ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కృషి చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అనంతపురం జిల్లా రైతులు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారని, వాళ్లను ఆదుకుంటామని ఆయన చెప్పారు. అనంతపురంలో ఎయిమ్స్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.