children dies
-
చిన్నారులే సమిధలు.. గాజాలో ప్రతి 15 నిమిషాలకు..
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపువారే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నట్లు పాలస్తీనియన్ స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించింది. నిత్యం 100 మందికిపైగా చనిపోతున్నారని తెలియజేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా గాజాలో 3,400 మందికిపైగా జనం మరణించారు. వీరిలో 1,000 మందికిపైగా బాలలు ఉన్నట్లు అంచనా. అంటే ప్రతి ముగ్గురు మృతుల్లో ఒకరు చిన్నపిల్లలే కావడం గమనార్హం. గాజాలో అచ్చంగా నరమేధమే సాగుతోందని డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్–పాలస్తీనా(డీసీఐపీ) అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. గాజాతో పోలిస్తే ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టం తక్కువ. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 1,400 మంది మృతిచెందగా, వీరిలో 14 మంది బాలలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ► గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించింది. ఆహారం, నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు చెబుతున్నా అవి చాలామందికి అందడం లేదు. ► తగినంత ఆహారం, నీరు లేక గాజాలో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. పారిశుధ్య వసతులు లేకపోవడంతో డయేరియా వంటి వ్యాధులు ప్రబులుతున్నాయని పేర్కొంటున్నారు. ► యుద్ధం కారణంగా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక అధికారులు చెప్పారు. అకారణంగా భయపడడం, రోదించడం వంటివి చేస్తున్నారని తెలియజేశారు. ► రణక్షేత్రంలో దాడులు, ప్రతిదాడులు చూస్తూ పెరిగిన పిల్లల్లో హింసాత్మక ధోరణి పెరుగుతుందని, భవిష్యత్తులో వారు అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని మానసిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. ► యుద్ధాల సమయంలో బాలలకు హక్కులుంటాయి. వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఇరుపక్షాలకూ ఉంటుంది. ► చిన్నారుల ప్రాణాలను రక్షించాలంటూ 1949లో జెనీవాలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని 1951లో ఇజ్రాయెల్ ఆమోదించింది. -
కృష్ణా జిల్లాలో విషాదం
-
కృష్ణా జిల్లాలో విషాదం
సాక్షి, గన్నవరం : కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో విషాదకర సంఘటన చోటుచేసుకొంది. కారులో ఆడుకోవాలన్న సరదా పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. కార్ డోర్ లాక్ అవటంతో ఊపిరాడక మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ క్వార్టర్స్ లో అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.ఇంటి వద్ద పార్క్ చేసిన కారులో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ కారు డోర్ లాక్ అయింది. అందులో చిక్కుకుపోయిన చిన్నారులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లోపలే ఊపిరాడక కుప్పకూలిపోయారు. వీరి కోసం తల్లిదండ్రులు గాలించగా, చివరకు కారులో విగతజీవులుగా కనిపించారు. చిన్నారుల మరణంతో కాలనిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరి తరమూ కాలేదు .సమాచారం అందుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీన్‌ని పరిశీలించారు .కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . -
కెపాసిటీ మించింది..విషాదం మిగిల్చింది.
సాక్షి, ఎమ్మిగనూరురూరల్/పెద్దకడుబూరు: కొన్ని నిమిషాల్లో క్షేమంగా ఎమ్మిగనూరుకు చేరుకుంటాం అనుకుంటుండగానే మలుపు రూపంలో మృత్యువు ఆ చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఎమ్మిగనూరు సమీపంలో గురువారం మధ్నాహ్నం జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన మాల నరసింహులు, ఈరమ్మలకు అశ్విని(10), నందిని, ఉష, పవిత్ర(1) నలుగురు ఆడపిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈరమ్మ తన పుట్టినిల్లు కర్ణాటకలోని సిరుగుప్పకు 12 రోజుల కిత్రం వెళ్లారు. గురువారం తన మెట్టినిల్లు కందనాతికి బయలుదేరారు. ఆదోనిలో బస్సు కోసం వేచి ఉండగా టాటా ఏసీ ఆటో ఎమ్మిగనూరుకు వెళ్తుండటంతో అందులో ఎక్కారు. వేగంగా వస్తున్న ఆటో.. నలందా బీఈడీ కాలేజీ మలుపు వద్ద అదుపు తప్పి డోర్ దగ్గర ఉన్న ఆశ్విని(10) కిందపడబోయింది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు కుమార్తెను కిందపడకుండా పట్టుకోవటానికి ప్రయత్నించేలోపు మరో చిన్నారి పవిత్ర(1) కింద పడిపోయింది. క్షణాల్లో ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ అందులో ఉన్న వారిని కింద దింపి, గాయపడ్డ వారిని అటుగా వస్తున్న ఆటోలో ఎక్కించి, ఆదోని వైపు పరారయ్యాడు. ప్రమాదం హడావుడిలో ఉండటంతో చూసి తప్పించుకువెళ్లినట్లు తెలుస్తుంది. ఆటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే కాకుండా.. పిల్లలకు డబ్బులు ఇవ్వరు అని సీట్లో కూర్చున్న వారిని నిల్చోపెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదే ప్రమాదంలో తల్లి ఈరమ్మకు ఎడమ చెయ్యి విరిగిపోయింది. క్షణాల్లో కళ్లముందే తమ పిల్లలు దుర్మరణం చెందటంతో తల్లిదండ్రులు దుఃఖసారగంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. పెద్దకడుబూరు ఎస్ఐ అశోక్ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును చిన్నారుల తండ్రి నరసింహులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని, ఆటో డ్రైవర్‌ను పట్టుకుంటామని పేర్కొన్నారు. -
చిన్నారులను మింగిన ప్రహరీ, గేటు..
సాక్షి, ఒంగోలు క్రైం: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను ప్రహరీగోడ బలితీసుకుంది. ఒంగోలు నగరం ముంగమూరు రోడ్డు జంక్షన్ సమీపంలోని కొత్తడొంకలో గురువారం ఈ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒంటిపూట బడులు కావడంతో పాఠశాలనుంచి వచ్చిన చిన్నారులు భోజనం కూడా చేయకుండా ఆటపాటల్లో మునిగిపోయారు. కాలనీలో నూతనంగా ప్రహరీ గోడ, గేటు అమర్చారు. ఈ క్రమంలో గేటు ఎక్కి అటూ, ఇటూ ఊగుతుండగా ఒక్కసారిగా ఇనుప గేటు వదులై నలుగురు చిన్నారులు కిందపడిపోయారు. ఆ తర్వాత గేటు ఊడి వచ్చి వారిపై పడింది. వెంటనే ప్రహరీ గోడ కూడా చిన్నారులపై కుప్పకూలింది. తేరుకున్న పరిసర ప్రాంతాలవారు వచ్చి శిథిలాలు తొలగించేందుకు శ్రమించారు. కానీ అప్పటికే గుడిమెట్ల నవదీప్(6) మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన సింధే ప్రేమ్ చంద్‌తో పాటు బాలుడి అక్క సింధే ప్రేమ్ జ్యోతి, కట్టా మణిలను హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తీవ్ర గాయాలపాలైన సింధే ప్రేమ్ చంద్(5), కట్టా మణి (7) ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం సింధే ప్రేమ్ జ్యోతి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. స్కూలు నుంచి వచ్చిన వెంటనే.. గుడిమెట్ల నవదీప్, సింధే ప్రేమ్ జ్యోతి, కట్టా మణి తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇళ్లకు వచ్చారు. వెంటనే ప్రేమ్ చంద్‌తో కలిసి నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడకు చెందిన ఇనుప గేటు ఎక్కి ఊగుతున్నారు. ప్రేమ్ జ్యోతి గేటును ఊపుతుండగా ముగ్గురు గేటుపై ఉన్నారు. వెంటనే గేటు ఊడటం.. ప్రహరీ కూలటం జరిగిపోయాయి. దీంతో కొత్తడొంక కాలనీ అరుపులు, కేకలతో హోరెత్తింది. అంతా కూలి పని చేసుకొనేవారే.. ఒక్కసారిగా ముగ్గురు చిన్నారులను మృత్యువు కబళించటంతో కొత్తడొంక కాలనీ విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక్కడంతా కూలి పనులు, చిరు వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఈ ఘటనతో మూడు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యాయి. ఆ చిన్నారుల మృతదేహాలను చూసిన వారి కళ్లు చెమర్చాయి. మృతి చెందిన చిన్నారులు 1.కట్టామణి, 2.ప్రేమ్‌చంద్, 3.నవదీప్.., 4. చికిత్స పొందుతున్న ప్రేమ్ జ్యోతి ప్రేమ్ చంద్ ఒక్కడే మగసంతానం.. సింధే వెంకటేశ్వర్లు దంపతులకు ప్రేమ్ చంద్ ఒక్కడే మగ సంతానం. మిగతా నలుగురు కుమార్తెలు. నలుగురు అమ్మాయిల తరువాత పుట్టాడు ప్రేమ్ చంద్. దీంతో ఆ కుటుంబాన్ని ఓదార్చటం ఎవరివల్లా కావటంలేదు. తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడి మృతదేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. కుమారుడి మృతదేహం ఒకవైపు, వైద్యశాలలో చికిత్స పొందుతున్న కుమార్తె మరో వైపు ఉండటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వెంకటేశ్వర్లు సెప్టిక్ ట్యాంకు డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. కట్టా మణి కూడా ఒక్కడే.. ప్రమాదంలో మృత్యువాత పడిన కట్టా మణి (7)కూడా ఆ కుటుంబానికి ఒక్క మగ సంతానం. వెంకటస్వామి దంపతులకు మణితో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. వెంకటస్వామి కుటుంబంతో సహా వంటపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. రెండో తరగతి చదువుతున్న మణి ఇంట్లో ఎంతో చలాకీగా ఉండేవాడు. గుడిమెట్ల నవదీప్ ముగ్గురు సంతానంలో పెద్దవాడు. తండ్రి గుడిమెట్ల వెంకటేశ్వర్లుకు ముగ్గురు మగసంతానం కాగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రిమ్స్‌కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమ్స్‌లో ఉన్న మృతదేహాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులను బలిగొన్న ప్రహరీ, గేటు.. పిల్లల స్కూలు బ్యాగులు, క్యారేజీలు సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రమాద సమాచారం తెలుసుకున్న ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు హుటాహుటిన కొత్తడొంకలోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సైలు ఎన్.సి.ప్రసాదు, దాసరి రాజారావు, మేడా శ్రీనివాసరావుతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రమాదం సంభవించిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ వైద్యులతో మాట్లాడారు. -
ఊపిరి.. ఉక్కిరి బిక్కిరి
కనిపించని సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం - సర్కారు ఆసుపత్రుల్లో అత్యవసరమైతే ఇక్కట్లే.. - జిల్లా కేంద్రం, హిందూపురంలో మాత్రమే ఏర్పాటు - వీటిలోనూ కొన్ని వార్డుల్లో సిలిండర్లే దిక్కు - వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత - గోరఖ్‌పూర్ ఘటనతోనూ మేల్కోని అధికార యంత్రాంగం అనంతపురం మెడికల్: గోరఖ్‌పూర్.. ఉత్తరప్రదేశ్‌లోని ఈ ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పసిప్రాణాలు గాల్లో కలిసిన విషయం తెలిసిందే. సిలిండర్లు సరఫరా చేసే ఏజెన్సీకి బిల్లులు చెల్లించలేదనే కారణంగా సరఫరా నిలిపివేయడంతో ప్రాణవాయువు అందక అభంశుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇంతలా కాకున్నా ‘అనంత’లోనూ సర్కారు ఆస్పత్రులకు ‘ఊపిరి’పోయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం స్పందిస్తే తప్ప భవిష్యత్‌లో ‘గోరఖ్‌పూర్’ తరహా ఘటన పునరావృతం కాకుండా చూడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘సెంట్రల్’ సిస్టం ఉన్నా అంతంతమాత్రమే.. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా 17 ఏళ్ల క్రితం ఏర్పాటైన సర్వజనాస్పత్రిలో ‘సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం’ ఉన్నా పూర్తి స్థాయిలో విస్తరించని పరిస్థితి. ప్రధానంగా ఛాతీ వార్డులో ఈ సౌకర్యం లేకపోవడంతో రోగులకు అష్టకష్టాలు తప్పట్లేదు. గతంలో ఇదే వార్డులో ఆక్సిజన్ సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయినా యంత్రాంగంలో మార్పు రాకపోవడం గమనార్హం. ఎంఎస్–1, ఎంఎస్–2, ఎఫ్ఎస్–1, ఎఫ్ఎస్–2, ఎంఎం, ఎఫ్ఎం, ఐడీ వార్డుల్లోనూ ఆక్సిజన్ ఆవశ్యకత ఉన్నా ‘సెంట్రల్’ సిస్టం లేకపోవడంతో అత్యవసరమైతే ఏకంగా ఏఎంసీకి తీసుకొస్తున్నారు. సాధారణంగా ఇక్కడి పడకలన్నీ ఎప్పుడూ రోగులతో నిండిపోతుంటాయి. ఈ సమయంలో ఇతర వార్డుల్లోంచి కేసులను తీసుకొస్తే వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మళ్లీ వార్డుల్లోనే ‘సిలిండర్లు’ ఉంచి ప్రాణవాయువు అందిస్తున్నారు. నిత్యం 80 నుంచి 90 సిలిండర్లు అవసరం అవుతుండగా.. ఓ ప్రైవేట్ ఏజెన్సీ వీటిని సరఫరా చేస్తోంది. ఇక హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అత్యవసర విభాగాలకు మాత్రమే ‘సెంట్రల్ ఆక్సిజన్’ సరఫరా అవుతోంది. ఇక్కడ పెద్ద సిలిండర్లు 18, చిన్న సిలిండర్లు 42 ఉండగా.. బెంగళూరులోని ఓ ఏజెన్సీతో అద్దె ప్రాతిపదికన నెట్టుకొస్తున్నారు. అద్దె చెల్లింపులతోనే కాలయాపన జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 80 పీహెచ్‌సీలు ఉండగా ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులకు రెఫర్ చేస్తుంటారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రెండు ఏరియా ఆస్పత్రులు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా ఎక్కడా సెంట్రల్ ఆక్సిజన్ సరఫరా పద్ధతి లేదు. కదిరి, ధర్మవరం, రాయదుర్గం, గుత్తి, పెనుకొండ, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, మడకశిర, సీకే పల్లి, శింగనమల, నల్లమాడ, పామిడి, కొండకమర్ల, కళ్యాణదుర్గం, కణేకల్లు, తనకల్లు ఆస్పత్రులు 30 నుంచి 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటయ్యాయి. ఈ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ, సర్జరీలు, ప్రసవాలు ఎక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి. ఏవైనా ప్రమాదాల్లో చిక్కుకునే వారికి తక్షణం ప్రాణవాయువు అందించాల్సి ఉంటుంది. అయితే శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా అద్దె చెల్లింపులతోనే కాలం గడుపుతున్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నిధులను సిలిండర్ల కోసం వెచ్చిస్తున్నారు. వాస్తవానికి ఆయా ఆస్పత్రుల్లో ‘సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం’ ఏర్పాటు చేయాలంటే రూ.కోట్లేమీ కావని, రూ.లక్షల్లోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవచ్చని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు. కొన్ని ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటం గమనార్హం. వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో మ్యానిఫోల్డ్(సెంట్రల్ ఆక్సిజన్ సరఫరా జరిగే గది) గదిలో విధులు నిర్వర్తించేందుకు టెక్నీషియన్లు ఎవరూ లేరంటే ఆశ్చర్యం వేయకమానదు. ఆస్పత్రిలోని అనస్తీషియా టెక్నీషియన్లే ఈ బాధ్యత చూస్తున్నారు. రోజుకు నాలుగైదు సార్లు సిలిండర్లు మార్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో సారి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. సర్జరీలు జరిగే సమయంలో తప్పనిసరిగా అనస్తీషియా టెక్నీషియన్లు ఆపరేషన్లలో నిమగ్నమై ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మ్యానిఫోల్డ్ గదిలో సిలిండర్లు బిగించడం కష్టతరంగా మారుతోంది. అత్యవసరమైతే ఏఎంసీకి తీసుకెళ్తాం సర్వజనాస్పత్రిలోని ఎఫ్ఎం వార్డులో రోజూ 30 మంది అడ్మిట్ అవుతారు. కొన్ని బ్యాడ్ కేసులు ఉంటాయి. రెండు సిలిండర్లు వార్డులో ఉంటాయి. అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సి వస్తే ఏఎంసీకి తరలిస్తాం. ఆ టైంలో బాధిత కుటుంబ సభ్యులు ఒక్కోసారి గొడవకు దిగుతారు. ఈ వార్డుతో పాటు చెస్ట్ వార్డులోనూ సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం ఉంటే బాగుంటుంది. మెడికల్ వార్డుల్లో తప్పనిసరి. - ఆర్బీ పద్మావతి దేవి, ఏపీ నర్సెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు.