కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలను, వినతులను తేలిగ్గా తీసుకోవద్దని కలెక్టర్ జి.కిషన్ అధికారులకు సూచించారు. మొదటిసారి గ్రీవెన్స్‌సెల్‌కు హాజరైన ఆయన సోమవారం ఉదయం పదిగంటలకే కలెక్టరేట్‌లోని తన చాంబర్‌కు వచ్చారు. తర్వాత కాన్ఫరెన్స్‌హాల్‌కు వెళ్లి ప్రజలు, వివిధ సంఘాల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదు స్వీకరించారు. వాటిని చదివి పరిష్కారం కోసం సంబంధిత విభాగాలకు రాశారు. పరిష్కారం కానివాటికోసం తిరగవద్దని, డబ్బులు, కాలం వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. అలాగే సాధ్యమయ్యేవాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
చకచకా ఆదేశాలు
అంత్యోదయ కార్డు కోసం వచ్చిన వికలాంగు డు, పాపయ్యపల్లికి చెందిన మోరె రమేష్‌కు రుణం తీసుకుని స్వయం ఉపాధి కింద ఏదైనా పనిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనాథలకు మాత్రమే అంత్యోదయ కార్డు ఇస్తామని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళికలో రుణం కోసం అతని పేరు ప్రతిపాదించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్‌ను ఆదేశించారు. ఎంబీఏ చదివిన వరంగల్ కాశిబుగ్గకు చెందిన జ్ఞానేశ్వర్ అనే వికలాంగుడికి కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ ఏపీడీ రామును ఆదేశించారు. తన భూమిని మరొకరు పట్టా చేయించుకున్నారని, తనకు న్యాయం చేయాలని మొగుళ్లపల్లికి చెందిన గాదె రూప వినతిపత్రం సమర్పించగా విచారణ జరిపి న్యాయం చేయాలని జేసీకి సూచించారు.
వడ్డేపల్లి టీచర్స్ కాలనీలో నాలా దగ్గర గృహ నిర్మాణాలు చేపడుతున్నారని స్థాని కులు ఫిర్యాదు చేయడంతో ఆ సమస్యను పరి ష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌కు రాశారు. నాలా దురాక్రమణలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో త్వరలో సమావేశం ఏర్పా టు చేయాలని అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్యను ఆదేశించారు. భూమి రికార్డులపై వస్తున్న ఫిర్యాదులపై జేసీ, తహశీల్దార్, ఆర్డీఓలతో సమావేశం ఏర్పాటు చే యాలని కో రారు. గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే ప్రతి వినతిని, ఫి ర్యాదును కంప్యూటరీకరించాలని, వాటి సం బంధించి తీసుకున్న చర్యలను విభాగాల వారీ గా అప్‌గ్రేడ్ చేయాలని గ్రీవెన్స్‌సెల్ సూపరిం టెండెంట్ రంగారావును కలెక్టర్ ఆదేశించారు.
ఆలస్యంగా వచ్చిన అధికారులు
కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక ఎన్నికల కోడ్ రావడంతో కలెక్టర్ కిషన్ గ్రీవెన్స్‌సెల్ నిర్వహించలేదు. తొలిసారిగా ఆయన గ్రీవెన్స్‌సెల్‌కు వస్తున్నారని సిబ్బంది జిల్లా విభాగాల శాఖాధిపతులకు ఆదివారం సమాచారం పంపించారు. అయినా అధికారుల్లో కొందరే ఉదయం 10:30గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. డ్వామా పీడీ హైమావతి, డీఎస్‌ఓ ఉషారాణి, సోషల్ వెల్పేర్ డిప్యూటీ డైరక్టర్ రోశన్న, బీసీ వెల్పేర్ డీడీ రమాదేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ నర్సింహస్వామి వచ్చారు. కలెక్టర్ వచ్చాక అదనపు జేసీ బి.సంజీవయ్య, ఎస్సీకార్పొరేషన్ ఈడీ సురేష్, హౌసింగ్ పీడీ లక్ష్మణ్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సప్తగిరి ఇతర శాఖల నుంచి అధికారులు వచ్చారు.
వెల్లువెత్తిన వినతులు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ సంఘాల నాయకులు, ప్రజలు గ్రీవెన్స్‌సెల్‌లో సోమవారం బారులు తీరారు. కలెక్టర్ కిషన్, అదనపు జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్ సురేంద్రకరణ్, డీఆర్‌డీఏ ఏపీడీ రాము వారినుంచి వినతిపత్రాలు స్వీకరించారు. విన్నపాల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
ప్రజా సమస్యలను తేలిగ్గా తీసుకోవద్దు
Published Tue, Aug 6 2013 5:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement