హైదరాబాద్: ''మీ అవినీతిని ప్రశ్నించడమే మేం చేసిన తప్పా..?'' అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగుతారా? అని మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ శాసనసభను దిగజార్చారని విమర్శించారు. శాసనసభలో సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారని దుయ్యబట్టారు.
రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏడుసార్లు సమావేశమైందని గుర్తుచేశారు. ఈ సమావేశాల్లో ఒక్కసారైనా ప్రజా సమస్యలపై చర్చించారా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంగా తాము సహకరిస్తామన్నా టీడీపీ ప్రభుత్వం నుంచి స్పందన శూన్యమన్నారు. రెండేళ్ల పాలనపై ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండని సూచించారు. ఇకపై ప్రజాసమస్యలపై దృష్టి సారించండని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.
'మీ అవినీతిని ప్రశ్నించడమే తప్పా..?'
Published Tue, Jun 7 2016 3:15 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement
Advertisement