వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఎవరూ బేషజాలకు పోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ మనకు రెండు కళ్లలాంటివని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలను దిక్కరించకుండా హుందాతనాన్ని పాటించాల్సిన బాధ్యత మన అందరీపై ఉందని అధికార పక్షానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేషజాలకు పోకుండా గురువారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.