starvation
-
PM Narendra Modi: వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే
సిసాయ్/దర్భంగా: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవినీతిపరుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని, అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఇక తప్పించుకోలేరని తేలి్చచెప్పారు. శనివారం జార్ఖండ్‌లోని సిసాయ్, పాలాము, బిహార్‌లోని దర్భంగాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా రాంచీలో, ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. జనం సొమ్ము దోచుకున్నవారికి మద్దతుగా మాట్లాడారని, వారి ఆసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినందుకే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి(హేమంత్ సోరెన్) ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడని చెప్పారు. అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఏ పాలనలో ఆకలి చావులు ‘‘అభివృద్ధిలో గిరిజన ప్రాంతాలు వెనుకంజలోనే ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆహార ధాన్యాలు గోదాముల్లో పందికొక్కుల పాలయ్యాయి. అప్పట్లో ఎంతోమంది గిరిజనుల బిడ్డలు తగిన ఆహారం లేక ఆకలితో మాడిపోయారు. సోనియా గాంధీ–మన్మోహన్సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ రాచరిక పాలనలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మేము అధికారంలోక వచ్చాక పరిస్థితి మారిపోయింది. పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచడాన్ని అప్పటి పాలకులు వ్యతిరేకించారు. కేవలం సంపన్నులకే ఆ సదుపాయం ఉండేది. మేమొచ్చాక మారుమూల ప్రాంతాల్లోనూ అందరికీ ఇంటర్నెట్ అందుతోంది. డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చాం. నేడు సోషల్ మీడియాలో యువత హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. గోద్రా ఘటనపై బోగస్ నివేదిక 20 ఏళ్ల క్రితం గుజరాత్లో గోద్రా రైలు దహనం ఘటనకు బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు(లాలూ ప్రసాద్ యాదవ్) ప్రయతి్నంచారు. కరసేవలకుపైనే నింద మోపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఆయన సహవాసం చేశారు. సోనియా మేడమ్ హయాంలోనే గోద్రా రైలు దహనం జరిగింది. 60 మందికిపైగా కరసేవకులు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి నియమించిన బెనర్జీ కమిషన్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. బోగస్ నివేదిక సమరి్పంచేలా జాగ్రత్తపడ్డారు. అసలు దోషులను కాపాడుతూ కరసేవకులనే బాధ్యులుగా చిత్రీకరించారు. ఆ నివేదికను న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది. అసలు దోషులను గుర్తించి శిక్ష విధించింది. కొందరికి మరణశిక్ష పడింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. సాధారణ జీవితం గడుపుతున్నా.. ‘‘కాంగ్రెస్ రాజకుమారుడు నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. పేదల ఇళ్లను సందర్శిస్తూ కెమెరాలకు పోజులిస్తున్నాడు. నేను సాధారణ జీవితమే గడుపుతున్నా. పేదల కష్టాలు నాకు తెలుసు కాబట్టి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రారంభించా. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. నేను గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాకు సొంత ఇల్లు, సొంత సైకిలు కూడా లేదు. జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం నాయకులు అవినీతికి పాల్పడుతూ తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు’’ గిరిజనులపై అకృత్యాలు సహించం ‘‘మావోయిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి మావోయిస్టుల జోలికి వెళ్లలేదు. నిషేధిత తీవ్రవాద సంస్థలు గిరిజన మహిళలపై అత్యాచారాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నాయి. ఇలాంటి అకృత్యాలు సహించే ప్రసక్తే లేదు’’ -
మరింత భయంకరంగా 2021..
జెనివా: కరోనా వైరస్ మహమ్మారి ఈ ఏడాదిని ఎంతో దుర్భరంగా మార్చేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ ఏడాది ఎప్పుడు ముగుస్తుందా.. కొత్త సంవత్సరంలోకి ఎప్పుడు అడుగుపెడతామా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కనీసం నూతన సంవత్సరం అయినా సంతోషంగా ఉంటామని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మరింత దారుణంగా ఉండనుందని.. విపత్తుగా మిగిలిపోనుందంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(డబ్ల్యూఎఫ్‌పీ) చీఫ్ డేవిడ్ బీస్లీ రాబోయే సంవత్సరం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. "విపత్తు" మానవతా సంక్షోభాలకు తమను తాము సిద్ధం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2021 దాదాపు ఒక శతాబ్దంలో మానవులు చూసిన అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిపోనుందట. వచ్చే సంవత్సరం తీవ్రమైన ఆకలి, కరువు తాండవిస్తాయని.. ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు నిపుణులు తెలిపారు. (చదవండి: 2030 నాటికి దారిద్య్రంలోకి మరో 20.7 కోట్ల మంది) కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి, ప్రపంచంపై దాని ప్రభావాల గురించి చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో బీస్లీ ఈ హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూఎఫ్‌పీ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 270 మిలియన్ల మంది ప్రజలు "ఆకలి వైపు పయనిస్తున్నారు", రానున్న ఏడాది తీవ్రమైన కరువు ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా బీస్లీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మహమ్మారి విజృంభణ వల్ల తలెత్తిన సంక్షోభం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది. ఈ ఏడాది దాదాపు 19 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేశాము. అయితే ఈ మొత్తానికి సంబంధించిన ఫలితం వచ్చే ఏడాది మనకు దక్కకపోవచ్చు’ అన్నారు. అంతేకాక ‘ఐక్యరాజ్యసమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లైతే 2021 చెత్త మానవతా సంక్షోభ సంవత్సరంగా ఉండబోతుంది. మనం మరో మెట్టు దిగబోతున్నాం’ అని హెచ్చరించారు. (చదవండి: ఆహారదాతకు ‘నోబెల్ శాంతి’) ఈ విపత్తు పరిస్థితికి కేవలం మహమ్మారి మాత్రమే కారణం కాదన్నారు బీస్లీ. కోవిడ్, దాని కట్టడి కోసం విధించిన ప్రభుత్వం నియంత్రిత లాక్డౌన్ మానవ పురోగతిని బాగా క్షీణింపజేశాయని.. "మానవ నిర్మిత సంఘర్షణ" కూడా ఈ పరిస్థితిలో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. ముఖ్యంగా సిరియా, యెమెన్, దక్షిణ సూడాన్ వంటి దేశాలలో పరిస్థితి మరింత భయంకరంగా ఉండబోతుందని హెచ్చరించారు బీస్లీ. "మేము ఈ యుద్ధాలలో కొన్నింటిని ముగించాల్సి వచ్చింది. ఈ యుద్ధాలను మేము అంతం చేయవలసి ఉంది. అప్పుడే మనం కోరుకునే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించగలము" అని బీస్లీ తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని ఆయన టైటానిక్‌తో పోల్చారు. ‘మేము వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఈ ప్రత్యేకమైన మంచుకొండకు నిధులను కేటాయించగల్గితే.. 2021లో వాటి ఫలితాలను పొందగలం. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించగలం’ అన్నారు. గతంలో డబ్ల్యుఎఫ్‌పి ఈ ఏడాది చివరినాటికి పోషకాహార లోపం ఎదుర్కొంటున్న ప్రజల సంఖ్య 80 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వాలను హెచ్చరించింది. -
అతిపెద్ద సంక్షోభంలో ప్రపంచం!
ఐక్యరాజ్యసమితి: ప్రపంచం అతిపెద్ద మానవ సంక్షోభాన్ని ఎదుర్కోనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. యెమన్, దక్షిణ సూడాన్, సోమాలియా, నైజీరియా దేశాల్లోని రెండు కోట్ల మంది కరువు, ఆకలి దప్పికలతో అలమటించనున్నారని పేర్కొంది. దీనిపై అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయకపోతే ప్రజలు ఆకలి బాధలతో పాటు వివిధ వ్యాధులతో మరణించే అవకాశముందని ఐరాస మానవతావాద సంఘం చీఫ్ స్టీఫెన్ ఒబ్రియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నాలుగు దేశాలకు వెంటనే నిధులు పంపించాలని ఐరాస భద్రతా మండలిలో విజ్ఞప్తి చేశారు. ఈ విపత్తు నివారణకు వచ్చే జూలై వరకు రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అక్కడి అభివృద్ధి పూర్తిగా మందగిస్తుందన్నారు. ఐదేళ్లలోపు వయసున్న 30 శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్న విషయం ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. యెమన్లోని మొత్తం జనాభా 1.8 కోట్ల మందిలో 70 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారన్నారు. అరబ్ దేశాల్లో పేద దేశమైన యెమన్ నుంచి గత రెండు నెలల్లో 48 వేల మంది వలసపోయారని తెలిపారు. ఇటీవల తన పర్యటన సందర్భంగా అక్కడి నేతలను, రెబెల్స్‌ను కలిసి సాయమందిస్తామని హామీ ఇచ్చినట్లు ఒబ్రియాన్ చెప్పారు. మానవతా కోణంలో చేస్తామన్న సాయాన్ని వారు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని తెలిపారు. అక్కడి నేతలు తమ ప్రవర్తన మార్చుకోకపోతే రాబోయే మానవ సంక్షోభానికి బాధ్యత వహించక తప్పదన్నారు. అలాగే మూడేళ్ల పౌర యుద్ధంతో ఆర్థికంగా చితికిపోయిన దక్షిణ సూడాన్‌లో కూడా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సూడాన్‌లో కరువును మనుషులే సృష్టించారని చెప్పారు. -
యెమెన్ లో ఆకలి చావులు
సరైన ఆహారం లేక ఎముకలు తేలిన శరీరంతో ఆసుపత్రి బెడ్‌పై దీనంగా కూర్చుని ఉన్న ఈ ఐదేళ్ల బాలుడి పేరు మొహన్నద్ అలీ. ఇతని రెండేళ్ల వయసున్న సోదరుడు ఈ మధ్యే ఆకలితో మృతిచెందాడు. ఇప్పుడు అలీ కూడా చావుకు దగ్గరగా ఉన్నాడనీ, కాపాడుకోడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని అతని 19 ఏళ్ల అన్న చెబుతున్నాడు. ఈ ఫొటోను 2016 డిసెంబరు 12న తీయగా యూనిసెఫ్ విడుదల చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం వల్ల యెమెన్ ప్రజలు ఆహారం కోసం పడుతున్న కష్టాలకు ఈ ఫొటో సాక్ష్యంగా నిలుస్తోంది. -
అక్కడ ఆకలితో అలమటిస్తున్న ప్రజలు
జుబా: అంతర్యుద్ధంతో రగిలిపోతున్న దక్షిణ సూడాన్‌లో దాదాపు 48 లక్షల మంది ప్రజలు ఆకలిమంటలతో అలమటిస్తున్నారని ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్’ సూడాన్ డెరెక్టర్ జాయిస్ కన్యాంగ్వా లూమా తెలిపారు. ముఖ్యంగా దక్షిణ సూడాన్‌లోని ఉత్తర ప్రాంతంలోవున్న బహర్ ఎల్ ఘజల్ ఆహార కొరత సమస్య మరీ తీవ్రంగా ఉందని, అక్కడ ప్రతి పది మందిలో ఆరుగురు ఆకలితో అలమటిస్తున్నారని, ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని లూమా తెలిపారు. ముందుగా ఆ ప్రాంతంలోని 8,40,000 మంది ప్రజలకు ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం కింద ఆహారాన్ని విమానాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించామని లూమా చెప్పారు. ప్రభుత్వ దళాలకు, మాచర్ దళాలకు మధ్య అంతర్యుద్ధం తిరిగి జూలై నెలలో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం బహర్ ఎల్ ఘజల్ ప్రాంతంలో అసాధారణ నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. అంతర్యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటాయని, కాలం కలసిరాక ప్రజల కొనుగోలు శక్తి కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని లూమా చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎల్ ఘజల్ ప్రాంతానికి సరకులను వ్యాపారులు తరలించినా కొనే పరిస్థితి అక్కడి ప్రజలకు లేదని అన్నారు. -
'సిరియా'లో ఆకలిరాజ్యం
-
వృద్ధుడి ఆకలి చావు!
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో సోమవారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు ఆకలి చావుకు గురయ్యాడు. వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చిన అతడు ఇస్లాంపూర, గౌలిగూడ ప్రాంతాల్లో భిక్షాటన చేసేవాడు. దొరికినప్పుడు తినడం.. లేకుంటే పస్తులుండడం చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం ఆకలితో అలమటించి చనిపోయాడు. -
కరువు కాటకాల్లో అనంత రైతులు: మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కృషి చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అనంతపురం జిల్లా రైతులు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారని, వాళ్లను ఆదుకుంటామని ఆయన చెప్పారు. అనంతపురంలో ఎయిమ్స్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
32,000 కుటుంబాలకు పస్తులే
వీఆర్వో, వీఆర్ఏలకు అందని గౌరవ వేతనాలు హైదరాబాద్: గ్రామాల్లో పాలనకు కళ్లు, చెవులైన వీఆర్వోలు, వీఆర్ఏలను రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి రోజు కూడా పస్తులు ఉంచుతోంది. ఏకంగా 32 వేల మంది వీఆర్వోలు, వీఆర్ఏలకు డిసెంబర్ నెల గౌరవ వేతనాలు చెల్లించలేదు. వీరికి ఇచ్చే గౌరవ వేతనం తక్కువగానే ఉంటుంది. వీరి గురించి రెవెన్యూ, ఆర్థిక శాఖలు పట్టించుకోవటం లేదు. వీరికి వేతనాలు రాకపోవడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా తీసుకున్న నిర్ణయం ఓ కారణం కాగా ప్రస్తుతం నాల్గో త్రైమాసిక నిధుల విడుదలను నిలుపుదల చేయడం మరో కారణం. ఆర్థికశాఖకు అందని ప్రతిపాదనలు: వీఆర్వోలకు నెలకు రూ.13 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వీఆర్ఏలకు నెలకు రూ.3,000 చొప్పున చెల్లిస్తున్నారు. గతంలో వీరికి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను చెల్లించారు. అయితే వీఆర్వోలు, వీఆర్ ఏలు రెగ్యులర్ ఉద్యోగులు కానందున వారికి 010 పద్దు నుంచి వేతనాలు ఇవ్వరాదంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు అదే సమస్యగా మారింది. 010 పద్దు నుంచి వేతనాలు రద్దు చేయడంతో డిసెంబర్ నెల వేతనం జనవరి 1వ తేదీన అందలేదు. రెవెన్యూ శాఖకు కేటాయించిన 284 పద్దు నుంచి వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసిక నిధులపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. గత మూడు త్రైమాసికాలకు చెందిన నిధుల వ్యయం ఆధారంగానే నాల్గో త్రైమాసిక నిధుల విడుదల విషయాన్ని ఆర్థికశాఖ నిర్ధారిస్తుంది. నిధుల విడుదలకు సీసీఎల్ఏ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాల్సి ఉంటుంది. జనవరి నెల సగం కావస్తున్నా ఇంతవరకు ఈ ప్రతిపాదనలు వెళ్లలేదు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులను వివరణ కోరగా నిధులు విడుదల కోసం సంబంధిత శాఖ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని, వస్తే పరిశీలిస్తామని తెలిపారు. -
పండగపూట పస్తులు
ఐదు నెలలుగా జీతాలకు నోచుకోని ఆరోగ్యశాఖ కాంట్రాక్టు సిబ్బంది బడ్జెట్ ఉన్నా నిధులు విడుదల చేయని అధికారులు విశాఖపట్నం : జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్టు సిబ్బంది పండగపూట పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. సంక్రాంతి పూట కొత్త దుస్తులు కాదు కదా.. కనీసం పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేక అల్లాడిపోతున్నారు. దసరా, దీపావళి పండుగలకు సైతం అఫ్పుచేసి గడిపామని, సంక్రాంతికీ అదే దుస్థితి అని జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా అంతటా వివిధ కేడర్లలో 320 మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. జిల్లాలో 280 మంది హెల్త్అసిస్టెంట్లు, 29 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, 20మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. వీరికి థర్డ్ క్వార్టర్ జీతాల బడ్జెట్ ఇంతవరకు విడుదలకాకపోవడంతో ఏజెన్సీలో ఐదు నెలలుగా, జిల్లాలో మూడు నెలలుగా జీతాలందక ఆకలితో అలమటిస్తున్నారు. ఐదు రూపాయల వడ్డీకి అప్పులు చేసి మరీ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. చింతపల్లి ట్రెజరీలో ఇటీవల వెలుగుచూసిన కుంభకోణంతో జీతభత్యాల చెల్లింపులు నిలిపివేశారు. లేని అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఉన్నట్టుగా రికార్డులు సృష్టించి ఏకంగా రూ.3.8కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను అధికారులు స్వాహా చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. దీంతో జీతాల బడ్జెట్ ఉన్నా బకాయిలు విడుదలకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆగస్టు,సెప్టెంబరు జీతాలు చెల్లించ కుండా నిలిపివేశారు. దీనిని వారం రోజులకిందట ఎన్జీవో సంఘం నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. జీతాలూ చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ట్రెజరీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో ప్రతి సారి జీతాలు చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఎంత బడ్జెట్ విడుదల చేశారు, ఎంత ఖర్చు చేశారు, ఉద్యోగుల వివరాలు సకాలంలో డైరక్టరేట్‌కు పంపాల్సి ఉంది. ఆ వివరాలు సరిగా లేకుంటే బడ్జెట్ విడుదలలో జాప్యం జరుగుతోందని ఎన్జీవో సంఘం నాయకుల సమాచారం. ఇంతవరకు బడ్జెట్ విడుదల కాకపోవడంతో బడ్జట్ రిక్వైర్మెంట్ డైరక్టరేట్‌కు పంపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా ట్రెజరీ అధికారి వద్ద ప్రస్తావించగా బడ్జెట్ ఉందని.. కానీ డీఎంహెచ్‌వో నుంచి గ్రీన్‌సిగ్నల్ లేనందున నిలిచిపోయి ఉంటాయని చెబుతున్నారు. కొంతమంది అవినీతి అధికారులు చేసిన చర్యలకు తాము ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలే తప్ప జీతభత్యాలను ఆపేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. -
పల్లె కన్నీరు పెడుతోంది
వ్యవసాయకూలీలు, సన్నకారు రైతులకు గ్రామాలలో పనులు కరువయ్యూరుు. మూడు పూటలా కడుపు నిండడం కష్టమైంది. కుటుంబపోషణ భారమైంది. పస్తులతో పల్లెలు కన్నీరు పెడుతున్నారుు. అందుకే పల్లె జనం కూలి కోసం వలసబాట పట్టారు. - ఆలూరు ఒక ఆలూరు నియోజకవర్గంలో సుమారు 40 గ్రామాల ప్రజలు వలసవెళ్లిపోయూరు. ఇళ్ల వద్ద పిల్లలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. పల్లెలు కళ కోల్పోరుు నిర్మానుష్యంగా మారారుు. ఆలూరు మండలం అరికెర గ్రామంలో సుమారు 35 కుటుంబాల సన్న కారు రైతులు, వ్యవసాయకూలీలు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, రాయచూరు, సింధనూరు, మొకా, బెంగళూరు,హైదారాబాద్, గుంటూరు తదితర పట్టణాలకు వలస వెళ్లారు. మరి కొందరు రైతులు తమ ఎడ్లకు పశుగ్రాసం కొరత కారణంగా శిరుగుప్ప పట్టణ కేంద్రంలోరని షుగర్ ఫ్యాక్టరీలో పనికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అరికెల గ్రామంలో వీధులన్నీ బోసిపోయూరుు. కేవలం వృద్ధులు, బడికి వెళ్లే పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇక దేవనకొండ మండలంలోని తెర్నెకల్లు, దేవనకొండ, కప్పట్రాళ్ల, పీ,కోటకొండ, హొళగుంద మండలంలోని నెరణికి తాండ, ఎల్లార్తి,సులువాయి, విరుపాపురం, హాలహర్వి మండలంలోని చింతకుంట, అర్ధగేరి, ఆస్పరి మండలంలోని కారుమంచి, కైరుప్పల, యాటకల్లు, తురవగల్లు, ఐనకల్లు, ములుగుందం, చిప్పగిరి మండలంలోని నంచర్ల, దౌల్లాపురం, నేమకల్లు, సంగాల తదితర గ్రామాల నుంచి అధికంగా వ్యవసాయకూలీలు వలస వెళ్లారు. -
ప్రాణాల మీదకు తెచ్చిన ప్రత్యేక రాష్ట్రం
ఒక రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటం.. కొన్ని వందల ప్రాణాలను బలిగొంటోంది. డార్జిలింగ్ కొండల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాటం సాగుతుండటంతో అక్కడి టీ తోటల కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆకలి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. జనవరి నుంచి ఇప్పటివరకు ఐదు టీ ఎస్టేట్లు మూతపడ్డాయి. అనిశ్చిత పరిస్థితి ఉండటం, టీ వేలం పాటలు కొనసాగకపోవడంతో తమ వ్యాపారానికి భరోసా లేదని టీ ఎస్టేట్లను యజమానులు మూసేసుకున్నారు. దాంతో చేయడానికి పని దొరక్క.. అనేక మంది కార్మికులు డొక్క ఎండిపోయి.. ఆకలి చావుల బారిన పడుతున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన వారు కారు. రాష్ట్రంకోసం జరుగుతున్న పోరాటం వల్ల ఉపాధి కోల్పోయి మరణించినవాళ్లు. గతంలో దాదాపు దశాబ్ద కాలం క్రితం పశ్చిమ మిడ్నపూర్ ప్రాంతంలోని ఆమ్లాసోల్లో ఇలాగే ఆకలిచావులు సంభవించినప్పుడు సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. కానీ, నాటి వామపక్ష ప్రభుత్వం, ఇప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వం రెండూ కూడా.. ఇవి ఆకలి చావులని గుర్తించడానికి అంగీకరించట్లేదు. గడచిన ఒకటిన్నర దశాబ్దాల కాలంలో దాదాపు వెయ్యిమంది వరకు టీ కార్మికులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఆకలి చావుల బారిన పడ్డారు. ఒకప్పుడు ఎడతెగని డిమాండుతో ఒక వెలుగు వెలిగిన టీ తోటలు ఇప్పుడు మూలపడటంతో ఆర్థికవ్యవస్థ మొత్తం కుప్పకూలుతోంది. అసలే తక్కువ ఆదాయం, తగిన వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలతో అతలాకుతలం అవుతున్న టీ కార్మికులకు ప్రస్తుత పరిస్థితి పులిమీద పుట్రలా ఉంది. ఇప్పుడు కనీసం కూలిపని చేద్దామన్నా దొరకట్లేదు. తినడానికి నాలుగు మెతుకులు కూడా సంపాదించుకోలేని పరిస్థితులు రావడంతో.. చివరకు టీ కార్మికులు తమ పిల్లలను కూడా అమ్ముకుంటున్నారు. చివరకు అమ్ముకోడానికి ఏమీ మిగలని పరిస్థితుల్లో ఆకలిబారిన పడి మరణిస్తున్నారు. పిల్లలైతే కేవలం మధ్యాహ్న భోజనం కోసమే పాఠశాలలకు వెళ్తున్నారు. ఇక్కడున్న కూలీల్లో దాదాపు సగం మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని సాధించడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో తెలియదు గానీ.. ఈలోపు మాత్రం ఉద్యమం వల్ల ఆకలి చావులను చూడాల్సి వస్తోంది!!