అభిరాం సేవలు అభినందనీయం
అభిరాం సేవలు అభినందనీయం
Published Fri, Jul 22 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ఆత్మకూరు : పట్టణంలోని అభిరాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని ఎల్‌ఆర్‌పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ట్రస్టు అధినేత డాక్టర్ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలు సామాజికసేవ వెలకట్టలేనివన్నారు. శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ హెల్ప్ ఇండియా స్వచ్ఛంద సంస్థ అధినేత స్టీఫెన్ బ్యాగులు అందజేయాలని కోరారన్నారు. దీంతో పలు పాఠశాలల్లో పేద 120 మంది విద్యార్థులను గుర్తించి రూ.40 వేలు విలువైన బ్యాగులు సమకూర్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అభిరాం ఆస్పత్రిని స్థాపించామన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్‌రావు, ఉపాధ్యాయులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement