బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో సోమవారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు ఆకలి చావుకు గురయ్యాడు. వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చిన అతడు ఇస్లాంపూర, గౌలిగూడ ప్రాంతాల్లో భిక్షాటన చేసేవాడు.
దొరికినప్పుడు తినడం.. లేకుంటే పస్తులుండడం చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం ఆకలితో అలమటించి చనిపోయాడు.