విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం చలిసింగిలో విషాదం చోటు చేసుకుంది. బంగారు తల్లి పథకంలో తమ ఇద్దరు పసికందుల పేర్లు నమోదు చేసేందుకు ఆ తల్లితండ్రులు స్వగ్రామమైన చలిసింగ్ గ్రామం నుంచి రావికతమం తరలి వెళ్లారు.
అయితే వారిని అక్కడ అధికారులు పట్టించుకోలేదు. దాంతో రాత్రి వరకు అక్కడే పడిగాపులు కాసి రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే చలి తీవ్రత అధికంగా ఉంది. దాంతో చలికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి చెందారు.