బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మీడియా ముందు భంగపాటు ఎదురైంది. బుధవారం ఓ నీటి ప్రాజెక్టు పనుల ప్రారంభం కోసం వెళ్లిన ఆయనకు అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఆగ్రహం తెప్పించింది. అయితే అక్కడ సంయమనం పాటించి మౌనంగా ఆయన.. తర్వాత చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
బుధవారం పెరియాపట్నలో ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియా ముందు.. మోటర్ స్విచ్ ఆన్ చేయగా అది పని చేయలేదు. దీంతో ఆయన పక్క ముఖాలు చూశారు. అయినా పక్కనున్నవాళ్లు అదేం పట్టించుకోకుండా చప్పట్లు కొట్టారు. అయితే.. అది పని చేయడం లేదని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు ఎంత ప్రయత్నించినా.. అది ఆన్ కాలేదు. చివరకు బటన్ ఫెయిల్ అయ్యిందని.. సాంకేతిక సమస్య తలెత్తిందని.. అందుకే అది పని చేయలేదని గుర్తించారు.
అయితే ఆ కార్యక్రమం తర్వాత ఆయన సంబంధిత అధికారుల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఈ ఉదయం చాముండేశ్వరీ ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్(సీఈఎస్‌సీ) ఎండీ సీఎన్‌శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తూ పీఎస్(ప్రిన్సిపల్ సెక్రెటరీ) ఉమాదేవి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. సౌకర్యాల రూపకల్పనలో విఫలం కావడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Embarrassment For #Siddaramaiah
— Mirror Now (@MirrorNow) January 25, 2024
Motor fails during project launch, #Karnataka CM seen pressing button repeatedly #Mysuru electricity board MD suspended After Humiliation for negligence@aayeshavarma | @KeypadGuerilla reports pic.twitter.com/vvecs6cWH7
Video Credits: Mirror Now
Comments
Please login to add a commentAdd a comment