
సాక్షి, శ్రీకాకుళం: తెలుగు దేశం పార్టీ మూడో జాబితా ఆ పార్టీలో చిచ్చును రాజేస్తోంది. చాలా చోట ఆశావహులకు మొండి చేయి ఇస్తూ.. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ప్రదర్శించారు. దీంతో అధినేత తీరుపై అసహనం ప్రదర్శిస్తున్నారు కార్యకర్తలు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కాకుండా.. గోండు శంకర్‌కు టికెట్ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు.
చంద్రబాబు ఫొటోను పగలకొట్టి.. చించిపారేసి కాళ్ల కింద పడి తొక్కారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి బాబు, పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోతూ.. మంటలు రాజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ అధిష్టానం నిర్ణయం పై లక్ష్మీదేవి అసంతృప్తితో రగిలపోతున్నారు. అనుచరులతో చర్చలు జరిపిన అనంతరం.. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని గుండ లక్ష్మీదేవి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment