bangaru thalli
-
బంగారుతల్లికి భరోసా ఏదీ..?
ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలో బంగారుతల్లికి భరోసా దక్కడం లేదు. ఈ పథకంలో అర్హులందరికి లబ్ధి చేకూరడం లేదు. జనాభాలో బాలికల నిష్పత్తిని పెంచడం, విద్య ద్వారా బాలికా సాధికారత సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఏడాది మే ఒకటి నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలులోకి వచ్చింది. అయితే దరఖాస్తు ప్రక్రియపై సరైన అవగాహన కల్పించకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకు, గ్రామైక్య సంఘం ఖాతాలు, ఆధార్‌కార్డులు లేవంటూ దరఖాస్తులను ఆమోదించడం లేదు. మరోవైపు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో గ్రామ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఇక అన్ని అర్హతలు ఉన్నా పలువురు లబ్ధిదారులకు డబ్బు మంజూరు కాక కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బంగారుతల్లి పథకంలో రూరల్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులను డీఆర్డీఏ పరిధిలో, మున్సిపల్ ప్రాంతాల వారిని మెప్మా పరిధిలో ఎంపిక చేస్తారు. 2013 మే ఒకటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి డీఆర్డీఏ పరిధిలో 4,276 మంది, మెప్మా పరిధిలో 974 మంది.. మొత్తం 5250 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు డీఆర్డీఏ పరిధిలో 3,191 మంది, మెప్మా పరిధిలో 314 మంది చిన్నారులకు మాత్రమే లబ్ధి చేకూరింది. మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలు, తెల్లరేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు లేవంటూ అధికారులు కిరికిరి పెడుతున్నారు. శాఖల మధ్య కొరవడిన సమన్వయం... బంగారు తల్లి పథకం అమలులో డీఆర్డీఏ, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ అధికారుల పాత్ర కీలకం. బిడ్డ పుట్టిన వెంటనే ఆ ప్రాంతంలోని ఆరోగ్యశాఖకు చెందిన ఆశా కార్యకర్తలు, ఐసీడీఎస్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు తెలుస్తుంది. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తేదీ, కుటుంబ ఆదాయం తదితర వివరాలతో గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని గ్రామీణ ప్రాంతాల వారు మహిళా సమాఖ్యల ద్వారా ఐకేపీ(డీఆర్డీఏ) అధికారులకు, పట్టణ ప్రాంతాల వారు పట్టణాభివృద్ధి పథకం(మెప్మా) అధికారులకు అందజేయాలి. అయితే ఒక శాఖకు, మరో శాఖకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలకు తెలిసిన విషయం అంగన్వాడీ వారి దృష్టికి తీసుకరాకపోవడం, ఇద్దరికీ తెలిసినా గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో అలసత్వం వహించడం పరిపాటిగా మారింది. ఇక ఆ తర్వాత ఆన్లైన్ చేయాల్సిన అధికారులు.. ఆధార్ కార్డులు, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం అయినట్లు సర్టిఫికెట్లు లేవంటూ దరఖాస్తులను మూలన పడేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో ఇంకా సగం మంది ఆధార్ కార్డులు దిగలేదు. దిగిన వారిలోనూ ఎక్కువ మందికి కార్డులు అందలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆధార్‌కార్డులు ఎలా తేవాలో బోధపడక పలువురు లబ్ధిదారులు దరఖాస్తు చేయడమే మానేస్తున్నారు. అలాగే పాప తల్లికి రేషన్‌కార్డు ఉండాలనే నిబంధనలతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా పెళ్లయిన వారి పేర్లు అత్తవారింట్లో ఉన్న కార్డుల్లో నమోదు కాకపోవడంతో.. తెల్లరేషన్ కార్డు లేదనే నెపంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని పలువురు మహిళలు వాపోతున్నారు. బర్త్ సర్టిఫికెట్ కోసం పుట్టెడు కష్టాలు... బిడ్డ పుట్టినా.. ఆ సర్టిఫికెట్ కోసం పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తోంది. ఆస్పత్రిలో ప్రసూతి అయిన వారికి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ సరిపోతుందని నిబంధనలు చెపుతున్నా.. పలువురు అధికారులు ఆ సర్టిఫికెట్లను అనుమతించడం లేదు. ఇక ఇంటి వద్ద ప్రసవం అయిన వారు సర్టిఫికెట్ తీసుకోవాలంటే గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామంలో ఉండే ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ మొదలైన వారి చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా ఇన్ని ఇబ్బందులు పడినా.. సర్టిఫికెట్ రాకపోవడంతో పలువురు తల్లులు దరఖాస్తు చేసేందుకు ముందుకు రావడం లేదు. -
బంగారు తల్లి పధకం వల్ల ప్రాణాలు కోల్పోయిన పసికందులు
-
పసికందుల ఉసురు తీసిన 'బంగారు తల్లి'
విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం చలిసింగిలో విషాదం చోటు చేసుకుంది. బంగారు తల్లి పథకంలో తమ ఇద్దరు పసికందుల పేర్లు నమోదు చేసేందుకు ఆ తల్లితండ్రులు స్వగ్రామమైన చలిసింగ్ గ్రామం నుంచి రావికతమం తరలి వెళ్లారు. అయితే వారిని అక్కడ అధికారులు పట్టించుకోలేదు. దాంతో రాత్రి వరకు అక్కడే పడిగాపులు కాసి రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే చలి తీవ్రత అధికంగా ఉంది. దాంతో చలికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి చెందారు. -
సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాలను సోమవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందాలంటే క్షేత్రస్థాయిలో ప్రచారం అవసరమన్నారు. జలయజ్ఞం, సబ్‌ప్లాన్, బంగారుత ల్లి, వడ్డీలేని రుణాలు, గృహాలు, పింఛన్లు తదితర పథకాలపై జిల్లా వ్యా ప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకతపై కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని డీపీఆర్వో గోవిందరాజులుకు సూచించారు. మొదటి విడతగా జిల్లాకు వచ్చిన 5 వాహనాల ద్వారా చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో జనవరి 12 వరకూ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్వతీపురం డివిజనల్ పీఆర్ఓ డి.రమేష్, ఏపీఆర్ఓ ఎస్.జానకమ్మ తదితరులు ఉన్నారు. -
పురిట్లోనే సంధి..?
పిఠాపురం, న్యూస్‌లైన్ : అతివలు ఆకాశ వీధుల్లో విజయపతాకం ఎగరేస్తున్న ఈ కాలంలోనూ ఆడపిల్లను ‘మహాలక్ష్మి’లా కాక.. మనశ్శాంతిని దూరం చేసే గుండెల మీద కుపటిలా భావించే వారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బంగారు తల్లి’ పథకం పేదవర్గాల్లో ఈ భావనను దూరం చేసేందుకు దోహదపడుతుందన్న ఆశ పేరాశ అవుతుందనిపిస్తోంది. పుట్టిన నాటి నుంచి పట్టభద్రురాలయ్యే వరకూ ఏటా ఆర్థికసాయం అందించడంతో పాటు చదువయ్యాక ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు మరికొంత మొత్తం ఇచ్చేలా రూపొందించిన ఈ పథకం అమలు ‘ఆదిలోనే హంసపాదు’లా తయారైంది. తొలి విడతగా ఇవ్వాల్సిన బిడ్డ సంరక్షణ ఖర్చులే ఇంకా లబ్ధిదారుల ఖాతాలకు జమ కాలేదు. బాలికా సంరక్షణ పేరుతో ముఖ్యమం త్రి ప్రకటించిన ‘బంగారు తల్లి’ అమలు.. చేసిన ప్రచార ఆర్భాటానికి అనువుగా లేనేలేదు. ఆడపిల్ల పుడితే వారింట బంగారమే అని ప్రచారం చేసిన అధికారులు ఆచరణలో అందుకు తగ్గ శ్రద్ధను చూపడం లేదు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న దంపతులకు పుట్టే ఆడపిల్లలకు ఈ పథకం ఈ ఏడాది మే నెల నుంచి అమలులోకి వస్తుందని ప్రచారం జరిగినా గత నెల రోజుల నుంచి మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్నా, ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నా ఈ పథకానికి అర్హులే. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి 8,800 మంది దరఖాస్తు చేసుకోగా 3500 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం మొదటి విడత గా రూ.1.10 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల నుంచి 950 మంది దరఖాస్తు చేసుకోగా 256 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వీరందరికీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో గత నెల రోజుల నుంచీ ధృవీకరణ పత్రాలు (బాండ్లు) పంపిణీ చేయిస్తున్నారు. ఎదిగే కొద్దీ.. కొద్దికొద్దిగా... ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి బిడ్డ సంరక్షణ ఖర్చుల కోసం రూ.2500, ఆ తరువాత టీకాల కోసం రూ.వెయ్యి, అంగన్వాడీ చదువులకు ఏటా రూ.1500, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏటా రూ.2 వేలు, ఆరు నుంచి ఎనిమి దో తరగతి వరకు ఏటా రూ.2500, తొమ్మిది నుంచి పదో తరగతి వరకు ఏటా రూ.3 వేలు, ఇంటర్మీడియట్లో ఏటా రూ.3,500, డిగ్రీలో ఏటా రూ.4 వేల చొప్పున దశల వారీగా అం దించేలా ఈ పథకాన్ని రూపొందించారు. బాలి కకు 18 ఏళ్లు నిండాక ఇంటర్మీడియట్‌తో చ దువు ఆపివేస్తే రూ.50 వేలు, డిగ్రీతర్వాత రూ. లక్ష ఇస్తారు. ఈ మొత్తం వారి స్వయం ఉ పాధికి దోహదపడుతుందన్నది ప్రభుత్వ లక్ష్యం. మూణ్నాళ్ల ముచ్చటేనా..? ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారుల పిల్లల సం రక్షణ నిమిత్తం తొలి విడతగా రూ.2500 చొప్పు న బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. అయితే కాగితాలపై ఘనంగా, ప్రకటనల్లో ఆకర్షణీయంగా ఉన్న పథకం అమలు అందుకు త గ్గట్టు ఎంత మాత్రం లేదు. బాండ్లు పంపిణీ చే సి నెలవుతున్నా ఏ ఒక్కరి ఖాతాలోనూ ఆ మొ త్తం జమ కాలేదు. పథకం ప్రచారాన్ని చూసి మురిసిన ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆ మురి పెం మూణ్నాళ్ల ముచ్చటేనా అన్న శంక కలుగుతోంది. దశలవారీ సాయంలో ‘బోణీ’యే కాకపోవడంపై వారు పెదవి విరుస్తున్నారు. మరోవైపు పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేయడం లేదని, లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నాయకుల సిఫార్సులనే పరిగణనలోకి తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘బంగారు తల్లి’కి ఆదరణ
కల్వకుర్తి, న్యూస్‌లైన్: ఆడపిల్లల సంరక్షణార్థం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం ఫలాలు పొందడంలో రాష్ట్రంలోనే పాలమూరు ప్రథమస్థానంలో నిలిచింది. జిల్లావాసులు ఎక్కువమంది ఈ పథకం ద్వారా ప్రయెజనాలను పొందారు. బంగారు తల్లి కింద లబ్ధిపొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,15,741 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91,666 మంది అర్హత సాధించగా చిన్నారుల ఖాతాల్లో రూ 15.86 కోట్లు జమఅయ్యాయి. మన జిల్లాలోని 64 మండలాల్లో 10,047 మంది చిన్నారుల కోసం దరఖాస్తులు రాగా రూ. 1.39లక్షలు మంజూరయ్యాయి. జిల్లాలో అత్యధికంగా బంగారుతల్లి ఫలాల కోసం 282 దరఖాస్తు చేసుకోగా, 268 మంది అర్హత సాధించడంలో బిజినేపల్లి మం డలం అగ్రస్థానంలో నిలిచింది. అయితే జిల్లాలోనే అత్యధికంగా నవాబ్‌పేట మం డలానికి చెందిన 169 మంది చిన్నారుల కోసం రూ.4,22,500 మంజూరైంది.కల్వకుర్తి నియోజకవర్గం ఐదు మండలాలకు చెందిన 786 మంది దరఖాస్తు చేసుకోగా రూ.13,80,000 ఆయా బ్యాంకు ఖాతాల్లో జమఅయ్యాయి. కల్వకుర్తి మండలంలో ఇప్పటికే 16 మంది చిన్నారుల ఖాతాల్లో డబ్బులు జమఅయ్యా యి. 109 మంది ఇప్పటికే డబ్బులు తీసుకున్నారు. మండలానికి మొత్తం రూ. 2,72,500 మంజూరైంది. ఆమనగల్లు మండలంలో 109 మంది ఇప్పటికే డబ్బు లు తీసుకున్నారు. మండ లానికి మొత్తం రూ.2,72,500 మంజూరైంది. మాడ్గుల మండలంలో 153 మంది డబ్బు తీసుకున్నారు. ఈ మండలానికి నియోజకవర్గం లో నే అత్యధికంగా రూ.3,82,500 మం జూరైంది. వెల్దండ మండలంలో 113 మంది ఇప్పటికే డ బ్బు తీసుకున్నారు. ఈ మండలానికి రూ. 2,82,500 మంజూరయ్యాయి. తలకొండపల్లి మండలానికి రూ.1.70 లక్షలు మంజూరయ్యా యి. 68 మంది ఇప్పటికే డబ్బు తీసుకున్నారు. పథకం అమలు తీరు ఇలా.. తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న కుటుంబంలో 2013 మే 1వ తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లలకు బంగారు పథకం వర్తిస్తుంది. ఒక కుంటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ముందుగా గ్రామంలో గర్భిణుల జాబితాను గ్రామసంఘం ఎఫ్-1 ఫార్మాట్లో తయారుచేసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యునిచే జాబితాను ధ్రువీకరించుకోవాలి. పేరు నమోదుకాగానే బ్యాంకుఖాతా తీసుకోవాలి. ఆడపిల్ల పుట్టగానే చిన్నారికి ‘బంగారు తల్లి’ అని పేరుపెట్టాలి. గ్రామ పంచాయతీ లేక మునిసిపాలిటీలో జనన ధ్రువీకరణపత్రం పొం దాలి. పాప జన్మించగానే ఎఫ్-2 ఫార్మాట్లో నమోదు చే యడానికి అవసరమైన జనన ధ్రువీకరణపత్రం, రేషన్, ఆధార్‌కార్డులు, తల్లీబిడ్డల ఫొటో, బ్యాంకు ఖాతా నెంబర్ సమర్పించారు. ఆ తరువాత అధికారి ధ్రువీకరణ పొంది రూ.2,500 మనం సూచిం చిన ఖాతాలో నేరుగా జమఅవుతాయి. చిన్నారికి ఏడేళ్లు నిండగానే ఆధార్ కార్డును పొంది ఆ నెంబర్‌ను డాటాబేస్‌లో పొందుపర్చాలి. అదే ఏడాది పాప పేరును తల్లి పేరుతో జతపర్చి జాయింట్ ఖాతాగా మార్చాల్సి ఉం టుంది. ఆ తరువాత ఆడపిల్ల పుట్టగానే రూ 2,500, మొదటి, రెండో ఏడాది వెయ్యి చొ ప్పు న, 3,4,5 ఏళ్లలో చిన్నారి అంగన్వాడీ కేం ద్రా ల్లో చేరిన తరువాత రూ 1500 చొప్పున, ఆరు నుంచి 10 ఏళ్లవరకు 5వ తరగతి పూర్తి చేసే నా టికి ఏడాదికి రెండువేల చొప్పున, 11 నుంచి 13 ఏళ్ల వరకు 6,7,8 తరగతులు పూర్తి చే సిన బాలికకు ఏడాదికి రూ 2500, దీంతో పాటు 9, 10వ తరగతులు పూర్తిచేసి, 14 నుంచి 15 బాలికకు ఏడాదికి మూడువేల చొప్పున, 16,17 ఏళ్లు నిండి ఇంటర్ పూర్తయ్యే వరకు రెండేళ్ల పాటు రూ 3,500 చొప్పున మంజూరవుతాయి. ఆ తరువాత 18 నుంచి 21 ఏళ్లు ఉండి డిగ్రీ పూర్తిచేస్తే ఏడాదికి నాలుగువేల చొప్పన 21 ఏళ్లు నిండగానే ఇంటర్ పూర్తయిన వారికి రూ 50 వేలు, డిగ్రీ పూర్తయిన వారికి లక్ష రూపాయలు అందుతుంది. ప్రచారం లోపం.. లబ్ధిదారులకు శాపం అయితే బంగారు తల్లి పథకం ద్వారా ఫలాలు పొందేందుకు అర్హులైనప్పటికీ పథకంపై ఇప్పటికీ గ్రామీణ ప్రాంతప్రజల్లో అవగాహన కల్పించేవారు కరువయ్యారు. దీంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కావాల్సిన అర్హతలు తెలియక తికమక పడుతున్నారు. బంగారుతల్లి పథకంపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
కొత్త కార్డులకు ఈ నెల బియ్యం లేనట్లే
రెంజల్, న్యూస్‌లైన్ : రచ్చబండ సాక్షిగా కలెక్టర్ చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వంతో పేదలకు ప్రయోజనం చేకూరడం లేదు. ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మూడోవిడత రచ్చబండతో ప్రజాధనం వృథా అయ్యిందే తప్ప వారికి ఒరిగిందేమి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రచ్చబండలో భాగంగా జిల్లాలో 80వేల రేషన్‌కార్డులు, 4,300మంది అర్హులకు బంగారుతల్లి గుర్తింపుకార్డులు, 40వేల మందికి పింఛన్లు, 11వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు, రూ.19 కోట్లు ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ బకాయి మాఫీ పత్రాలు అందించారు. వీరికి డిసెంబర్ నుంచి రూపాయి కిలో బియ్యంతో పాటు పింఛన్లు అందిస్తామని కలెక్టర్ ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అమలు ప్రశ్నార్థకం కావడంతో లబ్ధిదారులు హైరానా పడుతున్నారు. రేషన్ సరఫరాపై సమాధానం చెప్పలేక డీలర్లు, మండల స్థాయి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రచ్చబండ రోజునే పూర్తిస్థాయిలో మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేసినా గ్రామాల్లో నేటికీ పంపిణీ కొనసాగుతోంది. డిసెంబర్ నుంచి బియ్యం, పింఛన్లు అందించాలని చెప్పినా ఇంతవరకు డీలర్లు డీడీలు కట్టలేదు. జిల్లాలోని రేషన్ డీలర్లు ప్రతీనెల 15వరకు స్టాక్ వివరాలు మండల కార్యాలయాలకు అందిస్తారు. దాని ఆధారంగా డీలర్లకు 18వరకు అలాట్మెంట్ను ఇస్తారు. డీలర్లు 20వరకు సంబంధిత బ్యాంకుల్లో డీడీలు కట్టి ఎంఎల్ఎస్ పాయింట్లో సమర్పిస్తే 22 నుంచి డీలర్లకు రేషన్ సరుకుల సరఫరా ప్రారంభమవుతుంది. నెల మొదటి తేదీ నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడం మొదలుపెడతారు. అయితే గతనెల రచ్చబండలో కార్డులు పొందిన వారికి డీఎస్ఓ కార్యాలయం నుంచి అలాట్మెంట్ రాకపోవడంతో డీలర్లు డీడీలు కట్టలేదని తెలుస్తోంది. దీంతో వారికి డిసెంబర్ నెల బియ్యంతో పాటు పింఛన్లు అందే అవకాశం కనిపించడం లేదు. వచ్చే నెలలోనైనా అందించాలని వారు కోరుతున్నారు. -
పల్లెను వదిలేశారు
కామారెడ్డి, న్యూస్‌లైన్ : మొదటి విడత రచ్చబండ కార్యక్రమా న్ని గ్రామాల్లో నిర్వహించిన సర్కారు రెండో విడత కార్యక్రమాన్ని మండల కేంద్రాలకే పరిమి తం చేసింది. నిలదీతలను తప్పించుకోవడం కోసం మూడో విడతలో కేవలం లబ్ధిదారులనే రప్పించాలని పథకం రచించారు. లబ్ధిదారుల కు ఎంట్రీ పాస్‌లు ఇచ్చారు. అయితే కొత్తగా ప్రభుత్వ పథకాల కోసం వేలాదిగా ప్రజలు తరలిరావడంతో ప్రతి చోటా రచ్చబండ సభలు రసాభాసగా మారాయి. ‘బంగారుతల్లి’కి దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం మాచారెడ్డిలో నిర్వహించిన రచ్చబండకు ఓ తల్లి మూడు నెల ల పాపతో వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో తన కూతురును కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రభు త్వ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ఆ తల్లి కూతురిని కోల్పోయింది. రచ్చబండను నీరుగార్చడం వల్లే... ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన రచ్చబం డ లక్ష్యాన్ని దెబ్బతీయడం వల్లే ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. రచ్చబండలో దరఖాస్తు చేయడం కోసం వచ్చిన సందర్భంలో జరిగిన తోపులాట ఓ చిన్నారిని పొట్టనపెట్టుకున్న సంఘటన అందరినీ వేదనకు గురి చేసింది. రచ్చబండలో దరఖాస్తులు ఇచ్చేందుకు వందలాది మంది తరలి వస్తుండడం, దరఖాస్తులు సమర్పించడం కోసం గంటల తరబడి బారులు తీరాల్సి రావడంతో తోపులాట జరుగుతోంది. అదే గ్రామాల్లో సభలు నిర్వహిస్తే ఇంత మంది ఉండరు. తక్కువ మంది వస్తే సమస్యలు చెప్పుకోవడానికీ అవకాశం ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి రచ్చబండను గ్రామాల వారీగా నిర్వహించాలని కోరుతున్నారు. -
బంగారు తల్లికి బాలారిష్టాలు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది మే నెల నుంచి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇంతవరకూ ఈ పథకం పై తనకే అవగాహన లేదని ఇటీవల ఓ ఎంపీడీఓ స్వయంగా అన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని అమలు చేశారు. 2005 మే నెలలో బాలికా సంరక్షణపథకం పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీని స్థానంలో ఈ ఏడాది మే 1 నుంచి బంగారు తల్లి పథకాన్ని అమలు చేశారు. కొన్ని విమర్శల నేపథ్యంలో జూన్ 19వ తేదీన ఈ పథకంకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. దీంతో పథకం అమలులో జాప్యం జరిగింది తొలుత చాలా మందికి ఈ పథకంపై అవగాహన కొరవడటంతో పెద్దగా ఆసక్తి చూపలేదు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం కూడా దీనిపై పడింది. ప్రస్తుత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు బాండ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని సంబంధిత జిల్లా అధికారులు గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేశారు. అయితే దరఖాస్తు పత్రంలో గ్రామ సంఘం ప్రతినిధితోపాటు ఏఎన్ఎం, వైద్యాధికారులు సంతకాలు చేయాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పేదలు సైతం ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది పనితీరుపై వారు పెదవి విరుస్తున్నారు. ‘మీరు మా వద్ద టీకాలు వేయించుకోలేదని.. మీ సమాచారం మా వద్ద లేదని తాము సంతకాలు చేయలేమని’ చాలా చోట్ల ఏఎన్ఎంలు, డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదుచేయించుకున్నవారికి ఏఎన్ఎంలు క్రమం తప్పకుండా టీకాలు వేసి గర్భవతులపేర్లను నమోదు చేసుకుంటారు. ప్రైవేటు వైద్యుల వద్ద చూపించుకోవడంతో వారెవరో తమకు తెలియదని సంతకాలు చేయడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. మండల సమాఖ్య అధికారులకు శనివారం జిల్లా స్థాయిలో జరిగిన సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రైవేట్ వైద్యుల చేతనైనా సరే సంతకాలు చేయించాలని అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే దరఖాస్తులో రేషన్ కార్డు జిరాక్స్‌ను తప్పక జత చేయాల్సి ఉంది. చాలా మందికి పెళ్లి అయిన తర్వాత కొత్తగా రేషన్ కార్డు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రేషన్‌కార్డుకు దరఖాస్తుచేసినా మళ్లీ వచ్చే రచ్చబండలో కానీ ఇవ్వడం లేదు. 2011 నవంబర్‌లో రచ్చబండ జరగగా మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అలాగే బంగారుతల్లి పథకంకు సంబంధించిన సమాచారంపై అవగాహన లేక చాలా మంది అరకొరగా దరఖాస్తులను భర్తీ చేస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులు వీటిని తిప్పిపంపుతున్నారు. అన్ని వివరాలను పూర్తి చేస్తేనే మీకు అర్హత లభిస్తుందంటున్నారు. పథకం ఒక ఆడపిల్లకే వర్తిస్తుందా ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు పుట్టినా వర్తిస్తుందా, కవలలు పుడితే పరిస్థితి ఏమిటి వంటి విషయాలపై ఇంకా ప్రజల్లో పూర్తి అవగాహన లేదు. ఆపరేషన్ చేయించుకున్నవారికే పథకం వర్తిస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పుట్టిన ఆడపిల్ల చదువుకోకపోతే ఈ పథకం వర్తించదు. అంగన్వాడీ కేంద్రం మొదలు ఇంటర్మీడియట్ వరకు చదివి పాస్ అయితే రూ.55వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.లక్ష కలిపి మొత్తం రూ.1.55లక్షలు 21 ఏళ్లు వచ్చేనాటికి అందజేస్తారు. నగదు బదిలీ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 155321తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఏది ఏమైనా అధికారులు పూర్తి స్థాయిలో ఈ పథకంపై ప్రచారం చేయాల్సి ఉంది. -
బంగారుతల్లికి బాలరిష్టాలు
-
ఆడపిల్లల సంక్షేమానికే ‘బంగారు తల్లి’
వికారాబాద్, న్యూస్‌లైన్ : ఆడపిల్లల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధి నారాయణపూర్ గ్రామంలో సుమారు రూ.70లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల పోషణ తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక సహాయం అందజేస్తోందని చెప్పారు. సమాజంలో ఆడపిల్లలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే నారాయణపూర్ గ్రామంలో దాదాపు రూ.70లక్షల విలువ చేసే అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్రామంలో ఉర్దూ మీడియం పాఠశాలకు రూ.16 లక్షలు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15లక్షలు, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2లక్షలు, అలాగే నారాయణపూర్ - కట్టమైసమ్మ గుడి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.35లక్షలను బీఆర్జీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వం అందజేసే రుణాలతో పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని తమ కాళ్ల మీద నిలబడాలని మంత్రి సూచించారు. ప్రతి మండలానికి ఒక గ్యాస్ ఏజెన్సీ ఇప్పిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముందు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నారాయణపూర్ సర్పంచ్ నర్సింహులు, శివరెడ్డిపేట్ సొసైటీ చైర్మన్ కిషన్‌నాయక్, వికారాబాద్, ధారూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు, పౌర సంబంధాల అధికారి హర్షభార్గవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వినయ్‌కుమార్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ ‘బంగారు తల్లి’
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ఉద్దేశించిన ‘బంగారుతల్లి పథకాన్ని’ అర్హులైన వారందరికీ వర్తింపజేసేం దుకు సమష్టిగా కృషి చెయ్యాలని జి ల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరం లో ‘బంగారు తల్లి పోస్టర్’ను విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఈ యేడాది మే నెల నుంచి జిల్లా వ్యాప్తంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం వర్తిస్తోందన్నారు. ఇందుకుగాను వైధ్యులు ధృవీకరించిన బర్త్ సర్టిఫికెట్‌తోపాటు, ఇతర ధృవపత్రాలతో దరఖాస్తులను అందజేయాలన్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో పథకం అమలు జరుగుతుందని, ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే పథకాన్ని వర్తింపజెయ్యాలన్నారు. వైద్య సిబ్బంది నుంచి గర్బిణీల స్త్రీల వివరాలు, పుట్టిన ప్రతి బిడ్డ సమాచారాన్ని సేకరించి డిఆర్డిఏకు అందజేయాలన్నారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు చదువుతోపాటు, వారికి ఉపాధి లభించేంత వరకు ప్రభుత్వసాయం అందుతుందన్నారు. పథకంపై గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అర్హులైన వారందరు వినియోగించుకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.చంద్రశేఖర్, డిపిఓ రవీందర్, డ్వామా పీడి వెంకటరమణ రెడ్డి, డిఆర్డిఏ పీడి చంద్రశేఖర్ రెడ్డి, ఐసిడిఎస్ పీడి ఇందిర, తదితరులు పాల్గొన్నారు.