ఆత్మకూరు (కర్నూలు) : తనను వేధిస్తున్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని పేర్కొంటూ ఓ యువతి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన మంగళవారం కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. మండలంలోని నల్లకాల్వ గ్రామానికి చెందిన లక్ష్మీఈశ్వరమ్మ (23) గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేసింది.
అయితే ఆ ఫిర్యాదును పట్టించుకోకుండా ఎస్సై మహేశ్వరయ్య తనను దుర్భాషలాడుతున్నాడంటూ మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసుల సమక్షంలో క్రిమిసంహారక మందు తాగింది. దీంతో ఆమెను వెంటనే పోలీసులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలిసిన డీఎస్పీ సుప్రజ, సీఐ దివాకరరెడ్డి ఆమెను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు.
పోలీస్‌స్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం
Published Tue, Oct 6 2015 6:17 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement