
సాక్షి, కృష్ణా జిల్లా: బాపులపాడు మండలం మల్లవల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయినా 12 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. రాజేశ్వరి అనే నవ వధువు బాత్‌రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వగ్రామం మైలవరం సమీపంలోని గణపవరం కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రాజేశ్వరిని లాక్‌డౌన్ సమయంలో చదువు మాన్పించి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఇష్టం లేని వివాహం చేశారనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విశాఖ ప్రేమోన్మాది కేసులో 'మిస్టరీ')
Comments
Please login to add a commentAdd a comment