Four dead bodies
-
నలుగురు బందీల మృతదేహాలు అప్పగింత
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు బందీల మృతదేహాలను హమాస్ గురువారం విడుదల చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగర సమీపంలో రెడ్ క్రాస్ సంస్థకు అందజేసింది. అనంతరం రెడ్‌క్రాస్ వాహనంలో ఉంచారు. ఆ పేటికల్లో షిరి బిబాస్(32), ఆమె ఇద్దరు పిల్లలు ఏరియల్ బిబాస్(4), కెఫిర్ బిబాస్, రిటైర్డ్ జర్నలిస్ట్ ఓడెడ్ లిఫ్ షిట్జ్గా గుర్తించారు. వీరందరూ హమాస్ 2023 అక్టోబర్ ఏడో తేదీన దాడిలో అపహరించిన వారు. అయితే ఈ నలుగురు గతేడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో మరణించారని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ క్రూరమైన నిరంతర బాంబు దాడుల వల్ల అపహరణకు గురైనవారందరినీ రక్షించలేకపోయామని హమాస్ తెలిపింది. చనిపోయినవారు... పిల్లల ప్రాణాలనూ లెక్కచేయని నాయకత్వ తీరుకు బలైపోయారని హమాస్ బాధితుల కుటుంబాలకు తెలిపింది. మృతదేహాల పేటికలు తమకు అందాయని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. మరణించినవారి వివరాలను ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించలేదు. అప్పగింత సమయంలో.. ఖాన్ యూనిస్ శివార్లలో వేలాది మంది గుమిగూడారు. శవపేటికలను ఉంచడానికి ఏర్పాటు చేసిన వేదికపై ముసుగులు ధరించిన సాయుధులు... ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును రక్త పిశాచిగా చిత్రీకరించిన పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ఒక పెద్ద స్క్రీన్‌లో లిఫ్షిట్జ్, బిబాస్ కుటుంబం ఫొటోలను, వీడియోలను ప్రదర్శించారు. అత్యంత చిన్నవయస్కుడైన కెఫిర్.. బాట్మాన్ దుస్తులు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో అందరినీ కదిలించింది. -
నీటి గుంతలో నాలుగు మృతదేహాలు
దుత్తలూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ బైపాస్ పక్కన ఓ నీటి గుంతలో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. గురువారం ఉదయం అటుగా పొలాలకు వెళుతున్న రైతులు నీటి గుంతలో నాలుగు శవాలు తేలుతున్న విషయాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. నర్రవాడ బైపాస్‌లోని చెన్నకేశవస్వామి గుడి పక్కన ఒక నీటి గుంత ఉంది. అందులో గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలు తేలి ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మృతదేహాలు ఎవరివి?.. వారిని ఎవరైనా హతమార్చి నీటి గుంతలో పడేశారా? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. -
నాలుగు మృతదేహాలు లభ్యం
గార : మొగదాలపాడు బీచ్‌లో ఆదివారం విహారయాత్ర కు వెళ్లి గల్లంతైన నలుగురి ఆచూకీ లభ్యమైంది. సోమవారం ఉదయానికి మూడు మృతదేహాలు లభ్యం కాగా సాయంత్రం మొగదాలపాడు గ్రామానికి చెందిన కోరాడ మూర్తి మృతదేహం లభ్యమైంది. శ్రీకాకుళంకు చెందిన తుమ్ము ఉపేంద్ర, జొన్నలపాడు గ్రామానికి చెందిన పందిరి సోమశేఖర్, ఆమదాలపాడు గ్రామానికి చెందిన తామాడ సింహాచలం మృతదేహాలు సమద్రం ఒడ్డున తేలాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వీరితో పాటు గల్లంతైన మొగదాలపాడు గ్రామానికి చెందిన కోరాడ మూర్తి మృతదేహాన్ని మంగళవారం రిమ్స్‌కు తరలించనున్నా రు. ఆదివారం కేవలం ముగ్గురు యువకులు మాత్రమే గల్లంతైనట్టు గుర్తించారు. అయితే మరో వ్యక్తి శవమై తేలడంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. గార ఎస్సై పిమురళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్యెల్యే పరామర్శ శ్రీకాకుళం ఎమ్యెల్యే గుండ లక్ష్మీదేవి మొగదాలపాడు బీచ్ వద్దకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. బీచ్ వద్ద పటిష్ట రక్షణ చర్యలు చేపడతామన్నారు. తల్లిని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు శ్రీకాకుళం క్రైం : స్నేహితులతో కలసి పిక్నిక్కు వెళ్లిన పట్టణంలోని చిన్నబరాటం వీధికి చెందిన తుమ్ము ఉపేంద్ర సముద్రంలో గల్లంతై మృతిచెందడంతో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే... ఉపేంద్ర తన స్నేహితులతో కలసి ఆదివారం సాయంత్రం పిక్నిక్కు వెళ్లి మొగదలపాడు బీచ్‌లో గల్లంతైన విషయం తెలిసిందే. అయితే సముద్రంలోపలకు వెళ్లిపోయిన ఉపేంద్ర సోమవారం తెల్లవారి శవమై సముద్ర ఒడ్డున తేలాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. కుటుంబ బాధ్యతను మొత్తం చిన్న వయసులోనే మీదన వేసుకున్న ఉపేంద్ర చనిపోవడంతో తల్లి సూరికుమారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సుమారు ఏడాదిన్నర కిందట ఉపేంద్ర తన చెల్లెలు ఆశకు ఘనంగా వివాహం చేశాడు. తన తల్లి సూరికుమారిని బాగా చూసుకుందామనుకున్న సమయంలో ఒంటరిని చేసి అనంతలోకాలకు వెళ్లిపోయాడని బంధువులు కంటతడి పెడు తున్నారు. -
శిథిలాల నుంచి నాలుగు మృతదేహాలు వెలికితీత
న్యూఢిల్లీ ఇంద్రలోక్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు నాలుగు మృతదేహలను వెలికి తీశారు. ఆ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హస్తినలోని ఇంద్రలోక్ ప్రాంతంలో శనివారం పురాతన భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ భవనంలో పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరంగా చేశారు.