
'చర్చ, ఓటింగ్ తర్వాత ప్రకటన చేయాలి'
హైదరాబాద్: శాసనసభ నియమాలు తమకు తెలియవని టీడీపీ నాయకులు విమర్శించడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ నియబ నిబంధనల మేరకే తాము నడుచుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఏపీ రాజధానిపై రేపు(గురువారం) శాసనసభలో చర్చ, ఓటింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దీని తర్వాతే రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. అసెంబ్లీ నియమాలు తెలియకుండా వైఎస్ఆర్ సీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం శాసనసభలో అన్నారు.