పందులు బాబోయ్‌.. | pigs problem in wanaparthy district | Sakshi

పందులు బాబోయ్‌..

Published Thu, Feb 8 2018 5:25 PM | Last Updated on Thu, Feb 8 2018 5:25 PM

pigs problem in wanaparthy district - Sakshi

బాలికల ఉన్నత పాఠశాల వద్ద పందుల బెడద

ఆత్మకూర్‌ : ఒక పక్క స్వైన్‌ప్లూ వణికిస్తుందని.. దీనికి తోడు డెంగీలాంటి విషజ్వరాల బారిన పడి ఇది వరకే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనాభాకు తగ్గ పందుల స్వైరవిహారం ఉన్నా నివారించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమవుతున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో జనాభాకు సరిపడా పందుల స్వైరవిహారం ఉందని ఏ వీధిలో చూసినా, ఏ ఇంటి ముందు చూసినా, ఆలయాలు, మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు ఇలా ఎక్కడపడితే అక్కడ పందులే దర్శనం ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి క్యారీబ్యాగ్‌లలో చేతపట్టుకొని వెళ్తుంటే అమాంతం లాగేసుకుపోతున్నాయని వాపోతున్నారు. దుకాణా సముదాయాల్లో చొరబడుతూ నానా బీభత్సం చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే పందుల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

1
1/1

వస్త్ర దుకాణంలో చొరబడి పంది బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement