Gunda Lakshmi Devi
-
Srikakulam: చంద్రబాబుకు షాకిచ్చిన గుండ దంపతులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బాబు దెబ్బకు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులైన గుండ లక్ష్మీదేవి దంపతులు రాజకీయాలకు టాటా చెప్పేశారు. టికె ట్ వస్తుందేమోనని దింపుడు కళ్లెం ఆశతో ఇన్నాళ్లూ గడిపిన గుండ దంపతులకు టికెట్ మార్పు ఉండదని చంద్రబాబు స్పష్టం చేయడంతో రాజకీయాల్లో తాము ఉండలేమని ఆయన ముందే తేల్చి చెప్పేశారు. నేర ప్రవృత్తి కలిగిన వారికి, అవినీతి పరులకు పెద్దపీట వేసే మీలాంటి వారితో రాజకీయాలు చేయలేమని, ఏకంగా రాజకీయాలకే దూరంగా ఉండిపోతామంటూ గుండ లక్ష్మి దంపతులు చంద్రబాబుకు దండం పెట్టేశారు. మరో నాయకుడు కలమట వెంకటరమణ తాను వచ్చి బాబును కలవలేనంటూ ఫోన్లోనే తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ఇప్పుడిది జిల్లా టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. రమ్మని పిలిచి.. హైదరాబాద్ పిలిపించుకుని గుండ దంపతులకు న్యాయం చేస్తానని చెప్పిన చంద్రబాబు జిల్లాకొచ్చి నో చెప్పేశారు. మంగళవారం ఉదయం తనను కలవాలని కబురు పంపించడంతో హుటాహుటిన తన కుమారుడితో కలిసి గుండ అప్పల సూర్యనారాయ ణ, లక్ష్మీదేవి దంపతులు పలాసలో బస చేసిన చంద్రబాబు వద్దకు వెళ్లారు. బస్సులో తనను కలిసిన గుండ దంపతులకు ముఖం మీదే ఆయన తన అభిప్రాయాన్ని చెప్పేశారు. శ్రీకాకుళం అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని, ప్రస్తుత అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేయాలని, అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవో...ఎమ్మెల్సీ పదవో ఇస్తానని...2029 ఎన్నికల్లో మీ అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ముఖం చాటేసిన కలమట పాతపట్నం టికెట్ ఆశించి భంగపడిన కలమట వెంకటరమణకు మంగళవారం ఉదయం 8.15గంటల సమయంలో చంద్రబాబు నుంచి ఫోన్ వెళ్లింది. 10 గంటల్లోపు పలాసలో బస చేసిన తమను కలవాలని కోరారు. దానికి కలమట నో చెప్పేశారు. 10 గంటల్లోపైతే రాలేనని చెప్పి ఇంటి వద్దే ఉండిపోయారు. అక్కడికి వెళితే ఆఫర్లు తప్ప మరేదీ ఉండ దని అభిప్రాయానికి వచ్చేసి చంద్రబాబును కలవడానికి కలమట ఇష్టపడలేదని తెలుస్తోంది. అభ్యర్థి మార్చుతానన్న ప్రకటన తప్ప తనకు ఏ ఆఫర్ వద్దని, ఎలాగూ ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమైపోయాయని, మామిడి గోవిందరావుతో కలి సి పనిచేసేది లేదని తన కేడర్ వద్ద చెప్పేశారు. మధ్య లో ఎంపీ రామ్మోహన్నాయుడు ఏదో రాయబారం చేయడానికి ప్రయత్నించినా, నేనున్నాని భరోసా ఇచ్చినా కలమట వెనక్కి తగ్గలేదు. మాటలొద్దు.. చేతలు కావాలని ఎంపీ వద్ద అన్నట్టుగా తెలుస్తోంది. నచ్చేచెప్పేందుకు యత్నించినా... నో అంటూ .. అన్నీ విన్న గుండ దంపతులు మీ రాజకీయాలకు నమస్కారం...మాకే పదవులొద్దు... నేరప్రవృత్తి గల వారికి, అవినీతి పరులకు పెద్దపీట వేసే తరుణంలో తామీ రాజకీయాల్లో ఉండలేమని...క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోతామని చెప్పేసి బస్సు దిగేసి వెనక్కి వచ్చేశారు. వెళ్లిపోతున్న వారిని వెనక్కి పిలిచి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా గుండ దంపతులు ఆగలేదు. సీరియస్‌గానే బయటికొచ్చేసి చంద్రబాబుకు ఏ విషయాలైతే చెప్పారో అదే విషయాలను ప్రస్తావిస్తూ ఒక నోట్ కూడా విడుదల చేశారు. అనుచరులు ఏదో ఒక దారి చూసుకోవాలని పరోక్షంగా చెప్పేశారు. -
బాబుపై భగ్గుమన్న శ్రీకాకుళం టీడీపీ
సాక్షి, శ్రీకాకుళం: తెలుగు దేశం పార్టీ మూడో జాబితా ఆ పార్టీలో చిచ్చును రాజేస్తోంది. చాలా చోట ఆశావహులకు మొండి చేయి ఇస్తూ.. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ప్రదర్శించారు. దీంతో అధినేత తీరుపై అసహనం ప్రదర్శిస్తున్నారు కార్యకర్తలు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కాకుండా.. గోండు శంకర్‌కు టికెట్ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు. చంద్రబాబు ఫొటోను పగలకొట్టి.. చించిపారేసి కాళ్ల కింద పడి తొక్కారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి బాబు, పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోతూ.. మంటలు రాజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ అధిష్టానం నిర్ణయం పై లక్ష్మీదేవి అసంతృప్తితో రగిలపోతున్నారు. అనుచరులతో చర్చలు జరిపిన అనంతరం.. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. -
భావోద్వేగంతో కంట తడిపెట్టుకున్న లక్ష్మీదేవి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీలో కమలం ప్రమేయం కల్లోలం రేపుతోంది. జిల్లా కేంద్రం అసెంబ్లీ సీటు బీజేపీకి కేటాయిస్తున్నారనే సంకేతాలతో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం ఆందోళనకు దిగింది. లక్ష్మీదేవి అనుచరులు తీవ్ర ఆవేదనకులోనై ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ఇంటిని ముట్టడించారు. అనంతరం ఆయన నివాసంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాచ్మెన్పై దాడి చేశారు. ఎంపీ లేరని తెలుసుకుని ఇంటి బయట బైఠాయించి, అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఆడుతున్న డ్రామాలో తాము బలైపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం టిక్కెట్ కోసం గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ రెండు వర్గాలు గొడవ పడుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అని బాహాబాహీకి సైతం దిగాయి. ఇందులో గొండు శంకర్‌ను కింజరాపు ఫ్యామిలీ ప్రోత్సహిస్తోందని గుండ లక్ష్మీదేవి వర్గం తరుచూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ సీటు వస్తుందన్న ఉద్దేశంతో లక్ష్మీదేవి పనిచేస్తూ వస్తున్నారు. ఆమెకు పోటీగా గొండు శంకర్ కూడా తగ్గేది లేదంటూ కాలు దువ్వుతున్నారు. లక్ష్మీదేవికే టిక్కెట్ అని ఒకవైపు, యూత్ కోటాలో శంకర్‌కు అని మరోవైపు ఆశలు కల్పించి చంద్రబాబు పబ్బం గడిపారు. చివరికి వచ్చేసరికి శ్రీకాకుళం సీటును బీజేపీకి కేటాయిస్తున్నారని సంకేతాలు పంపించారు. బీజేపీతో ఒప్పందం కూడా జరిగిపోయిందని, ఆ పార్టీ తరఫున రాయలసీమకు చెందిన సురేంద్రకుమార్ పోటీ చేస్తారని తొలుత, తర్వాత పైడి వేణుగోపాల్ పోటీ చేస్తారని తెరపైకి తెచ్చారు. డ్రామానా.. చంద్రబాబు ఎత్తుగడా..! సీటు బీజేపీకి కేటాయించేశారా? లేదంటే టీడీపీలో ఉన్న ఆశావహుల అభిప్రాయం తెలుసుకోవడానికి చంద్రబాబు అండ్‌కో డ్రామాలాడిందో తెలియదు గానీ శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి గుండ లక్ష్మీదేవి వర్గం రోడ్డెక్కింది. టికెట్ కోసం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అధిష్టానంతో టచ్‌లో ఉండే ఎంపీ రామ్మోహన్నాయుడు వద్ద తేల్చుకోవాలని భావించారు. ఆమేరకు ఆమె వర్గీయులంతా 80అడుగుల రోడ్డులో ఉన్న ఎంపీ రామ్మోహన్నాయుడు నివాసాన్ని ముట్టడించారు. తమకు అన్యాయం చేస్తున్నదంతా కింజరాపు ఫ్యామిలీ అన్నట్టుగా ఆందోళనకు దిగారు నిమిషాల్లోనే ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న వాచ్మెన్పై దాడి చేశారు. మొత్తానికి లోపలికి వెళ్లేసరికి ఎంపీ లేకపోవడంతో కార్యాలయం అసిస్టెంట్‌తో మాట్లాడారు. ఎంపీ ఇక్కడ లేరని చెప్పడంతో ఫోన్లోనే ఎంపీతో మాట్లాడారు. మీ ఆవేదన అర్థమైందని, రెండో జాబితాలో లక్ష్మీదేవి పేరు లేకపోవడం బాధాకరంగా ఉందని, తన వంతుగా ప్రయత్నిస్తానని ఫోన్లోనే ఎంపీ రక్తి కట్టించారు. అయినప్పటికీ శాంతించలేదు. ఇదంతా ఎంపీ రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఆడుతున్న డ్రామా అని బయటికొచ్చి బైఠాయించారు. అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. టైర్లు కూడా కాల్చుదామని వెంట పట్టుకుని వచ్చారు. ఎంత చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఆందోళనకారులంతా గుండ లక్ష్మీదేవి ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. ఎంపీ ఇంటి దగ్గర జరిగిన ఎపిసోడ్‌ను అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు వివరించారు. ఎంపీ చెప్పిన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలో కొందరు జోక్యం చేసుకుని అదంతా డ్రామాయేనని, రెండు జాబితాల్లోనూ పేరు లేదనే విషయం ఎంపీకీ తెలియదా... బాబాయ్, అబ్బాయ్ కలిసి తమను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లోగా లక్ష్మీదేవి పేరు రాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, ఆత్మహత్యలకు సైతం సిద్ధపడతామంటూ హెచ్చ రించారు. ఈ సందర్భంగా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ అనాదిగా తమను తొక్కేస్తున్నారని, గత ఏడాదికి పైగా వర్గపోరు నడుస్తోందని చెప్పినా, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సీనియర్‌నైన తనకు అన్యాయం చేస్తున్నారని బాధపడ్డారు. వ్యక్తిగతంగా ఇష్టంలేకపోయినా అచ్చెన్నాయుడ్ని లక్ష్మీదే వి కలిసి మొర పెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి కూడా పెట్టారు. మొత్తానికి టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్నది డ్రామానా? చంద్రబాబు వేసిన ఎత్తుగడా అన్నది త్వరలోనే తేలనుంది. -
రౌడీయిజంపై ఉక్కుపాదం
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న గుండ లక్ష్మిదేవికి అభివృద్ధి చేయడం చేతకాక.. ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక.. తనపై అభాండాలు వేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం నియోజజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. తనకు రౌడీయిజం అంటగడుతున్నారని.. నగరంలో ఎక్కడైనా తన పేరుతో రౌడీయిజం, అరాచకం చేస్తే ఉక్కుపాదంతో తొక్కేస్తానన్నారు. శ్రీకాకుళం నగరంలో ఓ ప్రవేటు హోటల్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఎక్కడైనా తన పేరుతో రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నట్టు తెలిస్తే 9959865756 నంబరుకు ఫోన్ చేసి తనకు తెలపాలని కోరారు. ఎమ్మెల్యేగా ఎంపికైన గుండ లక్ష్మిదేవి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, రింగ్‌రోడ్డు, స్టేడియం నిర్మాణాలను పూర్తిచేయలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలో నిరుపేదల ఇళ్ళ నిర్మాణం కోసం రెండెకరాల స్ధలం సేకరించి ఉంచితే ఆ స్ధలం కబ్జా చేసి టీడీపీ కార్యాలయం నిర్మించడం దారుణమన్నారు. ఆధ్యత్మిక కార్యకలాపాలు జరిపించేందుకు టీటీడి కళ్యాణమండపం నిర్మాణానికి రూ.8 కోట్లు నిధులిస్తే కనీసం ఒక్క ఇటుక కూడా వేసుకోలేకపోయిన అసమర్ధురాలన్నారు. హుదహుద్ సమయంలో గూడు కోల్పోయిన వారి కోసం 192 ఇళ్ళు నిర్మిస్తే వాటన్నింటికి టీడీపీ జన్మభూమి కమిటీలకు, కార్యకర్తలకు లక్షలాది రూపాయిలు కమీషన్లు దండుకుని అనర్హులకి అప్పగించారన్నారు. నిరుపేదల కోసం ఇళ్ళు నిర్మాణమనిచెప్పి అర్బన్ హౌసింగ్‌లో ఒక్కో అడుక్కి రూ.3 వేలు కట్టించుకోవడం సరికా దన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ఆ డబ్బులు చెల్లించనక్కర్లేదని చెప్పారని గుర్తుచేశారు. టీడీపీ నాయకులు ఏమి చేశారని ఓటడుగుతారు? రాష్ట్ర విభజన అనంతరం వెనుకబడిన జిల్లాలకు తగిన ఫండ్స్ రాలేదు...విభజన హామీలు తుంగలో తొక్కేశారు....వెనుకబడ్డ జిల్లాకు రావాల్సిన కేంద్ర సంస్ధలు ఏర్పాటు చేయలేదు.. ఇన్ని చేశాకా టీడీపికి ఓటెయ్యాలా అని ప్రశ్నించారు. హోదాను తాకట్టుపెట్టడం వల్ల పరిశ్రమలు రాక అభివృద్ధి ఎక్కడివేసిన గొంగళిలా ఉండిపోయిందన్నారు. జిల్లాకు చెందిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు ముందు ఒక్క మాటాడలేరు...జిల్లాకు కావాల్సిన అభివృద్ధి పధకాలు అడగలేరని ఎద్దేవా చేశారు. మత్య్సకారులకు తొక్కతీస్తానని, నాయీ బ్రాహ్మణులకు తోక కత్తిరిస్తానని అవమానించింది చంద్రబాబు కాదా అన్నారు. -
నాగావళి తీరాన.. ఎటువైపో ఓటరన్న..!
సాక్షి, శ్రీకాకుళం: పురాతన నగరం. రెండు నదుల మధ్యన ఒద్దికగా ఒదిగిన పట్టణం. రాజకీయంగా మహామహులను అందించిన నేల. అన్నింటికీ మించి జిల్లా కేంద్రం. వెరసి శ్రీకాకుళం. సిక్కోలు ఇప్పుడు మరో రసవత్తర పోరు చూడబోతోంది. ధర్మాన, గుండ కుటుంబాల మధ్య ఎన్నికల పోరు రసకందాయంలో ఉంది. అభ్యర్థులు బలమైన నేపథ్యాలు కలిగిన వారు కావడం. వారి జీవితాలు జనాలకు తెరిచిన పుస్తకాలు కావడంతో అందరి చూపు ఇటువైపే ఉంది. ఐదేళ్లుగా ధర్మాన జనం ఇబ్బంది పడిన ప్రతి సమస్యపై పోరాడారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపారు. అదే సమయంలో కొత్త అభివృద్ధి పనులేవీ చేయలేదనే అపవాదును గుండ లక్ష్మీదేవి మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జన తీర్మానం ఎలా ఉంటుందో చూడాలి. 1952 నుంచి.. స్వాతంత్య్రం తర్వాతి నుంచి శ్రీకాకుళం రాజకీయంగా కీలకంగానే ఉంది. మొదట్లో ఇక్కడ ద్విసభ్య శాసన సభ్యత్వం ఉండేది. కావాలి నారాయణ మొదటి ఎమ్మెల్యే కాగా ద్విసభ్య శాసన సభ కావడంతో కేఏ నాయుడు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ స్థానం మొదటిలో కాంగ్రెస్‌కు అస్సలు కలిసిరాలేదు. ఒక్క వైఎస్సార్‌పై మాత్రమే ఇక్కడి జనం ప్రేమ చూపించారు. 1952 నుంచి 1962 మినహా 2004 వరకు దాదాపు అన్నిసార్లు కాంగ్రెస్సేతర అభ్యర్థులే గెలవగా.. ధర్మాన ప్రసాదరావు ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి 2004లో విజయ ఢంకా మోగించారు. ఆ తర్వాతి ఎన్నికల్లోనూ ఆయనే గెలుపొందారు. 2014లో మాత్రం ఓటమి చవి చూశారు. పదవిలో ఉన్నంత కాలం మాత్రం మర్చిపోలేని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని స్థానిక ప్రజలు చెబుతుంటారు. తొలి ఎమ్మెల్యేగా కావలి నారాయణ ♦ శ్రీకాకుళం నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా కావలి నారాయణ గెలుపొందారు. ♦ అప్పట్లో ద్విసభ్య నియోజకవర్గం కావడంతో రెండో నియోజకవర్గం నుంచి కేఏ నాయుడు గెలుపొందారు. ♦ అప్పట్లో వీరిద్దరూ కేఎల్పీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. ♦ 1955లో పి.సూర్యనారాయణ, 1962లో ఎ.తవిటయ్య, 1967లో తంగి సత్యనారాయణ, 1972, 1978లలో చల్లా లక్ష్మీనారాయణ, 1983లో తంగి సత్యనారాయణ, 1985, 1989, 1994, 1999 లలో గుండ అప్పల సూర్యనారాయణ విజయం సాధించారు. ♦ 2004, 2009లలో ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ♦ 2014లో గుండ లక్ష్మీదేవి శాసనసభ్యురాలిగా ఎంపికై ప్రస్తుతం కొనసాగుతున్నారు. వైఎస్సార్ గుర్తులు.. వైఎస్సార్, ధర్మాన కాంబినేషన్ అంటేనే అభివృద్ధికి మారుపేరు. శ్రీకాకుళంలో జరిగిన పనులే అందుకు నిదర్శనం. జిల్లాకు వంశధార, రిమ్స్ వైద్య కళాశాల, నాగావళి నదికి కరకట్టలు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మంజూరయ్యాయి. శ్రీకాకుళం నగరం విషయానికి వస్తే రక్షిత మంచినీటి పథకం, నాగావళిపై మూడు వంతెనలు, కలెక్టర్ కార్యాలయానికి నూతన భవనాలు, ప్రధాన రోడ్ల విస్తరణ, అరసవల్లి సమీపంలో అధునాతన ఆడిటోరియం, 80 అడుగుల రోడ్డు వారి హయాంలో జరిగినవే. శ్రీకాకుళం మునిసిపాలిటీ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందేందుకు అప్పట్లోనే బీజం పడింది. వేలాది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. పేదలకు ఫించన్లు, రేషన్ కార్డులు, అడిగిందే తడవుగా మంజూరు చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలాల్లో పరిశ్రమల ఏర్పాటు కూడా అప్పట్లోనే జరిగాయి. మండలాల్లోని ప్రతి గ్రామానికి రోడ్లు, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. చేనేత కార్మికులకు చేయూత లభించింది. ఇలా నియోజకవర్గాన్ని విశేషంగా అభివృద్ధి చేసి సువర్ణ యుగం అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఓటర్ల వివరాలు.. మొత్తం ఓటర్లు : 2,32,456 పురుషులు : 1,15,959 స్త్రీలు: 1,16,453 ఇతరులు : 44 ప్రధాన సమస్యలు.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కట గుండ అప్పలసూర్యనారాయణ భార్య గుండ లక్ష్మీదేవి పోటీ చేశారు. ఐదేళ్లు గడిచాక తాము ఫలానా పనిచేశాం అని చెప్పుకోవడానికి కూడా ఆమె ఏమీ చేయలేదని స్థానికులు అంటున్నారు. ధర్మాన హయాంలో జరిగిన పనులను తమవిగా చెప్పుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. గుండ కుటుంబం నుంచి అప్పలసూర్యనారాయణ నాలుగు పర్యాయాలు, లక్ష్మిదేవి ఒకసారి విజయం సాధించినా ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. భూగర్భ డ్రైనేజ్, రింగ్ రోడ్డు హామీలు అలాగే ఉండిపోయాయి. వీటికి కనీసం భూ సేకరణ కూడా చేయలేదు. ఇక స్మార్ట్‌సిటీ, అమృత్ పథకాలు ద్వారా జరుగుతున్న పనులు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయి. వీటిని తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ అభ్యర్థి ప్రయత్నం చేస్తున్నారు. టికెట్.. టికెట్ వజ్రపుకొత్తూరు: ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా దూర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లు ఊర్లకు రావడానికి ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. పలాస ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి ఇదే విషయంపై పది మందితో కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. వలస ఓటర్లు అత్యధికంగా ఉన్న వజ్రపుకొత్తూరు, మందస గిరిజన ప్రాంతాలతో పాటు మత్స్యకార ప్రాంతంలోని ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బస్సు కూడా దూరమైతే ట్రైన్ రిజర్వేషన్ చేయించడానికి కూడా వెనుకాడడం లేదు. అసలు ఈ ప్రాంతాల్లో యువకులు వలస వెళ్లిపోయిందే స్థానికంగా ఉపాధి కల్పించకపోవడం వల్ల.. ఆ మాట మర్చిపోయి వలస వెళ్లిన వారిని ఓటు కోసం తిరిగి రప్పిస్తున్నారు. నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు, అక్కుపల్లి, మెట్టూరు, డోకులపాడు, కంబాలరాయుడుపేట, దేవునల్తాడ, కొత్తపేట, మందస గిరిజన ప్రాంతంలోని వందలాది కుటుంబాలు స్థానికంగా బతుకు లేక పొట్టకూటి కోసం వలస వెళ్లాయి. వారి కోసం ఏనాడూ ఆలోచించని నేతలు ఓట్లు అనగానే బస్సు టికెట్లు ఇచ్చి మరీ రప్పిస్తుండడంతో స్థానికులకు నవ్వు తెప్పిస్తోంది. కోడ్ కూసి 20 రోజులవుతున్నా.. కొత్తూరుమండలం మెట్టూరు బిట్2 పునరావాస కాలనీలో ట్రీగార్డులకు అధికార పార్టీ జెండాల రెపరెపలు ఎల్.ఎన్.పేట: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 20 రోజులు దాటిపోతోంది. మరో పది రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అయినా అధికారులు అధికార పార్టీ జెండాలను తీయించడంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. పాతపట్నం నియోజక వర్గం కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్2 పునరావాస కాలనీలో అన్ని వీధుల్లోను సీసీ రోడ్లకు పక్కన మొక్కలు నాటారు. మొక్కల సంవరక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రీగార్డులకు అధికార పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ శిలాఫలకాలను సైతం కప్పలేదు. -
అమ్మ బాబోయ్!
చెప్పేది నీతి మాటలు.. నడిచేది అవినీతి బాటలు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తీరుకు సరిపోయే సూక్తి ఇది. ప్రభుత్వ పథకాలను తెలుగు తమ్ముళ్లకు మేతగా వేస్తూనే.. వారి అవినీతి ఆకలిని పరోక్షంగా సమర్థిస్తూ అక్రమాలను పెంచి పోషిస్తున్నారామె. జిల్లా కేంద్రంలో నాలుగున్నరేళ్లుగా ‘అమ్మ’ ఆదేశంతోనే తమ్ముళ్లు ఊళ్లపై పడి అక్రమాలకు తెగబడ్డారన్నది జనం మాట. చిన్న చిన్న సంక్షేమ పథకాల నుంచి పెద్ద పెద్ద కట్టడాల వరకు అన్నింటిలోనూ అధికార పార్టీ కార్యకర్తలు దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచరుల వ్యవహారం రచ్చకెక్కింది. నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లుగా ‘అమ్మ’ ఆదేశాలే పరమావధిగా ఆమె ముఖ్య అనుచరులు ఇష్టానుసారంగా ప్రభుత్వ పథకాలతో పాటు సంక్షేమ పథకాలను వదిలిపెట్టకుండా అక్రమాలకు తెగబడుతున్నారు. ఈ అక్రమాల వ్యవహారాల్లో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాత్ర పరోక్షంగా ఉందనేలా ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఆమె అండదండలతోనే నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, శ్రీకాకు ళం, గార మండలాల ముఖ్య నేతలు ప్రతి అభివృద్ధి అంశంతో పాటు సంక్షేమ పథకాలను సైతం వదిలిపెట్టకుండా అక్రమాలకు తెరలేపారు. తీరంలోని ఇసుక, మట్టి, రోడ్లు, కాలువలతో పాటు పేదల ఇళ్లను కూడా రాజకీయం చేస్తూ దోచుకున్నారు. తమ కుటుంబానికి నీతి తప్ప అవినీతి మచ్చ లేదంటూ బాహాటంగా ప్రకటనలిస్తున్న ‘గుండ’ నేతలు, తెరవెనుక మాత్రం తమ అనుచరుల అవినీతిని అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు. ‘ నేను అండగా ఉంటా...దోచేసుకోండని..’ ధీమాగా చెబుతూనే అధికారుల చేతులకు చర్యలకు కళ్లెం వేస్తున్నారు. పేరుకు, ప్రకటనల్లోనే నీతి వాక్యాలు చెబుతూ అడ్డదారిలో అవినీతి చేస్తూ ప్రజాధనాన్ని బొక్కేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే ఓ మంత్రి అచ్చెన్నకు వ్యతిరేకంగా, మరో మంత్రి కళాకు అనుకూలంగా ఎంపీ రామ్మోహన్నాయుడును వెంట తిప్పుకుంటూ తమ వారి ‘అవినీతి కథ’ ను నడిపిస్తూ ‘అమ్మ’ ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంలో సహ జ వనరులను కూడా అక్రమాలకు అడ్డాలుగా మార్చేసి, తమ అనుచర వర్గాలకు ఆయాచితంగా లబ్ధి చేకూరేలా చేయడంతో తెలుగు తమ్ముళ్లు అవినీతి కుమ్ముడు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారం వచ్చిన తొలినాళ్లలో అభివృద్ధిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఇప్పుడు టాప్‌టెన్‌లో కూడా లేరని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. నీరు–చెట్టు పేరిట అవినీతి రాష్ట్రంలో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి తెలుగు తమ్ముళ్ల అవినీతి ఆకలి తీర్చేందుకు నీరు–చెట్టు పథకమంటూ అక్రమాల పనులు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్ర నియోజకవర్గంలో శ్రీకాకుళం, గార మండలాల పరిధిలో లక్షలాది రూపాయలతో జలవనరుల శాఖ ఆ«ధ్వర్యంలో పనులు చేసినట్లుగా చూపించి నిధులు బొక్కేశారు. అలాగే ఉపాధి పనుల క్రమంలో కూడా రోడ్లు, పలు భవనాల నిర్మాణాల్లో కమీషన్లు దండుకున్నారు. ఇందులో ఎమ్మెల్యే లక్ష్మీదేవి అనుచరులే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తి జేబులు నింపుకున్నారు. అలాగే శ్రీకాకుళం కార్పోరేషన్లో కూడా లక్షలాది రూపాయలతో సీసీ రోడ్లు, ప్రధాన రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. ఇందులో కూడా తమ అనుచరులకే కాంట్రాక్టులు దక్కేలా చేస్తూ కమీషన్లు మింగారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. కార్పొరేషన్లో ఉన్న 50 డివిజన్లలో పలు అభివృద్ధి పనుల్లో కూడా అంతా తామై నడిపిస్తూ పనుల్లో వాటాల బేరాలు చేశారని, ఇందులో ఎమ్మెల్యే వెంట ఉన్న ఇద్దరు ము ఖ్య అనుచరుల దౌర్జన్యం దారుణంగా ప్రభావం చూపించింది. అలాగే అరసవల్లి కూడలి నుంచి సూర్యమహల్ కూడలి వరకు రోడ్డు విస్తరణ పనుల్లో కూడా అక్రమాలకు దిగారనే ఆరోపణలు వినిపించాయి. ఆగని జన్మభూమి కమిటీ ఆగడాలు తెలుగు తమ్ముళ్లు ప్రతి సంక్షేమ పథకం అమల్లోనూ తమ ప్రాధాన్యతను చూపిస్తూ, ఆఖరికి అధికారులపై కూడా తమ ఆధిపత్యం చెలాయించారు. గత నాలుగేళ్ల నుంచి జన్మభూమి కమిటీల పేరిట శ్రీకాకుళం, గార మండలాల్లో ప్రతి పంచాయతీలోనూ తెలుగు తమ్ముళ్లు పేదలకు అందాల్సిన పథకాల అమల్లో అక్రమాలకు తెగబడ్డారు. పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇలా ప్రతి వ్యవహారంలోనూ ఈ కమిటీ సభ్యుల పాత్ర వివాదాలు తెచ్చిపెట్టింది. ప్రతి సంక్షేమ పథకం అమలుకు ఒక్కో రేటును నిర్ణయిస్తూ అక్రమ వసూళ్లు చేపట్టిన ఈ కమిటీ తమ్ముళ్లు.. ఇష్టానుసారంగా పేదలు, సామాన్యుల వద్ద సొమ్ములు దోచుకున్నారు. అలాగే శ్రీకాకుళం కార్పొరేషన్లో తీరు చూస్తే ఈ ఆగడాలు మరింత అధికమయ్యాయి. మొత్తం 50 డివిజన్లలోనూ ఈ కమిటీ సభ్యుల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తదితర ఎమ్మెల్యే అనుచరులు ప్రతి అంశంలోనూ అక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇదంతా తనకు తెలిసే జరుగుతున్నా ఏమాత్రం స్పందించకుండా, పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే అక్రమాలకు ఊతమిచ్చారన్న ఆరోపణలు జోరందుకున్నాయి. జిల్లాలో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 8 నియోజకవర్గాల్లోనూ ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు మంత్రులు ఒక ప్రభుత్వ విప్ హయాంలో కూడా ఇలాగే తెలుగు తమ్ముళ్లు టీడీపీ ముఖ్య నేతల అండదండలతో అవినీతిలో ఓ కుమ్ముడు కుమ్మేస్తున్నారు. ఈ వ్యవహారాలపై జనం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇసుక అక్రమాలకు ప్రోత్సాహం శ్రీకాకుళం, గార రూరల్ ప్రాంతాల్లో ఇసుక అక్రమాలకు ఎమ్మెల్యే లక్ష్మీదేవి ప్రధాన అండదండగా నిలబడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా భైరి, పొన్నాం, భట్టేరు, కళ్లేపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తరలించడంతో లక్షల్లో చేతులు మారాయి. ఎమ్మెల్యే అనుచరులు ఇసుకాసురులుగా మారిపోయి మైనింగ్, పోలీసు అధికారులపై ఒత్తిళ్లు తెప్పిస్తూ అక్రమంగా విశాఖకు ఇసుకను తరలించడంతో పాటు స్థానిక అవసరాలకు కూడా ‘ఉచితం’ మాటున అక్రమాలకు తెగబడ్డారు. ఈక్రమంలో పలు వాహనాలను పోలీసులు, మైన్స్ శాఖాధికారులు పట్టుకున్నప్పటికీ, ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఇంటి నుంచి ఫోన్ సమాచారం రావడంతో పలు వాహనాలను తప్పించడం పరిపాటిగా మారింది. తెలుగు తమ్ముళ్లు ఇదే ధీమాతో యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమార్కుల చేతిలో హుద్‌హుద్ ఇళ్లు 2014లో హుద్‌హుద్ తుపాన్‌తో నష్టపోయిన బాధితులకు జిల్లా కేంద్రంలో కంపోస్ట్ కాలనీలో మొత్తం 192 ఇళ్లను మంజూరు చేశారు. అయితే ఇందులో అసలైన బాధితులకు ఒక్క ఇళ్లు కూడా దక్కకపోగా, మొత్తం ఇళ్లన్నీ అక్రమార్కులకు, అమ్మ అనుచరులకే దక్కాయి. ఈ విషయాన్ని ముందుగా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చి ఆ జాబితాను కూడా ప్రచురించిన సంగతి విదితమే. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయి సుమారు మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికీ అర్హుల జాబితాను విడుదల చేయకుండా ఎమ్మెల్యే లక్ష్మీదేవి అనుచరులు చక్రం తిప్పారు. ఇందులో సుమారు వందకు పైగా ఇళ్లును ఆమె అనుచరులకు కట్టబెట్టడం ద్వారా నిజమైన అర్హులకు ఇళ్లు అందని పరిస్థితి నెలకొంది. ఇళ్లు కేటాయించేందుకు డబ్బులు వసూళ్లు చేసి, అక్రమాలకు తెగబడ్డారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే కొందరు టీడీపీ ముఖ్య కార్యకర్తలు ఈ ఇళ్లను రూ.5లక్షల నుంచి రూ.8 లక్షల వరకు బేరం పెట్టేసి అమ్ముకున్నారన్న నిజాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. టీడీపీ డివిజన్ల నేతలు తమ బినామీ పేర్లతో ఇళ్లు దక్కించుకోవడం జరిగింది. ఈ వ్యవహారంలో తమకు, తమ కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదంటూ ప్రకటించిన ఎమ్మెల్యే, ఇళ్ల జాబితా బయటకు రావడంతో ఏం చెయ్యాలో తోచక ప్రతిపక్ష నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు విలేకరులకు కూడా ఇళ్లను కేటాయించడంతో ఈ విషయాన్ని మరుగున పడేసేలా ఎత్తులు వేశారు. హుద్‌హుద్ అర్హుల జాబితాలో సుమారు 40 మంది వరకు విలేకరులకు, వారి బినామీ పేర్లతో కేటాయించడం వివాదాస్పదమైంది. -
భర్త ఇచ్చిన ఇంటినే... ఎమ్మెల్యే కూల్చేయడమా?
శ్రీకాకుళం రూరల్: హిందూ సంప్రదాయం తెలిస్తే గ్రహణం రోజున కొన్ని కుటుంబాలను రోడ్డున నిలబెట్టేందుకు ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెగిస్తారా? అని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవి భర్త, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పట్టా ఇచ్చిన ఇంటినే ఇప్పుడు కూల్చేయడానికి ఆమె అధికారులను పురమాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి శ్రీకాకు ళం నగరం శివారు చాపరం పంచాయతీ పరిధిలోని విశాఖ–బి కాలనీలో వైఎస్సార్సీపీ నాయకుడికి చెందిన భవంతిని కూల్చేయడానికి పంచాయతీ సిబ్బంది వెళ్లారు. అందులో నివాసం ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించాలంటూ హడావుడి చేశారు. గ్రహణం పూట వచ్చి ఇలా రోడ్డుపైకి వెళ్లమంటే ఎలాగంటూ ఆయా కుటుంబాల వారు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ధర్మాన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. వెంటనే జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, తహసీల్దారు మురళీకృష్ణతో మాట్లాడారు. ఇది ఎమ్మెల్యేకు తగునా? శ్రీకాకుళం నగరంలో కొద్దిరోజులుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును ధర్మాన తప్పుపట్టారు. పట్టా తీసుకొని కొన్నేళ్ల క్రితం నిర్మించిన భవంతిని ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి పక్షపాత చర్యలకు పాల్పడితే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 1996లో తంగి ఈశ్వరరావుకు అప్పటి ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ పట్టా ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన భార్య మాత్రం ఇప్పుడా విషయం తెలియకుండా కేవలం కక్ష సాధింపు కోసం భవనాలను కూల్చివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కళ్లెదుట బడ్జెట్ హోటల్ పక్కన భారీ కన్వెన్షన్ హాల్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా నిర్మిస్తున్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా? అని ప్రశ్నించారు. దేవాదాయ భూముల్లోనే అక్రమాలను ఎందుకు ఉపేక్షిస్తున్నారో తాము వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందు కన్వెన్షన్ హాల్ నిర్మాణాన్ని కూల్చి వేయండని సవాల్ విసిరారు. -
నాలుగు మృతదేహాలు లభ్యం
గార : మొగదాలపాడు బీచ్‌లో ఆదివారం విహారయాత్ర కు వెళ్లి గల్లంతైన నలుగురి ఆచూకీ లభ్యమైంది. సోమవారం ఉదయానికి మూడు మృతదేహాలు లభ్యం కాగా సాయంత్రం మొగదాలపాడు గ్రామానికి చెందిన కోరాడ మూర్తి మృతదేహం లభ్యమైంది. శ్రీకాకుళంకు చెందిన తుమ్ము ఉపేంద్ర, జొన్నలపాడు గ్రామానికి చెందిన పందిరి సోమశేఖర్, ఆమదాలపాడు గ్రామానికి చెందిన తామాడ సింహాచలం మృతదేహాలు సమద్రం ఒడ్డున తేలాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వీరితో పాటు గల్లంతైన మొగదాలపాడు గ్రామానికి చెందిన కోరాడ మూర్తి మృతదేహాన్ని మంగళవారం రిమ్స్‌కు తరలించనున్నా రు. ఆదివారం కేవలం ముగ్గురు యువకులు మాత్రమే గల్లంతైనట్టు గుర్తించారు. అయితే మరో వ్యక్తి శవమై తేలడంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. గార ఎస్సై పిమురళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్యెల్యే పరామర్శ శ్రీకాకుళం ఎమ్యెల్యే గుండ లక్ష్మీదేవి మొగదాలపాడు బీచ్ వద్దకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. బీచ్ వద్ద పటిష్ట రక్షణ చర్యలు చేపడతామన్నారు. తల్లిని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు శ్రీకాకుళం క్రైం : స్నేహితులతో కలసి పిక్నిక్కు వెళ్లిన పట్టణంలోని చిన్నబరాటం వీధికి చెందిన తుమ్ము ఉపేంద్ర సముద్రంలో గల్లంతై మృతిచెందడంతో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే... ఉపేంద్ర తన స్నేహితులతో కలసి ఆదివారం సాయంత్రం పిక్నిక్కు వెళ్లి మొగదలపాడు బీచ్‌లో గల్లంతైన విషయం తెలిసిందే. అయితే సముద్రంలోపలకు వెళ్లిపోయిన ఉపేంద్ర సోమవారం తెల్లవారి శవమై సముద్ర ఒడ్డున తేలాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. కుటుంబ బాధ్యతను మొత్తం చిన్న వయసులోనే మీదన వేసుకున్న ఉపేంద్ర చనిపోవడంతో తల్లి సూరికుమారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సుమారు ఏడాదిన్నర కిందట ఉపేంద్ర తన చెల్లెలు ఆశకు ఘనంగా వివాహం చేశాడు. తన తల్లి సూరికుమారిని బాగా చూసుకుందామనుకున్న సమయంలో ఒంటరిని చేసి అనంతలోకాలకు వెళ్లిపోయాడని బంధువులు కంటతడి పెడు తున్నారు.