కల్వకుర్తి, న్యూస్‌లైన్: ఆడపిల్లల సంరక్షణార్థం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం ఫలాలు పొందడంలో రాష్ట్రంలోనే పాలమూరు ప్రథమస్థానంలో నిలిచింది. జిల్లావాసులు ఎక్కువమంది ఈ పథకం ద్వారా ప్రయెజనాలను పొందారు. బంగారు తల్లి కింద లబ్ధిపొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,15,741 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91,666 మంది అర్హత సాధించగా చిన్నారుల ఖాతాల్లో రూ 15.86 కోట్లు జమఅయ్యాయి. మన జిల్లాలోని 64 మండలాల్లో 10,047 మంది చిన్నారుల కోసం దరఖాస్తులు రాగా రూ. 1.39లక్షలు మంజూరయ్యాయి. జిల్లాలో అత్యధికంగా బంగారుతల్లి ఫలాల కోసం 282 దరఖాస్తు చేసుకోగా, 268 మంది అర్హత సాధించడంలో బిజినేపల్లి మం డలం అగ్రస్థానంలో నిలిచింది.
అయితే జిల్లాలోనే అత్యధికంగా నవాబ్‌పేట మం డలానికి చెందిన 169 మంది చిన్నారుల కోసం రూ.4,22,500 మంజూరైంది.కల్వకుర్తి నియోజకవర్గం ఐదు మండలాలకు చెందిన 786 మంది దరఖాస్తు చేసుకోగా రూ.13,80,000 ఆయా బ్యాంకు ఖాతాల్లో జమఅయ్యాయి. కల్వకుర్తి మండలంలో ఇప్పటికే 16 మంది చిన్నారుల ఖాతాల్లో డబ్బులు జమఅయ్యా యి. 109 మంది ఇప్పటికే డబ్బులు తీసుకున్నారు. మండలానికి మొత్తం రూ. 2,72,500 మంజూరైంది. ఆమనగల్లు మండలంలో 109 మంది ఇప్పటికే డబ్బు లు తీసుకున్నారు. మండ లానికి మొత్తం రూ.2,72,500 మంజూరైంది. మాడ్గుల మండలంలో 153 మంది డబ్బు తీసుకున్నారు. ఈ మండలానికి నియోజకవర్గం లో నే అత్యధికంగా రూ.3,82,500 మం జూరైంది. వెల్దండ మండలంలో 113 మంది ఇప్పటికే డ బ్బు తీసుకున్నారు. ఈ మండలానికి రూ. 2,82,500 మంజూరయ్యాయి. తలకొండపల్లి మండలానికి రూ.1.70 లక్షలు మంజూరయ్యా యి. 68 మంది ఇప్పటికే డబ్బు తీసుకున్నారు.
పథకం అమలు తీరు ఇలా..
తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న కుటుంబంలో 2013 మే 1వ తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లలకు బంగారు పథకం వర్తిస్తుంది. ఒక కుంటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ముందుగా గ్రామంలో గర్భిణుల జాబితాను గ్రామసంఘం ఎఫ్-1 ఫార్మాట్‌లో తయారుచేసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యునిచే జాబితాను ధ్రువీకరించుకోవాలి. పేరు నమోదుకాగానే బ్యాంకుఖాతా తీసుకోవాలి. ఆడపిల్ల పుట్టగానే చిన్నారికి ‘బంగారు తల్లి’ అని పేరుపెట్టాలి. గ్రామ పంచాయతీ లేక మునిసిపాలిటీలో జనన ధ్రువీకరణపత్రం పొం దాలి. పాప జన్మించగానే ఎఫ్-2 ఫార్మాట్‌లో నమోదు చే యడానికి అవసరమైన జనన ధ్రువీకరణపత్రం, రేషన్, ఆధార్‌కార్డులు, తల్లీబిడ్డల ఫొటో, బ్యాంకు ఖాతా నెంబర్ సమర్పించారు.
ఆ తరువాత అధికారి ధ్రువీకరణ పొంది రూ.2,500 మనం సూచిం చిన ఖాతాలో నేరుగా జమఅవుతాయి. చిన్నారికి ఏడేళ్లు నిండగానే ఆధార్ కార్డును పొంది ఆ నెంబర్‌ను డాటాబేస్‌లో పొందుపర్చాలి. అదే ఏడాది పాప పేరును తల్లి పేరుతో జతపర్చి జాయింట్ ఖాతాగా మార్చాల్సి ఉం టుంది. ఆ తరువాత ఆడపిల్ల పుట్టగానే రూ 2,500, మొదటి, రెండో ఏడాది వెయ్యి చొ ప్పు న, 3,4,5 ఏళ్లలో చిన్నారి అంగన్‌వాడీ కేం ద్రా ల్లో చేరిన తరువాత రూ 1500 చొప్పున, ఆరు నుంచి 10 ఏళ్లవరకు 5వ తరగతి పూర్తి చేసే నా టికి ఏడాదికి రెండువేల చొప్పున, 11 నుంచి 13 ఏళ్ల వరకు 6,7,8 తరగతులు పూర్తి చే సిన బాలికకు ఏడాదికి రూ 2500, దీంతో పాటు 9, 10వ తరగతులు పూర్తిచేసి, 14 నుంచి 15 బాలికకు ఏడాదికి మూడువేల చొప్పున, 16,17 ఏళ్లు నిండి ఇంటర్ పూర్తయ్యే వరకు రెండేళ్ల పాటు రూ 3,500 చొప్పున మంజూరవుతాయి. ఆ తరువాత 18 నుంచి 21 ఏళ్లు ఉండి డిగ్రీ పూర్తిచేస్తే ఏడాదికి నాలుగువేల చొప్పన 21 ఏళ్లు నిండగానే ఇంటర్ పూర్తయిన వారికి రూ 50 వేలు, డిగ్రీ పూర్తయిన వారికి లక్ష రూపాయలు అందుతుంది.
ప్రచారం లోపం.. లబ్ధిదారులకు శాపం
అయితే బంగారు తల్లి పథకం ద్వారా ఫలాలు పొందేందుకు అర్హులైనప్పటికీ పథకంపై ఇప్పటికీ గ్రామీణ ప్రాంతప్రజల్లో అవగాహన కల్పించేవారు కరువయ్యారు. దీంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కావాల్సిన అర్హతలు తెలియక తికమక పడుతున్నారు. బంగారుతల్లి పథకంపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
‘బంగారు తల్లి’కి ఆదరణ
Published Sun, Dec 8 2013 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement