శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ బైపాస్ పక్కన ఓ నీటి గుంతలో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి.
దుత్తలూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ బైపాస్ పక్కన ఓ నీటి గుంతలో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. గురువారం ఉదయం అటుగా పొలాలకు వెళుతున్న రైతులు నీటి గుంతలో నాలుగు శవాలు తేలుతున్న విషయాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
నర్రవాడ బైపాస్‌లోని చెన్నకేశవస్వామి గుడి పక్కన ఒక నీటి గుంత ఉంది. అందులో గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలు తేలి ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మృతదేహాలు ఎవరివి?.. వారిని ఎవరైనా హతమార్చి నీటి గుంతలో పడేశారా? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.