ఆత్మకూర్ బంద్ విజయవంతం
Published Mon, Sep 19 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
– స్థంభించిన రాకపోకలు
– వనపర్తి వద్దు.. పాలమూరు ముద్దు
ఆత్మకూర్ : ఇక్కడున్న నీళ్లను దోచుకెళ్లేందుకే ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట మండలాలను వనపర్తి జిల్లాలో కలుపుతున్నారని, అలా జరిగితే అన్ని విధాలుగా నష్టపోతామని, పాలమూరు జిల్లాలోనే తమ మండలాలు కొనసాగించాలని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గంగాధర్‌గౌడ్, గాడి కష్ణమూర్తి, రామలక్ష్మారెడ్డి, తిప్పారెడ్డి, పురం సుదర్శన్‌రెడ్డి, రవికుమార్‌యాదవ్ మాట్లాడుతూ ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట మండలాలు పాలమూరులోనే కొనసాగితే డివిజన్, నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడే అవకాశాలు దండిగా ఉన్నాయన్నారు. ఇక్కడి జూరాల జలాలను కొల్లాపూర్‌కు తరలించుకుపోయి అక్కడున్న చెరువులను, కుంటలను నింపుకొని వారి పంటలు పండించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి పంట పొలాలు బీడు బారాయని, ఇక్కడి చెరువులు నీళ్లులేక నెర్రెలు బారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమను బలవంతంగా వనపర్తిలో కలిపితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. బంద్ కారణంగా రాకపోకలు స్థంభించిపోయాయి. ప్రయాణికులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సీఐ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పుట్నాల రమేష్, అశ్విన్‌కుమార్, అబ్దుల్‌జలీల్, అశోక్‌కుమార్, బంగారు శ్రీను, చెన్నయ్య, ఎస్టీడీ శ్రీనివాసులు, రహెమతుల్లా, ప్రతాప్‌రెడ్డి, బంగారు భాస్కర్, లింగయ్య, వెంకటేష్, మాసన్న, గడ్డం శ్రీనివాస్‌యాదవ్, తుకారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement