సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి | Welfare programs should be aware :Collector | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి

Published Tue, Dec 17 2013 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM

Welfare programs should be aware :Collector

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాలను సోమవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందాలంటే క్షేత్రస్థాయిలో ప్రచారం అవసరమన్నారు. జలయజ్ఞం, సబ్‌ప్లాన్, బంగారుత ల్లి, వడ్డీలేని రుణాలు, గృహాలు, పింఛన్లు తదితర పథకాలపై జిల్లా వ్యా ప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకతపై కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని డీపీఆర్వో గోవిందరాజులుకు సూచించారు. మొదటి విడతగా జిల్లాకు వచ్చిన 5 వాహనాల ద్వారా చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో జనవరి 12 వరకూ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్వతీపురం డివిజనల్ పీఆర్‌ఓ డి.రమేష్, ఏపీఆర్‌ఓ ఎస్.జానకమ్మ తదితరులు ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement