officials negligence
-
అయ్యో సిద్ధా.. మీడియా ముందు భంగపాటు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మీడియా ముందు భంగపాటు ఎదురైంది. బుధవారం ఓ నీటి ప్రాజెక్టు పనుల ప్రారంభం కోసం వెళ్లిన ఆయనకు అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఆగ్రహం తెప్పించింది. అయితే అక్కడ సంయమనం పాటించి మౌనంగా ఆయన.. తర్వాత చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. బుధవారం పెరియాపట్నలో ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియా ముందు.. మోటర్ స్విచ్ ఆన్ చేయగా అది పని చేయలేదు. దీంతో ఆయన పక్క ముఖాలు చూశారు. అయినా పక్కనున్నవాళ్లు అదేం పట్టించుకోకుండా చప్పట్లు కొట్టారు. అయితే.. అది పని చేయడం లేదని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు ఎంత ప్రయత్నించినా.. అది ఆన్ కాలేదు. చివరకు బటన్ ఫెయిల్ అయ్యిందని.. సాంకేతిక సమస్య తలెత్తిందని.. అందుకే అది పని చేయలేదని గుర్తించారు. అయితే ఆ కార్యక్రమం తర్వాత ఆయన సంబంధిత అధికారుల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఈ ఉదయం చాముండేశ్వరీ ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్(సీఈఎస్సీ) ఎండీ సీఎన్‌శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తూ పీఎస్(ప్రిన్సిపల్ సెక్రెటరీ) ఉమాదేవి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. సౌకర్యాల రూపకల్పనలో విఫలం కావడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. Embarrassment For #Siddaramaiah Motor fails during project launch, #Karnataka CM seen pressing button repeatedly #Mysuru electricity board MD suspended After Humiliation for negligence@aayeshavarma | @KeypadGuerilla reports pic.twitter.com/vvecs6cWH7 — Mirror Now (@MirrorNow) January 25, 2024 Video Credits: Mirror Now -
మూగవాణి!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రస్తుతం ఎవరికీ పట్టని పనికిమాలిన ‘వాణి’గా మారింది. ఐదారేళ్ల క్రితం కృష్ణబాబు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంతో ఆదరణ ఉండేది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉదయం 10 గంటల కల్లా వచ్చే ప్రజలు క్యూ కట్టేవారు. వచ్చిన వారందరినీ వరుస క్రమంలో పంపించేందుకు వరుస నెంబర్లతో టోకెన్లు జారీ చేసేవారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే సమయమైనా..అందరిఫిర్యాదులూ స్వీకరించేంత వరకు అధికారులు ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఉండేవారు. కమిషనర్‌తోపాటు అన్ని విభాగాల అడిషనల్ కమిషనర్లు.. తదితరులు తప్పనిసరిగా ఉండేవారు. తమ వద్దకు వచ్చిన ప్రజల వేదనల్ని సావధానంగా వినేవారు. అప్పటికప్పుడే కంప్యూటర్లోనూ నమోదు చేసేవారు. అన్నీ పూర్తయ్యాక సంబంధిత విభాగాలకు పంపించేవారు. ప్రతివారం ఎన్ని ఫిర్యాదులొచ్చిందీ.. పత్రికా ప్రకటన సైతం విడుదల చేసేవారు. ఆ తర్వాత సోమేశ్‌కుమార్ కమిషనర్‌గా వచ్చిన తర్వాత కూడా కొంత కాలం వరకు ఈ కార్యక్రమం సజావుగా సాగింది. ఆ తర్వాత కమిషనర్ లేకపోయినా..కనీసం అడిషనల్ కమిషనర్ స్థాయి వారు ప్రజావాణికి హాజరయ్యేవారు. ఆయా విభాగాలకు సంబంధించి ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకునేది వారే కనుక అడిషనల్ కమిషనర్లుండేవారు. ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ తదితర విభాగాల అధిపతులూ తప్పనిసరిగా ఉండేవారు. దాదాపు రెండేళ్లుగా మొక్కుబడి తంతుగా సాగుతోన్న ప్రజావాణి గత ఏడాది కాలం నుంచి మరీ అధ్వాన్నంగా మారింది. కమిషనర్ సంగతటుంచి, కనీసం అడిషనల్ కమిషనర్లు కూడా హాజరు కావడం లేదు. విభాగాల ఉన్నతాధికారులూ రావడం లేదు. తప్పదన్నట్లుగా.. మొక్కుబడిగా ఒకరో ఇద్దరో వచ్చి కూర్చుంటున్నారు. అదీ క్లర్కులు, సూపరింటెండెంట్లు సైతం ఎవరు అందుబాటులో ఉంటే వారు కూర్చొని ప్రజలిచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అన్ని విభాగాల వారు ఉండకపోవడంతో పాటు పరిష్కారంపై నిర్ణయం తీసుకునేవారు లేకపోవడంతో ఆయా విభాగాలకు సంబంధించి సరైన సమాధానం ఇచ్చేవారు లేరు. ‘ఫిర్యాదు ఇచ్చిపోండి..పరిష్కరిస్తాం’ అని చెబుతూ ఫిర్యాదు పత్రం స్వీకరిస్తున్నారు. కనీసం వాటినైనా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అంటే అదీ లేదు. తీసుకున్న ఫిర్యాదు కాగితాల్ని ఆ తర్వాత ఎప్పుడో ఆన్లైన్లో ఉంచుతున్నారు. అందిన అన్ని ఫిర్యాదుల్నీ ఆన్లైన్లో ఉంచని ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు తాజాగా సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణికి అందిన ఫిర్యాదులే పది కాగా, వాటిల్లో ఒకటి కనిపించకుండా పోయింది. ఇక ఫిర్యాదు పరిష్కారమవుతుందనుకోవడం భ్రమే. ప్రజావాణిలో అందజేస్తే తమ ఫిర్యాదు వెంటనే పరిష్కారమవుతుందని భావించి పలువురు ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసల కోర్చి వస్తున్నారు. పది గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, ఒక్కోసారి 11.30 గంటల వరకు కూడా ప్రారంభం కావడం లేదు. తాజాగా సోమవారం ప్రజావాణికి సైతం అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులెవరూ హాజరు కాలేదు. వచ్చిందే నలుగురు. ఫిర్యాదులు నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్ సైతం సోమవారం 12 గంటల దాకా రాకపోవడంతో స్వీకరణలో జాప్యం జరిగింది. అంతమాత్రం దానికి కార్యక్రమాన్నే పూర్తిగా ఎత్తివేస్తే పోద్దికదా అని దూరం నుంచి వచ్చిన ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పదే ఫిర్యాదులు.. ఇక ఫిర్యాదుల్లో ప్రతిసారీ టౌన్ప్లానింగ్దే సింహభాగం. ఫిర్యాదులెన్ని అందినా అక్రమార్కులతో మిలాఖతయ్యే టౌన్‌ప్లానింగ్ అధికారులు వాటిని పరిష్కరించరు. తిరిగి, తిరిగి విసిగి వేసారి పోవాల్సిందే. సోమవారం మొత్తం పది ఫిర్యాదులందగా, అందులో టౌన్‌ప్లానింగ్‌వే ఆరు ఉన్నాయి. ఆస్తిపన్ను, ఇంజినీరింగ్, ఆరోగ్యం– పారిశుధ్యం తదితర విభాగాలకు చెందినవి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గణాంకాలు చూపేందుకు మాత్రం అందిన ఫిర్యాదుల్లో 60 –90 శాతం వరకు పరిష్కారమైనట్లు పేర్కొంటారు. సర్కిళ్లలో పరిష్కారం కాక.. సర్కిళ్లు, జోన్ల స్థాయిల్లో పరిష్కారం కావాల్సినవి సైతం అక్కడ పరిష్కారం కాక ఎందరో ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. యూసుఫ్‌గూడ ప్రాంతంలో తన ఇంటిలో కొంతభాగాన్ని ఇతరులకు అమ్మితే.. మొత్తం ఇల్లును అమ్మినట్లు మ్యుటేషన్ చేశారని, తన ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సర్కిల్‌స్థాయి అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించుకున్నా.. పట్టించుకోకపోవడంతో ఇక్కడికొచ్చినట్లు ఒకరు వాపోయారు. పైపెచ్చు రెండు పర్యాయాలు సంబంధిత డాక్కుమెంట్లు సమర్పించినా, కనిపించడం లేవని చెబుతున్నారని వేదన వ్యక్తం చేశారు. -
నిబంధనలకు పొగ
తూప్రాన్ : శ్రీనివాస్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం కొనుగోలు చేసిన బైక్‌పై వెళ్తున్నాడు. దారిలో పోలీసులు ఆయన వాహన పత్రాలను పరిశీలించారు. ఆయన వద్ద అన్ని ధ్రువీకరణ పత్రాలున్నాయి.. కానీ కాలుష్య స్థాయిని తెలిపేది మాత్రం లేదు. దీంతో కొత్త వాహనం అని చెప్పినా పోలీసులు రూ. 300 జరిమానా విధించారు. అదే శ్రీనివాస్ మరోసారి 2000 మోడల్ పాత ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన తనిఖీలో కాలుష్య నిర్ధారణ ధ్రువీకరణ పత్రాన్ని చూపించాడు. అంతే ఆ వాహనానికి ఎలాంటి జరిమానా విధించకుండానే వదిలేశారు. కళ్ల ముందే వాహనం నుంచి పొగలు వస్తున్నా వారు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్నాయి. వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం.. అధికారులు తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వాహనాల కాలుష్య నియంత్రణ చర్యలు శూన్యం వాహన కాలుష్య నియంత్రణ కోసం కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని అమలు పరచడంలో అధికారులు విఫలమవుతున్నారు. కాలుష్య ధ్రువీకరణ పత్రం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ వాటిలో ఎంత మోతాదు కాలుష్య కారకాలున్నాయనే అంశాన్ని విస్మరిస్తున్నారు. దీంతో కాలుష్యానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ క్రమంలో వాహనాలు కాలుష్యాన్ని చిమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి. కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనలు కొందరికి దోపిడీకి ఉపయోగపడుతున్నాయి. వాహనాల కాలుష్యాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వం సంచార తనిఖీ కేంద్రాలను అనుమతించింది. కానీ వారు వాహనాలకు ఎటువంటి పరీక్షలు జరపకుండానే కాలుష్య శాతాలను ముద్రించి వాహనదారులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. మరమ్మతులు చేయించుకోవాలి.. 2010 ఏప్రిల్ తర్వాత వచ్చిన భారీ వాహనాల్లో మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ల్యాంప్ ఉండాలనే నిబంధన ఉంది. శబ్ధ కాలుష్య నియంత్రణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. వీటి అమలు మాత్రం ఎక్కడా జరగడం లేదు. తనిఖీ కేంద్రాల్లో ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ల్యాంప్ ఆగినపుడు తనిఖీ చేసిన కాలుష్య విలువలు కచ్చితంగా రావనేది దీని అర్థం. తనిఖీ సమయంలో ల్యాంప్ పనిచేయకుంటే తప్పనిసరిగా వాహనాన్ని మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని పరిశీలిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న వాహనాల వివరాలిలా ఉన్నాయి. నాన్ ట్రాన్స్‌ఫోర్టు వాహనాలు కార్లు 4834, మోటార్ సైకిళ్లు 44,257, ఇతర వాహనాలు 426, టీటీ 6003, ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఆటోలు 5,688, గూడ్స్ 3,292, మ్యాక్సీ క్యాబ్స్ 237, మోటార్ క్యాబ్ 699 ఇతర వాహనాలు 35, స్టేజీ క్యారియర్లు 102, టీటీ 3,711 ఉన్నాయి. ఇప్పటి వరకు 2016 అక్టోబర్ నుంచి జిల్లాలో 352 కేసులు చేశామని జిల్లా ఆర్టీఏ అధికారి గణేశ్ తెలిపారు. అలాగే జరిమానాలు రూ. 2లక్షల 24వేల 395 వరకు విధించినట్లు తెలిపారు. కాలుష్య స్థాయి ఏమేరకు ఉండాలంటే.. 1989 మోటారు వాహన చట్టం 115(2) నిబంధనల ప్రకారం వాహన కాలుష్యాల స్థాయి ఏ మేరకు ఉండాలనేది నిర్ణయించారు. కార్బన్ మోనాక్సైడ్, హెచ్‌సీ నిల్వలు ఎంత ఉండాలో సూచించారు. ఈ చట్టాన్ని మళ్లీ 2001లో సవరించారు. ఈ రెండింటి ప్రకారం పెట్రోల్, గ్యాస్, ద్విచక్ర వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ 3.0 శాతం నుంచి 4.5 శాతానికి మించి ఉండకూడదు. డీజిల్‌తో నడిచే భారీ వాహనాలకు 4.5 శాతం లోపు ఉండాలి. నాలుగు చక్రాల డీజిల్ వాహనాలకు పురాతన వాహనాలకైతే 0.5 నుంచి 3.0 శాతంలోపే కార్బన్ మోనాక్సైడ్ శాతం ఉండాలి. ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్న వాహనాల్లో ఎక్కడా వీటి స్థాయిలను పరిశీలించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మోతాదుకు మించితే కేసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం.. వాహనాల నుంచి కాలుష్యం అధిక మోతాదులో వెదజల్లితే కేసులు నమోదు చేస్తాం. వాహనాలకు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి. లేనట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. –గణేష్, ఆర్టీఏ అధికారి -
మురుగు.. ముప్పు
వీపనగండ్ల : మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. వీధుల్లోని రోడ్లపైనే మురుగు ప్రవహిస్తోంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం.. పందులు, దోమలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముక్కు మూసుకోవాల్సిందే.. గ్రామాల్లోని అంతర్గత రోడ్లపై నడవాలంటే ముక్కు మూసుకెళ్లాల్సిందే. రోడ్లపైనే మురుగు, వ్యర్థపదార్థాలు పడేస్తుండటంతో పందులు సంచరిస్తున్నాయి. పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు .. పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా చేసుకున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా మండలంలో పారిశుద్ధ్యం, అంతర్గత , ఆపరేటర్ల నిర్వాహణ పేరుతో అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేశారు. సంపట్రావుపల్లిలో పారిశుద్ధ్యం, ఆపరేటర్ పేరుతో రూ.లక్షా 10వేలు డ్రా చేసినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. సంగినేనిపల్లిలో పారిశుధ్యం నిర్వాహణ కోసం రూ.60 వేలు, ఆపరేటర్ వేతనం కోసం రూ.8824 , తూంకుంటలో రూ.75 వేలు, గోవర్దనగిరిలో రూ.35 వేలు, కల్వరాళ్లలో రూ.40వేలు ఖర్చు చే సినట్లు అధికారులు లెక్కలు వేసి ఆయా గ్రామ పంచాయతీల నిధుల నుంచి డ బ్బులు డ్రా చేశారు. కానీ చాలా గ్రామా ల్లో పారిశుధ్య పనులు చేపట్టిన దాఖ లాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. విచారణ జరపాలి గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టకపోయినా అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రా చేసిన నిధులపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించాలి. గ్రామాల్లో ఉన్న మురికి గుంతలను పూడ్చి వృథా నీరు ఊర చివరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి ఆందోళనకు శ్రీకారం చుడుతాం. – శేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు దృష్టి సారిస్తాం గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యంపై దృష్టిసారిస్తాం. ప్రజా ప్రతినిధులు డ్రా చేసిన నిధులపై విచారణ జరుపుతాం. గ్రామాల్లో పర్యటించి శాశ్వత పారిశుద్ధ్య నిర్వాహణ పనుల కోసం నిధుల మంజూరుకు జిల్లా అధికారులకు నివేదికలు పంపుతాం. – బద్రినాథ్, ఇన్చార్జ్ ఈఓఆర్డీ -
పందులు బాబోయ్..
ఆత్మకూర్ : ఒక పక్క స్వైన్‌ప్లూ వణికిస్తుందని.. దీనికి తోడు డెంగీలాంటి విషజ్వరాల బారిన పడి ఇది వరకే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనాభాకు తగ్గ పందుల స్వైరవిహారం ఉన్నా నివారించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమవుతున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో జనాభాకు సరిపడా పందుల స్వైరవిహారం ఉందని ఏ వీధిలో చూసినా, ఏ ఇంటి ముందు చూసినా, ఆలయాలు, మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు ఇలా ఎక్కడపడితే అక్కడ పందులే దర్శనం ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి క్యారీబ్యాగ్‌లలో చేతపట్టుకొని వెళ్తుంటే అమాంతం లాగేసుకుపోతున్నాయని వాపోతున్నారు. దుకాణా సముదాయాల్లో చొరబడుతూ నానా బీభత్సం చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే పందుల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇతను నిజంగానే ఫిబ్రవరి 30న పుట్టాడంట!
ఛండీగఢ్ : అధికారుల నిర్లక్ష్యం ఓ పంజాబీ యువకుడిని కష్టాలపాలు చేస్తోంది. విద్యాపరంగానే కాదు.. వృత్తిపరంగానూ ఎదగకుండా ఆటంకాలు కలగజేస్తోంది. పొరపాటున అతని జన్మదిన తేదీని తప్పువేయటమే అందుకు కారణం. లూథియానాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 20, 1995లో జన్మించాడు. 2012లో అతను చదువులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తర్వాత పంజాబ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎలాగోలా పదో తరగది పూర్తి చేసిన ఆ యువకుడు.. ఇప్పుడు 12వ తరగతి పరీక్షల కోసం సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలో అతను బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు మాత్రం జనన ధృవీకరణ పత్రంలో ఫిబ్రవరి 30 అని తేదీని చేర్చారు. పైగా అది మ్యానువల్‌గా రాయటం కొసమెరుపు. అది గమనించకుండా సివిల్ సర్జన్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు దానిపై సంతకం చేశారు. ఇక దాని సవరణ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన హర్‌ప్రీత్ చివరకు.. చదువుకు పుల్‌స్టాప్ పెట్టి కెనడా వెళ్లి పనులు చేసుకుంటూ బతుకుదామని నిర్ణయించుకున్నాడు. పాస్‌పోర్టు కోసం కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అవసరం కావటంతో అతని కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఏడాది నుంచి ఎందరిని కలిసి విజ్ఞప్తులు చేస్తున్నా.. ఎవరూ అతన్ని పట్టించుకోవటం లేదంట. దీంతో మీడియా దృష్టికి తన సమస్యను చెప్పుకొని హర్‌ప్రీత్ వాపోయాడు. -
అధికారుల నిర్లక్ష్యం.. అవస్థలే సమస్తం
చామలపల్లి (చండూరు) : సాక్షాత్తూ సీఎం చెప్పినా ఆ మాటలు మాకు కాదనుకున్నారేమో గానీ ఆ అధికారులు పట్టించుకోలేదు. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడి ముచ్చటగా మూడు వారాలు కావొస్తోంది. దసరా ముందు రోజే పంపాల్సిన రికార్డులను నేటికీ పంపలేదు. ఫలితంగా పాలనలో స్తబ్దత నెలకొంది. నాంపల్లి, చండూరు మండల శాఖాధికారుల నిర్లక్ష్యం మూలంగా మూడు రెవెన్యూ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లాల, మండలాల విభజనలో అధికారులు ఏమరపాటుగా ఉండడంతో ఆ గ్రామం ఏ మండలం కిందుందో తెలియక ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. దీంతో చామలపల్లి గ్రామస్తులు ప్రభుత్వ పాలనను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిమిత్తం ఏ మండలానికి వెళ్ళాలో తెలియక తికమక పడుతున్నారు. ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం దసరా సందర్భంగా జిల్లాల, మండలాల విభజనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నాంపల్లి మండలం పరిధిలోని చామలపల్లి గ్రామాన్ని చండూరు మండలంలో విలీనం చేసింది. ఇదంతా ఒక ఎత్తై ఆనాటి నుంచి ఏదైనా పని కోసం నాంపల్లి మండల శాఖ అధికారుల దగ్గరకు వెళ్తే తమకేం సంబంధం లేదని సమాధానమిస్తున్నారు. మరోవైపు చండూరుకు వెళ్తే రికార్డులు ఇంకా అందలేదనే సాకులు చెప్తుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. మా గ్రామానికి ఏ మండలం అధికారులు సేవలు అందిస్తారో చెప్పండని ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. నిత్యం వివిధ పనుల నిమిత్తం విద్యార్థులు, రైతులు రెండు మండలాల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. అసలేం జరుగుతుందటే.. దసరా రోజు నాంపల్లి మండలం నుంచి చామలపల్లి గ్రామాన్ని చండూరులో కలుపుతున్నట్లు అధికారులకు ప్రభుత్వం నుంచిఉత్తర్వులు అందాయి. 13 రోజు లుగా ఆ గ్రామానికి చెందిన రికార్డులను చండూరు మండల శాఖాధికారులకు పంపించడంలో నాంపల్లి మండల శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ నాంపల్లి మండల అధికారులు అంటూ కాలయాపన చేస్తుండడంతో ఈ సమస్య ఉత్పన్న మైంది. అధికారుల తప్పిదంతోనే ఇలా.. ఇదిలావుంటే దీనికితోడు మరో సమస్య ఉత్పన్నమవుతుంది. అదెంటంటే చామలపల్లి గ్రామ పంచాయతీని చండూరు మండలం లో విలీనం చేస్తున్నట్లు నాంపల్లి మండల శాఖాధికారులు గతం లో ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ పం చాయతీకి బదులుగా మూడు రెవిన్యూ గ్రామాలని నివేదిక అందిస్తే ఆ గ్రామ పంచాయతీకి ఆవాస గ్రామాలైన కుందేలు తిరుమలగిరి, గానుగుపల్లి సైతం మండలం చేరేవి. ఇలా కాకుండా ఒక్క చామలపల్లి గ్రామపంచాయతీ పేరుతో నివేదిక పంపడంతో మిగతా రెండు ఆవాస గ్రామాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. అధికారులు చేసిన పొరపాటు ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు నానాఅవస్థలు ఎదుర్కొంటున్నారు. రెండు ఆవాస గ్రామాలు చామలపల్లికి లేకపోతే జనాభా పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గానుగుపల్లి దాటే చామలపల్లికి పోవల్సిఉంది. ఇదంతా చూస్తుంటే చిన్న తప్పిదం కాస్త పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. -
ప్లాటు పాట్లు
విజయనగరం మున్సిపాలిటీ: అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని సొంతిల్లు నిర్మించుకుకోవాలనే తపనతో రియల్ ఎస్టేట్లలో స్థలా లు(ప్లాటు) కొనుగోలు చేస్తున్న పేద, మద్య తరగతి ప్రజలు ఇప్పుడు పాట్లు పడుతున్నారు. ఏవి అధికారిక లే అవుట్లో..ఏవి అనధికారకంగా వెలిసిన లే అవుట్లో తెలియక కొనుగోలు చేసిన వారి పరిస్థితి ప్రస్తుతం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మా రింది. అనధికారికంగా వెలసిన లేవుట్లను నివారించి..సదరు యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయంలో చేతులెత్తేసి... ఆ లేవుట్లలో కొనుగోలు చేసిన భూముల్లో (ప్లాట్లలో) నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమంటూ తెగేసి చెబుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా పంచాయతీ శాఖ అధికారిక లెక్కల ప్రకారం అధికారికంగా వేసిన లే అవుట్లు 2463.76 ఎకరాల్లో 263 ఉండగా..అనధికారికంగా వేసిన లేవుట్లు 1955.06 ఎకరాల్లో విస్తీర్ణంలో 276 వరకు ఉన్నాయి. గత ఏడాది విజెలెన్స్ అధికారులు కేవలం డెంకాడ మండల పరిధిలో16 అక్రమ లే అవుట్లు గుర్తించి, వాటి ద్వారా రూ.12 కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నట్లు తేల్చారు. ఈ ఒక్క మండలంలోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడితే జిల్లా వ్యాప్తంగా మిగిలిన మండలాల్లో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. వాస్తవానికే పంట భూములను లే అవుట్లుగా మార్చాలంటే ముందుగా సదరు ధృవపత్రాలు రెవెన్యూ డివిజనల్ అధికారికి ల్యాండ్ కన్వర్జేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసం లే అవుట్ మొత్తం విలువలో 9 శాతం ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. అలా ఆర్డీఓ కార్యాలయం నుంచి అనుమతి తీసుకున్న తరువాత ఏ గ్రామ పంచాయతీలో లే అవుట్ వేస్తున్నారో సదరు పంచాయతీ అనుమతి పొందాలి. అనుమతి ఇచ్చే ముందు సదరు లే అవుట్లో ప్లాట్‌కు తగిన రహదారి, వీధి దీపాలు, నీటి సౌకర్యాలు ఉన్నాయా లేవా..అన్నది పరిశీలించిన అనంతరం ఆ లేవుట్‌లో 10 శాతం భూమిని పంచాయతీకి అప్పగించాలి. అయితే ఇవేవీ చేయకుండానే పలువురు యజమానులు లే అవుట్ వేయటంతో పాటు వాటిని విక్రయాలు జరిపి చేతులు దులుపుకు న్నారు. ప్రస్థుతం ఇటువంటి లే అవుట్లలో నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ శాఖ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలు అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్ చర్యలకు అవకాశం ఉన్నా ప్రయోజనం శూన్యంః ఇలా ప్రజలను మభ్యపెట్టి అనధికారిక లే అవుట్లలో భూములు విక్రయించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా ఈ వ్యాపారం జిల్లాలో సాగుతుండగా.. అప్పట్లో అధికారుల ఉదాసీన వైఖరితో అటువంటి లే అవుట్ల వైపు కన్నెత్తి చూసిన పాపన పోలేదు. అనంతర కాలంలో నిబంధనలకు విరుద్ధమైన లే అవుట్లో భూములు కొనుగోలు చేశామని కోనుగోలు దారులు గుర్తించి లోకాయుక్తను ఆశ్రయించగా.. సదరు కమిషనర్ అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే అనధికారిక లే అవుట్ల యజమానులకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు ప్రారంభించగా... వారి అడ్రస్‌లు సక్రమంగా లేక ఆ నోటీసులు అందకుండా పోయాయి. జిల్లాలో వందల సంఖ్యలోనే అక్రమ లేవుట్లు జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లే అవుట్లపై అటు ఉడా అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఏళ్ల తరబడి దృష్టి సారించిన దాఖలాలు లేవు.లేవుట్లు 1955.06 ఎకరాల్లో విస్తీర్ణంలో 276 వరకు ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే ఆసరాగా తీసుకుంటున్న అక్రమార్కులు కొద్ది పాటి భూమిని కొనుగోలు చేసి పక్కనే ఉన్న ప్రభుత్వ బంజరు భూములు, చెరువులు, గుంతలను కలుపుకుని లే అవుట్ వేసేస్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, నిబంధనల మేరకు లే అవుట్లో పది శాతం భూమిని అప్పగించకుండా, కన్వర్షన్ రుసుం చెల్లించకుండా లే అవుట్లు వెలుస్తున్నాయి. ఇవేవీ తెలియని ప్రజలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా డబ్బులు ఉన్నప్పుడే రెండు ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే మంచిదన్న ఆత్రుతతో వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అక్రమ లే అవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అనుమతులిచ్చేది లేదు అనధికారిక లే అవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేది లేదు. అది నిబంధనలకు విరుద్ధం. అనధికారిక లే అవుట్లు వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుందామంటే వారెక్కడున్నారో తెలియని పరిస్థితి. గుర్తిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. -ఎస్.సత్యనారాయణరాజు, జిల్లా పంచాయతీ అధికారి. విజయనగరం. -
అధికారుల నిర్లక్ష్యం.. అభివృద్ధికి విఘాతం
శ్రీకాకుళం పాతబస్టాండ్: పాలకుల అలక్ష్యం... అధికారుల నిర్లక్ష్యం వెరసి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. శాసన సభ, శాసన మండలి సభ్యుల నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అభివృద్ధి నిధుల విషయంలో రెండేళ్లుగా మొండిచేయి చూపించడమే ఇందుకు కారణం. గత ఏడాది (2014-15)కి ఎన్నికలు జరిగా యి. ప్రస్తుతం రాష్ర్టం లోటు బడ్జెట్లో ఉందన్న సాకుతో ఈ నిధులు విడుదలను రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇక ఈ ఏడాది (2015-16)కి ఈ సీడీపీ నిధులు మంజూరు చేయలేమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగానే చేతులెత్తేశారు. దీంతో ఈ రెండేళ్లలో జిల్లాలో జరగాల్సిన సుమారుగా రూ.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. శాసన సభ్యులు కూడా కార్యకర్తల వద్ద పలు అభివృద్ధి పనుల విషయంలో మాట చెల్లక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రత్యేక అభివృద్ధి పనులకు వచ్చిన సుమారు రూ.30 కోట్లను ప్రస్తుత పాలకులు సకాలంలో ఖర్చచేయలేక పోయారు. దీంతో నిధులు మురిగిపోయి వెనక్కిమళ్లాయి. వెరసి జిల్లా అభివృద్ధి విషయంలో టీడీపీ పాలన విఫలమైందని తెలుస్తోంది. కొత్త పనులు రెండేళ్లుగా ఒక్కటీ ప్రారంభంకాలేదు. రావాల్సిన నిధులు ఇవీ... 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ.. మూడు జిల్లాలకు అనుబంధంగా మరో ఇద్దరు నోడల్ ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరికి గత ఏడాది రూ.11 కోట్లకు పైగా అభివృద్ధి నిధులు మంజూరు కావాల్సి ఉన్నా విడుదల కా లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13 కోట్లు మంజూరు కావాల్సి ఉన్నా, ఇవి కూడా విడుదల కాలేదు. దీంతో రెండేళ్ల అభివృద్ధి నిలిచిపోయినట్లే. మురిగిపోయిన నిధులు ఇక ప్రత్యేక అభివృద్ధి ఫండ్ పేరిట 2013-14లో జిల్లాకు గత ప్రభుత్వం రూ.61 కోట్లు కేటాయించింది. ఈ నిధులు 2015 మార్చిలోగా పూర్తిగా ఖర్చు చేయాల్సింది. అయితే ఈ నిధులు విడుదల చేసిన వెంటనే ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వం ఈ నిధులు ఖర్చుచేయలేక పోయింది. తరవాత వచ్చిన టీడీపీ పాలకుల్లో సమన్వయం లేకపోవవడం, నిధులు వివిధ పనులకు కేటాయించడంలో శాసన సభ్యులకు అవగాహన లేకపోవడం, తదితర వైఫల్యాల వల్ల సుమారుగా రూ.30కోట్ల నిధులు వెనుతిరిగాయి. ఇలా టీడీపీ పాలనలో జిల్లా అభివృద్ధి క్రమంగా కుంటుపడుతున్నట్లు తెలుస్తోంది. -
ట్రాన్స్‘ఫార్మర్’ ఇబ్బందులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. వర్ధన్నపేటలోని 133/11 కేవీ సబ్‌స్టేషన్‌లోని 50 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ మూడు వారాల కిత్రం కాలిపోరుుంది. ఫలితంగా ఆయూగ్రామాలకు కరెంట్ కోతలు తప్పడంలేదు. ఓ వైపు వర్షాభావం.. మరోవైపు విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. - కాలిపోయిన పవర్ ట్రాన్స్ఫార్మర్ - ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం - 100కుపైగా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం - కాలుతున్న మోటార్లు వర్ధన్నపేట 133/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి మైలారం, నందనం, కొండూరు, కూనూరు ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది. మైలారం ఫీడర్లో మైలారం, ల్యాబర్తి, అన్నారం, నందనం ఫీడర్లో నందనం, పంథిని ఐనవోలు, ఇల్లంద, వడ్లకొండ.. కొండూరు ఫీడర్లో కొండూరు, రాయపర్తి, కాట్రపల్లి.. కూనూర్ ఫీడర్లో కూనూర్, దమ్మన్నపేట, జఫర్గడ్, వెంకటాపూర్ సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 100పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా కానుంది. ఓవర్‌లోడ్‌తో ఇబ్బంది.. వర్ధన్నపేట సబ్‌స్టేషన్‌లో 2001లో 50 ఎంవీఏ, 31.5 ఎంవీఏ సామర్థ్యంతో రెండు పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్) ఏర్పాటు చేశారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్‌ను కంట్రోల్ చేస్తూ గ్రామాల్లోని సబ్స్టేషన్లకు సరఫరా చేసేవారు. సాంకేతిక కారణాలతో గత నెల 21న అర్ధరాత్రి రూ. కోటి విలువైన 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అప్పటి నుంచి అధికారులు మరమ్మతుకు చర్యలు తీసుకోలేదు. అందుబాటులో ఉన్న పీటీఆర్ 31.5 ఎంవీఏ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా పవర్‌డ్రాప్ (అంతరాయం) అవుతున్నా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. వ్యవసాయానికి అంతంత మాత్రమే.. కొన్ని మండలాల్లో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నా.. వర్ధన్నపేట పరిధిలో కనీసం 5-6 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. ఓవర్‌లోడ్‌తో సబ్స్టేషన్లలోని ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కి విద్యుత్ నిలిచిపోతుంది. గ్రామాల్లో 12 గంటల పాటు ఎల్ఆర్ పేరుతో విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. వ్యవసాయానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను రైతులు నష్టపోతున్నారు. కొన్ని గ్రామాల్లో తరచూ విద్యుత్ మోటార్లు కాలిపోతున్నారుు. నివేదిక పంపించాం..: సత్యనారాయణ, ట్రాన్సకో ఏఈ సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి 50 ఎంవీఏ పీటీఆర్‌ను తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. రైతులు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం. -
పసికందుల ఉసురు తీసిన 'బంగారు తల్లి'
విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం చలిసింగిలో విషాదం చోటు చేసుకుంది. బంగారు తల్లి పథకంలో తమ ఇద్దరు పసికందుల పేర్లు నమోదు చేసేందుకు ఆ తల్లితండ్రులు స్వగ్రామమైన చలిసింగ్ గ్రామం నుంచి రావికతమం తరలి వెళ్లారు. అయితే వారిని అక్కడ అధికారులు పట్టించుకోలేదు. దాంతో రాత్రి వరకు అక్కడే పడిగాపులు కాసి రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే చలి తీవ్రత అధికంగా ఉంది. దాంతో చలికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి చెందారు.