీరాలి. వివాహ వేడుకలకు కాంజీవరం, బనారసి, చికంకారి వంటి చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఈ కాలాతీత డిజైన్లు సంప్రదాయ రూపంలో ధరించినా లేదా ఆధునిక ట్విస్ట్‌తో మెరిపించినా, ఇవి మసకబారే సూచనలు కనిపించడం లేదన్నది నిజం.
కోర్సెట్‌లు ఫ్యాషన్ రంగాన్ని ఆక్రమించాయి అని చెప్పవచ్చు. వీటిని సంప్రదాయ వివాహ వేడుకలకు తీసుకురావడం ఎలా అనే అంశంపై పెద్ద కసరత్తే జరిగింది. అందుకు పెళ్లికూతుళ్లు కూడా తమ వివాహ సమయంలో ఆధునికంగా కనిపించడానికి కోర్సెట్ చోళీలను ఎంచుకుంటున్నారు.
దాంతో దిగ్గజ డిజైనర్లు తమ డిజైన్స్‌కు ఆధునికతను జోడిస్తున్నారు. సాంప్రదాయ పెళ్లి బ్లౌజ్‌లకు ఇవి ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. ఫిష్‌టైల్ లెహంగాతో కోర్సెట్ చోళీలు జతగా చేరి అద్భుతంగా కనిపిస్తున్నాయి. సంగీత్ నుంచి రిసెప్షన్ వరకు కోర్సెట్‌లు అంతటా రాజ్యమేలుతున్నాయి.
లాంగ్ వెయిల్స్
పాశ్చాత్య వివాహాల నుంచి వీటిని స్ఫూర్తి పొందినట్లు అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వధువులలో ట్రైల్ లేదా వెయిల్ ఉన్న లెహంగాలను ధరించే ధోరణి పెరుగుతోంది. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకునే వధువులకు ఈ లుక్ ఒక గొప్ప ఎంపిక. లాంగ్ ట్రైల్స్ లేదా వెయిల్స్ ఉన్న లెహంగాలు ప్రిన్సెస్ లుక్‌తో అందంగా కనిపిస్తాయి.
(చదవండి: 'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!)
Comments
Please login to add a commentAdd a comment