నమ్మించి.. నగ్న చిత్రాలతో బెదిరించి.. | Man held for blackmailing with objectionable videos in krishna district | Sakshi

నమ్మించి.. నగ్న చిత్రాలతో బెదిరించి..

Apr 25 2017 1:53 PM | Updated on Sep 5 2017 9:40 AM

నమ్మించి.. నగ్న చిత్రాలతో బెదిరించి..

నమ్మించి.. నగ్న చిత్రాలతో బెదిరించి..

అమాయక యువతులను ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకొని..

విజయవాడ: అమాయక యువతులను ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకొని.. వారి నగ్న చిత్రాలు తీసి బెదిరిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరినర్సింగపాలెం గ్రామానికి చెందిన సింగం అనిల్‌కుమార్‌ ప్రేమ పేరుతో యువతులను ముగ్గులోకి దించి వారి నగ్న చిత్రాలు సేకరించి వేధింపులకు గురి చేస్తున్నాడు.

యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్య కెమెరాలతో చిత్రించి వాటి సాయంతో వారిని లైగింకంగా వేధించడంతో పాటు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడు. అతని బారిన పడిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు నిందితుడు సింగం అనిల్‌కుమార్‌ను మంగళవారం అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఓ సెల్‌ఫోన్‌, ఓ ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పది మంది యువతులకు చెందిన నగ్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement