Older
-
రెండు ప్రంచ యుద్ధాలను చూసిన బామ్మ! చివరి క్షణాల్లో..
జపాన్ అత్యధిక ఆయుర్దాయం కలిగిన మానవులకు నిలయంగా వార్తలకెక్కిన సంగతి తెలిసందే. ఇంతకు ముందు ఆ దేశంలో పలువురు వ్యక్తులు దీర్ఘకాలం జీవించిన వ్యక్తులుగా రికార్డులు సృష్టించారు కూడా. అలా అత్యంత దీర్ఘకాలం బతికిన రెండో వ్యక్తిగా ఓ బామ్మ కూడా ఉంది. ఆమెకు 116 ఏళ్ల వయసు. ఆమె మంగళవారం తనకెంత ఇష్టమైన ఫుడ్ బీన్-పేస్ట్ జెల్లీని తిని తుది శ్వాస విడించినట్లు జపాన్ పేర్కొంది. ఆ బామ్మ పేరు ఫుసా టట్సుమీ. ఒసాకాలోని కాశీవారా నగరంలో ఓ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఉంటుంది. ఫుసా టట్సుమీ మరణించినట్లు అక్కడి అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. జపాన్ చరిత్రలో 116 ఏళ్ల వయసుకు చేరుకున్న ఏడవ జపనీస్ వ్యక్తిగా ఫుసా టట్సుమీ బామ్మ నిలిచింది. సరిగ్గా 2022 ఏప్రిల్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఆమెను అధికారికంగా ప్రకటించడం విశేషం. గతేడాది జపాన్‌లో 119 ఏళ్ల కేన్ తనకా మరణించిన తర్వాత జపాన్‌లో రెండొవ అత్యంత వృద్ధ బామ్మగా ఈ ఫుసా టట్సుమీ గుర్తింపు పొందింది. టట్సుమీ బామ్మ రెండు ప్రపంచ యుద్ధాలను, విపత్తులను, కరోనా వంటి మహమ్మారీలను చూసింది. ఆమె భర్త ఓ రైతు. వారికి ముగ్గురు సంతానం. ఆమె నర్సింగ్ హోమ్ చేరేంత వరకు చాలా ఆరోగ్యంగా తోటపని, వ్యక్తిగత పనులు చాలా చలాకీగా చేసుకుంది. సరిగ్గా 70 ఏళ్ల వయసులో తొడ ఎముక విరిగి అనారోగ్యం పాలవ్వడం తప్పించి అంతకమునుపు ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. 106 ఏళ్ల వయసులో వృద్ధాశ్రమానికి చేరే వరకు అన్ని పనులు చకచకా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచేది. గత కొన్ని రోజుల నుంచే నర్సింగ్ హోమ్‌లో ఉండటం జరిగింది. అక్కడ కూడా ఉద్యోగలందర్నీ పలకరిస్తూ ఉత్సాహంగా ఉండేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఒసాకా గవర్నర్ హిరోఫుమి యోషిమురా సైతం ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. గత నెల సెప్టెంబర్‌లో జరిగిన టట్సుమీ పుట్టిన రోజుల వేడుకలను ఆయన గుర్తు చేసుకుంటూ ఆమె కడవరకు ఎంత ఆరోగ్యంగా ఉందో స్వయంగా చూశానని, ఆమెలా అందరూ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తే దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించగలుగుతారని అన్నారు. (చదవండి: జుట్టు లేకపోయినా మోడల్‌గా రాణించి శభాష్ అనిపించుకుంది! హెయిర్‌లెస్ మోడల్‌గా సత్తా చాటింది) -
అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..
వయసులో అతను వృద్ధుడే కానీ బాడీ పరంగా ఉక్కులాంటి దేహం. యువ బాడీబిల్డర్లకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతని సొంతం. తొమ్మిది పదుల వయసులో ఓ వీల్‌చైర్‌కే పరిమితమై.. మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. అతను మాత్రం చాలా యాక్టివిగ్ అచ్చం యువకుడిలో ఉండే నూతనోత్సహాం అతనిలో ఉంది. ఇంతకీ అతను ఎవరూ? ఆ వయసులో కూడా అంత చురుగ్గా ఎలా ఉన్నాడంటే.. జిమ్ అరింగ్టన్ అనే వ్యక్తి ఓ బాడీ బిల్డర్. అతను వయసులో ఉన్నపుడే ఎలాంటి బాడీని మెయింటేన్ చేశాడో అలానే వృద్ధాప్యంలో కూడా మెయింటేన్ చేసి అబ్బురపర్చాడు. 90ల వయసులో కూడా బాడీ బిల్డర్ మాదిరి తన కండలు, బాడీ తీరు మారకపోవడవం విశేషం. క్రమం తప్పకుండా చేసే జిమ్, తీసుకునే ఫుడ్ డైట్ కారణంగా అతను అలా బాడీని కంటిన్యూ చేయగలిగాడు. దీంతో అతను అత్యంత వృద్ధ బాడీ బిల్డర్‌గా రికార్డు నెలకొల్పోడు. తనకు చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ మీద మక్కువ ఉండేదని, ఇదే తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకునేలా చేసిందని ఆనందంగా చెబుతున్నడు అరింగ్టన్. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అతని హెల్త్ సీక్రెట్‌కి సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేసింది. అందులో తన ఆరోగ్య రహస్యం, బాడీని అలా మెయింటైన్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిట్కాలను పంచుకున్నాడు అరింగ్టన్. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ వయసులో కూడా బాడీని ఫిట్‌గా ఉంచి అందరికి స్ఫూర్తిగా నిలిచారంటూ అరింగ్టన్పై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి) -
పాపం.. తిండి మానేసి మరీ కన్నుమూసింది
హాంకాంగ్: ప్రపంచంలో అత్యంత వయస్కురాలైన మగ పాండా కన్నుమూసింది. 35 ఏళ్ల యాన్ యాన్(పాండా పేరు) హాంకాంగ్ ఓషన్ థీమ్ పార్క్‌లో మృతి చెందినట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భూమ్మీద మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వయసుర్కాలైన మగ పాండా ఇదే. దీని వయసు 35 ఏళ్లు కాగా, ఈ వయసు మనిషి వయసు 105 ఏళ్లకు సమానం. అత్యంత సున్నితమైన జీవరాశి జాబితాలో పాండాకు సైతం చోటు ఉంది. యాన్ యాన్ 1999 నుంచి ఈ పార్క్‌లో ఉంటోంది. గత పదిరోజులుగా అది తిండి తగ్గిస్తూ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నా.. అది ఎందుకలా చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. బలవంతంగా తినిపించే ప్రయత్నం చేసినా.. ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతకు ముందు అత్యధిక వయసున్న పాండాగా జియా జియా పేరిట రికార్డు ఉండేది. 38 ఏళ్ల వయసులో అది 2016లో కన్నుమూసింది. జియా జియా, యాన్ యాన్లను చైనా ప్రభుత్వం హాంకాంగ్ పార్క్‌కు కానుకగా ఇచ్చింది. పాండాల సంరక్షణకు మారుపేరుగా ఉన్న హాంకాంగ్‌లో.. వాటి జనాభా మాత్రం అంతగా వృద్ధి చెందడం లేదు. మరోవైపు చైనా నుంచే కానుకల రూపంలో వచ్చిన యింగ్ యింగ్, లే లే పాండాలతో సంతానోత్పత్తి చేయించాలన్న పదిహేనేళ్ల ప్రయత్నాలు ఫలించడం లేదు. -
వావ్...‘అమ్మ’మ్మా...
తన కూతురి కోసం.. ఓ తల్లి ఎవరూ చేయని సాహసం చేసింది. 67 ఏళ్ల వయసులో సరొగేట్ తల్లిగా మారి.. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత పెద్దవయసులోని సరొగేట్ తల్లిగా ఆమె నిలిచింది. ఈ ఘటన గ్రీస్‌లో జరిగింది. ఏడున్నర నెలల గర్భం అనంతరం సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. ఆ బిడ్డ పుట్టినప్పుడు 1.2 కిలోల బరువుంది. ఇప్పుడు తనకు తల్లిలా కంటే అమ్మమ్మలాగే ఎక్కువ అనిపిస్తోందని అనస్టాసియా ఓంటు అనే ఆ వృద్ధురాలు చెప్పారు. ఈమె మధ్య గ్రీస్‌లోని లారిసా అనే గ్రామానికి చెందినవారు. గర్భం దాల్చిన సమయంలో తాను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నానన్నారు. తన కూతురు సొంత బిడ్డను కనలేదని తెలిసినప్పుడు ఆమె గుండె పగిలేలా ఏడ్చిందని అనస్టాసియా అన్నారు. విషయం ఏమిటంటే.. ఆమె కూతురు కాన్స్టాంటినా (43) కేన్సర్ కారణంగా 2009లోనే మరణించింది. అంతకుముందు ఆమెకు ఏడుసార్లు గర్భం పోయింది. దాంతో.. ఆమె చనిపోవడానికి ముందు.. ఆమె బిడ్డకు తాను తల్లినవుతానని చెబితే ఏమాత్రం నమ్మలేకపోయిందని, కానీ తాను చాలా ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అంతర్జాతీయ రికార్డులను బట్టి చూస్తే, ఇప్పటివరకు ఇంత పెద్ద వయసులో సరొగేట్ మదర్‌గా ఎవరూ లేరని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ పాంటోస్ తెలిపారు. ఇది ప్రత్యేకమైన కేసు కావడంతో కోర్టు కూడా అనుమతి తెలిపిందని, ఆ తర్వాత తాను ముందుకెళ్లానని ఆయన వివరించారు. -
ఆ విషయంలో ముసలివాళ్లే మేలట..!
న్యూయార్క్: భావ వ్యక్తీకరణలో వయో వృద్ధులే మేలంటున్నారు పరిశోధకులు. యువత కన్నా.. అరవై ఏళ్ళ వయసు దాటినవారే బాధ, ఒంటరితనం వంటి అన్ని రకాల భావాలను వ్యక్త పరచడంలో సానుకూల స్పందన కలిగిఉంటున్నారని తాజా అధ్యయనాల్లో కనుగొన్నట్లు చెబుతున్నారు. భావోద్వేగాల విషయంలోనూ వృద్ధులే అత్యంత అనుకూలమైన, చురుకైన ప్రవర్తన కలిగి ఉంటున్నారని చెప్తున్నారు. యువతలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటున్నాయని, వృద్ధులు నిర్మలమైన అనుభూతులను, ప్రశాంతతను కలిగి ఉన్నట్లు అమెరికా మసాచెట్స్ ఆమ్హెస్గ్ విశ్వవిద్యాలయం ప్రధాన పరిశోధకుడు రెబెక్కా రెడీ ఓ నివేదికలో వెల్లడించారు. 60 నుంచి 90 ఏళ్ళ వయసువారితోపాటు, 18 నుంచి 32 ఏళ్ళ వారిలో అనుకూల, ప్రతికూల భావోద్వేగాలపై పరిశోధనలు జరిపిన అధ్యయనకారులు వివరాలను ఏజింగ్ అండ్ మెంటల్ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు. పరిశోధనల్లో వృద్ధులు యువతకన్నా సంతోషంగా, ఆనందంగా ఉండటమే కాక, ఎంతో నిర్మలమైన మనసుతోనూ, సానుకూల భావోద్వేగాలను కలిగి ఉండటాన్ని గమనించినట్లు వెల్లడించారు. యువ, వృద్ధ బృందాల్లో అనేక లక్షణాల్లో పోలిక ఉన్నప్పటికీ విచారం, ఒంటరితనం, ప్రశాంతత వంటి వాటిలో మాత్రం విభేధాలను గమనించినట్లు చెప్తున్నారు. యువత.. సిగ్గు, విచారం, చికాకు, ఒంటరితనం వంటి వాటిని వ్యక్త పరచడంలో స్వీయ నిందను వెలిబుచ్చడం చూసి ఎంతో ఆశ్చర్యపోయినట్లు ప్రధాన పరిశోధకుడు రెడీ చెప్తున్నారు. ఇటువంటి విషయాల్లో వృద్ధులే సాపేక్ష స్వభావాన్ని కలిగి ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. అమెరికాలోని వృద్ధుల్లో భావోద్వేగాలను తెలుసుకోవడం వల్ల వైద్య పరంగా గణనీయమైన ఫలితాలను అందించే అవకాశం ఉంటుందని పరిశోధక బృందం వెల్లడించింది. మానసిక వైద్యులకు, కేర్ టేకర్లకు, వర్కర్లకు వృద్ధుల సంరక్షణా బాధ్యతలు నిర్వహించడంలో వారి స్వభావ పరిశీలన ఎంతో అవసరమని, తమ పరిశోధన అందుకు సహాయపడుతుందని చెప్తున్నారు. -
పసి వయసులోనే వృద్ధాప్యం!
చిన్న పిల్లలకు సోకే అత్యంత అరుదైన చర్మవ్యాధి బెంజమిన్ బటన్. పసివయసులోనే వృద్ధాప్యం వచ్చినట్లుగా మారిపోవడం ఈ వ్యాధి లక్షణం. ఈ చర్మవ్యాధి సోకిన చిన్నారులు వయసు పైబడినవారిలా కనిపిస్తారు. ఏడేళ్ల అంజలి కుమారి, 18 నెలల కేశవ్ కుమార్ లాంటి చాలా మంది ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతున్నారు. అతి చిన్న వయసులోనే చర్మమంతా ముడతలు పడిపోయి, వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారు. జన్యుపరంగా వచ్చే ఆ అరుదైన రుగ్మతతో అక్కాతమ్ముళ్లు బాధపడుతున్నారు. జార్ఖండ్ రాంచికి చెందిన అంజలి, కేశవ్‌లను క్యూటిస్ లాక్సాగా పిలిచే అత్యంత భయంకరమైన రోగం పట్టిపీడిస్తోంది. శత్రుఘ్న రాజక్, రింకీదేవి దంపతులకు అంజలి, కేశవ్ లతో పాటు... 11 ఏళ్ల మరో కుమార్తె శిల్పి కూడా ఉంది. ఆమెలో మాత్రం పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా కనిపించలేదట. ఇండియాలో డాక్టర్లు కూడా ఈ వ్యాధిని తగ్గించడం కష్టమని చెప్పేశారు. అయితే తమను వీధిలోని వారంతా వింతగా చూస్తున్నారని, చెత్త కామెంట్లు చేస్తున్నారని అంజలి వాపోతోంది. దాది అమ్మా (బామ్మ), బుడియా (ముసలి), బందరియా (కోతి) వంటి పదాలతో పిలుస్తూ స్కూల్లో అంతా గేలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ పిల్లలకు సోకిన ఈ వింతవ్యాధి ఎప్పటికైనా తగ్గుతుందేమోనన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వైద్యులు మాత్రం దీనికి ఇతర దేశాల్లో తప్ప.. భారత్‌లో మందు లేదని తేల్చిచెప్పేశారు. లాండ్రీ మ్యాన్‌గా పనిచేస్తూ నెలకు రూ. 4,500 మాత్రమే సంపాదించే శత్రుఘ్నకు విదేశాల్లో వైద్యం చేయించే తాహతు లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఎప్పటికైనా తమ పిల్లలు సాధారణ స్థితికి వస్తారని ఆ తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. -
వృద్ధుడి ఆకలి చావు!
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో సోమవారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు ఆకలి చావుకు గురయ్యాడు. వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చిన అతడు ఇస్లాంపూర, గౌలిగూడ ప్రాంతాల్లో భిక్షాటన చేసేవాడు. దొరికినప్పుడు తినడం.. లేకుంటే పస్తులుండడం చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం ఆకలితో అలమటించి చనిపోయాడు. -
‘అద్దె’కు వచ్చి ఉసురు తీశారు
బంగారం కోసం వృద్ధురాలి హత్య నమ్మించి సొత్తు దోచుకున్న జంట పెదగంట్యాడ : బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. పెదగంట్యాడ ప్రాంతంలో గురువారం ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఓ అపరిచిత జంట ఈ దారుణానికి ఒడిగట్టిందని భావిస్తున్నారు. ఇటీవల ఆరిలోవలోనూ ఇదే తరహాలో హత్య జరిగిన నేపథ్యంలో ఈ రెండూ ఒక ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నెల్లిముక్కులో బొట్టా మహలక్ష్మి (70)కి రెండంతస్తుల ఇల్లుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఆమె ఒంటరిగా ఉంటోంది. మూడో కుమారుడు చనిపోవడంతో అతని భార్య లక్ష్మి, పిల్లలు రెండో అంతస్తులోని ఒక పోర్షన్లో ఉంటున్నారు. మొదటి అంతస్తులో రెండు పోర్షన్లు ఖాళీగా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఇరవై, పాతికేళ్ల వయసున్న ఓ జంట అక్కడికి వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని మహాలక్ష్మిని అడిగారు. అడ్వాన్స్ రూ. 2 వేలు ఇచ్చారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు వారు మళ్లీ వచ్చారు. గృహప్రవేశం చేస్తామని, ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలని లోనికి ప్రవేశించారు. వీరు గృహ ప్రవేశం చేస్తున్న సమయంలో మహలక్ష్మి కోడలు తనపిల్లలను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. కాస్సేపటి తర్వాత ఆమె ఇంటికి చేరుకుంది. అపరిచిత జంట అద్దెకు అడిగిన పోర్షన్ తలుపు దగ్గరకు వేసి ఉండటం లక్ష్మి గమనించింది. పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో తలుపు తీసుకొని లోపలికి వెళ్లింది. మధ్యగదిలో మహాలక్ష్మి చనిపోయి కనిపించింది. దీంతో ఆమె నిశ్చేష్టురాలయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీసీపీ శ్రీనివాస్, సౌత్ ఏసీపీ కె.వి.రమణ, న్యూపోర్టు సీఐ జి.శ్రీనివాస్, ఎస్ఐ షణ్ముఖరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అపరిచిత జంటే మహాలక్ష్మి గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మెడలోని బంగారం తాడు, చెవి ముక్కులకు ఉన్న బంగారం వస్తువులు కనిపించలేదు. ఆభరణాలకోసం దురాగతానికి పాల్పడిఉంటారని లక్ష్మి పోలీసులకు వివరించింది. ఆ వృద్ధురాలి వద్దనున్న చిక్కంలోని నగదునూ ఆ జంట కాజేసింది.