పెళ్లైన ఐదురోజులకే నవ వధువు అదృశ్యం
రంగారెడ్డి: పెళ్లి జరిగిన ఐదు రోజులకే పెళ్లి కూతురు అదృశ్యమైన సంఘటన జిల్లాలోని కుల్కచర్ల మండల పరిధిలోని తిర్మాలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబికులు తెలిపిన వివరాల ప్రకారం తిల్మాలాపూర్ గ్రామానికి చెందిన రాములు, జయమ్మల కూతురు పద్మ (19) ఈ నెల 11న మహబుబ్గనర్ జిల్లా మిడ్జిల్ మండలం వలబ్నగర్ కు చెందిన భగవంత్గౌడ్తో వివాహం జరిపించారు.వివాహాం అయిన తరువాత ఐదో రోజు పెళ్లి తంతులో భాగంగా పందిరి కొమ్మ తీయడానికి పెళ్లి కూతురు ఇంటికి ఈ నెల 17న వచ్చారు.
అదే రోజు సాయంత్రం నుంచి పెళ్లి కూతురు కనిపించకుండ పోయిందని పెళ్లి కూతురు కుటుంబికులు తెలిపారు.అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కూడ అదే రోజు నుంచి కనిపించడం లేదని అ యువకుడు పై అనుమానం ఉందని గురువారం అమ్మాయి తల్లి జయమ్మ పోలీసులకు పిర్యాదు చేసింది. జయమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు.