Bapulapadu
-
కృష్ణా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి
కృష్ణా, సాక్షి: కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోడూరుపాడు వద్డ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్వామినాథన్ (40), రాకేష్ (12), రాధప్రియ (14), గోపి(23) అక్కడిక్కడే మృతి చెందగా సత్య (28) (స్వామినాథన్ భార్య ) తీవ్రంగా గాయపడింది. దీంతో, ఆమెను వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇక, వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదంలో మృతుందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదఛాయలు అములుకున్నాయి. మరోవైపు.. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై వివరాలను సేకరిస్తున్నారు. -
విషాదం: పెళ్లయినా 12 రోజులకే..
సాక్షి, కృష్ణా జిల్లా: బాపులపాడు మండలం మల్లవల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయినా 12 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. రాజేశ్వరి అనే నవ వధువు బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వగ్రామం మైలవరం సమీపంలోని గణపవరం కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రాజేశ్వరిని లాక్డౌన్ సమయంలో చదువు మాన్పించి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఇష్టం లేని వివాహం చేశారనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విశాఖ ప్రేమోన్మాది కేసులో 'మిస్టరీ') -
కృష్ణా జిల్లాలో విషాదం
-
కృష్ణా జిల్లాలో విషాదం
సాక్షి, గన్నవరం : కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో విషాదకర సంఘటన చోటుచేసుకొంది. కారులో ఆడుకోవాలన్న సరదా పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. కార్ డోర్ లాక్ అవటంతో ఊపిరాడక మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ క్వార్టర్స్ లో అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.ఇంటి వద్ద పార్క్ చేసిన కారులో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ కారు డోర్ లాక్ అయింది. అందులో చిక్కుకుపోయిన చిన్నారులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లోపలే ఊపిరాడక కుప్పకూలిపోయారు. వీరి కోసం తల్లిదండ్రులు గాలించగా, చివరకు కారులో విగతజీవులుగా కనిపించారు. చిన్నారుల మరణంతో కాలనిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరి తరమూ కాలేదు .సమాచారం అందుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీన్‌ని పరిశీలించారు .కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . -
కుమార్తె సహా తల్లి ఆత్మహత్యాయత్నం
సాక్షి, బాపులపాడు: ఏం కష్టమొచ్చిందో ఏమో తన బిడ్డతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఆరేళ్ళ వయసున్న కుమార్తెతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించింది ఆ మాతృమూర్తి. అయితే అదృష్టవశాత్తు తల్లీబిడ్డ గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. -
నమ్మించి.. నగ్న చిత్రాలతో బెదిరించి..
విజయవాడ: అమాయక యువతులను ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకొని.. వారి నగ్న చిత్రాలు తీసి బెదిరిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరినర్సింగపాలెం గ్రామానికి చెందిన సింగం అనిల్‌కుమార్ ప్రేమ పేరుతో యువతులను ముగ్గులోకి దించి వారి నగ్న చిత్రాలు సేకరించి వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్య కెమెరాలతో చిత్రించి వాటి సాయంతో వారిని లైగింకంగా వేధించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. అతని బారిన పడిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు నిందితుడు సింగం అనిల్‌కుమార్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓ సెల్‌ఫోన్, ఓ ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పది మంది యువతులకు చెందిన నగ్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే డెల్టాలో కరువు: వైఎస్ జగన్
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే కృష్ణా డెల్టాలో కరువు ఏర్పడిందని, ఏలూరు కాల్వ పుట్టిననాటి నుంచి ఏనాడూ ఇలాంటి రైతులు ఇంతలా బాధపడలేదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడులో సోమవారం పర్యటించిన వైఎస్ జగన్ ఎండిపోయిన పంటలు పరిశీలించి, స్థానిక మినుము రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్న రెండేళ్లలో రైతులకు సాగునీరు అందించలేదు. పంట నష్టపోయిన రైతులను కనీసం అధికారులు కూడా పరామర్శించలేదు. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుల పొలాలను మాత్రమే సర్వేచేసి పరిహారం ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. నీళ్లొస్తాయనే ఆశతో మినుము పంట వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని 3వేల ఎకరాల పరిస్థితి ఇలాగే ఉంది’ అని వైఎస్ జగన్ అన్నారు. ఎండిన పంటపొలాల పక్క నుంచే వెళ్లి విమానం ఎక్కే జిల్లా మంత్రి ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
‘డెల్టా సుగర్స్’లో చెరకు క్రషింగ్ ప్రారంభం
శేరినరసన్నపాలెం (హనుమాన్‌జంక్షన్ రూరల్), న్యూస్‌లైన్ : చెరకు రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా టన్నుకు రూ.365 చెల్లిస్తున్నామని డెల్టా సుగర్స్ కర్మాగారం సీఈవో ఎం. సుబ్బరాజు తెలిపారు. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంలోని డెల్టా సుగర్స్ కర్మాగారంలో 2013-14వ సంవత్సరం క్రషింగ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చెరకు సాగును ప్రోత్సహించడానికి రైతులకు అవసరమైన సామగ్రి, ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం చెరకు ధర టన్నుకు రూ.2,125 మద్దతు ధర ప్రకటించగా, రాష్ట ప్రభుత్వం కొనుగోలు పన్ను రూ.60తో కలిపి రూ.2,185గా నిర్ణయించామని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్టులో పంచదార ధర తక్కువగా ఉన్నప్పటికీ అదనంగా టన్నుకు రూ.365 కలిపి రూ.2,550 చొప్పున రైతులకు చెల్లిస్తామన్నారు. జనరల్ మేనేజరు ఎం.రాజబాబు, కేన్ మేనేజర్ కె.వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ చెరకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి నండూరు సత్యవెంకటేశ్వరశర్మ, హనుమాన్ సుగర్స్ మాజీ చైర్మన్ గుండపనేని ఉమవరప్రసాద్, రేమల్లె సర్పంచి కలపాల జగన్మోహనరావు, వేలేరు మాజీ సర్పంచి వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.