Athmakur
-
విషాదం.. క్వారీ గుంతలో పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహా ముగ్గురి మృతి
సాక్షి, సూర్యాపేట: క్వారీ గుంతలోపడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి హాజరై క్వారీ చూసేందుకు వెళ్లి.. ప్రమాదవాశాత్తు అక్కడి గుంతలో పడి ప్రాణాలు విడిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి వారు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) క్వారీ చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్ రెడ్డి లు ఇద్దరూ ఆ గుంతలో దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఆత్మకూరు ఉపఎన్నిక.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
ఆత్మకూరులో లక్ష మెజారిటీ కొడతాం: మంత్రి జోగి రమేష్
-
ఆత్మకూరులో పోటిపై చంద్రబాబు క్లారిటీ
సాక్షి, అమరావతి: మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఆత్మకూరు ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించారు. ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందితే.. అక్కడ తాము పోటీ పెట్టడం లేదన్నారు. మొదటి నుంచి టీడీపీ ఈ విధానాన్ని పాటిస్తోందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో గురువారం చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరు ఎన్నికపై మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకే తిరిగి ఉప ఎన్నికలో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదన్నారు. బద్వేలులో తాము ఎందుకు పోటీ చేయలేదో ఆత్మకూరులోనూ అందుకే చేయడం లేదన్నారు. చదవండి: Divyavani On Chandrababu Naidu: టీడీపీలో మహిళలకు గౌరవం లేదు -
వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం
ఆత్మకూరు: ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని పోలింగ్ సరళిని బట్టి ప్రస్పుటంగా అర్థమైందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎనలేని అభిమానంతో ప్రజలు ఎప్పుడో ఆయనకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. ప్రజలు తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించారన్నారు. టీడీపీ నాయకులు ఓటమి భయంతో బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. దీనికి ఉదాహరణే తనపై చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లిలో దాడి జరిగిందన్నారు. ఓ వైపు రిగ్గింగు చేసుకుంటూ ప్రశ్నించినందుకు కొమ్మి, ఆయన అనుచరులు దాడులు చేశారన్నారు. ఇలాంటి దాడులకు తాను భయపడబోనని పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలే తనకు శ్రీరామ రక్ష అన్నారు. టీడీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తూ మర్రిపాడు మండలంలో ఓట్ల పోలింగ్‌లో మోసం జరుగుతోందని పుకార్లు పుట్టించి అధికారులను ఆ మండలానికి పంపారన్నారు. అదే అదునుగా చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తాను ఆ మండలానికి వెళ్లానన్నారు. టీడీపీ అభ్యర్థి బొల్లినేని తమ గ్రామానికి వస్తే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చామన్నారు. అదే క్రమంలో తాను చేజర్ల మండలానికి వెళితే అక్రమాలకు పాల్పడటంతో పాటు తనపై భౌతిక దాడులకు పాల్పడ్డారని ఇది టీడీపీ నీచ రాజకీయమని ఆయన విమర్శించారు. పోలింగ్ సమయంలో కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ఓటర్లు ఓపిగ్గా కేంద్రాల్లో వేచి ఉండి తమ ఓట్టు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా రానున్నది జగనన్న పాలనేనని ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు జి.బాలఅంకయ్య, కొప్పోలు చిన్నపురెడ్డి ఉన్నారు. జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో ప్రస్తుతం జరిగిన ఓటింగ్‌ను చూస్తుంటే 10 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంటు సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని కొండాపాళెంగేటు సమీపంలో గురువారం ఓటు వేసిన ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునేందుకు ఉదయం నుంచి ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశామని చెబుతుంటే మే 23వ తేదీన తప్పకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారన్నారు. ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీదే విజయం నెల్లూరు(సెంట్రల్): జిల్లాతో పాటు రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలుస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఓటు వేయాలనే ఉత్సాహంతో ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి సామాజిక హక్కు అన్నారు. మన బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవడం మంచిదన్నారు. ప్రస్తుతం జరిగిన తీరు చూస్తుంటే ప్రజల మనిషికే రూరల్ ప్రజలు పట్టం కట్టారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. తనను ఆశీర్వదిస్తున్న రూరల్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికృ ధన్యవాదాలు తెలిపారు. -
వామ్మో..ఆత్మకూరు బస్టాండ్!
కర్నూలు , ఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం వస్తోం దంటే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీశైల మహాక్షేత్రం. బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు క్షేత్రానికి తరలి వస్తుంటారు. జిల్లా వాసులే కాకుండా కన్నడిగులు సైతం మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. వీరు ముందుగా ఆత్మకూరు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే వేలాది మంది భక్తులకు అనుగుణంగా ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సరైన సౌకర్యాలు లేవు. ఈ నెల 25 నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆత్మకూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఆత్మకూరులో ఆర్టీసీ డిపో 1972లో ఏర్పడింది. జిల్లాలోనే అత్యధికంగా లాభాలు తెచ్చేదిగా పేరుంది. ప్రతి రోజు ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి 10 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. బస్టాండ్‌లో కుళాయిలు ఉన్నా..వాటిలో మంచి నీరు రాదు. నీటి సమస్య తీర్చేందుకు అధికారులు డిపో ఆవరణలో బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికులకు దాహం వేస్తే లీటర్ నీళ్ల బాటిల్ రూ.20 చెల్లించి కొనాల్సిందే. నగర పంచాయతీ అధికారులకు ఆర్టీసీ వారు నీటి పన్నులు చెల్లిస్తున్నా..తగినన్ని కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. ట్యాంకర్లతో నీటిని కొని బస్టాండ్‌ను శుభ్రం చేయాల్సి వస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న సమయంలో నీటి సరఫరా బాగా ఉండేదని, నగర పంచాయతీగా ఏర్పడిన తరువాత ఇబ్బందులు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. శివస్వాముల అవస్థలు కఠిన దీక్షతో శివమాల ధరించిన శివస్వాములు ఆత్మకూరు బస్టాండ్‌లో మంచినీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరుకు వచ్చిన శివస్వాములుకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు బస్సు సౌకర్యం లేదు. దీంతో బస్టాండ్ ప్రాంగణంలోనే నిద్రించే పరిస్థితి ఉంది. నేలపైనే శివస్వాములు నిద్రించడంతో పాటు.. మరుగుదొడ్లు కూడా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తగ్గిన సర్వీసులు.. ఆత్మకూరు డిపోలో 600 మందికిపైగా కార్మికులు విధులు నిర్వహించే వారు. దాదాపు 15 సంవత్సరాల పాటు అత్యధిక ఆదాయ డిపోగా గుర్తింపు పొందింది. శ్రీశైల క్షేత్రమేగాక కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు ఇక్కడ నుంచి బస్సుల సౌకర్యం ఉండేది. అయితే 2010 నుంచి ఆదాయం తగ్గడంతో సర్వీసులు తొలగించారు. ఆత్మకూరు నుంచి శ్రీశైల క్షేత్రానికి కేవలం 2 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. అదనపు సర్వీసులు వేయాలని భక్తులు కోరుతున్నా ఆర్టీసీ అధికారుల్లో చలనం లేదు. ‘మరుగు’న పడేశారు బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్ల పరిస్థితి అధ్వాంగా ఉంది. సరైన నీరు లేకపోవడం, దుర్వాసన వస్తుండడం..తదితర కారణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటిని మూసివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో కుర్చీలు సరిగా లేవు. ప్రయాణికులు మెట్లపైనే కూర్చునే పరిస్థితి నెలకొంది. రాత్రి వేళ శ్రీశైలానికి వెళ్లే బస్సులు ఆత్మకూరులోనే ఉంటున్నాయి. ప్రయాణికులు నిద్రించేందుకు కావాల్సిన సౌకర్యాలు లేవు. దోమల బెడదతో కంటికి కునుకు కరువవుతోంది. ఆత్మకూరు డిపోలో ఉన్న బస్సు సర్వీసులు –69 సిబ్బంది: కండక్టర్లు–110, డ్రైవర్లు–92, గ్యారేజ్‌లో కార్మికులు–40 -
ఎమ్మెల్యేలను కొన్నందుకా..రుణమాఫీతో ముంచినందుకా
కర్నూలు జిల్లా: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాటం దేనికోసమని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు శిల్పాచక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను వంచించినందుకా లేక మహిళలను మోసం చేసినందుకా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్నందుకా లేక రైతన్నలను రుణమాఫీ పేరుతో నిట్టనిలువునా ముంచినందుకా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మకూరులో ముస్లిం సోదరులు శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య, కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ హఫీజ్ ఖాన్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి మాట్లాడుతూ..‘ టీడీపీ ప్రభుత్వంలో అసలైన లబ్దిదారులకు న్యాయం జరగడం లేదు. కేవలం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరుగుతోంది. చంద్రబాబుపై ఎవరు మాట్లాడినా జగన్ మోహన్ రెడ్డే వాళ్లతో మాట్లాడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నవ నిర్మాణ దీక్షలు మొత్తం జగన్‌ను తిట్టడానికే సరిపోయాయి. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను డ్రామాలుగా వర్ణించడం సిగ్గు చేటు. 14 నెలల ముందు రాజీనామా చేసిన ఎంపీల త్యాగాన్ని అందరూ కీర్తించాలి. దమ్ము, చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామాలు చేయాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చార’ని తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య మాట్లాడుతూ.. నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆరువందల హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలని మోసం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాలు అపహాస్యం అయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మంచి నీళ్లు దొరకడం లేదు కానీ మద్యం డోర్ డెలివరీ జరుగుతోందని ఎద్దేవా చేశారు. పంచభూతాలను సైతం దోచుకుతిన్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. నాలుగేళ్లుగా ఏ ఏడు కా ఏడు నవ నిర్మాణ దీక్షలు చేయడం సిగ్గు చేటని తీవ్రంగా మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని విమర్శించడానికి మాత్రమే నవనిర్మాణ దీక్షలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఉరి వేసుకున్నా ఎవరికీ లాభం లేదని, కాంగ్రెస్‌తో జతకట్టేందుకు టీడీపీ సిద్ధపడి, వైఎస్సార్సీపీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని ఆయన మామ స్వర్గీయ ఎన్టీఆర్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. దిగజారుడు టీడీపీ రాజకీయాలకు పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధపడ్డారని, విలువలతో కూడిన రాజకీయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతమని అన్నారు. కర్నూల్ జిల్లాలో 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు తప్పక గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హాఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసిన మంచి పనులు గురించి చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో యూటర్న్ అంకుల్ అన్న పేరు మాత్రమే చంద్రబాబు సాధించిందని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు దుల్హన్ కార్యక్రమంలో అసలైన లబ్ధిదారులకు లాభం చేకూరడం లేదని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తితే టీడీపీ ఖాళీ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. -
వ్యవసాయ పొలంలో వెండి నాణేలు
ఆత్మకూర్: ఓ రైతు వ్యవసాయ పొలాన్ని చదును చేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్తులు గుంపులుగుంపులుగా చేరి తవ్వకాలు జరిపారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని కత్తెపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండారెడ్డికి చెందిన పొలాన్ని సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి, ఆయన ద్వారా నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారం క్యాంపు గ్రామానికి చెందిన నారాయణరావు 22 ఎకరాల పొలాన్ని నెల క్రితం కొనుగోలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం సర్వే 123/ ఈలో ని పిల్లిగుట్ట వద్ద పొలాన్ని సాగు కోసం చదును చేస్తున్నాడు. ఈ సందర్భంగా తవ్వకాల్లో వెండి నాణేలు లభ్యం కావడంతో వ్యవసాయ కూలీల ద్వారా గ్రామస్తులకు సమాచారం చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో పొలం వద్దకు చేరుకుని తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు దొరికినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఆత్మకూర్ సీఐ బండారి శంకర్ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు, రైతుకు దొరికిన 17 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణేలు నిజాం కాలం నాటివిగా గుర్తించారు. అనంతరం తహసీల్దార్ జెకె.మోహన్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించగా. నాణేలను కలెక్టర్‌కు అందచేయనున్నట్లు తెలిపారు. కాగా, తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు బయటపడ్డాయనే ప్రచారం సాగుతోంది. -
పందులు బాబోయ్..
ఆత్మకూర్ : ఒక పక్క స్వైన్‌ప్లూ వణికిస్తుందని.. దీనికి తోడు డెంగీలాంటి విషజ్వరాల బారిన పడి ఇది వరకే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనాభాకు తగ్గ పందుల స్వైరవిహారం ఉన్నా నివారించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమవుతున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో జనాభాకు సరిపడా పందుల స్వైరవిహారం ఉందని ఏ వీధిలో చూసినా, ఏ ఇంటి ముందు చూసినా, ఆలయాలు, మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు ఇలా ఎక్కడపడితే అక్కడ పందులే దర్శనం ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి క్యారీబ్యాగ్‌లలో చేతపట్టుకొని వెళ్తుంటే అమాంతం లాగేసుకుపోతున్నాయని వాపోతున్నారు. దుకాణా సముదాయాల్లో చొరబడుతూ నానా బీభత్సం చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే పందుల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆత్మకూర్ బంద్ విజయవంతం
– స్థంభించిన రాకపోకలు – వనపర్తి వద్దు.. పాలమూరు ముద్దు ఆత్మకూర్ : ఇక్కడున్న నీళ్లను దోచుకెళ్లేందుకే ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట మండలాలను వనపర్తి జిల్లాలో కలుపుతున్నారని, అలా జరిగితే అన్ని విధాలుగా నష్టపోతామని, పాలమూరు జిల్లాలోనే తమ మండలాలు కొనసాగించాలని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గంగాధర్‌గౌడ్, గాడి కష్ణమూర్తి, రామలక్ష్మారెడ్డి, తిప్పారెడ్డి, పురం సుదర్శన్‌రెడ్డి, రవికుమార్‌యాదవ్ మాట్లాడుతూ ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట మండలాలు పాలమూరులోనే కొనసాగితే డివిజన్, నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడే అవకాశాలు దండిగా ఉన్నాయన్నారు. ఇక్కడి జూరాల జలాలను కొల్లాపూర్‌కు తరలించుకుపోయి అక్కడున్న చెరువులను, కుంటలను నింపుకొని వారి పంటలు పండించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి పంట పొలాలు బీడు బారాయని, ఇక్కడి చెరువులు నీళ్లులేక నెర్రెలు బారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమను బలవంతంగా వనపర్తిలో కలిపితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. బంద్ కారణంగా రాకపోకలు స్థంభించిపోయాయి. ప్రయాణికులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సీఐ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పుట్నాల రమేష్, అశ్విన్‌కుమార్, అబ్దుల్జలీల్, అశోక్‌కుమార్, బంగారు శ్రీను, చెన్నయ్య, ఎస్టీడీ శ్రీనివాసులు, రహెమతుల్లా, ప్రతాప్‌రెడ్డి, బంగారు భాస్కర్, లింగయ్య, వెంకటేష్, మాసన్న, గడ్డం శ్రీనివాస్‌యాదవ్, తుకారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కేసునమోదు
ఆత్మకూరు(ఎం) : తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థికసాయం పొందడానికి దరఖాస్తు చేసుకున్న మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన జింజిరాల రామచంద్రు–వరలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.శివనాగప్రసాద్ బుధవారం విలేకరులకు తెలిపారు. గ్రామానికి చెందిన రామచంద్రు–వరలక్ష్మి ఫిబ్రవరి నెలలో కూతరు వివాహం కాగా ఏప్రిల్‌లో వివాహమైనట్టు వివాహ పత్రికను ముద్రించి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆర్ఐ డి.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
అమర పోలీసులకు సెల్యూట్..!
ఆత్మకూరు(ఎం) పోలీస్‌స్టేషన్‌పై మావోయిస్టుల దాడి జరిగి నేటితో పదేళ్లు ఆత్మకూరు(ఎం) : సరిగ్గా పదేళ్ల క్రితం.. జనమంతా.. రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయం..అప్పుడే పిడుగుపడినట్టుగా పెద్ద శబ్దం వినిపించింది. జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమిటా అని లేచి బజార్లకు వచ్చేలోపే పోలీస్‌స్టేషన్‌పై బాంబులతో దాడి జరిగిందనే వార్త దాహనంలా వ్యాపించింది. అదే ఆత్మకూర్(ఎం)మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌పై మావోయిస్టుల జరిపిన బాంబుదాడి ఘటన. ఈ దాడి జరిగి గురువారంతో పదేళ్లయ్యింది. దశాబ్దం క్రితం ఇదేరోజు అర్ధరాత్రి (18–08–2006న) జరిగిన దాడిలో అప్పటి స్టేషన్ ఎస్ఐ చాంద్ పాషా, ఏఎస్ఐ సుల్తాన్‌మొయినో ద్దీన్, హోంగార్డు లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మావోయిస్టుల దాడిలో ప్రాణాలొదిలిన అమరపోలీసుల త్యాగాన్ని స్మరించుకుందాం. వారి మతికి నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుదాం.. క్షణక్షణం.. భయంభయం ! వర్కట్‌పల్లి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మండల కేంద్రంలో 1993–94లో అప్పటి ఎంపీపీ పి.హేమలత ఇంటిని నక్సలైట్లు పేల్చివేశారు. అప్పటి నుంచి ఎటువంటి సంఘటనలు ఆత్మకూరు(ఎం)లో చోటు చేసుకోలేదు. ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న ఆత్మకూరు(ఎం)లో మరలా 2006లో అలజడి మెుదలైంది. పోలీస్‌స్టేషన్‌పై మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఎస్ఐ, ఏఎస్ఐ, హోంగార్డుల మతి చెందగా జనం క్షణక్షణం భయపడుతున్నారు. అలాగే ఏడాదిన్న క్రితం జానకిపురంలో ఉగ్రవాదుల కాల్పులకు మతి చెందిన ఎస్ఐ డి.సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు మరణాలను ఇప్పటికీ ఈ మండల ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. -
రుణమాఫీ లేదు.. ఏం లేదు..
ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి వద్ద వాపోయిన మహిళలు ఆత్మకూరురూరల్ : ‘చంద్రబాబు పొదుపు మహిళలకు రుణమాఫీ అంటూ ఊదరగొట్టి ఒక్కొక్కరి ఖాతాలో కేవలం రూ.3,000 జమచేసి ఆ సొమ్ము సైతం వాడుకునేందుకు వీల్లేకుండా కొర్రీలు పెట్టారని’ మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం మండలంలోని పాతజంగాలపల్లి గ్రామంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి సమస్యలు తెలుసుకున్నారు. ఎస్సీకాలనీలో బద్దెల లక్ష్మమ్మ తన ఐదు నెలల వయస్సు ఉన్న మనుమరాలికి గుండెలో చిల్లు ఉందని డాక్టర్లు చెప్పారని, ఆ పాపకు ఆరోగ్యశ్రీకార్డు లేదని ఆవేదన వ్యక్తంచేసింది. అధికారులతో మాట్లాడి సాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దేవరపాటి కొండయ్య అనే వ్యక్తి తనకు గతంలో పింఛన్ వస్తుండేదని, ప్రస్తుతం నిలిపేశారని చెప్పాడు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ బాబు అధికారంలోకి రావడం కోసం వెయ్యి అబద్దాలు ఆడారని విమర్శించారు. అర్హులైన వారికి పక్కాగహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయినా ఒక్క ఇళ్లుయినా కట్టిన పాపానపోలేదన్నారు. రైతులవాణిని అసెంబ్లీలో వినిపిస్తానన్నారు. సర్పంచ్ గడ్డం విజయసేన, జి.శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి, నాయకులు ఉల్సా పెంచలయ్య, సానా వేణుగోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, శ్రీరాములు, ముక్కమళ్ల రఘురామిరెడ్డి, వెంకటరెడ్డి, చిన్నపరెడ్డి, యానాదిరెడ్డి, ఖాజావలి, ఖాదర్‌బాష, షేక్ ఖాజావలి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, జయరామిరెడ్డి, ఎండీ ముజీబ్, ఓబుల్‌రెడ్డి, రహీం, వశీం, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. -
అభిరాం సేవలు అభినందనీయం
ఆత్మకూరు : పట్టణంలోని అభిరాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని ఎల్‌ఆర్‌పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ట్రస్టు అధినేత డాక్టర్ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలు సామాజికసేవ వెలకట్టలేనివన్నారు. శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ హెల్ప్ ఇండియా స్వచ్ఛంద సంస్థ అధినేత స్టీఫెన్ బ్యాగులు అందజేయాలని కోరారన్నారు. దీంతో పలు పాఠశాలల్లో పేద 120 మంది విద్యార్థులను గుర్తించి రూ.40 వేలు విలువైన బ్యాగులు సమకూర్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అభిరాం ఆస్పత్రిని స్థాపించామన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్‌రావు, ఉపాధ్యాయులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
ఆత్మకూరు : ప్రమాదాల నివారణకు డ్రైవర్లు అన్నిరకాల జాగ్రత్తలు చేపట్టాలని ఆత్మకూరు ఎస్సై పూర్ణచంద్రరావు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాల సభను నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు. ప్రశాంత వాతావరణంలో మంచి అలవాట్లతో ఉంటే ప్రమాదాలకు దూరంగా ఉండగలుగుతారన్నారు. డిపోలో గత 26 సంవత్సరాలుగా ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్ చేసిన డ్రైవర్లు డి.శ్రీనివాసులు, రామయ్య, రెహమాన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఐ రాము, ఏఎంఎఫ్ షాజహాన్, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆత్మకూరు(ఎం)(నల్గొండ జిల్లా): ఆత్మకూరు(ఎం) మండలం కొరేటికల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై చుక్కాపురం నుంచి కొరేటికల్ వెళ్తున్న చెరుకు జహంగీర్(35) అనే వ్యక్తి అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. జహంగీర్ స్వస్థలం ఆత్మకూరు(ఎం) మండలం చుక్కాపురం. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
డీలర్ దారుణ హత్య
ఆత్మకూరు: వ్యవసాయ బావి వద్ద నుంచి ఇంటికి వస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికంగా నివాసముంటున్న రమణ (30) డీలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈక్రమంలో నిన్న రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. గుర్తు తెలియని దుండగులు రాడ్లతో దాడి చేశారు. దీంతో తలపై బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. శుక్రవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు (కర్నూలు) : తనను వేధిస్తున్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని పేర్కొంటూ ఓ యువతి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన మంగళవారం కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. మండలంలోని నల్లకాల్వ గ్రామానికి చెందిన లక్ష్మీఈశ్వరమ్మ (23) గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఫిర్యాదును పట్టించుకోకుండా ఎస్సై మహేశ్వరయ్య తనను దుర్భాషలాడుతున్నాడంటూ మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసుల సమక్షంలో క్రిమిసంహారక మందు తాగింది. దీంతో ఆమెను వెంటనే పోలీసులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలిసిన డీఎస్పీ సుప్రజ, సీఐ దివాకరరెడ్డి ఆమెను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. -
నర్సాపురం గ్రామంలో 200ల మందికి జ్వరాలు
ఆత్మకూర్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం నర్సాపురం గ్రామంలో విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇంటికి ఒకరిద్దరు చొప్పున దాదాపు 200 మంది జ్వరాల బారినపడ్డారు. ఇటీవల గ్రామంలో పీహెచ్సీ సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. అంతేకాకుండా గ్రామంలో 8 డెంగ్యూ కేసులు కూడా బయటపడ్డాయి. బాధితుల్లో ముగ్గురు కోలుకున్నప్పటికీ ఐదుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.