
పెళ్లైన మూడు రోజులకే..
కుటుంబసభ్యులతో కలిసి నర్సింహస్వామిని దర్శించుకుని నదిలోకి దంపతులు స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నవ వధువు మునిగిపోయింది. బంధువులు వెంటనే ఆప్రమతమై వెలికి తీశారు. కొన ఊపిరితో ఉన్న దీపికను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. పెళ్లికుతురు దీపిక మరణించడంతో నేరేడుచర్ల, ఆలగడప గ్రామాల్లో విషాదం నెలకొంది.