
వరుడికి 40, వధువుకి 24
గవర్నమెంట్ జాబ్ బాబూ,
మన దేశంలో పెళ్లి అంటే కేవలం వేడుక, ఆనందం మాత్రమేకాదు ఆడంబరం, ఆర్బాటం కూడా. ఎంత ఖర్చైనా పరవాలేదు విలాసవంతంగా మూడు ముళ్ల వేడుక పూర్తి కావాల్సిందే. ఇదీ నేటి ప్రజ తీరు. దీనికి తోడు ఇలాంటి వివాహ వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం క్రేజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అంటే ముందుగా గుర్తొచ్చే నెటిజన్లు కమెంట్లే గదా. తాజాగా ఒక పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.అయితే ఈ పెళ్లి వెనుక విశేషం ఇదే అంటూ ఇంటర్నెట్ యూజర్లు కమెంట్లతో హోరెత్తించారు. ఇంతకీ విషయం ఏమిటంటే.
ఈ వైరల్ వీడియోలో వధువు గ్రాండ్ జర్జోజీ వర్క్‌తో తయారైన మెరూన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. డబుల్ దుపట్టాలతో మరింత అందంగా కనిపించింది.ఆకర్షణీయమైనమేకప్, చోకర్,నెక్లెస్‌లు,చెవిపోగులు ఇలా సర్వహంగులతో పెళ్లికూతురి లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తోంది. మరోవైపు, వరుడు కూడా ఐవరీ కలర్ షేర్వానీలో బాగానే తయారయ్యాడు. ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు. మరీ ముఖ్యంగా పెళ్లి కూతురు చాలా ఉత్సాహంగా స్టెప్పులేసింది. అటు 40 ఏళ్ల పెళ్లి కొడుకుగా సిగ్గుపడుతూ ఆమెతో జత కలిశాడు.

అసలు స్టోరీ ఇదట!
వరుడు వయసు 46, వధువు వయసు 24.తనకంటే పదహారు సంవత్సరాలు పెద్దవాడిని సంతోషంగా వివాహం చేసుకుంది. వయసులో చాలా తేడా ఉన్నా కూడా ఆమె ఆనందంగా కనిపిస్తోంది. వరుడు గవర్నమెంట్ టీచర , సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగం అందుకే ఇలా అంటూ గత ఏడాది డిసెంబరులో చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. వీడియో అప్‌లోడ్ కాగానే కమెంట్ సెక్షన్‌ను నెటిజన్లు చమత్కారాలు, వ్యంగాలతో నింపేశారు. కొంతమంది పెళ్లి కొడుకు వయస్సును ఎగతాళి చేయగా, మరికొందరు గవర్నమెంట్ ఉద్యోగం బాబూ అని వ్యాఖ్యానించారు.
పెళ్లి చేయాలంటే అందం, కులంతోపాటు, వయసు, హోదాకూడా పరిశీలిస్తారు పెద్దలు సాధారణంగా. సమయాన్నిబట్టి, తమ సౌలభ్యాన్ని వీటిల్లో అనేక మినహాంపులతో పెళ్లిళ్లు జరిగిపోతాయి. దాదాపు వీరంతా చాలా హ్యాపీగా జీవితాలను గడుపుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియా యూజర్లు మాత్రం, చమత్కారాలతో, మీమ్స్ సందడిచేస్తూనే ఉంటారు. ‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు’ అన్న సామెత వీళ్లు అసలు పట్టించుకోరు.
Comments
Please login to add a commentAdd a comment