Unidentified
-
కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి మృతి
సిన్సినాటి: అమెరికాలోని ఓహియోలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆదిత్య అడ్లఖా(26) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న తుదిశ్వాస విడిచారు. ఓహియో రాష్ట్రం యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో డాక్టరేట్ చేస్తున్న ఆదిత్య ఈనెల 9న కారులో వెళ్తుండగా దుండగులు పలుమార్లు అతడిపైకి కాల్పులు జరిపారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడగా, కారు అదుపుతప్పి గోడను ఢీకొని ఆగిపోయింది. ఆదిత్యను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 18న అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని రాంజస్ కాలేజీలో బీఎస్సీ, 2020లో ఎయిమ్స్‌లో ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అతడు సిన్సినాటి యూనివర్సిటీలో జాయినయ్యారు. కాగా, కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. -
Unidentified Anomalous Phenomena: కలవో, లేవో...!
ఏలియన్స్. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్స్. గ్రహాంతరవాసులు.. ఇలా వాళ్లకు ఎన్నెన్నో పేర్లు. వాళ్ల చుట్టూ ఎన్నెన్నో కథలు. వాళ్ల ఉనికిపై ఎన్నెన్నో కథనాలు. వాళ్లు భూమిపైకి వచ్చిపోయేందుకు ఉపయోగిస్తారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (ఎగిరే పళ్లాలు) చుట్టూ మరెన్నో పుకార్లు. వాటిని చూశామంటూ గత ఒకట్రెండు శతాబ్దాలలో ఎంతోమంది పత్రికలకు, టీవీలకు ఎక్కారు. కొన్నిసార్లు వినువీధిలో కొన్ని వింత వస్తువులు కెమెరాలకు చిక్కాయి. అవి ఎగిరే పళ్లాలేనని నమ్మిన వాళ్లు, వాటిలో గ్రహాంతరవాసులు వచ్చారని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఎందరో! దాంతో ఈ విషయంపై నాసా ఇటీవల కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది. దీన్ని ఇప్పటిదాకా గుర్తించని అసాధారణ దృగ్విషయం (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ)గా పేర్కొంటూ, దీని తాలూకు నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు ఒక స్వతంత్ర కమిటీ వేసింది. అది ఏడాది పాటు అన్ని కోణాల్లో పరిశోధన చేసి 33 పేజీల నివేదిక సమర్పించింది. అయితే ఏలియన్స్ గానీ, అవి ప్రయాణించే ఎగిరే పళ్లాలు గానీ ఉన్నాయని గానీ, లేవని గానీ ఇదమిత్థంగా నివేదిక ఎటూ తేల్చకపోవడం విశేషం! నాసా యూఏపీ ప్యానల్ నివేదిక ముఖ్యాంశాలు ► ఇప్పటిదాకా మా పరిశీలనకు వచ్చిన అసాధారణ దృగ్విషయాల్లో (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ) చాలావాటి అసలు స్వభావాన్ని కచ్చితంగా నిర్ధారించలేకపోయాం. ► ఎగిరే పళ్లాలుగా చెప్పిన వాటికి నిజంగా గ్రహాంతర మూలాలున్నట్టు తేలలేదు. ► వీటిలో చాలావరకు బెలూన్లు, డ్రోన్లు, విమానాలుగా తేలాయి. ► అయితే కొన్ని యూఏపీ కేసులు అప్పటిదాకా మనకు తెలిసిన ఏ దృగ్విషయంతోనూ సరిపోలలేదు. ► ఏలియన్స్, ఎగిరే పళ్లాల విషయంలో ప్రజల్లో నెలకొని ఉన్న అంతులేని ఆసక్తి అర్థం చేసుకోదగిందే. అందుకే ఈ విషయమై ఎలాంటి కొత్త సమాచారం తెలిసినా ఎప్పటికప్పుడు వారితో పంచుకుంటాం. నాసాకు యూఏపీ ప్యానల్ సిఫార్సులు ► యూఏపీ సంబంధిత డేటా సేకరణ, విశ్లేషణ కోసం ఒక స్టాండర్డ్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. ► యూఏపీలపై అవగాహనను విస్తృతం చేసుకోవడానికి కృత్రిమ మేధ తదితర టెక్నాలజీల సాయం తీసుకోవాలి. ► యూఏపీల అధ్యయనంలో పారదర్శకత, ఇతర దేశాలు, అధ్యయన సంస్థలతో పరస్పర సహకారం చాలా అవసరం. ► యూఏపీ పరిశోధనలకు, డేటా సేకరణ, అధ్యయనం, ప్రభుత్వ, విదేశీ, అంతర్జాతీయ సంస్థలతో మరింత సమన్వయం తదితరాల నిమిత్తం ఈ ప్రాజెక్టుకు నిధులను మరింత పెంచాలి. ఎగిరే పళ్లాలను గురించి జనాల్లో నెగటివ్ భావజాలం ఎంతగానో పాతుకుపోయింది. ఏలియన్స్ ఉనికి తాలూకు నిజానిజాలను నిర్ధారించేందుకు అత్యంత కీలకమైన డేటాను సేకరించడంలో ఇదే అతి పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది’ – నాసా యూఏపీ అధ్యయన బృందం ఏలియన్స్ ఉన్నదీ లేనిదీ పక్కాగా తేల్చాలన్నా, దీనిపై లోతుగా పరిశోధన చేయాలన్నా ఇప్పుడున్న వాటికి చాలా భిన్నమైన, సృజనాత్మక శాస్త్రీయ అధ్యయన పద్ధతులు అత్యాధునికమైన శాటిలైట్ టెక్నాలజీ కావాలి. అంతకు మించి, ఈ అంశంపై జనం దృక్కోణంలోనే మౌలికంగా చాలా మార్పు రావాలి’ – నాసా – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరీ బాలుడు..!
చింతకొమ్మదిన్నె : కడప–రాయచోటి ప్రధాన రహదారిలోని కాంపల్లె చెక్‌పోస్టు వద్ద ఆదివారం గుర్తు తెలియని బాలుడు సీకే దిన్నె పోలీసులకు ఏడుస్తూ కనిపించాడు. దీంతో పోలీసులు బాలుడిని విచారించగా, తనది పోరుమామిళ్ల గ్రామమని చెబుతున్నాడు తప్ప తనపేరుతో సహా ఇతర వివరాలు ఏమీ చెప్పడం లేదు. దీంతో సీకే దిన్నె పోలీసులు ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జమ్మకు ఆ బాలుడిని అప్పగించారు. -
ఎవరీ బాలుడు..!
చింతకొమ్మదిన్నె : కడప–రాయచోటి ప్రధాన రహదారిలోని కాంపల్లె చెక్‌పోస్టు వద్ద ఆదివారం గుర్తు తెలియని బాలుడు సీకే దిన్నె పోలీసులకు ఏడుస్తూ కనిపించాడు. దీంతో పోలీసులు బాలుడిని విచారించగా, తనది పోరుమామిళ్ల గ్రామమని చెబుతున్నాడు తప్ప తనపేరుతో సహా ఇతర వివరాలు ఏమీ చెప్పడం లేదు. దీంతో సీకే దిన్నె పోలీసులు ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జమ్మకు ఆ బాలుడిని అప్పగించారు. -
సాలిపేట అటవీప్రాంతంలో మహిళ దారుణ హత్య
మెదక్ రూరల్ మండలం సాలిపేట అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు గొంతు పిసికి చంపేసినట్లు తెలుస్తోంది. అటుగా వచ్చిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని శవం ఆచూకీ లభ్యం
జఫర్‌గఢ్ : అనుమానాస్పదస్థితిలో జఫర్‌గఢ్ శివారు నల్లబండ వద్ద లభ్యమైన గుర్తు తెలియని యువకుడి శవం ఆచూకీ లభ్యమైనట్లు ఎస్సై బండారి సంపత్ తెలిపారు. స్థానికుల ద్వారా సోమవారం వెలుగులోకి రావడం జరిగింది. మృతుడు ఎవరన్నది తెలియకపోవడంతో పోలీసులు ఎంజీఎం మార్చురిలో భద్రపర్చారు. పత్రికలో వచ్చిన ఫొటో, కథనాల ఆధారంగా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామానికి చెందిన కుల్లా సంపత్, నిర్మల దంపతులు మంగళవారం మార్చురికి వచ్చి తమ కుమారుడు మహేశ్ (24)గా గుర్తిం చారు. కాగా వీరిది స్వగ్రామం జఫర్‌గఢ్ శివారు వడ్డెగూడెం అయినప్పటికీ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఉనికిచర్లకు వెళ్లి అక్కడనే స్థిరపడ్డారు. కుమారుడి మృతిపై తల్లిదండ్రులు, బంధువులు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు. మృతుడు హన్మకొండ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో ఎంబీఎ పూర్తి చేశాడు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో తన స్మేహితుల వద్దనే ఉంటూ చదువుకుంటున్నాడు. చదువుతున్న సమయంలోనే ఐదు నెలల క్రితం వరంగల్‌లోని ఓ గోల్డ్ షాపులో పనిచేశాడు. ఇటీవల మహేశ్ తాత కుల్లా సాయిలు మృతి చెందడంతో 10 రోజుల పాటు తన స్వగ్రామమైన వడ్డెగూడెంలోనే ఉంటున్నాడు. ఈ సమయంలోనే మృతుడు తాను మృతి చెందిన నల్లబండ వద్ద తన స్నేహితులతో కలిసి విందు పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. తాత దశదినకర్మ పూర్తయిన తర్వాత మహేశ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉనికిచర్లకు వెళ్లాడు. తర్వాత మహేశ్ తన ఇంటి నుంచి నాలుగు రోజుల క్రితం హన్మకొండకు వెళ్లినట్లు తెలిసింది. ఎప్పటి లాగానే తమ కుమారుడు స్నేహితుల వద్దనే ఉన్నాడని భావించిన తల్లిదండ్రులు పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా గుర్తించారు. మహేశ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మహేశ్ మృతిపై ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు తెలియరాలేదని ఎస్సై సంపత్ తెలిపారు. -
వనస్థలిపురంలో ఆకతాయిల హల్చల్
వనస్థలిపురం (హైదరాబాద్): వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఓ కారును ధ్వంసం చేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
వాహనం ఢీకొని మహిళ మృతి
గచ్చిబౌలి (రంగారెడ్డి): కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున గచ్చిబౌలిలోని హుందాయ్ షోరూం వద్ద రోడ్డు దాటుతున్న మహిళ(45)ను గచ్చిబౌలి వైపు నుంచి వచ్చిన ఓ కారు ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
కరీంనగర్: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కాటారం మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ముద్దలపల్లి గ్రామంలో ఓ గుర్తు తెలియని మహళ(35) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వ్యక్తి దారుణ హత్య
అనంతపురం: కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమోత్తురు గ్రామం సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద జరిగింది. వివరాలు.. మోపిడి గ్రామానికి చెందిన వెంకటేష్(45) అనే వ్యక్తిని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేసి వెళ్లారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నీటి గుంతలో నాలుగు మృతదేహాలు
దుత్తలూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ బైపాస్ పక్కన ఓ నీటి గుంతలో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. గురువారం ఉదయం అటుగా పొలాలకు వెళుతున్న రైతులు నీటి గుంతలో నాలుగు శవాలు తేలుతున్న విషయాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. నర్రవాడ బైపాస్‌లోని చెన్నకేశవస్వామి గుడి పక్కన ఒక నీటి గుంత ఉంది. అందులో గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలు తేలి ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మృతదేహాలు ఎవరివి?.. వారిని ఎవరైనా హతమార్చి నీటి గుంతలో పడేశారా? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. -
గోనెసంచిలో వ్యక్తి మృతదేహం
-
నాలా వద్ద మహిళ మృతదేహం లభ్యం
హైదరాబాద్ : హైదరాబాద్ రామాంతపూర్ వివేకానగర్లోని నాలా పక్కన ఆదివారం ఉదయం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 38 సంవత్సరాల వయసున్న ముస్లిం మహిళ మృతదేహం నాలా పక్కన పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
వృద్ధుడి ఆకలి చావు!
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో సోమవారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు ఆకలి చావుకు గురయ్యాడు. వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చిన అతడు ఇస్లాంపూర, గౌలిగూడ ప్రాంతాల్లో భిక్షాటన చేసేవాడు. దొరికినప్పుడు తినడం.. లేకుంటే పస్తులుండడం చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం ఆకలితో అలమటించి చనిపోయాడు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
షాద్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : రోడ్డు దాటుతుండగా ఏదో వాహనం ఢీకొనడంతో ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... మంగళవారం అర్ధరాత్రి షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ శి వారులో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళుతు న్న ఏదో వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి (30) అక్కడికక్కడే మృ తి చెందాడు. బుధవారం తెల్లవారుజామున జీఎంఆర్ పెట్రోల్ సిబ్బంది గ మనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏ ఎస్ఐ రమేష్‌రెడ్డి పరిశీలించి కేసు ద ర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసినవారు ఫోన్ నం. 08548252333, 9440795741, 9440795740కు సంప్రదించాలని కోరారు. -
గుర్తుతెలియని మహిళ మృతి
చెరుకుపల్లి, న్యూస్‌లైన్: చెరుకుపల్లి గ్రామ సరిహద్దులలో తాళ్లచెరువు సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. సమీప రైతులు శనివారం ఉదయం మహిళ మృతదేహాన్ని గమనించి చెరుకుపల్లి పోలీ సులకు సమచారం అందించారు. ఎస్ఐ శేషగిరిరావు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 35ఏళ్లలోపు ఉంటుందని, ఎరుపు రంగు చారలు, పసుపు రంగు చుక్కల చీర ధరించి ఉందన్నారు. ఆమె శుక్రవారం రాత్రి మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.