
సాక్షి, సూర్యాపేట: క్వారీ గుంతలోపడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి హాజరై క్వారీ చూసేందుకు వెళ్లి.. ప్రమాదవాశాత్తు అక్కడి గుంతలో పడి ప్రాణాలు విడిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి వారు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) క్వారీ చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్ రెడ్డి లు ఇద్దరూ ఆ గుంతలో దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment