ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
ఆత్మకూరు : ప్రమాదాల నివారణకు డ్రైవర్లు అన్నిరకాల జాగ్రత్తలు చేపట్టాలని ఆత్మకూరు ఎస్సై పూర్ణచంద్రరావు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాల సభను నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు. ప్రశాంత వాతావరణంలో మంచి అలవాట్లతో ఉంటే ప్రమాదాలకు దూరంగా ఉండగలుగుతారన్నారు. డిపోలో గత 26 సంవత్సరాలుగా ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్ చేసిన డ్రైవర్లు డి.శ్రీనివాసులు, రామయ్య, రెహమాన్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీఐ రాము, ఏఎంఎఫ్ షాజహాన్, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.