గార : మొగదాలపాడు బీచ్‌లో ఆదివారం విహారయాత్ర కు వెళ్లి గల్లంతైన నలుగురి ఆచూకీ లభ్యమైంది. సోమవారం ఉదయానికి మూడు మృతదేహాలు లభ్యం కాగా సాయంత్రం మొగదాలపాడు గ్రామానికి చెందిన కోరాడ మూర్తి మృతదేహం లభ్యమైంది. శ్రీకాకుళంకు చెందిన తుమ్ము ఉపేంద్ర, జొన్నలపాడు గ్రామానికి చెందిన పందిరి సోమశేఖర్, ఆమదాలపాడు గ్రామానికి చెందిన తామాడ సింహాచలం మృతదేహాలు సమద్రం ఒడ్డున తేలాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వీరితో పాటు గల్లంతైన మొగదాలపాడు గ్రామానికి చెందిన కోరాడ మూర్తి మృతదేహాన్ని మంగళవారం రిమ్స్‌కు తరలించనున్నా రు. ఆదివారం కేవలం ముగ్గురు యువకులు మాత్రమే గల్లంతైనట్టు గుర్తించారు. అయితే మరో వ్యక్తి శవమై తేలడంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. గార ఎస్సై పిమురళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్యెల్యే పరామర్శ
శ్రీకాకుళం ఎమ్యెల్యే గుండ లక్ష్మీదేవి మొగదాలపాడు బీచ్ వద్దకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. బీచ్ వద్ద పటిష్ట రక్షణ చర్యలు చేపడతామన్నారు.
తల్లిని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు
శ్రీకాకుళం క్రైం : స్నేహితులతో కలసి పిక్నిక్‌కు వెళ్లిన పట్టణంలోని చిన్నబరాటం వీధికి చెందిన తుమ్ము ఉపేంద్ర సముద్రంలో గల్లంతై మృతిచెందడంతో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే... ఉపేంద్ర తన స్నేహితులతో కలసి ఆదివారం సాయంత్రం పిక్నిక్‌కు వెళ్లి మొగదలపాడు బీచ్‌లో గల్లంతైన విషయం తెలిసిందే. అయితే సముద్రంలోపలకు వెళ్లిపోయిన ఉపేంద్ర సోమవారం తెల్లవారి శవమై సముద్ర ఒడ్డున తేలాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. కుటుంబ బాధ్యతను మొత్తం చిన్న వయసులోనే మీదన వేసుకున్న ఉపేంద్ర చనిపోవడంతో తల్లి సూరికుమారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సుమారు ఏడాదిన్నర కిందట ఉపేంద్ర తన చెల్లెలు ఆశకు ఘనంగా వివాహం చేశాడు. తన తల్లి సూరికుమారిని బాగా చూసుకుందామనుకున్న సమయంలో ఒంటరిని చేసి అనంతలోకాలకు వెళ్లిపోయాడని బంధువులు కంటతడి పెడు
తున్నారు.
నాలుగు మృతదేహాలు లభ్యం
Published Tue, Nov 18 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement
Advertisement