people problems
-
విన్నపాలు వినవలె..
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మొదటిసారిగా శుక్రవారం ప్రారంభమైన ప్రజాదర్బార్‌కు జన సందోహం వెల్లువెత్తింది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఫిర్యాదులు పట్టుకొని ప్రజలు ఉదయం 8 గంటల నుంచే ప్రజాభవన్‌కు తరలివచ్చారు. వేలాది మంది రావడంతో బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాస ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి ఉదయం దాదాపు 10.15 గంటల ప్రాంతంలో అక్కడకు వచ్చారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. ఇతరుల నుంచి కూడా విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో ఏం చేయాలో చూడాలని సీఎం అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారు. మరికొందరు రోడ్లు, భూములు, ఇతర సమస్యలను ప్రస్తావించారు. గంటసేపున్న సీఎం ప్రతి ఒక్కరి సమస్యలు ఓపిగ్గా విన్నారు. అనంతరం ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిమిత్తం సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత మంత్రి సీతక్క ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతిఒక్కరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. మధ్యాహ్నం మూడున్నర వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమం వారంలో రెండురోజులు నిర్వహించేలా.. శాఖల వారీగా ఫిర్యాదులు స్వీకరించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే దీనికి సీఎం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. 320 సీట్లు .. 15 డెస్కులు ..మౌలిక వసతులు ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితర అధికారులు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు. సమస్యల నమోదుకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి విజ్ఞాపన పత్రాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేసి, ప్రతి విజ్ఞాపనకు ప్రత్యేక గ్రీవెన్స్ నంబర్ ఇచ్చి, ప్రింటెడ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం, పిటిషన్ దారులకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఎక్ నాలెడ్జ్జ్‌మెంట్ పంపే విధంగా ఏర్పాటు చేశారు. ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా నీడతో కూడిన క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. హర్షాతిరేకాలు ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజలు ప్రగతిభవన్ తలుపులు అందరికీ తెరుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రజాదర్బార్ నిర్వహించారంటూ గుర్తు చేసుకున్నారు. గడీల పాలనకు చరమగీతం పాడారంటూ కొందరు పాటలు పాడారు. కొందరు ప్రగతిభవన్ పైకి ఎక్కి అంతా కలియదిరిగారు. పచ్చిక బయలుపై, భవనాల వద్ద పెద్ద ఎత్తున ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. ప్లాట్లు కబ్జా చేశారు మా అసోసియేషన్‌కు సంబంధించిన ప్లాట్లను కొందరు కబ్జా చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే విచారించారు. దొంగ డాక్యుమెంట్లు పెట్టి కబ్జా చేశారని తేలింది. ఎమ్మార్వోపై చర్య తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇప్పటివరకు మోక్షం లభించలేదు. నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నాం. త్వరగా న్యాయం చేయాలని కోరేందుకు వచ్చా. –దామోదర్‌రెడ్డి, చాణిక్యపురి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, నాదర్గుల్, రంగారెడ్డి జిల్లా మా పేరు మీద పట్టా చేయించాలి మా భూమి మా పేరు మీద పట్టా చేయించాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారే తప్ప పట్టా చేయించడం లేదు. ఐదు మందిమి ఉన్నా పట్టాలు ఇవ్వలేదు. లక్షలు ఇవ్వాలంటున్నారు. పేదోళ్లం అంత డబ్బులు ఎలా ఇవ్వగలం? – గిరన్న, బాలమ్మ,కాశింనగర్ గ్రామం, వనపర్తి జిల్లా -
ప్రజాసమస్యలపై బీజేపీ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు తెలపాలని, ఉద్యమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ వివిధ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఆదివారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబరు నెలాఖరు నాటికి రోజుకో కార్యక్రమం చొప్పున 18 కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. నేటి నుంచి చేపట్టబోయే కార్యాచరణ ► ఆగస్టు 31: వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కిసాన్ మోర్చా అధ్వర్యంలో వ్యవసాయ కమిషనర్‌కు వినతిపత్రం. ప్రైవేట్ టీచర్లు, కాలేజీ లెక్చరర్ల సమస్యలపై యువమోర్చా ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం. ► సెప్టెంబర్ 1: పార్టీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు. ► 2న: తెలంగాణ విమోచనం కోసం బలిదానమైన అమరవీరులకు పరకాలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ శ్రద్ధాంజలి ఘటిస్తారు. ► 3న: ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు వసూలు చేస్తున్న అధిక ఫీజులపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వినతిపత్రం ► 3, 4 తేదీల్లో: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశంగా చేయాలని, పోరాటం జరిగిన స్థలాలను స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్లకు వినతిపత్రాలు. ► 4న: కరోనాను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు ► 5న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ► 6న: తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్రస్థాయిలో కళాకారుల సమావేశం నిర్వహణ. ► 7న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌కు విన్నవించడం ► 8న: తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్రస్థాయిలో మేధావులతో సమావేశం నిర్వహణ ► 11న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిరసన కార్యక్రమాలు ► 12, 13 తేదీల్లో: కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సందర్శన ► 17న ఉదయం: ప్రతి పోలింగ్ బూత్‌లో జాతీయజెండా ఎగురవేయాలి ► 17న సాయంత్రం: తెలంగాణ విమోచన దినోత్సవంపై బహిరంగ ర్యాలీ (వర్చువల్ ర్యాలీ) ► 21న: గోదావరి నది జలాలపై రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ► 25న: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 10 మొక్కలు నాటాలి. ► సెప్టెంబర్ చివరి నాటికి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్రంలో 100 రైతు ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పీవో) ఏర్పాటు కోసం కార్యాచరణ. -
గుక్కెడు నీటికి గంపెడు కష్టాలు
సాక్షి, కొండపి(ప్రకాశం): మండలంలోని చోడవరం గ్రామస్తులకు రక్షిత మంచినీటి సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంకులతో పాటు మూసి నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకుకు మంచినీటి సరఫరాకు పైప్‌లైన్ ఉంది. దీంతో పాటు ఇటీవల రామతీర్థం రిజర్వాయర్ నుంచి మంచినీరు గ్రామస్తులకు అందిస్తున్నామని అధికారులు పాలకులు చెబున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రామస్తులకు గుక్కెడు మంచినీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో వెయ్యి మంది జనాభాతో పాటు మరో 500 మందికి పైగా కాలనీవాసులు ఉన్నారు. మంచినీరు అందించటం కోసం 50వేల లీటర్ల సామర్థ్యంతో గ్రామంలో ఒక ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మూసిలో బోర్లు వేసి బావికి నీరు సరఫరా చేసి అక్కడి నుంచి గ్రామానికి మంచినీరు వచ్చేలా పథకం రూపొందించారు. దీంతో పాటు రామతీర్థం రిజర్వాయర్ నుంచి సైతం మంచినీరు గ్రామానికి మంచినీరు సరఫరా చేయటం కోసం పైప్‌లైన్ ట్యాంకుకు సైతం అనుసంధానం చేశారు. అంత వరకు బాగానే ఉన్నా రామతీర్థం రిజర్వాయర్ నుంచి ఒక్కరోజు సైతం గ్రామానికి మంచినీరు సరిగా సరఫరా చేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా అంతకు ముందు గ్రామంలోని రక్షిత పథకం నుంచి మంచినీరు అందడం లేదని గ్రామస్తులు తెలిపారు. అదే విధంగా గ్రామంలో 20 కుటుంబాలకు నీరు ఆధారంగా ఉన్న చేతిపంపు మరమ్మతులకు గురైనా ఇంత వరకు పట్టించుకోకపోవడంతో వాడుకనీరు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. అలంకారప్రాయంగా ఓవర్‌హెడ్‌ట్యాంకు పట్టించుకోని అధికారులు గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పంచాయతీ కార్యదర్శి గానీ ప్రత్యేకాధికారి గానీ మంచినీరు సరఫరా విషయమై పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులకు పక్షం రోజులు పైగా మంచినీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రామతీర్థం నుంచి సరఫరా చేసే రక్షిత మంచినీరు పథకం పైపులైన్లో సమస్య ఉండి నీరు ట్యాంకుకు ఎక్కటం లేదని, పైప్‌లైన్ పగిలిందనే విషయం పథకం సిబ్బందికి తెలిపినా స్పందన లేదని గ్రామస్తులు తెలిపారు. పొరుగు గ్రామాలకు పరుగు.. గ్రామంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో పక్కన ఉన్న వెన్నూరు, దేవిరెడ్డిపాలెం గ్రామాలకు ద్విచక్రవాహనాలతో వెళ్లి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. వృద్ధులు పొరుగు గ్రామాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. కొంతమంది గ్రామానికి వచ్చే బబుల్వాటర్ వ్యాన్ల నుంచి మంచినీరు కొనుక్కోని తాగుతున్నట్లు తెలిపారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి కిరణ్‌ను ఫోన్లో వివరణ కోరగా..విషయం తన దృష్టికి వచ్చిందని రామతీర్థం పైప్‌లైన్ పగిలిందని, పైప్ జాయింట్ మిషన్‌తో వేయాలని అప్పటి లోగా గ్రామంలోని రక్షితపథకం నీరు అందిస్తాన్నారు. ప్రత్యేక అధికారి సురేఖను వివరణ కోరగా మంచినీరు సమస్య ఎవ్వరు తనదృష్టికి తీసుకరాలేదని, సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా అయినా తొలిస్తామని, ఎన్నికల పనుల్లో తీరికలేకున్నామని తెలిపారు. పది రోజులుగా మంచినీరు సరఫరాలేదు గ్రామానికి పక్షం రోజులుగా మంచినీరు సరఫరా లేదు. దీంతో గ్రామస్తులు మంచినీరు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవటంలేదు. రామతీర్థం మంచినీరు సైతం రావడం లేదు. – ఆర్ వెంకటనారాయణ, చోడవరం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది మంచినీరు కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. వయస్సు మళ్లిన వారు మంచినీటి కోసం పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రెండు పథకాలు ఉన్నా మంచినీరు అందించలేకపోవటం దారుణం. మున్ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం కావడం లేదు. – ఎన్ రమణయ్య, చోడవరం -
సమ్మెలో కార్మికులు..సమస్యల్లో జనం
ఇబ్రహీంపట్నంరూరల్ : పంచాయతీల్లో సేవలు స్తంభించిపోయాయి. కార్మికులు సమ్మెబాట పట్టడంతో గ్రామాలు సమస్యల్లో కునారిల్లుతున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రజల గోడు పట్టించుకునే వారే కరువయ్యారు. గత నెల 23వ తేదీ నుంచి పంచాయతీ కార్మికులు వారి సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారు. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 4వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో కారోబార్, బిల్ కలెక్టర్, వాటర్‌మెన్, ఎలక్ట్రీషియన్, అటెండర్, పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారు. ప్రస్తుతం వారంతా సమ్మె చేస్తుండడంతో పనులు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో పదిహేను రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వాటర్‌మెన్ సమ్మెలో ఉండడం వల్ల నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు రూ.300 నుంచి రూ.500 వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకుంటున్నారు. కొన్నిచోట్ల ప్రజలే స్వయంగా వాల్వ్ తిప్పుకుని నీటి సరఫరా చేసుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో నీటి సమస్య జఠిలమైంది. చాలా గ్రామాల్లో మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్త చెదారం పేరుకుపోయి గ్రామాలు మురికికుపాలుగా తయారయ్యాయి. ఎలక్ట్రీషియ న్ అందుబాటులో లేకపోవడంతో లైట్లు వేసే వారు కూడా కరువయ్యారని, పాడైన లైట్లను మార్చడం లేదని ప్రజలు చెబుతున్నారు. ప్రజలే వీధి దీపాలు వేసుకుంటున్నారు. ఇటీవల గ్రామస్తులంతా నీటి కోసం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి ప్రత్యేక అధికారులకు సమస్యలు విన్నవించారు. నీళ్లు లేవు పంచాయతీ సిబ్బంది నీళ్లు పెట్టడం లేదు. వారం రోజుల క్రితం మా కుటుంబంలో ఒకరు మరణించారు. స్నానాలు చేయాలన్నా, ఇంటిని శుభ్రం చేసుకోవాలన్నా నీరు కరువైంది. రూ.500 పెట్టి ట్యాంకర్ నీటిని కొన్నాం. నీటి సమస్య తీవ్రంగా ఉంది. – దేవరకొండ యాదమ్మ, పోచారం -
అదే తీరు.. 9తోనే సరి
సాక్షి, చిత్తూరుఎడ్యుకేషన్ : ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకొకసారి జరిగే జెడ్పీ సర్వ సభ్య సమావేశం నిర్వహణలో తీరు మారలేదు. ఎప్పటి లాగే ప్రధాన అంశాలు చర్చకు రాలేదు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన జిల్లా పరి షత్ సర్వసభ్య సమావేశంలో చిన్న చిన్న సమస్యలపైనే చర్చించి, మమ అనిపించారు. సమావేశానికి పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి హాజరయ్యారు. ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూ డా సమావేశానికి కాకపోవడం గమనార్హం. ఇక జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాత్రం సమావేశానికి యథావిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జేసీ గిరీషా, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, ఏఓలు ప్రభాకర్‌రెడ్డి, వెంకటరత్నం, అధికారులు పాండురంగస్వామి, విజయకుమార్, రవిప్రకాష్‌రెడ్డి, కుర్మానాథ్, ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, దొరబాబు, జిల్లా గ్రంథా లయ చైర్మన్ కన్నయ్యనాయుడు పాల్గొన్నారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి బైఠాయింపు జెడ్పీ పాలకవర్గం తమకు అనుకూలంగా ఉన్న వారికే నిధులు కేటాయిస్తోందని నాగలాపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత సమావేశంలో స్టేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళనని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, తదితర పనులను తమ మండలానికి కేటాయించడం లేదని తెలిపారు. తొమ్మిదింటితో సరిపెట్టేశారు జెడ్పీ సమావేశం ఉదయం 11.10 గం టలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల కాంట్రాక్టులకు సంబంధించిన జీఎస్టీపై 45 నిమిషాలు గడిపేశారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్ గళం విప్పారు. అజెండాలో 42 అంశాలు ఉండగా కేవలం 9 అం శాలపై మాత్రమే చర్చలు జరిపి తూతూ మం త్రంగా సభను ముగించేశారు. సాక్షరభారత్ రద్దుపై వాడివేడి చర్చ రాష్ట్ర ప్రభుత్వం సాక్షరభారత్పై కుట్రపన్ని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిందని పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ ఆరోపించారు. దీనిపై మంత్రి అమరనాథరెడ్డి జోక్యం చేసుకుని ఆ నిర్ణయం తమది కాదని కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని సమాధానమిచ్చారు. ఏ ఇతర రాష్ట్రాల్లో లేని రద్దు రాష్ట్రంలో మాత్రమే ఎందుకు విధించారని సభ్యులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఇక్కడ మాట్లాడితే ఏం లాభముంటుందని మంత్రి అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ‘నువ్వు వైఎస్సార్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ మారావు. నీవు మాకు నీతులు చెప్పడం ఏమిటి?.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్యవాదోపవాదాలు జరిగాయి. విద్యాశాఖపై సుదీర్ఘచర్చ అజెండాలో రెండో అంశమైన విద్యాశాఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నభోజన నిధులు విడుదల కావడం లేదని, విద్యాసంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించలేకపోయారన్నారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెట్టి ఇషా విద్యను నడపడం సబబు కాదన్నారు. రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాల స్థలాలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మా ట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకనే దాన్ని టీడీపీ నాయకుల ఘనతగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలనడం సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు జిప్సం అందడంలేదు ఐరాల, పూతలపట్టు ప్రాంతాల్లో చాలా మంది రైతులకు జిప్సం అందడం లేదు. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. ప్రజా సమస్యలపై వారు చర్చించరు... మేము చర్చిస్తే విరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయే గాని బోధించేందుకు టీచర్లు లేకపోవడం దారుణం. – సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు జరపడం లేదు మోడల్ స్కూళ్లల్లో పేద విద్యార్థులు చేరడానికి వెళుతుంటే అడ్మిషన్లు లేవని ప్రిన్సిపాళ్లు తిప్పి పంపుతున్నారు. 20 శాతం అధికంగా విద్యార్థులను చేర్చుకోవచ్చనన్న నిబంధన ఉన్నప్పటికీ అడ్మిషన్లు చేయడం లేదు. ఈ విషయంపై డీఈఓ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండడంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. – దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే ఫలితం దక్కడం లేదు ప్రతిసారీ సర్వసభ్య సమావేశానికి, స్థాయి సంఘ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నాం. జెడ్పీకి ఎన్ని నిధులు వచ్చా యి... ఏఏ పనులకు ఖర్చు పె ట్టారు... అన్న వివరాలను చెప్పడం లేదు. పాఠశాలలో అదనపు తరగతులు అవసరమున్న చోట కట్టకుండా ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నా ఫలితం దక్కడం లేదు. – వెంకటరెడ్డి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు, పుంగనూరు -
చదువుకోవాలని ఉంది..
మెదక్‌రూరల్ : అమ్మా..నాన్నా లేని అనాథను చదువుకోవాలని ఉంది రెసిడెన్షియల్లో సీట్ ఇప్పించండి సారూ అంటూ శివ్వంపేట మండలం తల్లెపల్లి తండాకు చెందిన శ్రావణి అనే చిన్నారి ప్రజావాణిలో వేడుకుంది. సోమవారం మెదక్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేశ్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి 119 ఆర్జీలు వచ్చాయి. శ్రావణి తన నానమ్మ చామంతితో కలిసి ప్రజావాణిలో ఆర్జీని సమర్పించింది. తాను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలానని, వరుసకు నానమ్మ అయిన చామంతి వద్ద ఉంటున్నట్లు తెలిపింది. శివ్వంపేట ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న తనకు రెసిడెన్షియల్లో సీట్ ఇప్పించి ఆదుకోవాలని కోరింది. మురికి నీటిని వదులుతున్నారు ఉద్దేశ్యపూర్వకంగా మా ఇంట్లోకి మురికి నీటిని వదులుతున్నారని హ వేళిఘణాపూర్ మండలం బోగుడ భూపతిపూర్ గ్రామానికి చెందిన విఠల్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. గ్రామంలో తాను ఇళ్ళు నిర్మించుకుటుండగా అదే గ్రామానికి చెందిన సాదుల పోచయ్య ఉద్దేశ్యపూర్వకంగానే మురికి నీటిని, వ్యర్థ జలాలను వదులుతూ అపరిశుభ్ర వాతావరణాన్ని చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
పందులు బాబోయ్..
ఆత్మకూర్ : ఒక పక్క స్వైన్‌ప్లూ వణికిస్తుందని.. దీనికి తోడు డెంగీలాంటి విషజ్వరాల బారిన పడి ఇది వరకే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనాభాకు తగ్గ పందుల స్వైరవిహారం ఉన్నా నివారించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమవుతున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో జనాభాకు సరిపడా పందుల స్వైరవిహారం ఉందని ఏ వీధిలో చూసినా, ఏ ఇంటి ముందు చూసినా, ఆలయాలు, మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు ఇలా ఎక్కడపడితే అక్కడ పందులే దర్శనం ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి క్యారీబ్యాగ్‌లలో చేతపట్టుకొని వెళ్తుంటే అమాంతం లాగేసుకుపోతున్నాయని వాపోతున్నారు. దుకాణా సముదాయాల్లో చొరబడుతూ నానా బీభత్సం చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే పందుల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
సమస్యలు పరిష్కరించండయ్యా..
ఒంగోలు టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన మీకోసంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జీఓలు అమలు చేయాలి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ఏడురకాల జీఓలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు సీహెచ్ మజుందార్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు కోరారు. పర్మినెంట్ పంచాయతీ కార్మికులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించేందుకు, టెండర్ విధానం రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టు పద్ధతిన కనీస వేతనం ఇచ్చి వారినే కొనసాగించాలని, ఎన్ఎంఆర్, పార్ట్‌టైం, ఫుల్‌టైమ్ కాంట్రాక్టు పద్ధతిన పంచాయతీల్లో పనిచేస్తున్న అర్హుల జాబితా తయారు చేసి కమీషనరేట్‌కు పంపించడం తదితర వాటికి సంబంధించిన జీఓలను జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంపించలేదని పేర్కొన్నారు. నివేశన స్థలాలు కేటాయించాలి చినగంజాం మండలం చినగంజాం, కడవకుదురు, చింతగుంటల గ్రామాల్లో అర్హులైన 400 మందికి నివేశన స్థలాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు వేడుకున్నారు. సర్వే నం 828, 128, 129లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. కూలీనాలి చేసుకొని జీవించే తమకు ఇళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో స్థలాలు ఇవ్వమని స్థానిక తహసీల్దార్‌ను వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. మీరైనా న్యాయం చేసి ఇళ్లు ఇప్పించాలని కోరారు. హేచరీలపై చర్యలు తీసుకోవాలి నాసిరకం రొయ్య పిల్లలు తయారు చేస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండవ శ్రీనివాసరావు, దుగ్గినేని గోపీనా«థ్ కోరారు. తీర ప్రాంతాల్లోని 20 వేల హెక్టార్లలో రైతులు వెనామీ రకం రొయ్య సాగు చేస్తున్నారన్నారు. 36 వెనామీ రకం రొయ్య పిల్లలను తయారు చేసే హేచరీలు ఉన్నాయని, వీటి నుంచి రైతులు రొయ్య పిల్లలను కొనుగోలు చేసి వారి చెరువుల్లో సాగు చేస్తారన్నారు. రెండేళ్ల నుంచి కొన్ని హేచరీలు నాసిరకం రొయ్య పిల్లలు తయారు చేసి రైతులకు అమ్ముతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఒక్కో రైతు ఎకరాకు 3 లక్షల రూపాయల వరకు నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. హేచరీలపై నిఘా ఉంచి నాణ్యమైన రొయ్య పిల్లలను అందించేలా చూడాలని కోరారు. బట్వాడాలు ఆగిపోయాయి మార్కాపురంలోని పలకల కార్మికులను ఆదుకోవాలని మార్కాపురం డిజైన్ స్లేట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. మార్కాపురంలో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పలకల పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. పలకల యజమానులు తాము ఎగుమతి చేసిన సరుకు తాలూకు హెడ్ఫారం సకాలంలో అందజేయలేదన్న సాకుతో పరిశ్రమ బ్యాంకు ఖాతాలను హోల్డ్‌లో పెట్టారన్నారు. దీంతో కార్మికులకు నెల రోజులకు పైగా బట్వాడాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అకౌంట్స్‌ను హోల్డ్‌లో పెట్టిందని ఫిర్యాదు చేశారు. మౌలిక వసతులు కల్పించాలి ఒంగోలు నగరం 50వ డివిజన్ జయప్రకాష్ ఎక్స్టెన్షన్ కాలనీలో నివాసం ఉంటున్న తమకు మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు వేడుకున్నారు. తమ కాలనీ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దుర్బర జీవితాన్నే గడుపుతున్నామన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డు లేకపోవడంతో గుంటల నుంచి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల మధ్యే మురుగునీరు నిలిచి వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. తమ కాలనీకి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మిరప పంటను వైరస్ కాటేసింది మిరప పంటకు జెయిని వైరస్ వ్యాపించి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురానికి చెందిన రైతులు వాపోయారు. గ్రామంలో 300 ఎకరాల్లో మిరప పంట సాగు చేశామని, పూత పిందె దశలో ఒక్కసారిగా తామర పురుగు, నల్లి, తెల్లదోమ వ్యాపించడంతో పూర్తిగా దెబ్బతిందన్నారు. ఒక్కో రైతుకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 5 క్వింటాళ్లకు మించి రాలేదన్నారు. ఇప్పటికే 100 ఎకరాల్లో పంట తీసివేయడం జరిగిందన్నారు. తమ పంటకు నష్టపరిహారం నమోదు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. -
మంత్రి ఇలాఖాలో ప్రజల కష్టాలు
చెంతనే నీరున్నా.. అందని దుస్థితి.. కనగానపల్లి (రాప్తాడు) మండలం ముక్తాపురం మోడల్ కాలనీకి ఎదురుగా ఉన్న దళితులది. మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతమైనా జనాలకు ‘జల’కష్టాలు తీరడం లేదు. రెండు బోర్లు వేయించినా కాలనీవాసులకు మాత్రం నీటి కష్టాలు తీరడం లేదు. బోర్లకు పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిత్యం వారంతా ఇదిగో ఇలా రోడ్డు మీదకొచ్చి అష్టకష్టాలు పడుతున్నారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, అనంతపురం -
జనపథం - అమరావతి రాజధాని ప్రాంతం
-
ఏపీసీసీ ఛీఫ్ మౌనదీక్ష
మడకశిర: రాష్ట్రంలో ప్రస్తుతమున్నది తీవ్ర దుర్భిక్షమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లా మడకశిరలోని గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఉదయం 11.20 నుంచి 12 గంటల వరకు దీక్ష సాగింది. తొలుత స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు, దేశ వ్యాప్తంగా లౌకికవాదానికి ముప్పు, రైతు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికి ఈ దీక్ష చేపట్టానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో మైనార్టీలకు భద్రత కరువైందన్నారు. హిందువులకు కూడా శాంతి లేదన్నారు. రాష్ట్రంలో 6.50 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఉందని ఆయన తెలిపారు. ఐదు వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 12 లక్షల మంది కూలీల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. యంత్రాలతో ఉపాధి పనులను చేపడుతుండటంతో కూలీల వలసలు పెరిగాయన్నారు. గతేడాది రాష్ట్రంలో 580 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరి కుటుంబాలకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు. హేవళంబి సంవత్సరంలో రాష్ట్ర ప్రజలను పాలకులు పెద్దఎత్తున మోసం చేస్తారని పంచాంగం చెబుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ చేవూరు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరెన్సీ కష్టాలు కంటిన్యూ!
-
తిరగబడిన బతుకుబండి
► 50 రోజులైనా తీరని కరెన్సీ వెతలు ► చితికిపోతున్న చిరు వ్యాపారాలు.. ► చేతిలో పెట్టుబడులు లేక రైతుల అవస్థలు ► అనేక రంగాలు అతలాకుతలం.. ► జౌళి, జువెలరీ, స్థిరాస్తి.. అన్నీ నేలచూపులే ► అప్పు పుట్టక.. వైద్యం అందక.. ► భార్యను కోల్పోయిన భర్త ఒకరు.. ► ఆరుగాలం చెమటోడ్చి పండించిన ► పంట కష్టాన్ని బ్యాంకు నుంచి ► విడిపించుకోలేక తల పట్టుకున్న రైతు ఒకరు.. ► గిరాకీ మొత్తం తగ్గిపోయింది.. ► కుటుంబానికి పూట కూడ గడవడం లేదంటూ కళ్లనిండా నీళ్లు నింపుకున్న చిరు వ్యాపారి ఒకరు.. ► పనుల్లేవ్.. పైసల్లేవ్.. గోసగోస అయింతందంటూ గోడు వెల్లబోసుకున్న కూలీ ఒకరు.. ► కాలేజీలో ఫీజు కూడా కట్టలేకపోతున్నానంటూ బాధపడుతున్న విద్యార్థి ఒకరు.. ఇలా ఒక్కరా.. ఇద్దరా.. ఎవరిని కదిపినా కరెన్సీ వెతలే! ఒకటి కాదు.. రెండు కాదు.. యాభై రోజులుగా ఇదే యాతన!! రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కూలీ నుంచి అంతో ఇంతో జీతంతో కుటుంబాన్ని నడుపుతున్న వేతనజీవి దాకా అందరూ బాధితులే! అటు వ్యాపారాలు కుదేలై ఆర్థికరంగం.. బతుకుచక్రం తిరగబడి జీవనరంగం గాడి తప్పాయి. నవంబర్ 8 అర్ధరాత్రి పిడుగులా పడిన ‘కరెన్సీ రద్దు’ నిర్ణయం బడుగుజీవితోపాటు అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది. నేటికి 50 రోజులు గడిచిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన గడువూ ముగిసింది. కష్టాలు మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి. జనం కష్టాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘సాక్షి’పరిశీలన జరిపింది. సామాన్యుల కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని ఇందులో స్పష్టమైంది.. పెద్ద నోట్ల రద్దు దెబ్బకు 50 రోజులుగా లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. బతుకు బండి లాగలేక కుదేలవుతున్నాయి. ఉపాధి కరువై..బతుకు బరువై దిగాలుగా కాలం వెళ్లదీస్తున్నాయి. రెక్కాడితే డొక్కాడని నిరుపేద కూలీల దగ్గరి నుంచి ఆటో వాలా, టిఫిన్ సెంటర్, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, రైతులు.. ఇలా ఎవరిని కదిలించినా గత 50 రోజులుగా పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు. తినే తిండికి కూడా తిప్పలవుతోందంటూ కన్నీరు పెడుతున్నారు. సంక్రాంతి పండుగెలా గడుస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు పూర్తవడంతో కూలీల నుంచి చిరు వ్యాపారుల దాకా తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఆ వివరాలివీ.. – సాక్షి నెట్వర్క్ అప్పు పుట్టక నా భార్య ప్రాణం పోయింది నా భార్య పేరు వెంకటమ్మ. మాకు 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వ్యవసాయం మీదే ఆధారపడ్డం. ఈ మధ్య వెంకటమ్మకు జబ్బు చేసింది. నెలకింద దేవరకొండ ఆస్పత్రిలో చేర్పించిన. ఎంతకూ తగ్గలే.. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నరు. రూ.4 లక్షలు అయితయని చెప్పిండ్రు. అప్పటికే నోట్లు రద్దయినై. ఎక్కడ తిరిగినా డబ్బు దొరకలే. ఎవల్నడిగినా అప్పు పుట్టలే. చివరకు ఉన్న మూడున్నర ఎకరాల పొలాన్ని బేరం పెట్టిన. ఎకరం నాలుగు లక్షలు పలికే భూమి.. రెండు లక్షలకే అమ్ముతనన్న. ఎవరూ ముందుకు రాలేదు. నా భార్య ఆరోగ్యం విషమించింది. ఉత్త చేతులతోనే హైదరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకుపోయిన. చేర్పించిన రోజే కన్నుమూసింది. నా బిడ్డ తల్లిలేనిదయింది. – సిలమల బలరాం, గన్నెర్లపల్లి, నల్లగొండ జిల్లా చిల్లర లేదంటే వెళ్లిపోతున్నరు.. 30 ఏళ్లుగా హోటల్ నడుపుతున్న. రెండు నెలలుగా గిరాకీ సగానికి తగ్గిపోయింది. రెండు ప్లేట్లు ఇడ్లీ తిని, టీ తాగి రెండు వేల నోటిస్తే చిల్లర ఎక్కడ నుంచి తేవాలే. ‘చిల్లర ఉందా..’ అని ముందే అడిగితే టిఫిన్ చేయకుండానే వెళ్లి పోతున్నరు. స్కూల్ ముందు మా హోటల్ ఉంది. పిల్లలు పది రూపాయలు తీసుకొని వచ్చి టిఫిన్ తీసుకెళ్లేవారు. నోట్లు బంద్ అయినప్పటి నుంచి స్కూల్ పిల్లలు రావట్లేదు. లాభం రాకున్నా మరో పని చేయలేక హోటల్ నడుతున్నా.. – సూరిబాబు, హోటల్ యజమాని, జేకే కాలనీ, ఇల్లెందు పూట గడవడమే కష్టం వ్యాపారం నడుస్తలేదు.. నోట్లు రద్దు చేసినప్పటి నుంచి సచ్చిపోతున్నం. పూట గడవడమే కష్టంగా ఉంది. కూరగాయలు అమ్ముకుంటేనే కుటుంబం గడుస్తది. రెండు నెలల నుంచి బేరాల్లేవు. మొదట్లో అందరూ పాత రూ.500, రూ.1,000 నోట్లే ఇచ్చారు. వాటికి చిల్లర ఇవ్వలేక బేరాలు పోగొట్టుకున్నాం. పాత నోట్లు తీసుకున్నా.. బ్యాంకులో వేసేందుకు రోజంతా నిలబడాలె. అట్లా కూడా బేరాలు పోయినయి. కొన్ని రోజుల నుంచి 50, 100 రూపాయల కూరగాయలు కొన్నా రెండు వేల నోటు ఇస్తున్నరు. చిల్లర ఎక్కడి నుంచి తేవాలె. – ఎస్కే ముంతాజ్, కూరగాయల వ్యాపారి, సత్తుపల్లి బాగా తక్లీబ్ అయితంది.. బార్ పక్కనే పాన్‌షాప్ నడిపిస్తున్న.. కిరాయి ఇంట్లో ఉంటం. నోట్లు రద్దయినకాడ్నుంచి గిరాకీ తగ్గింది. పాన్ షాపు కిరాయి, ఇల్లు కిరాయి కట్టాలె. తిండికి ఎల్లాలె. నా దగ్గర అంతా ఐదారు రూపాయల పాన్లు, సిగరెట్లు, సోంపులు అమ్ముతయ్. చిల్లర ఇయ్యలేక గిరాకీ పోతోంది. మేం సామాన్లు కొనుక్కునే కాడ పాత నోట్లు తీసుకోరాయే. మొన్ననే బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి.. వచ్చిన చిల్లర అందులో వేసిన. మళ్లీ తీసుకోవడానికి లైన్ల నిలబడినా ఇవ్వరాయె. ఇటు గిరాకీ పోవట్టె.. పైసలు రాకపాయే.. పైసల్లేక సామాను తెచ్చుకునేదానికి లేదాయె. ‘‘బడే నోట్ కే బారే మే అబీ లాభ్ కిస్కా హై.. లుక్సాన్ కిస్కా హై మాలూమ్ నహీ.. మగర్ బీచ్‌మే హమ్కో తక్లీబ్ హోరా (పెద్ద నోట్ల రద్దుతో ఎవరికి లాభమో.. ఎవరికి నష్టమో తెలియదు కానీ.. మధ్యలో మాకు ఇబ్బందులు తప్పడం లేదు).’’ – కత్కర్ దిలీప్, పాన్‌షాప్ నిర్వాహకుడు, కరీంనగర్ ఎవుసానికి తిప్పలైతంది నోట్లు రద్దు చేసినంక ఎవుసానికి మస్తు కష్టమొచ్చింది. 50 రోజుల నుంచి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చెప్పుకుంటే ఏడుపొస్తుంది. వానాకాలంలో ఎకరం మక్క, మరో ఎకరంలో వరి వేసిన. మక్కలు దెబ్బతిన్నయ్, వరి కూడా సరిగ రాలే. పంటలు అమ్మితే చెక్కు ఇచ్చిండ్రు. దాన్ని పట్టుకుని బ్యాంకు చుట్టూ తిరిగినా.. రోజుకు రూ.2 వేలే ఇస్తున్నరు. ఇన్ని రోజుల నుంచి తిరిగితే రూ.8 వేలు దొరికినయ్. ఆ పైసలు వానాకాలంలో పనిచేసిన కూలీలకే సరిపోయినయ్. దాంతోటి చేతిల చిల్లిగవ్వ లేక వరి నాటు ఆలస్యంగా వేసిన. ఇంకా కూరగాయల తోట పెట్టలేదు. ఎరువులు, విత్తనాలు ఉద్దెర తెచ్చినా.. కూలీలకు డబ్బులు ఇవ్వడం ఇబ్బంది అవుతోంది. – రైతు శిల్వరాజ్, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ పండుగెట్ల గడిచేది? నోట్లు బంద్ కావడంతో ఇంట్లో అవసరాలకు పరేషాన్ అవుతోంది. నా భర్త ఆటో నడుపుతడు. ఇప్పుడు గిరాకీ లేక ఇంటికాడే ఉండాల్సి వస్తోంది. కూరగాయలు, బియ్యం, పప్పులు, ఉప్పు, బట్టలు, పుస్తకాలు, ఇంటి కిరాయి, కరెంటు బిల్లు ఇట్లా చెప్పుకుంట పోతే పైసల కోసం రోజూ ఎదురుచూడక తప్పడం లేదు. సంక్రాంతి పండుగ వస్తోంది. ఇది పైసల్లేని పండుగగా మారుతుందేమో అనిపిస్తోంది. బ్యాంకులో రోజంతా నిల్చున్నా 2 వేల నోటు ఇస్తున్నరు. దానికి చిల్లర దొరుకుతలేదు. ఇలాగైతే ఎట్లా? – గోపు విజయ, శ్రీభక్త మార్కండేయ వీధి, మహబూబాబాద్ చెల్లి పెళ్లి వాయిదా వేశా నెల రోజుల కింద మా చెల్లెలు పెళ్లి జరగాల్సి ఉన్నా.. నోట్ల రద్దు కారణంగా అప్పు పుట్టక వాయిదా వేయాల్సి వచ్చింది. వ్యాపారం కూడా బాగా పడిపోయింది. ఇంటి కిరాయి కట్టేటన్ని డబ్బులు కూడా రావడం లేదు. పిల్లలకు ఫీజులు, ఇంట్లో తిండి, ఇతర ఖర్చుల కోసం కూడా తిప్పలవుతోంది. రెండు నెలలుగా అప్పులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఈ బాధలు తప్పేదెన్నడు? – రాజు, పండ్ల వ్యాపారి, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వంద సుత మిగుల్తలేవ్.. నోట్లు రద్దు చేసిన కాన్నుంచి జేబుల డబ్బులు ఉంటలేవ్. చిల్లర డబ్బుల్లే ఆటో ఎక్కేటోళ్లు తగ్గిండ్లు. అడ్డా మీద ఆటోలు పెట్టుకుని గంటల కొద్ది ఎదురుచూసుడైతంది. నోట్లు రద్దు కాకముందు దినాం 300 రూపాయలు మిగిలేవి. ఇప్పుడు రోజుకు వంద కూడా వస్తలేవు. – బోగే కుమార్, ఆటోడ్రైవర్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గిరాకీలు పడిపోయినయ్ మాది ఊట్కూర్. రోజూ బైక్‌పై నారాయణపేటకు వచ్చి టీ స్టాల్‌ను నడుపుకుంటా. పెట్రోల్‌కే 50 రూపాయలు ఖర్చయితది. నోట్ల రద్దుతో గిరాకీ పడిపోయింది. చాయ్ తాగిన వారు రూ.2 వేల నోటు చూపిస్తున్నారు. చిల్లర లేదంటే ఉద్దెర పెడుతున్నారు. చిల్లర కోసం అవస్థ పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే చిల్లర వ్యాపారస్తులకు కావాల్సిన చిల్లరను బ్యాంకుల ద్వారా అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.. – ఊట్కూర్ శంకర్, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లా పాల డబ్బులు ఎవరూ ఇస్తలేరు నాకు ఎకరం పొలం, 10 గేదెలున్నాయి. రోజూ 25 లీటర్ల పాలను తాండూరులో జనానికి అమ్ముతుంటా. పెద్ద నోట్లను రద్దు చేసినంక నెలనెలా ఇవ్వాల్సిన పాల బిల్లులు ఎవరూ ఇస్తలేరు. నవంబర్ నెలలో పోసిన పాల పైసలల్ల సగం కూడా రాలె. దాంతోటి చిట్టీ పైసలు, పిల్లల ఫీజులు, ఆటో కిరాయికి కూడ ఇబ్బంది వచ్చింది. ఇంట్లో అవసరాలకు కూడా చేతులో పైసలు లేకుంట పొయినయ్. ఇట్లనే ఉంటే శానా పరేషాన్ గావాల్సి వస్తది. – దోర్నాల వెంకటేశం, వికారాబాద్ జిల్లా విశ్వనాథపూర్ పైసలడిగితే నాయిన కంట్లో నీళ్లు తిరుగుతున్నయ్.. నర్సాపూర్‌లోని కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదుతున్నా. మా ఊరు మానెపల్లి నుంచి మంగళపర్తి దాకా ఆటోలో.. అక్కడి నుంచి బస్సులో నర్సాపూర్‌కు వెళ్తా. మా నాన్న ఆంజనేయులు వ్యవసాయం చేస్తారు. పంట ఖర్చులకు, నా ఆటో ఖర్చులు, బస్‌పాస్, ఇంటి ఖర్చుల కోసం ఇంట్లో 40 వేలు పెట్టిండు. నోట్లు రద్దు చేయంగనే ఆ పైసలు తీసుకుపోయి వెల్దుర్తిలోని ఏపీజీవీబీలో జమ చేసిండు. ఇప్పుడు 20 కిలోమీటర్ల దూరమున్న వెల్దుర్తికి పోయి బ్యాంకు క్యూలైన్‌న్‌లో నిలబడినా.. 2 వేలే ఇస్తున్నరు. ఆ పైసలు సరిపోక కష్టమైతోంది. నాకు ఆటో కిరాయి, బస్‌పాస్, చిల్లర ఖర్చులకు పైసల్లేవు. ఇంటి ఖర్చులకు కూడా బాధయితున్నది. డబ్బులు ఉండి కూడా మరొకరి దగ్గర చేయి చాపాల్సి వస్తోంది. పైసలు కావాలని అడిగినప్పుడు మా నాయన కళ్లల్ల నీళ్లు తిరుగుతున్నయ్.. – ఆకుల సంతోషి, డిగ్రీ విద్యార్థిని, మెదక్ జిల్లా మానెపల్లి అప్పడిగితే.. ఏటీఎం కార్డు ఇస్తున్నారు! ‘‘కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నా. నా జీతం మీదనే తల్లిదండ్రులను, భార్యా పిల్లలు మొత్తం కుటుంబాన్ని నెట్టుకురావాలి. నోట్ల రద్దుతో మా కుటుంబం పరిస్థితి పరేషానైంది. పొయిన నెల జీతం రాలేదు. నేను కట్టాల్సిన వారెవరికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. వాళ్లు సతాయిస్తున్నారు. ఇగో వస్తయ్.. అగో వస్తయ్.. అని సర్ది చెప్తున్నా. బయట అప్పు తెచ్చుకుని ఇంట్లోకి సామాను తెచ్చిన. నా కొడుకును హాస్పిటల్లో చూపించుదామన్నా పైసల్లేవు. ఇప్పటికే మా దోస్త్ దగ్గర ఐదు వేలు అప్పు తీసుకున్నా.. మళ్లీ అడిగితే.. ఇదిగో నా ఏటీఎం కార్డు. పోయి ఏటీఎం సెంటర్ కాడ నిల్చుని తీసుకురా అంటుండు..’’ – మధుసూదన్‌రెడ్డి, కాంట్రాక్టు ఉద్యోగి, సిద్దిపేట జిల్లా పుస్తకాలకూ డబ్బులు లేవు అవసరం కోసం డబ్బు అందక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నం. చదువుకునేందుకు పుస్తకాలు, ఇతర ఖర్చులకు డబ్బు కావాలి. ఇంట్లో అమ్మనాన్నలను అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు. 50 రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం. బ్యాంకులకు వెళితే క్యూలైన్లు ఉంటున్నాయి. డబ్బులు దొరకడం లేదు. ఏటీంఎంలు పనిచేయడం లేదు. పుట్టినరోజుకు కొత్త డ్రెస్సు కొనుక్కోలేక పాతవే వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. – నారగోని స్రవంతి, విద్యార్థిని, నకిరేకల్ కూలీ దొరుకుత లేదు నేను అడ్డా కూలిని. నా భార్య బీడీలు చేస్తుంది. ముగ్గురు పిల్లలున్నరు. నోట్లు రద్దయినప్పటి నుంచి అడ్డా మీద కూలి దొరుకుత లేదు. పెద్ద నోట్లు చెల్లక.. చిన్న నోట్లు దొరక్క పనులు చేసేటోళ్లు ఆపేసిండ్రు. వారంలో ఒకటి రెండు రోజులే పని ఉంటోంది. ఆ కూలి పైసలు పొట్టకే చాలట్లేదు. నా భార్య బీడీల పైసలూ వస్తలేవు. వాటిని బ్యాంకు ఖాతాల వేస్తరట. పనిలేక.. పైసల్లేక గోస అయితుంది. ఏ రోజు ఎట్ల ఉంటదోనని భయంగా ఉంది. – గడప దయాకర్, కూలీ, సిరిసిల్ల వ్యాపారం పడిపోయింది కొబ్బరి కాయల ధరలు.. వ్యాపారం సగానికి పైగా పడిపోయాయి. గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. జనం పైసల్లేక పూజలకు, దేవుళ్లకు కొబ్బరికాయలు కొట్టడం తగ్గించినరేమో అనిపిస్తోంది. గతంలో రెండు రోజులకో లారీ కొబ్బరికాయలు అమ్ముడు పోయేవి. నోట్ల రద్దుతో వారం మొత్తంలో కూడా ఒక లారీ కొబ్బరికాయలు అమ్మలేకపోతున్నం. క్యాష్ లెస్ లావాదేవీలు చేసే పరిస్థితీ లేదు. 50 రోజులు గడిచినా ఇంకా పరిస్థితి నుంచి తేరుకోలేకపోతున్నాం. – శంకర్, కొబ్బరికాయల హోల్‌సేల్ వ్యాపారి, వరంగల్ దక్షిణ తరువాత ఇస్తామంటున్నారు నోట్లు రద్దుతో మా పూజారులకూ కష్టాలు వచ్చాయి. గుడికి వచ్చేవారు కనీసం దక్షిణ కూడా వేయడం లేదు. నెలలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, పూజలు కలిపి 20 వరకు చేస్తా. నవంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 10 దాకా పెళ్లిళ్లు చేశాను. కానీ డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. పెళ్లికి డబ్బులు సరిపోలేదు.. తరువాత ఇస్తామంటున్నారు. చిన్నచిన్న ఖర్చులకు కూడా బకాయిలు పెడుతున్నారు. నోట్ల వ్యవహారం తేలేదెన్నడో.. నా డబ్బు నాచేతికి వచ్చేదెన్నడో..! – శ్రీకాంత్ శర్మ, అయ్యప్ప దేవాలయం పూజారి, నాగనూల్, నాగర్‌కర్నూల్ జిల్లా -
తేడాలొస్తే.. సంగతి చూస్తా
డయల్ యువర్ కలెక్టర్‌లో కాటంనేని భాస్కర్ గ్రామీణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు ఏలూరు (ఆర్ఆర్ పేట) : మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తే.. అలాంటి వారి సంగతి తేలుస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. బోగస్ లెక్కలు చూపించి సొమ్ములు డ్రా చేస్తే సంబంధిత అధికారుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మానం, ఉపాధి హామీ పథకాలపై శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ అంశాలపై ప్రజలతో ఫోన్లో మాట్లాడిన ఆయన వారి సమస్యలు తెలుసుకుని, ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన జి.పాండురంగారావు ఫోన్ చేసి.. మరుగుదొడ్ల నిర్మాణంలో 40 శాతం నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. మరుగుదొడ్లు కట్టకపోయినా కట్టినట్టు చూపించి కొన్నిచోట్ల.. ఒక మరుగుదొడ్డిపై మూడేసి బిల్లులు చొప్పున మరికొన్ని చోట్ల డ్రా చేశారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో పెద్దఎత్తున యూనిట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్లు కట్టకుండా కట్టినట్టు లెక్కల్లో చూపి సొమ్ము డ్రా చేస్తే విచారణ జరిపిస్తామన్నారు. సంబంధిత అధికారుల నుండి సొమ్ము రికవరీ చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై 24 గంటల్లోగా పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డ్వామా పీడీ ఎం. వెంకటరమణను కలెక్టర్ ఆదేశించారు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన కూనపాముల రాజేష్ కలెక్టర్‌కు ఫోన్ చేసి.. తమ గ్రామంలో 2004లో నిర్మించిన మరుగుదొడ్లకు బిల్లులు చెల్లిస్తున్నారని, కొత్తగా నిర్మించుకున్న వారికి డబ్బు ఇవ్వకపోవడంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గ్రామ కార్యదర్శి పనిచేసే చోట నివాసం ఉండటం లేదని, గ్రామానికి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ.. తక్షణమే విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. ఏలూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ ఫోన్లో మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరిగిందని, ఆ గ్రౌండ్ రాళ్ళు, రప్పలతో ఉండటతో సరిగ్గా పరిగెత్తలేకపోయామని చెప్పింది. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మైదానాన్ని వాకర్లకు అనువుగా రాళ్లు రప్పలు లేకుండా తీర్చిదిద్దాలని కోరింది. దీనిపై ఎస్పీతో చర్చించి చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి గ్రామానికి చెందిన పరువు శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఇంటి పన్నును పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా అద్దెకున్న వారి పేరుతో గుమాస్తా మార్పు చేశాడని ఆరోపించాడు. దీనిపై విచారణ జరిపితే పెద్ద కుంభకోణం బయటపడుతుందని చెప్పగా.. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పాలకొల్లు ఈఓపీఆర్డీకి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, డీపీవో కె.సుధాకర్ పాల్గొన్నారు. -
బ్యాంకులకు సెలవులు.. జనాలు ఎటుపోతారో?
-
బ్యాంకులకు వరుస సెలవులు.. జనాలు ఎటుపోతారో?
టిక్..టిక్..టిక్మంటూ గడియారం చప్పుళ్లు రాజకీయ నేతలకు, సంపన్నులకు, బడాబాబులకు వినిపించడంలేదేమోగానీ సామాన్యుడికి, మధ్యతరగతి పౌరుడికి మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని వీరి బతుకులు బ్యాంకుల పాలయ్యాయి. బ్యాంకులు తెరిచే రేపటికోసం ఈ రాత్రి నుంచే గడియలు లెక్కబెట్టుకుంటున్నవారైతే కోకొల్లలు.. రేపు ఎలాగైనా ముందు వెళ్లి డబ్బు చేజిక్కించుకోవాలని అలారం పెట్టుకొని మరి మేల్కొంటున్న పరిస్థితి. పథకం ఫలితం ఎవరికి దక్కేనో? ఎప్పుడు దక్కేనోగానీ, బ్యాంకుల వద్ద పడిగాపులుగాయడం మాత్రం గత నెలరోజులుగా నిత్యకృత్యంగా మారింది. ఆ బ్యాంకు వరుసల్లోనే కూలిపోతున్నవారు కొందరైతే.. అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నవారు ఇంకొందరు. చిరాకుతో పరస్పరం నాకంటే నాకంటూ నాదంటే నాదంటూ ముష్టిఘాతాలకు దిగుతున్నవారు కూడా వీరిలో మినాహాయింపుకాదు. ఇది చాలదన్నట్లూ పోలీసుల లాఠీ దెబ్బలు అదనపు బహుమానం. దీంతో త్యాగాలు ప్రజలవి.. బోగాలు నాయకులవి అన్నచందాన పరిస్థితి మరోసారి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రజలు మావైపే ఉన్నారంటూ ప్రధాని, ఇతర నాయకులు ఏకపక్షంగా అభిప్రాయాలు ప్రకటించడం కూడా బ్యాంకులముందు పడిగాపులుగాస్తున్న వారిని విస్మయ పరుస్తోంది. బ్యాంకుల ముందు నిల్చున్న సెక్యూరిటీలతోటి బ్యాంకు ఉద్యోగులు, మేనేజర్లతోటి జనాలు ఓ చిన్నపాటి యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఆశ్చర్యం కాదు. కనీసం ఆర్బీఐ విధించిన షరతుల ప్రకారమైనా ప్రజలకు బ్యాంకులు డబ్బు చెల్లిస్తున్నాయా అది కూడా లేదు. దీంతో చాలిచాలని డబ్బుతో కొన్ని అవసరాలు తీరి.. ఇంకొన్ని తీరక తీవ్ర పరిస్థితులతోనే జనాలు అల్లాడిపోతుంటే ఇప్పుడు గుదిబండలాగా.. బ్యాంకులకు వరుసగా మూడు రోజుల సెలవులొచ్చాయి. రెండో శనివారం, ఆదివారం, సోమవారం ముస్లింల పర్వదినం మిలాద్-ఉన్-నబి సందర్భంగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఈ 72గంటలు ఎలా గడుస్తాయా అని ఆలోచనలో పడ్డారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని వారి పరిస్థితి మరింత దయనీయంగా ఈ మూడురోజులు మారనుంది. పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8 తెల్లవారి నుంచి ఇప్పటి వరకు బ్యాంకుల ముందు ప్రజల అవస్థలు ఏమాత్రం మారని పరిస్థితి. రోజురోజుకు బ్యాంకుల ముందు క్యూలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పోనీ ఏటీఎంలలో డబ్బు నింపుతున్నారా అంటే అది శూన్యం. బ్యాంకులు నడిచే రోజుల్లో మాత్రమే కొన్ని చోట్లల్లోనే చాలిచాలనంత డబ్బు పెడుతున్నారు. అది కూడా అలాపెట్టి పెట్టగానే అయిపోతోంది. సాఫ్ట్ వేర్ సమస్య అంటూ, డబ్బు అందడం లేదంటూ బ్యాంకులు వివరణ ఇస్తూ వస్తున్నాయి. ఈ తీరు ఇప్పటికే ప్రజానీకానికి తీవ్ర చిరాకులు తెప్పిస్తోంది. కొన్ని చోట్ల ఆందోళనలు కూడా మొదలవుతున్నాయి. జనాలు రోడ్లెక్కి బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులపై దాడులు చేస్తున్నారు. ఇప్పుడు మూడు రోజుల సెలవులు రావడం, అది కూడా వీకెండ్‌కావడంతో మరోసారి జనాల పరిస్థితి అధ్వాన్నంగా కనిపించనుంది. సెలవులను దృష్టిలో పెట్టుకునైనా అందుబాటులో ఉన్న ఏటీఎంలలో డబ్బులు నింపేస్తే పూర్తి స్థాయిలో కాకున్నా కొంతమేరకైనా తమకు ఉపశమనం కలిగించినట్లవుతుందని ప్రజలు వాపోతున్నారు. -
‘నోట్ల’ కష్టాలకు నెల..
రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నవంబర్ 8న అకస్మాత్తుగా ప్రక టన చేశారు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లేవీ చెల్లబోవంటూ షాకిచ్చారు. ఈ నిర్ణ యం అమల్లోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీ కట్టడి కోసమంటూ నోట్లను రద్దు చేసినా.. సాధారణ ప్రజలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ఎదుట గంటలకొద్ది క్యూలైన్లు. ‘నోట్ల’ సమస్య వల్ల దేశవ్యాప్తం గా వంద మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. నవంబర్ 8 500, 1,000 నోట్లను రద్దు చేస్తున్నటు ప్రధాని ప్రకటన. ఆ రోజు అర్ధరాత్రి నుంచే ఆ నోట్లు చెల్లబోవని వెల్లడి. డిసెంబర్ 30 వరకు పాత నోట్లు మార్చుకోవడానికి అవకాశం. ‘నోట్ల’లెక్కలు తేల్చడానికి మరుసటి రోజున బ్యాంకులకు సెలవు, రెండు రోజులపాటు ఏటీఎంల మూసివేత ప్రకటన. పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లు, విమాన- రైల్వే టిక్కెట్లు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ సేవలకు మూడు రోజులపాటు (11వ తేదీ వరకు) పాత నోట్లతో చెల్లింపులకు అవకాశం. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఒక్కొక్కరు రోజుకు రూ.4 వేలు పాత నోట్ల మార్పిడికి అవకాశం. ఏటీఎంలలో రోజుకు రూ.2 వేలు, బ్యాంకుల్లో రోజుకు రూ.10 వేలు విత్‌డ్రా పరిమితులు. మొత్తంగా వారానికి రూ.20 వేలే తీసుకోగలిగేలా ఆంక్షలు. చెక్కులు, డీడీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీలపై పరిమితి విధించలేదు. నవంబర్ 9 బ్యాంకులు,ఏటీఎంలు పనిచేయలేదు. ప్రజల్లో ఆందోళన. బ్యాం కుల్లో నగదు మార్పిడి కోసం ఏదైనా గుర్తింపుకార్డు ప్రతి సమ ర్పించాలంటూ నిబంధనలు. 11వ తేదీ అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు నిలిపివేత. రూ.2.5 లక్షలు దాటిన, లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను, జరిమానా వసూలు చేస్తామని ప్రకటన. నవంబర్ 10 కష్టాలు షురూ. డిపాజిట్లు, నగదు మార్పిడి కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లు జనంలోకి వచ్చాయి. ఏటీఎంల మూత. నవంబర్ 11 తొలిసారిగా తెరుచుకున్న ఏటీఎంలు. భారీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు లేకపోవడంతో.. అన్నీ వంద నోట్లే నింపిన అధికారులు. కొంత సేపటికే ఖాళీ. ప్రజలకు ఇబ్బందులు. పలు రంగాల్లో పాత నోట్ల వినియోగానికి ఇచ్చిన అవకాశాన్ని, టోల్ వసూలు నిలిపివేతను నవంబర్ 14 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ నిర్ణయం. నవంబర్ 12 బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద జనం అవస్థలు. నల్లధనం నియంత్రణకు మరిన్ని చర్యలుంటాయన్న ప్రధాని. నవంబర్ 13 ఆదివారం పనిచేసిన బ్యాంకులు. పెరిగిన క్యూలైన్లు. ఏటీఎం, బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో జనంలో ఆగ్రహావేశాలు. నగదు మార్పిడి పరిమితి రూ.4,500కు, ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి రూ.2,500కు, బ్యాంకుల్లో రోజుకు రూ.10వేల విత్‌డ్రా పరిమితిని ఎత్తివేస్తూ... వారానికి విత్‌డ్రా పరిమితి రూ.24,000కు పెంపు. కొత్త రూ.500 నోట్లు మార్కెట్లోకి. నవంబర్ 14 పెట్రోల్ బంకులు, ప్రభుత్వ సేవలు సహా పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. కరెంట్ ఖాతాల నుంచి విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. గురునానక్ జయంతి సందర్భంగా మూసి ఉన్న బ్యాంకులు. ఏటీఎంల వద్ద క్యూలైన్లు. పలు చోట్ల ఆందోళనలు వ్యక్తం చేసిన ప్రజలు ఠి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలను డిసెంబర్ 30వ తేదీ వరకూ ఎత్తివేస్తూ నిర్ణయం. నవంబర్ 15 కొనసాగిన క్యూలైన్లు. తొలి వారంలో ఏకంగా రూ.1,14,139 కోట్లు డిపాజిట్లు వచ్చినట్లు ఎస్బీఐ ప్రకటన. నవంబర్ 17 నగదుమార్పిడి పరిమితి రూ.2,000కు కుదింపు. వివాహాల కోసం రూ.2.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ ప్రకటన. రైతులకు విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. టోల్ వసూళ్ల నిలిపివేతను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల వరకు తీసుకునే అవకాశం. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఒకశాతం తగ్గించిన పలు బ్యాంకులు నవంబర్ 18 ‘నోట్ల రద్దు’తో 55 మంది మరణించారంటూ పార్లమెంటులో విపక్షాల గొడవ. ఢిల్లీలో ఆందోళనలు. నవంబర్ 22 బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేత. డిపాజిట్లకే అవకాశం. టోల్ వసూళ్ల నిలిపివేతను డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ ప్రకటన. పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులు డిసెంబర్ 15 వరకు పొడిగింపు. నవంబర్ 25 రిజర్వుబ్యాంకు శాఖల్లో మాత్రం నోట్ల మార్పిడి కొనసాగిస్తూ ప్రకటన. అటు జన్‌ధన్ ఖాతాల్లోకి కేవలం 14 రోజుల్లో రూ.27,200 కోట్లు డిపాజిట్ అయినట్లు 26న కేంద్రం వెల్లడి నవంబర్ 28 మూడు వారాల్లో రూ.8.45 లక్షల కోట్లు పాత నోట్లు డిపాజిట్ అరుునట్లు ఆర్బీఐ ప్రకటన. కొనసాగిన క్యూలైన్లు. నవంబర్ 30 జన్‌ధన్ ఖాతాల్లోంచి నెలకు రూ.10 వేల విత్‌డ్రా పరిమితి విధించిన ఆర్బీఐ. డిసెంబర్ 1 తార స్థాయికి కష్టాలు. వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులకు ఇబ్బందులు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకే ఇచ్చిన బ్యాంకులు. పెట్రోల్ బంకులు, విమాన టికెట్లు వంటి వాటిలో పాత నోట్ల చెల్లుబాటు గడువును 2వ తేదీ అర్ధరాత్రి వరకు కుదింపు (తొలుత డిసెంబర్ 15 వరకు గడువిచ్చారు). డిసెంబర్ 6 నోట్ల రద్దు’ తర్వాత రూ.2 వేల కోట్ల లెక్కల్లో చూపని ధనాన్ని వెల్లడించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటన. తమ దాడుల్లో రూ. 130 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు గుర్తించినట్లు వెల్లడి. డిసెంబర్ 7 బ్యాంకుల్లోకి రూ.11.55 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంకు. డిసెంబర్ 8 ‘నోట్ల’ ఇబ్బందులను తట్టుకునేందుకు నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహిస్తూ పలు ఉపశమన చర్యల ప్రకటన -
ఎన్నాళ్లీ పడిగాపులు?!
– అరకొరగా నగదు మార్పిడి, ఏటీఎంల పరిస్థితి మరీ దారుణం – సహకార బ్యాంకుల్లో అప్పుల జమ ఆపేసిన ఆర్బీఐ – పీవోఎస్ మిషన్ల ద్వారా ఎస్బీఐ ఆధ్వర్యంలో మినీ ఏటీఎంలు అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు కొత్త నోట్ల తిప్పలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు మంగళవారం కూడా జిల్లా అంతటా బ్యాంకులన్నీ ప్రజలతో పోటెత్తాయి. దాచుకున్న పాత రూ.500, రూ.1,000 ఇవ్వడం ద్వారా రూ.4,500 వరకు నగదు మార్పిడి జరుగుతోంది. ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకులో నగదు మార్పిడి బాగానే ఉన్నా... మిగిలిన బ్యాంకుల్లో తమ ఖాతాదారులకే అదీ కూడా నగదు నిల్వలను బట్టి రూ.2వేల నుంచి రూ.4 వేల వరకు ఇస్తున్నారు. దాని కోసం సామాన్య వర్గాలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. సాయంత్రం వరకూ నిరీక్షణ నోట్ల మార్పిడి కోసం ఉదయం 9 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నా... సాయంత్రానికి కాని కొంత డబ్బు లభించే పరిస్థితి లేదు. అన్ని బ్యాంకుల్లో రూ.500, రూ.1000 పాత నోట్ల డిపాజిట్లు కొనసాగుతున్నాయి. అయితే తొలి నాలుగు రోజుల పాటు ఉన్న రద్దీ ఐదో రోజు కనిపించలేదు. రూ.2.50 లక్షలకు మించి డిపాజిట్లకు ఆదాయపుశాఖ పన్ను పోటు ఉంటుందనే ఆందోళనతో కొత్త ఖాతాదారులు పాన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రధానంగా సాయినగర్ ఎస్బీఐ ప్రధాన శాఖ వద్ద జన జాతర కొనసాగుతుండగా గంటల కొద్దీ బారుల్లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని బ్యాంకుల వద్ద పోలీసు పహారా మధ్య నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. ఇబ్బందుల్లో ‘సహకార’ ఖాతాదారులు మంగళవారం నుంచి అన్ని రకాల సహకార బ్యాంకుల్లో రూ.500, రూ.1000 పాత నోట్ల డిపాజిట్లను రిజర్వ్‌బ్యాంకు రద్దు చేసినట్లు సమాచారం. దీంతో అప్పులకు జమ చేయడానికి వీలులేకుండా పోవడంతో ఖాతాదారులకు సరికొత్త ఇబ్బంది ఎదురైంది. రూ.100 అంతకన్నా తక్కువ విలువ చేసే నోట్లను మాత్రమే సహకార బ్యాంకుల్లో జమ చేసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. దిష్టిబొమ్మల్లా ఏటీఎంలు జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించి 520 వరకు ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఇవాళ... రేపు అంటూనే వారం రోజులుగా ఇవి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటీఎంలు పూర్తీ స్థాయిలో అందుబాటులోకి వస్తే జనం కష్టాలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. కనీసం రూ.100 నోట్లను రోజుకు రెండు మూడు సార్లు ఏటీఎంలలో నింపితే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చిరిగిన నోట్లే గతి వంద నోట్ల కొరత భారీగా ఉండటంతో రోజురోజుకూ ఇబ్బందులు ఎక్కువవుతున్నట్లు బ్యాంకర్లే చెబుతున్నారు. చాలా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చిరిగిపోయినవి, పనికిరావని లైన్లు గీసినవి, రిజర్వ్‌బ్యాంకుకు వెనక్కు పంపేందుకు ఉంచిన కాలం చెల్లిన రూ.100 నోట్లను ప్రజలకు అంటగడుతున్నారు. రూ.2 వేల నోటుకు చిల్లర దొరకడం తీవ్ర సమస్యగా పరిణమించిన నేపథ్యంలో ఏదో ఒకటిలే అంటూ ప్రజలు వాటినే తీసుకెళుతున్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో మినీ ఏటీఎంలు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ కొంత వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా ఎస్బీఐలో కరెంటు అకౌంట్ కలిగివున్న కొందరు ఖాతాదారులకు పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మిషన్లు ఇవ్వడంతో పాటు వారి ఖాతాల్లోకి రూ.50 నుంచి రూ.ఒక లక్ష వేశారు. మంగళవారం అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్లోని కార్తికేయ మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన పీవోఎస్ని ఎస్బీఐ ఆర్ఎం ఎంవీఆర్ మురళీకృష్ణ ప్రారంభించారు. ఏ బ్యాంకు ఖాతాదారులైనా అవసరాన్ని బట్టి రూ.1 వేయి నుంచి రూ.2 వేలు డ్రా చేసుకుసే సౌలభ్యం కల్పించారు. ఖాతాదారుడు తన క్రెడిట్‌కార్డులను స్కైప్ చేసి నగదు తీసుకోవచ్చు. -
అప్పటి వరకూ పాత నోట్లు కొనసాగించాలి
విజయవాడ: కొత్తనోట్లు పూర్తిగా చెలామణిలోకి వచ్చేవరకు పాత రూ.500, రూ.1000 నోట్లను కొనసాగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో సోమవారం నాయకులు బీసెంట్ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేత దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ... నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
'సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూడాలి'
-ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా : బ్యాంకుల్లో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1000, 500 నోట్లను రద్దు చేయడంతో బ్యాంకుల వద్ద సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులను, కష్టాలను పరిశీలించేందుకు, ఆదివారం కడ్తాల్ ఆంధ్రాబ్యాంకును ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకులో ఉన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడవలసి వస్తుందని, కేవలం రూ.2వేల వరకే నగదు మార్పిడి చేస్తున్నారని వారు వాపోయారు. ఆదివారం బ్యాంకులో నగదు నిల్వ అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారని, చాలామంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాల్సి వచ్చిందని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే బ్యాంకు మేనేజర్‌తో చర్చించారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వంశీచంద్‌రెడ్డి కోరారు. -
నోట్ల రద్దు పై నాడో మాట..నేడో మాట!
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను నిషేధిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మధ్య తరగతి, చిరు వ్యాపారులు, పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, కలుగుతోందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు నల్ల కుబేరులకు వత్తాసు పలుకుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజముంది? నిజానిజాలను కాస్త పక్కనపెట్టి సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం ఇదే అంశంపై బీజేపీ ఏమందో వీడియో సాక్షిగా పరిశీలించాల్సిన అవసరం, నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నకిలీలను, నల్లడబ్బును అరికట్టేందుకు అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ 2005 సంవత్సరానికి ముందున్న నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందంటూ సిఫార్సు చేశారు. ఈ చర్య వల్ల నల్లడబ్బు వెలుగులోకి రాకపోగా, మధ్యతరగతి, పేదలు, బడుగు వర్గాల ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పెద్ద ఎత్తున ఎగిరిపడింది. నోట్లను తాము నిషేధించడం లేదని, 2005కు ముందున్న నోట్లలో భద్రతా ఫీచర్లు తక్కువ ఉన్నాయన్న కారణంగా మాత్రమే వాటిని మార్చాలన్నది తమ అభిప్రాయమంటూ రఘురామ్ రాజన్ వివరణ ఇచ్చినా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఆ ప్రతిపాదనపై విరుచుకుపడ్డారు. పేదలకే కష్టాలు, కన్నీళ్లు ‘2005 సంవత్సరానికి ముందున్న నోట్లను ఉపసంహరించాలంటూ కొత్త విధానాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. నల్లడబ్బు నుంచి దృష్టిని మళ్లించేందుకు తెచ్చిన ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించాలి. ఈ దేశంలో దాదాపు 65 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవు. ఉన్నవారికి కూడా వాటి బ్రాంచిలు దూరంగా ఉన్నాయి. వారిలో చదువుకున్న వారు కూడా తక్కువే. వారు తమ జీవితాంతం కష్టపడి కూడబెట్టిన కాసిన్ని కాసులను ఇంట్లోనే దాచుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల దెబ్బతినేది నల్లడబ్బు కాదు. వారు చాలా పొదుపుగా దాచుకున్న డబ్బుపై దెబ్బ పడుతుంది’ అని అన్నారు. పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు డబ్బులు మార్చుకునేందుకు దలారుల చేతుల్లో చిక్కుకుని, కొంత డబ్బును కోల్పోతారని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల కుబేరులకు మార్గాలుంటాయి ‘నల్లడబ్బున్న వారు నగరాల్లో ఉంటారు. వారికి తమ డబ్బును మార్చుకునేందుకు అనేక మార్గాలుంటాయి. కానీ పేద వాళ్లు, సామాన్యులు, మహిళలు ఏం కావాలి? తమ భర్తల సంపాదనను అటకమీద డబ్బాల్లో, పప్పులో, బియ్యంలో దాచుకునే జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి’ అని ఎంతో ఆవేదనతో మీనాక్షి లేఖి వ్యాఖ్యానించారు. అమెరికా డాలర్లలో, విదేశీ కరెన్సీలో దాచుకునే నల్ల కుబేరులకు ఏం కాదని, పేదలు దాచుకునే నగదే కాలి బూడిదవుతుందని కూడా ఆమె హెచ్చరించారు. అంతటితోని ఆమె సరిపెట్టుకోకుండా ‘ఎకనామిక్ టై మ్స్’ పత్రికలో ఓ చిన్న ఆర్టికల్ కూడా రాశారు. పేదలపై ప్రభావం ముందే చెప్పాలి ‘ఆర్బీఐ తాను తీసుకునే నిర్ణయం వల్ల ఎంత కరెన్సీమీద ప్రభావం ఉంటుందో కచ్చితంగా లెక్కకట్టాలి. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతుందో కూడా తేల్చాలి. పేద ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అంచనా వేయాలి. మొత్తంగా ఉండే ప్రభావం ఏమీటో తేల్చి, వాటి వివరాలను ప్రజల ముందుంచాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి’ అని ఆ పత్రికలో ఆమె రాశారు. మరి ఆమె చెప్పినట్లుగా నోట్లను నిషేధించే ముందు మోదీ ప్రభుత్వం ఎంత కసరత్తు చేసిందో, ఎన్ని వివరాలు ప్రజల ముందుంచిందో, అప్పడో మాటకు ఇప్పుడో మాటకు కారణాలేమిటో కారకులను అడగి తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ప్రతిపక్షాల విమర్శలను పక్కన పెట్టి నేడు సామాన్య ప్రజలు పడుతున్న నోట్ల కష్టాలను అమిత్ షా స్వీయ నేత్రాల ద్వారానే చూసి తెలిసికుంటే ప్రజల కష్టాలతీర్చే మార్గాన్ని అన్వేషించవచ్చు! -
’నోట్ల’ పై నాడో మాట నేడో మాట, ఏమిటీ నైజం?
-
జనమంతా బ్యాం 'క్యూ' లో నే!
చాంతాడంత లైన్లు.. గంటల తరబడి నిరీక్షణ రాజధానితోపాటు రాష్ట్రమంతటా ఇదే సీన్ పలుచోట్ల తోపులాటలు.. బందోబస్తు మధ్య కార్యకలాపాలు కొన్ని బ్యాంకుల్లో తెరిచిన కొద్ది గంటల్లోనే ఖజానా ఖాళీ రూ. 2 వేల నోటు అందుకుని మురిసిపోరుయిన ప్రజలు నోట్ల మార్పిడి, డిపాజిట్లకు పోటెత్తిన జనం బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు బారులు సాక్షి, హైదరాబాద్: కరెన్సీ కదిలింది.. రెండ్రోజులుగా బీరువాల్లో, పర్సుల్లో, పోపుడబ్బాల్లో అచేతనంగా పడి ఉన్న పెద్ద నోటుకు ప్రాణమొచ్చింది.. బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆపపోపాలు పడుతూ వెళ్లి క్యూ కట్టింది..! తళతళలాడే కొత్త రూపాన్ని ధరించి జేబులో చేరింది!! నిన్నమొన్నటిదాకా పాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లక ఇబ్బందులు పడ్డ జనం గురువారం వాటిని మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు. వారితోపాటు డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చినవారితో ఉదయం 8 గంటల నుంచే బ్యాంకులు, పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. రాజధాని భాగ్యనగరంతోపాటు రాష్ట్రంలో ఎక్కడచూసినా బ్యాంకుల ముందు చాంతాడంత బారులు కనిపించాయి. పోలీసు బందోబస్తు, గంటల తరబడి పడిగాపుల మధ్య... కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ.2 వేల నోట్లు అందుకున్న వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. కొన్నిచోట్ల నగదు చాలకపోవడంతో బ్యాంకులు మధ్యాహ్నం వరకే సేవలను నిలిపివేశారుు. దీంతో జనం నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు నడుమ బ్యాంకు కార్యకలాపాలు సాగాయి. అటు జిరాక్స్ సెంటర్లు కూడా కిటకిటలాడాయి. నోట్ల మార్పిడికి, డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్ పత్రాలు తప్పనిసరి అని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో జనం జిరాక్స్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. గంటల తరబడి పడిగాపులు జనం ఉదయం 8 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకొని లైన్లలో నించున్నారు. ఉదయం 10.30కు బ్యాంకులు తెరుచుకున్నారుు. ఒక్కో వినియోగదారుడు ఐదారు గంటలకుపైనే లైన్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉదయం బ్యాంకుకు వచ్చిన వారు మధ్యాహ్నం 3 తర్వాతే బయటకు వెళ్లారు. కొత్త రూ.2,000 నోట్లు చెలామణిలోకి వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో అన్ని బ్యాంకుల్లో అందుబాటులోకి రాలేదు. పలుచోట్ల కొత్త నోట్లను అందుకున్న వాళ్లు మాత్రం సంతోషం వ్యక్తంచేశారు. మొత్తంగా పెద్దనోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా కకావికలమైన నగరం గురువారం కాస్త తెరిపిన పడింది. చాలా మంది తమ వద్ద ఉన్న పాత నగదును ఖాతాల్లో జమ చేసుకొనేందుకు పోటీ పడ్డారు. ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వాళ్లకు రూ.10 వేల వరకు అవకాశం కల్పించారు. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాలను మరుసటి రోజుకు వాయిదా వేశారు. మధ్యాహ్నం వరకే క్లోజ్... చంపాపేట్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు గురువారం వైద్య చికిత్సల కోసం కోఠీలోని ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు సీటీ స్కాన్ రాశారు. వెంటనే తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకొనేందుకు కోఠీలోని ఎస్బీఐకి వెళ్లాడు. అప్పటికి మధ్యాహ్నం 2.30 అయింది. అప్పటికే కొత్త రూ.2000 నోట్లు, పాత వంద నోట్లు అయిపోయాయంటూ బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. శ్రీనివాస్‌కు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఆరా తీస్తే రూ.50 లక్షల వరకు తాము పై అధికారులను అడిగితే బ్యాంకుకు కేవలం రూ.10 లక్షలే అందజేశారని చెప్పారు. ఒక్క కోఠీలోనే కాదు.. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. విద్యానగర్, కాచిగూడ, చిలకలగూడ, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులు మధ్యాహ్ననికే కార్యకలాపాలను నిలిపివేశాయి. మరోవైపు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పినా.. చాలాచోట్ల అది కనిపించలేదు. సిబ్బంది కొరత, ఇతర కారణాల వల్ల ఒకట్రెండు కౌంటర్లనే ఏర్పాటు చేశారు. దీంతో రద్దీ బాగా పెరిగింది. ఈస్ట్, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో సర్వర్ డౌన్ వల్ల కొన్ని బ్యాంకుల్లో సేవలు తాత్కాలికంగా స్తంభించాయి. పోస్టాఫీసుల్లో గందరగోళం... రాజధానిలో పలుచోట్ల పోస్టాఫీసుల్లోకి కొత్త కరెన్సీ, వంద నోట్లు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో క్యూలో నించున్న వారు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పంపిణీ మొదలైంది. తప్పని చిల్లర తిప్పలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరితోపాటు పలు జిల్లాల్లో గురువారం కూడా జనానికి చిల్లర తిప్పలు తప్పలేదు. చిల్లర లేక పెట్రోల్ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కోదాడ పట్టణ సమీపంలో చిల్లర ఇవ్వలేదంటూ జగ్గయ్యపేట డిపోకు చెందిన ఓ బస్సు కండక్టర్ ప్రయాణికులను కోదాడ శివారులో దింపేశాడు. ఇక సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 130 బ్యాంకుల్లో గురువారం ఒక్కరోజే రూ.వంద కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర జమ అరుునట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాల్లో 367 బ్యాంకులకు జనం క్యూ కట్టారు. పోస్టాఫీస్‌లో డబ్బుల మార్పిడి జరగలేదు. డిపాజిట్లు మాత్రమే చేశారు. కొత్తనోటు చూడముచ్చటగా ఉంది కొత్త రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి ఉదయ మే బ్యాంకుకు వెళ్లాను. భారీ క్యూలైన్లో నిలబ డి నోటు చేతికి తీసుకు న్నాను. నోటు కొత్తగా ఉంది. పాత వెయి నోటు అంత అందంగా లేకున్నా చూడముచ్చటగా ఉంది. - తుమ్మలపల్లి మహేశ్, హైదరాబాద్ కాస్త భిన్నంగా ఉంది పాత వెయి నోటు కంటే రూ.2 వేల నోటు కొంత భిన్నంగా ఉంది. మూడు గంటల పాటు లైన్లో నిలబడి పాత నోట్లను మార్పిడి చేసుకున్నాను. - బాలు, హైదరాబాద్ రెండోరోజూ స్తంభించిన మార్కెట్లు రెండోరోజు కూడా హైదరాబాద్‌లోని మార్కెట్లు కళా విహీనంగానే కనిపించారుు. అన్నిచోట్ల కార్యకలాలు స్తంభించారుు. రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లు వెలవెలబోయారుు. సికింద్రాబాద్ జనరల్ బజార్, రాణిగంజ్, మోండా మార్కెట్. కోఠి, మలక్‌పేట్, బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, తదితర ప్రాంతాల్లో గిరాకీ లేక వ్యాపారులు ఉసూరుమన్నారు. నిత్యం రద్దీగా ఉండే బేగంబజార్ వంటి ప్రాంతాలు కూడా వెలవెలబోయారుు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలోనూ వ్యాపారం ఇంకా జోరందుకోలేదు. -
'చీఫ్ కమిషనర్‌ను నియమించాలి'
ఒంగోలు : సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను వెంటనే నియమించాలని ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు సంఘం రాష్ట్ర కార్యదర్శి జి. బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి పుష్కర కాలమైనా ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉందని విచారం వ్యక్తం చేశారు. 2010లో నియమించిన చీఫ్ కమిషనర్ జన్నత్‌హుస్సేన్ అనంతరం ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఉమ్మడి కమీషన్ కార్యాలయం హైదరాబాద్‌లోనే కొనసాగుతోందన్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా స్థానికంగా పరిష్కారం కాకపోవడంతో సంబంధిత వ్యక్తులు హైదరాబాద్ వెళ్లలేక మధ్యలోనే ఆగిపోతున్నారన్నారు. కమిషనర్ల సంఖ్యను పెంచి చీఫ్ కమిషనర్ కార్యాలయాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసులు వాయిదా వేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. సమాచార హక్కు చట్టం అమలుచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా కో ఆర్డినేషన్ కమిటీని కలెక్టర్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
17 నుంచి సీపీఎం పాదయాత్ర
ఖమ్మం : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కోసం ఈ నెల 17న ఆదిలాబాద్ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రజల బాగు కోసం తెచ్చుకున్నదని, ప్రజల పక్షాన నిరంతరం సీపీఎం పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేపడుతుంటే సీఎంగా ఉన్న కేసీఆర్ అడ్డుకుంటామని చెప్పడం సరైంది కాదన్నారు. జిల్లాల ఏర్పాటును సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తుందని, కానీ, ప్రస్తుతం చేసిన జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత లోపించిందన్నారు. 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించే సమయంలో ఏ ప్రాతిపాదికన చూసినా శాస్త్రీయత లేదని తమ్మినేని పేర్కొన్నారు. -
కేసీఆర్ అసమర్థత వల్లే ఇబ్బందులు
-
కేసీఆర్ అసమర్థత వల్లే ఇబ్బందులు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అసమర్థత, అనుభవరాహిత్యంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయిన తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వాలదే బాధ్యత అనడం సిగ్గుచేటన్నారు. నాలాలపై ఆక్రమణలు కూల్చివేస్తామంటే ఎవరు అడ్డుకున్నారని, ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలో కేవలం రెండు బంగళాలను కూల్చివేసి ఎందుకు ఆపారని, ఎన్ కన్వెన్షన్ సెంటర్లో బోర్డును పెట్టి ఎందుకు తీసివేశారని ప్రశ్నించారు. -
జిల్లాలో విస్తారంగా వర్షాలు
ఉపరితల ఆవర్తన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో బుధవారం ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. జిల్లాలో 6 మిల్లీ లీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడలో సాయంత్రం అర్ధగంటపాటు కుండపోతగా వర్షం కురిసింది. ఆ తర్వాత కాస్త తగ్గినా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. బందరురోడ్డు, ఏలూరురోడ్డు, ఐదో నంబరు రోడ్డు, వన్‌టౌన్‌లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. డ్రెయిన్లలో నీరు పొంగి పొర్లింది. వాహనచోదకులు, విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా స్తంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్షం వల్ల వరి, పత్తి పైరుకు మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. – మచిలీపట్నం/విజయవాడ -
పార్వతీపురంలో భారీ వర్షం
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరహాల గడ్డ సమీపంలోని రాజీవ్ గృహకల్పలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని సెంటర్ సమీపంలో భారీ వర్షానికి ఓ ఇంటి ప్రహరి గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
సగటు మనిషి సమస్యలపై టీవీ యాంకర్ల శీతకన్ను
అవలోకనం ప్రకటనదారులు ఖర్చుపెట్టగల సామర్థ్యమున్న వినియోగదారు బృందాలపైనే ఆసక్తి చూపుతుంటారు. ఈ తరహా వినియోగదారులను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి టీవీ చానళ్లు ఈ బృందాల ఆకాంక్షలను పట్టించుకునే కంటెంట్, రిపోర్టులపైనే దృష్టి పెట్టితీరాలి. అందుకనే పోషకాహార లేమి, ప్రాథమిక పాఠశాలలను పోటీతత్వంతో నడపడంలో ప్రభుత్వాల అసమర్థత వంటి అంశాలు టీవీ చానళ్ల ప్రైమ్‌టైమ్ చర్చల్లోకి రావు. అందుకే ఉన్నత తరగతి బాగా ఆసక్తి చూపే ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపైనే అతిశయించిన స్థాయిలో చర్చ చేస్తుంటారు. భారత్‌లో టీవీ యాంకర్లు మరీ శక్తిమంతులుగా అవతరించారా? ప్రత్యేకించి టైమ్స్ నౌ ఆర్నాబ్ గోస్వామి వంటి ఇంగ్లిష్ యాంకర్ల విషయానికి వస్తే నేను అవుననే సమాధానమిస్తాను. శక్తిమంతులు అంటే నా ఉద్దేశం... ప్రతిరోజూ దేనిపై చర్చ సాగాలి, ఏది ముఖ్యమైనది అనే అంశాన్ని వీరు ప్రభావితం చేస్తారనే. ఇది ప్రింట్ మీడియాలోనూ, ఇంటర్నెట్లోనూ ఉన్న జర్నలిస్టులకు లేని, ఎన్నటికీ వారు కలిగివుండని అధికారం. గోస్వామి వంటి యాంకర్లు కలిగిస్తున్న ఈ ప్రభావం చాలావరకు ప్రతికూల మైనదే అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి వారి దృష్టంతా ఉన్నత వర్గ ఆరా టాలకు సంబంధించిన అంశాలపైనే ఉంటుంది. దేశంలో ఆరోగ్యం, ప్రాథమిక విద్య, పోషకాహారం వంటి సమస్యల బారినపడుతున్న కోట్లాది మెజారిటీ ప్రజ లకు చెందిన అంశాలను వీరు చర్చించరు. ఇలా అంటున్నానంటే యాంకర్ ఒక దుష్టుడనీ, హాని కలిగించే వాడనీ అర్థం కాదు. ఇలా జరగడానికి, ఇలాంటి పరిస్థితి అంత సులభంగా మారకపోవడానికి వ్యవస్థాగత కారణాలు చాలానే ఉన్నాయి. మొదటది. భాష పరంగా భారత్ ఒక అసాధారణమైన జాతి. ఉన్నత వర్గాలు విదేశీ భాషనే తమ వ్యవహార భాషగా మార్చుకున్న ఒకే ఒక ప్రధాన దేశం ఇది. దీన్ని తీవ్రమైన సాంస్కృతిక పతనమనే చెప్పాలి. భారతీయుల్లో దాదాపు పది శాతం మంది ఏదో ఒక రకంగా ఇంగ్లిష్‌ను మాట్లాడగలరని అంచనా. ఈ పదిశాతం మంది భారతీయుల్లో పావుశాతం అంతకంటే తక్కువ జనా భాకు ఇంగ్లిష్ ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఉంటోందని నా భావన. ఇంగ్లిష్ ఒక అనుసంధాన భాషగా ఉంది కాబట్టే ఈ ఉన్నత వర్గమే భారత్‌లో భాషాపరంగా అనుసంధానమై ఉన్న ఏకైక జనాభాగా ఉంది. ఒక పేద తమిళుడు ఒక నిరుపేద కశ్మీరీతో లేదా గుజరాతీయుడితో మాట్లాడేందుకు మార్గమే లేదు. కానీ ఈ రాష్ట్రాలకు చెందిన ఉన్నత తరగతి ప్రజలు మాత్రం ఇంగ్లిష్‌లో సులభంగా మాట్లాడుకోగలరు. ఈ వర్గం ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో సులభంగా పనిచేయడానికి, డజను అధికార భాషలను కలిగి ఉన్న ఉపఖండంలో ఎలాంటి కష్టం లేకుండా వీరు ఒకచోటి నుంచి మరొక చోటికి బదిలీ కావడానికి ఇదే కారణం. రెండో కారణం ఏమిటంటే, భారత్‌లో మీడియా అత్యధికంగా సబ్సిడీకర ణకు గురైంది. దేశంలో వార్తాపత్రికలు చాలావరకు 4 రూపాయలకే లభ్యమవు తాయి. ఈ ధరకు మీరు 40 పేజీల పూర్తిస్థాయి ఇంగ్లిష్ పత్రికను పొందగలరు. అమెరికాలో, యూరప్‌లో మరెక్కడైనా సరే ఇదే పత్రిక ధర రూ.70 లుగా ఉంటుంది. మన పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో చూసినా భారత్‌లోని పత్రికల కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధర ఉంటుంది. న్యూస్‌ప్రింట్ ధర అంటే వార్తలను ముద్రించే పేపర్ ధర ప్రపంచవ్యాప్తంగా ఒకటే. భారత్‌లోని ప్రధానమైన దినపత్రికలు కెనడాకు చెందిన న్యూస్‌ప్రింట్‌ను డాలర్లలో కొంటుంటాయి. నా అంచనా ప్రకారం ఒక్కొక్క పేపర్ అచ్చయ్యేందుకు కనీసం రూ. 12లు అవుతుంది. మరి పత్రికా యజమానులు పాఠకుడికి అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు? బహుశా ప్రకటనదారులే కావచ్చు. అదేవిధంగా టాటా స్కై ఇంగ్లిష్ న్యూస్ ప్యాకేజీ 20 ఇంగ్లిష్ వార్తా చానళ్లను నెలకు రూ. 60లకే అందిస్తోంది. అంటే టైమ్స్ నౌ టీవీ చానల్‌ను మనం రోజుకు 3 రూపాయల ఖర్చుతో చూడవచ్చు. అదే అమెరికాలోని ఫాక్స్ న్యూస్‌కు మనం చందా కట్టా లంటే 20 రెట్లు ఎక్కువ చెల్లించాలి. మళ్లీ ప్రశ్నిస్తున్నా. మన ఇంగ్లిష్ చానళ్లను అంత సబ్సిడీ ధరలకు ఎవరు అందిస్తున్నారు? యాంకర్ల వేతనాలను ఎవరు చెల్లిస్తున్నారు? అంటే ప్రకటనదారులే అని చెప్పాలి. ప్రకటనదారులు కొన్ని వినియోగదారు బృందాలపట్లే.. అంటే ఖర్చుపెట్టగల సామర్థ్యమున్న బృందాలపైనే ఆసక్తి చూపుతుంటారు. ఈ తరహా వినియోగదారు లను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి టీవీ చానళ్లు ఈ బృందం ఆకాంక్ష లను పట్టించుకునే కంటెంట్, రిపోర్టులపైనే దృష్టి పెట్టితీరాలి. అందుకనే పోషకా హార లేమి, ప్రాథమిక పాఠశాలలను పోటీతత్వంతో నడపడంలో ప్రభుత్వాల అసమర్థత వంటి అంశాలు టీవీ చానళ్ల ప్రైమ్ టైమ్ చర్చల్లోకి రావు. అందుకే ఉన్నత తరగతి బాగా ఆసక్తి చూపే ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపైనే అతిశయించిన స్థాయిలో చర్చ చేస్తుంటారు. అయితే తరచుగా యాంకర్లు తమ కంటెంట్ జనాదరణకు సంబంధించిన ఈ వ్యవస్థాగత అంశాలను తమ వ్యక్తిగత ప్రతిభతో గందరగోళపరుస్తుంటారను కోండి. అయితే ఈ వ్యవస్థాగత కారణాల వల్లే ఇంగ్లిష్ యాంకర్ అత్యంత శక్తిమం తుడు అవుతున్నాడు. గడిచిన కొన్ని సంవత్సరాల్లో అర్నాబ్ వంటి యాంకర్లు చేస్తున్న డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వమే తన విధానాలను, చర్యలను సవ రించుకోవలసి వచ్చిందన్న మాట వాస్తవం. ప్రభుత్వంలో కాస్త వివేకవంతుడైన వ్యక్తి ఈ విషయంలో తన విశ్లేషణను నాతో పంచుకున్నారు. దాంట్లో కొంత భాగాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆయన ఇలా చెప్పాడు: ‘అర్నాబ్ ఇప్పుడు ఎజెండాను రూపొందిస్తున్నారు... చైనా, పాకిస్తాన్ల నుంచి భారత్‌కు ఇక్కడి నుంచి ఆ దేశాలకు నేతలు చేసే సందర్శనలను సరిహద్దుల్లోంచి జొరబడుతున్న చొరబాటుదారుల చిత్రాలతో, లేక ఇన్ఫ్రారెడ్ చిత్రాలతో చూపిస్తుంటారు. అలాంటి సందర్శనలను నిలిపివేయిం చడం లేదా దాని ప్రభావాన్ని పలుచబారేలా చేయడమే దీని లక్ష్యం.’ ఇలాంటి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుంది. ఎందుకంటే టీవీ యాంకర్ అనేవాడు పాపులారిటీ, రేటింగుల కంటే మించిన ప్రాధాన్యత కలిగిన వాడు కాదు. తమకున్న జనాకర్షణ జాతి హితంతో ముడిపడి ఉందని అతడు లేదా ఆమె భావిస్తూండవచ్చు. అయితే కొన్ని అంశాలలో ఇది వాస్తవం కాదు అనడంలో వివా దమే లేదు. అలాంటి సందర్భాల్లో మనకు ఎంత నష్టం జరుగుతుంది? దుర దృష్టవశాత్తూ టీవీ చర్చలో ఇది ఒక అంశంగా ముందుకు రావడం లేదు. (వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ) -
విన్నపాలు వినవలె..!
గుంటూరు వెస్ట్ : జిల్లాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ ప్రజా సమస్యల వేదికలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈఓ సోమేపల్లి వెంకటసుబ్బయ్య, డీఆర్ఓ కె.నాగబాబు, డీఈఓ కేవీ శ్రీనివాసరెడ్డి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ సత్యకుమార్ తదితరులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ సత్వరమే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గిరిజన భవన్‌ను నిర్మించాలి –కె.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య సేవా సంఘం అధ్యక్షుడు నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ ఎదుటగల జెడ్పీ స్థలంలో గిరిజన భవన నిర్మాణం కోసం గతంలో 27 సెంట్ల భూమిని కేటాయించారు. ఆ స్థలంలో ఆగస్టు 9వ తేదీన నిర్వహించే ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజున గిరిజన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవానికి నగరంలో విద్యుద్దీపాలతో లైటింగ్ ఏర్పాటు చేయాలి. నివేశనా స్థలాలు ఇవ్వాలి – కంభంపాటి ఆనందకుమార్, జిల్లా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) నగరంలోని తారక రామానగర్, సీతమ్మకాలనీ, కోబాల్డ్‌పేట, పీఎస్‌నగర్, శారదాకాలనీ, తుళ్లూరు మండలంలోని పెదపరిమి, అనంతవరం తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఇళ్లస్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నివేశన స్థలాల కోసం గతంలో అనేకమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తక్షణమే ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. -
'మీ అవినీతిని ప్రశ్నించడమే తప్పా..?'
హైదరాబాద్: ''మీ అవినీతిని ప్రశ్నించడమే మేం చేసిన తప్పా..?'' అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగుతారా? అని మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ శాసనసభను దిగజార్చారని విమర్శించారు. శాసనసభలో సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏడుసార్లు సమావేశమైందని గుర్తుచేశారు. ఈ సమావేశాల్లో ఒక్కసారైనా ప్రజా సమస్యలపై చర్చించారా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంగా తాము సహకరిస్తామన్నా టీడీపీ ప్రభుత్వం నుంచి స్పందన శూన్యమన్నారు. రెండేళ్ల పాలనపై ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండని సూచించారు. ఇకపై ప్రజాసమస్యలపై దృష్టి సారించండని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. -
క్రమబద్ధీకరించని కట్టడాలను కూల్చేస్తాం
- చట్టపర అడ్డంకులు, ఇతర అభ్యంతరాలు లేకుంటేనే క్రమబద్ధీకరణ: తలసాని - దేవాదాయ, వక్ఫ్, నాలా, చెరువు, మున్సిపల్ స్థలాల్లో నిర్మాణాలను ఉపేక్షించం సాక్షి, హైదరాబాద్: చట్టపరమైన అడ్డంకులు, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధీకరించేందుకు ఆస్కారం లేని అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో దేవాదాయ, వక్ఫ్ భూములు, నాలాలు, చెరువులు, మున్సిపల్ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు వీలు కాదని, వాటిని కూల్చివేయక తప్పదని చెప్పారు. కూల్చివేతల వల్ల ఇళ్లను కోల్పోయే పేదలకు ప్రభుత్వం అమలు చేయనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద పునరావాసం కల్పిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు, ప్రభుత్వ సలహాదారుడు పాపారావుతో మంత్రి తలసాని నేతృత్వంలోని కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ, కొత్త భవన నిర్మాణ పాలసీ రూపకల్పన తదితర అంశాలపై చర్చించింది. అనంతరం మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ నగరంలోని అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం త్వరలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణతో పాటు భవిష్యత్‌లో మళ్లీ కొత్త అక్రమ కట్టడాలు పుట్టుకురాకుండా నియంత్రించాలన్న ఉద్దేశంతో చివరిసారిగా ఈ పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. భవిష్యత్‌లో క్రమబద్ధీకరణలకు అవకాశం ఉండబోదని, ఒకవేళ ఎక్కడైనా అక్రమ కట్టడం/లే అవుట్ వెలిసినా.. ఆ ప్రాంత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కొత్త భవన నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. తాకట్టు(మార్ట్గేజ్) నిబంధన వల్ల ప్రస్తుతం పేదలు 100 గజాలు, 150 గజాల్లో సైతం ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి పొందలేకపోతున్నారని, పేదలకు ఈ విషయంలో సడలింపు ఇస్తామన్నారు. నగరంలోని కోటి 42 లక్షల మంది జనాభా అవసరాలకు తగ్గట్లు సదుపాయాలను కల్పించేందుకు బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకనే అక్రమ కట్టడాలు, లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయని, దీనికి పరిష్కారంగా అన్ని శాఖల అనుమతులు ఒకే దగ్గర లభించేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి తలసాని చెప్పారు. -
నెలరోజుల్లో ఇరిగేషన్ పాలసీ
- సీఎం ప్రకటిస్తారన్న భారీ నీటిపారుదల మంత్రి హరీష్‌రావు - ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తాం.. రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు - 24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే.. - రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు సత్తుపల్లి/ వేంసూరు:‘తెలంగాణలో విద్యుత్ లేకుం డా చేస్తే పంటలు ఎండిపోయి ప్రజలు ఇబ్బందులు పడతారనే కుట్రతో అర్ధరాత్రి అడ్డగోలుగా చంద్రబాబు తొమ్మిది మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారు. లోయర్ సిలేరును తెలంగాణకు కాకుండా చేసి.. ఇప్పుడు విభజనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అని భారీ నీటి పారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. బేతుపల్లి ప్రత్యామ్నాయ వరద కాలువకు బుధవారం రాత్రి నీరు విడుదల చేశారు. అనంతరం వేంసూరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. చంద్రబాబునాయుడు లోయర్ సిలేరు ప్రాజెక్టు లేకుండా చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చారన్నారు. కేసీఆర్ పారిశ్రామిక పాలసీ ప్రకటించిన తరువాత పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పరుగులు తీయటం బాబుకు మింగుడు పడటం లేదన్నారు. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో జిల్లాకు ఇరిగేషన్ పాలసీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల్లో ప్రకటిస్తారని తెలిపారు. దుమ్ముగూడెం వద్ద బ్యారెజ్ కట్టలేదు కానీ.. మోటార్లు తెప్పించి బిల్లులు మింగేశారని ఆరోపించారు. జరిగిన ఖర్చు వృథాకాకుండా రిటైర్డ్ ఇంజనీర్లతో రీ-డిజైన్ చేయించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు లిఫ్ట్ సంఖ్యను తగ్గిస్తూ త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మొదటి దశలో చెరువులన్నీ మిషన్ కాకతీయలో బాగు చేసుకుంటున్నామని.. మీడియం ఇరిగేషన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ముందుకు వెళ్తున్నామన్నారు. పత్రి మండల కేంద్రంలో గౌడౌన్ ఏర్పాటు కోసం రూ.85 కోట్లు మంజూరు చేశామన్నారు. ఉక్కుఫ్యాక్టరీ నిర్మిస్తాం.. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్రప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నామని మంత్రి అన్నారు. జీ-4 దశలో ఐరన్ ఓర్ ఉందన్నారు. ఎక్స్‌ఫ్లోరేషన్ చేసి జీ-4 జీ-3 దశకు తెచ్చి తెలంగాణలో ఐరన్‌ఓర్ వెలికితీత పనులు సింగరేణికి అప్పగించామని.. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు. పత్తి ైరె తుల మద్దతు ధర కోసం సీసీఐతో చర్చిస్తున్నామన్నారు. జిల్లాకు నాలుగేళ్లలో గోదావరి జలాలు తీసుకొస్తామని రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బేతుపల్లి ప్రత్యామ్నాయ వరద కాలువ నీటి విడుదల చేయటం నా పూర్వ జన్మ సుకృతమన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జలగం వెంకటరావు, బాణోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, వేంసూరు జెడ్పీటీసీ గుగులోత్ భాషా, ఎంపీపీ మోటపోతుల జగన్నాథం, సర్పంచ్ తక్కెళ్లపాటి గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు
♦ బీఎస్ఎన్ఎల్ అధికారుల అలసత్వంతో ప్రజల అవస్థలు ♦ ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి గుంటూరు రూరల్ : ఓ పక్క రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతుంటే మరో పక్క ఆన్లైన్ పనిచేయక మరిన్ని ఇంబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా నల్లపాడు గ్రామం లో బీఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం కలగటంతో రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రోడ్డు విస్తరణలో భాగంగా వైర్లు తెగి అన్లైన్ వ్యవస్థ పనిచేయకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలంటున్నారు. బీఎస్ఎన్ఎల్ అధికారుల అలసత్వం వల్లే ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండిపడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్సార్‌జిల్లాలో వర్షం బీభత్సం
వైఎస్సార్‌జిల్లా: అకాల వర్షం రావడంతో వైఎస్సార్‌జిల్లా ఓబుల వారిపల్లి మండల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షానికి మండల పరిధిలోని పది గ్రామాల్లో 100 కు పైగా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 50 కి పైగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయియి. దీంతో మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు.. రవాణ సౌకర్యాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న వేధింపులు
పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథిపై కేసు నమోదు కంకిపాడు: ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నేతలు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. మత్స్యకారులకు అండగా నిలిచిన ఆ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథిపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలో మత్స్యకారులు నిర్మించుకున్న అభయాంజనేయస్వామి దేవాలయం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం ఉంది. దీనిపై వెఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.పార్థసారథి మద్దూరు పంచాయతీ కార్యదర్శి సీహెచ్ కిరణ్‌ను ఫోన్లో ప్రశ్నిం చారు. ఆయన కంకిపాడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. పార్థసారథి తనతో ఫోన్లో దురుసుగా మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఒత్తిడి మేరకు శనివారం కేసు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
ప్రశ్నిస్తే దుర్మార్గులంటారా?: జానారెడ్డి
ప్రతిపక్షాన్ని తూలనాడటం కేసీఆర్ మానుకోవాలి సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను విస్మరించినందువల్లే తమను ప్రతిపక్షంలో కూర్చోపెట్టారని, ప్రస్తుతం ఆ సమస్యలను సరిచేయాలని అడిగితే దుర్మార్గులు, దుశ్శాసనులని తూలనాడతారా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిపక్షనేత కె.జానారెడ్డి ప్రశ్నించారు. దీనిపై సీఎం ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అధికార దర్పాన్ని పక్కన పెట్టి, గతంలో జరిగిన తప్పులను ప్రభుత్వం సరిచేయాలని, అది ధర్మమని పేర్కొన్నారు. లేదంటే తమను పక్కన పెట్టినట్లే టీఆర్ఎస్ను కూడా ప్రజలు పక్కన పెడతారన్నారు. సమస్యలపై అసూయ, ద్వేషంతో కాకుండా సామాజిక అభివృద్ధి కోణంలో చూడాలని, నిందలు వేయడం మంచిది కాదని హితవు పలికారు. సోమవారం విద్యుత్‌పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అనంతరం జానా మాట్లాడారు. ‘గతంలో అనేకమార్లు ప్రభుత్వాలు మారాయి. రెండు సీట్లున్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నాలుగు వందల సీట్ల నుంచి కాంగ్రెస్ విపక్షంలోకి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే. వాటిని గౌరవించాలి తప్పితే హేళన చేయరాదు’’ అన్నారు. విద్యుత్ సమస్యకు కాంగ్రెస్ కారణం కాదన్నారు. విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేం దుకు అధికార పక్షానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. విభజన చట్టం మేరకు ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ వాటా ఇవ్వాల్సిందేనని, లేదంటే కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. విద్యుత్ వాటాలపై ప్రజల మధ్య విద్వేషాలు పెరగకముందే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు. రాష్ట్రాల మధ్య తగాదాలు తీర్చేందుకు అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని, అఖిలపక్షంగా వెళ్లి ప్రధానిని కలవాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు చేయలేదని ఈ సమయంలో టీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. దాంతో జానారెడ్డి సీఎం కుర్చీని చూపిస్తూ... ‘నేనెందుకు అక్కడ లేనంటే ఏం చెబుతాం’ అని అన్నారు! విద్యుదుత్పత్తి, వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, రాష్ట్రానికి వాటా దక్కేందుకు న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ బదులిచ్చారు. -
సభ సజావుగా సాగేలా సహకరించాలి
టీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి గద్వాల: అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలు, అభివృద్ధి చర్చలకు వేదికయ్యేలా సభ్యులందరూ సహకరించాలని స్పీకర్ మధుసూదనాచారి కోరారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగుతాయని చెప్పారు. ఈ సమావేశాల్లో సభ్యులందరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలే ప్రధానంగా చర్చించి, గతంలో జరిగిన సమావేశాలకు భిన్నంగా ప్రజలు మెచ్చుకునేలా సభ్యులందరూ సహరించాలని ఆయన సూచించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సహకరిస్తే సమయం వృథా కాకుండా అన్ని అంశాలు చర్చించే అవకాశం వస్తుందన్నారు. ఎన్నిరోజుల పాటు సమావేశాలు జరిగాయన్నది కాదని, ఎన్నిగంటల పాటు సమావేశాలు ఫలవంతంగా సాగాయన్నది ముఖ్యమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమకు న్యాయం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజాభిప్రాయాలకు అసెంబ్లీ వేదిక య్యేలా సహకరించాలని ఆయన కోరారు. మీడియా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగదని, ఇందులో అపోహలు పెట్టుకోవద్దని స్పీకర్ స్పష్టం చేశారు. -
జవాబుదారీ రెవె‘న్యూ’
యాచారం: ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు స్థానిక తహసీల్దార్ వసంతకుమారి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ కార్యదర్శులు వారంలో మూడురోజుల పాటు గ్రామాల్లోనే ఉండేం దుకు, జనాల సమస్యలను పరిష్కరించేందుకు ప్ర ణాళికను రూపొందించారు. చిన్న చిన్న పనుల కోసం వారాలతరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పని లేకుండా ప్రజల వద్దకే రెవెన్యూ పాలన తీసుకెళ్లేందుకు ఆమె వినూత్నంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. గత ఏడాది ప్రభుత్వం రెవెన్యూ క్లస్టర్లలో గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. గ్రామ రెవెన్యూ కార్యాలయాలు ఎప్పుడూ చూసినా మూతపడే ఉండేవి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రజలు మళ్లీ తహసీల్దార్ కార్యాలయాన్నే ఆశ్రయించేవారు. అయినా సమస్యలు పరిష్కారానికి నోచుకునేవి కావు. దీంతో తహసీల్దార్ వసంతకుమారి గ్రామ రెవెన్యూ పాలనకు శ్రీకారం చుట్టారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాల రెవెన్యూ కార్యదర్శులతో ఆమె సమావేశమయ్యారు. శుక్రవారం నుంచి రెవెన్యూ పాలన గ్రామం నుంచే సాగించాలని కార్యదర్శులకు సూచించారు. వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గ్రామంలోనే కార్యదర్శులు ఉండేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. వారు గ్రామాల్లోఉండడమే కాకుండా.. రెవెన్యూ రికార్డులు స్థానికంగానే చూసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల్లో హర్షం కార్యదర్శులు గ్రామాల్లో ఉండే రోజుల్లో ఉదయం నుంచి 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రామాల్లో ఉండాలి. కార్యదర్శి పేరు, ఫోను నంబరు క్లస్టర్ కార్యాలయం వద్ద అతికించాలి. అత్యవసర సమయాల్లో గ్రామాలకు రాని పక్షంలో తహసీల్దార్ లేదా సర్పంచ్‌కు సమాచారం అందించాలని వసంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ పాలన ఇక గ్రామాల నుంచి సాగడానికి తహసీల్దార్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పహాణీ, పాసు పుస్తకాలు, పట్టాల మార్పిడి తదితర చిన్న చిన్న పనుల కోసం నెలల కొద్దీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగేవాళ్లమని, ప్రస్తుతం స్థానికంగానే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కృషి చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. గ్రామాల్లోనే కార్యదర్శులు ఉండేలా.. సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి నిత్యం కార్యాలయానికి రాకుండా చూడడమే లక్ష్యమని తహసీల్దార్ వసంతకుమారి స్పష్టంచేశారు. -
మీ కోసం నేనున్నా..
ఖమ్మం : ‘ఏం పెద్దయ్యా.. బాగున్నావా..? అన్నా.. ఏం చేస్తున్నావు..? అక్కా అందరు మంచిగా ఉన్నారా..? తమ్ముడూ మంచిగా చదువుతున్నావా..? అంటూ అందరినీ పలుకరిస్తూ, వారి సమస్యలు వింటూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎంపీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం నగరంలోని సారథినగర్ నుంచి గాంధీచౌక్, గాంధీనగర్, పంపింగ్వెల్రోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు. గోళ్లపాడు ఛానల్లో మురుగునీరు పేరుకుపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలతో మాట్లాడారు. * ‘బిడ్డా.. గోళ్లపాడు కాల్వ చెత్తతో పూడుకు పోయింది.. మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరుగుతున్నాయి.. దుర్వాసనతో రోగాల పాలవుతున్నాం..’ అంటూ రాములమ్మ అనే వృద్ధురాలు ఎంపీకి తన బాధను విన్నవించింది. * ‘అన్నా.. కాల్వలో మా బాబు పడిపోయాడు.. సమయానికి చూసి తీశాం కాబట్టి బతికిండు .. లేకపోతే చనిపోయేవాడు..’ అంటూ అచ్చిన వినోద అనే మహిళ ఎంపీ దృష్టికి తీసుకువచ్చింది. * ‘ అన్నా.. రోడ్లు సరిగా లేవు.. ఇబ్బంది అవుతోంది.. రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడంతో మూడు కిలో మీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తోంది’ అంటూ ఎస్కే రహిమా అనే మహిళ, సారథినగర్ ప్రజలు చెప్పిన సమస్యలను ఎంపీ విన్నారు. అనంతరం గాంధీచౌక్‌లో హమాలీలతో మాట్లాడారు. వారి సమస్యలు విని ‘మీకు నేనున్నాన’ని భరోసా ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడానికి గల కారణాలను మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని కాల్వలు, ఉప కాల్వల నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారుల వివరణ తీసుకున్నారు. కాల్వకు సంబంధించిన మ్యాప్ తెప్పించుకుని పరిశీలించారు. ఆయా ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్సీపీ నాయకులు ..ఎంపీకి వివరించారు. అనంతరం సారథినగర్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే ప్రదేశాన్ని పరిశీలించారు. రైళ్ల రాకపోకలతో గేట్ దాటేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గోళ్లపాడు కాల్వలో పూడికతీత పనులు త్వరగా చేపడతామని, శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. రైల్వే అధికారులతో మాట్లాడి తర్వగా అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. సారథినగర్ నుంచి గాంధీచౌక్ చేరుకున్న ఆయన అక్కడ హమాలీలతో మాట్లాడారు. అక్కడి నుంచి గ్రెయిన్ మార్కెట్ రోడ్డు, శ్రీనివాసనగర్, ముస్తఫానగర్, జెడ్పీ సెంటర్ మీదుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. -
డుమ్మాలే అధికం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మా సమస్యలపై గొంతెత్తండి అంటూ శాసనసభకు జిల్లా ప్రజలు పంపిన నేతల పనితీరు ఎలా ఉంది. ఆశించిన రీతిలో వారు రాణించగలిగారా? ప్రజా సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపారా? వంటి అంశాల ను విశ్లేషించే ముందు అసలు ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు సభకు హాజరయ్యారు? డుమ్మాలు కొట్టడంలో ఎవరు ముందున్నారు వంటి అంశాలను అసెంబ్లీ వెబ్సైట్ రికార్డులను పరిశీలిస్తే అసలు విషయాలు వెల్లడవుతాయి. తాజాగా వాయిదాపడిన శాసన సభ 13వ విడత సమావేశాలను మినహాయిస్తే, మన ఎమ్మెల్యేల హాజరు శాతం ఆశించిన స్థాయిలో లేదు. మరో నాలుగు నెలల్లో 13వ శాసన సభ కాల పరిమితి ముగియనుంది. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో శాసనసభ 12 పర్యాయాలు విడతల వారీగా కొలువుదీరింది. 2009 జూన్ నుంచి 2013 జూన్ వరకు శాసనసభ 173 రోజుల పాటు సమావేశమైంది. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం వెతకాల్సిన శాసనసభ్యులు రోజుల తరబడి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. అభివృద్ధి సాధిస్తున్నామంటూ నియోజకవర్గాల్లో ఊదరగొడుతున్న నేతలు రోజుల తరబడి అసెంబ్లీ ముఖం చూడటం లేదు. జీత భత్యాలు మాత్రం ఠంచన్‌గా తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు ఎంతసేపు అసెంబ్లీలో గడిపారు, ఎన్ని అంశాలను ప్రస్తావించారు, ఎన్నింటికి సమాధానాలు రాబట్టగలిగారనే విషయాలపైనా మదింపు జరిగితే ఎవరు ఎంత పనిచేశారో వెల్లడయ్యేది. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి హాజరు వివరాలు మినహాయిస్తే మిగతా ఏడుగురు ఎమ్మెల్యేల్లో నారాయణఖేడ్ శాసన సభ్యులు పి. కిష్టారెడ్డి, గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మెరుగైన హాజరుశాతం నమోదు చేశారు. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టక ముందు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి 119 రోజులకు గాను 55 రోజులు డుమ్మా కొట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ శాసనసభకు ముఖం చాటేసిన ఎమ్మెల్యేల్లో ముందు వరుసలో ఉన్నారు. ఇదిలా ఉండగా 2010లో హరీష్‌రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుంచి జూలై వరకు 38 రోజుల పాటు జరిగిన సమావేశాలకు హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన హాజరు శాతం తగ్గింది. -
ప్రజా సమస్యలను తేలిగ్గా తీసుకోవద్దు
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలను, వినతులను తేలిగ్గా తీసుకోవద్దని కలెక్టర్ జి.కిషన్ అధికారులకు సూచించారు. మొదటిసారి గ్రీవెన్స్‌సెల్‌కు హాజరైన ఆయన సోమవారం ఉదయం పదిగంటలకే కలెక్టరేట్లోని తన చాంబర్‌కు వచ్చారు. తర్వాత కాన్ఫరెన్స్‌హాల్‌కు వెళ్లి ప్రజలు, వివిధ సంఘాల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదు స్వీకరించారు. వాటిని చదివి పరిష్కారం కోసం సంబంధిత విభాగాలకు రాశారు. పరిష్కారం కానివాటికోసం తిరగవద్దని, డబ్బులు, కాలం వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. అలాగే సాధ్యమయ్యేవాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చకచకా ఆదేశాలు అంత్యోదయ కార్డు కోసం వచ్చిన వికలాంగు డు, పాపయ్యపల్లికి చెందిన మోరె రమేష్‌కు రుణం తీసుకుని స్వయం ఉపాధి కింద ఏదైనా పనిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనాథలకు మాత్రమే అంత్యోదయ కార్డు ఇస్తామని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళికలో రుణం కోసం అతని పేరు ప్రతిపాదించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్‌ను ఆదేశించారు. ఎంబీఏ చదివిన వరంగల్ కాశిబుగ్గకు చెందిన జ్ఞానేశ్వర్ అనే వికలాంగుడికి కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ ఏపీడీ రామును ఆదేశించారు. తన భూమిని మరొకరు పట్టా చేయించుకున్నారని, తనకు న్యాయం చేయాలని మొగుళ్లపల్లికి చెందిన గాదె రూప వినతిపత్రం సమర్పించగా విచారణ జరిపి న్యాయం చేయాలని జేసీకి సూచించారు. వడ్డేపల్లి టీచర్స్ కాలనీలో నాలా దగ్గర గృహ నిర్మాణాలు చేపడుతున్నారని స్థాని కులు ఫిర్యాదు చేయడంతో ఆ సమస్యను పరి ష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌కు రాశారు. నాలా దురాక్రమణలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో త్వరలో సమావేశం ఏర్పా టు చేయాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్యను ఆదేశించారు. భూమి రికార్డులపై వస్తున్న ఫిర్యాదులపై జేసీ, తహశీల్దార్, ఆర్డీఓలతో సమావేశం ఏర్పాటు చే యాలని కో రారు. గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే ప్రతి వినతిని, ఫి ర్యాదును కంప్యూటరీకరించాలని, వాటి సం బంధించి తీసుకున్న చర్యలను విభాగాల వారీ గా అప్‌గ్రేడ్ చేయాలని గ్రీవెన్స్‌సెల్ సూపరిం టెండెంట్ రంగారావును కలెక్టర్ ఆదేశించారు. ఆలస్యంగా వచ్చిన అధికారులు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక ఎన్నికల కోడ్ రావడంతో కలెక్టర్ కిషన్ గ్రీవెన్స్‌సెల్ నిర్వహించలేదు. తొలిసారిగా ఆయన గ్రీవెన్స్‌సెల్‌కు వస్తున్నారని సిబ్బంది జిల్లా విభాగాల శాఖాధిపతులకు ఆదివారం సమాచారం పంపించారు. అయినా అధికారుల్లో కొందరే ఉదయం 10:30గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. డ్వామా పీడీ హైమావతి, డీఎస్ఓ ఉషారాణి, సోషల్ వెల్పేర్ డిప్యూటీ డైరక్టర్ రోశన్న, బీసీ వెల్పేర్ డీడీ రమాదేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ నర్సింహస్వామి వచ్చారు. కలెక్టర్ వచ్చాక అదనపు జేసీ బి.సంజీవయ్య, ఎస్సీకార్పొరేషన్ ఈడీ సురేష్, హౌసింగ్ పీడీ లక్ష్మణ్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సప్తగిరి ఇతర శాఖల నుంచి అధికారులు వచ్చారు. వెల్లువెత్తిన వినతులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ సంఘాల నాయకులు, ప్రజలు గ్రీవెన్స్‌సెల్‌లో సోమవారం బారులు తీరారు. కలెక్టర్ కిషన్, అదనపు జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్ సురేంద్రకరణ్, డీఆర్డీఏ ఏపీడీ రాము వారినుంచి వినతిపత్రాలు స్వీకరించారు. విన్నపాల్లో కొన్ని ఇలా ఉన్నాయి.