కృష్ణా జిల్లాలో విషాదం | Three Children Were Deceased Due To Car Door Was Locked In Krishna District | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో విషాదం

Published Thu, Aug 6 2020 7:03 PM | Last Updated on Thu, Aug 6 2020 8:58 PM

Three Children Were Deceased Due To Car Door Was Locked In Krishna District - Sakshi

సాక్షి, గన్నవరం : కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో విషాదకర సంఘటన చోటుచేసుకొంది. కారులో ఆడుకోవాలన్న సరదా పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. కార్ డోర్ లాక్ అవటంతో ఊపిరాడక మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ క్వార్టర్స్ లో అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.ఇంటి వద్ద పార్క్‌ చేసిన కారులో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ కారు డోర్‌ లాక్‌ అయింది. అందులో చిక్కుకుపోయిన చిన్నారులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లోపలే ఊపిరాడక కుప్పకూలిపోయారు. వీరి కోసం తల్లిదండ్రులు గాలించగా, చివరకు కారులో విగతజీవులుగా కనిపించారు. చిన్నారుల మరణంతో కాలనిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరి తరమూ కాలేదు .సమాచారం అందుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీన్‌ని పరిశీలించారు .కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement