Peoples
-
458 మందిని రక్షించిన ప్రకాశం జిల్లా పోలీసులు
-
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు.. చంద్రబాబుపై సామాన్యులు ఫైర్
-
కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారంటే...?
‘జమ్మూ–కశ్మీర్’ విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం. ఏదో ఒక కారణంగా కశ్మీర్ రోజూ వార్తల్లో ఉంటోంది. పార్టీలు, నాయకులు, మేధావులు, జాతీ యవాదులు ఏదో ఒక సంద ర్భంలో కశ్మీరు గురించి మాట్లా డుకుంటూనే ఉంటారు. దేశమంతా కశ్మీరు గురించి చర్చిస్తున్న విషయాల్నే కశ్మీరీలు మాట్లాడుకుంటు న్నారా? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కశ్మీరీల మనసుల్లో ఏముంది? అని అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్య టించింది. కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు... ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నిక అని కశ్మీరీలు అంటారు. అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నిక లన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేనని వారు భావిస్తున్నారు. జమ్మూ– కశ్మీరులో ఏ మూలకు వెళ్లి ఎవ్వరితో మాట్లాడినా... చాలా సమస్యలపై వారికి ఏకాభిప్రాయం లేనప్ప టికీ, ఉమ్మడి అభిప్రాయం ఉన్నది ఒక విషయంలోనే: ఆ రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నారు.2019 ఆగస్టు 5న ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తి హోదా తొలగిపోయింది. రాష్ట్రాన్ని కశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు, పూర్వ జమ్మూ– కశ్మీర్‌కి లభిస్తున్న స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, ఈ సెప్టెంబర్ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వ హించాలని ఆదేశించింది. ‘‘ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదే శాలతో ఎన్నికలు జరిగినా... మహా అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’’ అని శ్రీనాగ్లో ఒక వ్యాపారి చెప్పాడు. ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది.రాష్ట్ర హోదాపాలన విషయంలో ఢిల్లీ మోడల్ని, సామాన్య స్థానికులతో పాటు గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదా రులుగా ఉన్న గుజ్జర్ సామాజిక వర్గం బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ–కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరు ద్ధరించాలని, ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తు న్నారు. కశ్మీర్ విషయంలో తమది చరిత్రాత్మక నిర్ణయ మని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటోంది. కానీ, కశ్మీరులో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీ పరి స్థితిపై కొంత అనిశ్చితి నెలకొంది.కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫ ల్యాలు ఉంటాయి. కానీ, అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే ఏ విధంగా చూసినా మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావి స్తున్నారు. ‘‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగి పోయాయి. ఎన్నికలు లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాల నను ఆశించలేం అని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య అంతరం పెరిగి పోయింది. మీడియాలో చూపించే వంతెనలు, అండర్ పాస్‌లను పక్కన పెడితే, స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయార య్యాయి. కొత్త రోడ్లు వేయడం, రోడ్లను రిపేర్ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న దాని కన్నా 2019కి కంటే ముందే బాగుండేదని అనేక ఉదాహరణలు చెబు తున్నారు.జమ్మూ, శ్రీనగర్‌లు గవర్నమెంట్ ప్రకటనల్లో మాత్రమే పేరుకు స్మార్ట్ సిటీలనీ, తగిన మౌలిక వస తులు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనీ స్థానిక వ్యాపారులు చెబుతు న్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ, బయట నుంచి వచ్చిన వాళ్లే మద్యం వ్యాపారం చేస్తు న్నారనీ, ముఖ్యమైన స్థానాలన్నింటీలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులే ఉంటున్నారనీ, ఇది తమకు న్యాయం చేయడం లేదనీ ప్రజలు ఏకాభిప్రా యంతో ఆరోపిస్తున్నారు. ‘‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటి వాళ్లనే ఎందుకు నియ మిస్తున్నారు? ఎందుకు అంత భయం?’’ అని అడ్వ కేట్‌గా పనిచేస్తున్న షేక్ షకీల్ ప్రశ్నించారు.‘‘మాకు ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. మేం ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహుల కింద నేరం మోపు తున్నారు. గత 5 ఏళ్లుగా మేం ఎన్నుకోని ప్రభుత్వంలో ఉన్నాం’’ అనేది కశ్మీరీ యువత అభిప్రాయం. చలికాలంలో జమ్మూ, వేసవికాలంలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్ పెట్టింది. దీనికి అనవసర ఖర్చు అవు తోందనీ, ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయ మనీ బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ, 5 ఏళ్ల తర్వాత చూస్తే దర్బార్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం. ‘‘దర్బార్ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవి. వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చే మాకు ఆదాయం అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకు పోయాయ’’ని జమ్మూ వ్యాపారి వికాస్ శర్మ చెప్పాడు. జనం కోరు తున్నట్టు దర్బార్‌ను పునరుద్ధరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనీ, అందుకే తాము అడిగినా నాయకత్వం పట్టించు కోవడం లేదని స్థానిక బీజేపీ నాయకులు చెబు తున్నారు.35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ–కశ్మీరులో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నికలను బహిష్కరించిన ఈ ప్రాంతంలో, ప్రభుత్వాన్ని ఎన్ను కోవడానికి తపిస్తున్న ప్రజల గాఢమైన కోరికకు ఈ ఓటింగ్ శాతం అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరించాలనీ, ‘దిగుమతి’ సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావా లనీ కోరుకుంటున్న కశ్మీరీల కల నెరవేరుతుందా, లేదా అనేది ఇంకో నెలన్నరలో తేలనుంది.– జి. మురళీకృష్ణ, వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థలో పరిశోధకులు -
మోదీ పీఎంవో కాదది... ప్రజా పీఎంవో!
న్యూఢిల్లీ: ‘‘ప్రధాని కార్యాలయమంటే అధికార కేంద్రమని మన దేశంలో పదేళ్ల కింది దాకా అభిప్రాయముండేది. కానీ నేను పుట్టింది అధికారం కోసం కాదు. నాకు అధికారం కావాలని ఎప్పుడూ ఆలోచించను. ప్రధాని కార్యాలయం కూడా అధికార కేంద్రం కాకూడదు. అది ప్రజల పీఎంవోగా ఉండాలి తప్ప మోద పీఎంవోగా కాదు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘నేను అధికారం కోసం జని్మంచలేదు. 140 కోట్ల మంది భారతీయులే నాకు దేవుళ్లు. వారి సంక్షేమమే నా పరమావధి. దానికోసమే వారు నాకు మరోసారి అవకాశమిచ్చారు. పీఎంవోను అధికార కేంద్రంగా మార్చే ఉద్దేశం నాకెన్నడూ లేదు. అది ప్రజల సంక్షేమం కోసం పని చేసే సంస్థగా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. 2014 నుంచీ అదే దిశగా కృషి చేస్తూ వచ్చామన్నారు. ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. సోమవారం ఉదయం ప్రధాని కార్యాలయంలో ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై తొలి సంతకం చేశారు. పీఎంఓలో అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారినుద్దేశించి మోదీ మాట్లాడారు. పీఎంవో ఒక ప్రేరక శక్తిగా నిలవాలన్నదే తన తపన అని చెప్పారు. ‘‘దేశమే ముందు. నాకైనా, మీకైనా ఇదే ఏకైక లక్ష్యం కావాలి’’ అని వారికి ఉద్బోధించారు. ‘‘2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదాం. మీనుంచి నేను కోరేది అదే’’ అని స్పష్టం చేశారు. ‘‘మనం నిరీ్ణత పని గంటలు పెట్టుకుని, వాటికి పరిమితమై పని చేసేవాళ్లం కాదు. పని వేళలతో పాటు ఆలోచనలకు కూడా ఎలాంటి హద్దులూ లేనివాళ్లే నా పీఎంవో బృందం. వారిపై దేశమూ ఎంతో నమ్మకం పెట్టుకుంది’’ అన్నారు. ‘‘గత పదేళ్లో ఆలోచించిన, అమలు చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా చేసి చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇదే నా భవిష్యత్తు విజన్’’ అని పేర్కొన్నారు.‘‘అంతర్జాతీయ ప్రమాణాలన్నింటినీ అధిగమిద్దాం. నిన్న ఎలా ఉన్నాం, ఈ రోజు ఎంత బాగా చేశామన్నది కాదు. ఇక ముందు ప్రతి రంగంలోనూ మనమే ప్రపంచంలో అగ్రగాములుగా ఎదగాలి. ఇప్పటిదాకా ఎవరూ చేరలేని శిఖరాలకు దేశాన్ని తీసుకెళ్దాం’’ అని అధికారులకు పిలుపునిచ్చారు. అది జరగాలంటే ఆలోచనల్లో స్పష్టత, చిత్తశుద్ధిపై నమ్మకం, ఆ దిశగా కష్టించే స్వభావం అత్యంత అవసరమని మోదీ చెప్పారు. పీఎంవో బృంద సభ్యులు అందిస్తూ వస్తున్న సహకారానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అదే నా శక్తి రహస్యం... తనకు ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తోందని ఈ ఎన్నికల సందర్భంగా చాలామంది అడిగారని మోదీ అన్నారు. ‘‘30 ఏళ్లుగా నాకీ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. నాలోని విద్యార్థి నిత్యం సజీవంగానే ఉంచుకుంటాను. బలహీనతకు, బద్ధకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వను. చైతన్యంతో, శక్తిమంతంగా ఉండటమే నా రహస్యం. అలా ఉన్నప్పుడే విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతాం. నూతనోత్తేజం, రెట్టించిన ఉత్సాహం, శక్తియుక్తులతో ముందుకు సాగుతా’’ అని చెప్పారు. ‘పీఎం కిసాన్ నిధి’పై మోదీ తొలి సంతకం సాక్షి, న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం 17 వ విడత నిధుల విడుదల ఫైలుపై మోదీ తొలి సంతకం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ.20 వేల కోట్ల నిధులు అందనున్నాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడ్డ ప్రభుత్వమన్నారు. అందుకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సంతకం రైతు సంక్షేమ ఫైలుపై పెట్టడం సముచితమన్నారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. -
సీఎం జగన్ పై తమిళనాడు ప్రజల ప్రశంసలు
-
సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ పలకరింపుతో ప్రజల్లో భావోద్వేగం
-
వైరల్ వీడియో: రోడ్డుపై వెళ్తున్న అందర్నీ పలకరిస్తున్న పిల్లి
-
సీఎం జగన్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి రోజా
-
Viral Video: కార్ల సాయంతో నడి రోడ్డుపై వినూత్న స్నానం
-
జయహో బీసీ సభకు తరలి వచ్చిన ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు
-
గన్ షాట్ : చంద్రబాబుకు సీమ నేర్పిన పాఠం ఏంటి ..?
-
జనసేన నేతలకు జగనన్న ఇళ్ల లబ్దిదారుల షాక్
-
మా గ్రామంలో అభివృద్ధిని పవన్ అడ్డుకుంటున్నాడు : ఇప్పటం గ్రామస్తులు
-
పేతురును వరించిన ఆత్మీయ ఐశ్వర్యం!
నేను ఎవరినని ప్రజలు అనుకొంటున్నారని యేసుక్రీస్తు ఒకసారి తన శిష్యులను అడిగాడు. కొందరు నీవు బాప్తిస్మమిచ్చు యోహానువని, మరికొందరు నీవు ఏలీయా లేదా యిర్మీయా లేదా మరెవరైనా ప్రవక్తవని అనుకొంటున్నారని శిష్యులు జవాబిచ్చారు. ‘మరి మీరు నేనెవరినని అనుకొంటున్నారు?’అని ప్రభువు ప్రశ్నిస్తే వాళ్ళు కొంత సందిగ్ధంలో పడ్డారు. ‘ఇంతకీ ఈయన ఎవరు?’ అన్న ప్రశ్న వాళ్ళ మనస్సులో ఉందన్నది అర్థం చేసుకునే ప్రభువు ఈ ప్రశ్న వేశాడు. ‘నన్ను వెంబడించండి’ అన్న యేసుప్రభువువారి ఒక్క మాటకు లోబడి, శిష్యులు తమ వృత్తులు, కుటుంబాలు, ఆస్తులన్నీ వదిలిపెట్టి ఆయన్ను వెంబడించారు. అది జరిగి అప్పటికి మూడేళ్లకు పైనే అయ్యింది. ఆయన ప్రసంగాలను వాళ్ళు వింటున్నారు, ఆయన కృపను, కరుణను దగ్గరి నుండి చూస్తూ అనుభవిస్తున్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలకు వాళ్లంతా ప్రత్యక్షసాక్షులు. దేవునిరాజ్యం సమీపంగా ఉన్నదన్న మూలాంశంతో ఆయన చేస్తున్న ప్రసంగాలు విని, ఆ రాజ్యానికి ఆయనే రాజు అని వారు నిర్ధారించుకున్నారు. అయితే ఇటీవలే అరణ్యంలో కేవలం ఐదురొట్టెలు, రెండు చేపల్ని ఆయన ఐదువేలమందికి పైగా ప్రజలకు పంచిపెట్టినపుడు, ప్రజలంతా ఎంతో సంబరపడి ఆయన్ను రాజును చెయ్యడానికి ప్రయత్నిస్తే వారి మధ్యనుండి ఆయన తప్పించుకొని వెళ్లిపోవడం వారి సందిగ్ధాన్ని మరెక్కువ చేసింది. ఆయన ఒక రాజు కాదు, ప్రవక్త కాదు, నాయకుడూ కాదు. మరి ఆయన ఎవరు? వెంటనే పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువని అన్నాడు.‘నరులు కాదు, దేవుడే నీకీ విషయాన్ని బయలుపర్చాడు. నీ ఈ విశ్వాసం మీదే నేను నా చర్చిని కడతాను’ అని యేసుప్రభువు వెల్లడించాడు. ‘క్రీస్తు’ అనేది యేసు పేరులో భాగం కాదు.‘అభిషిక్తుడు లేదా మెస్సీయా లేదా రక్షకుడు’ అన్నది దాని అంతరార్ధం. ధర్మశాస్త్రాన్నంతా ఎరిగిన పరిసయ్యులు, శాస్త్రులనే నాటి మేధావి వర్గానికి అర్ధం కాని ఈ మర్మాన్ని పామరుడు, వృత్తిరీత్యా జాలరి అయిన పేతురుకు బోధపడటం యేసు ప్రభువుకు ఆనందం కలిగించింది(మత్తయి 16:13–20). ఈ ఉదంతాన్నే యోహాను తన సువార్తలో రాస్తూ, యేసు ప్రభువు యూదులతో విశ్వాసులకు జనకుడైన అబ్రాహాముకన్నా ముందునుండే ‘నేను ఉన్నవాడను’ అంటే దేవుణ్ణి అని ప్రకటిస్తే, ఆయన్ను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నాడు (యోహాను 8:58). మనుషుల చంచల స్వభావానికి అద్దం పట్టే ఉదంతమిది. తాము దేవుళ్ళు కాకున్నా లేనిపోని హడావుడి, ఆర్భాటం, గారడీలు చేసే మాయల మరాఠీలకు ఆలయాలు కట్టి పూజలు చేస్తారు కాని దేవుడే స్వయంగా తనను తాను తగ్గించుకొని, సాత్వికుడై పరలోకంనుండి దిగి వచ్చి సామాన్య ప్రజలతో మమేకమై వారి మధ్యే నివసించి తన మహిమల్ని, పరలోకాధికారాన్ని అంత స్పష్టంగా రుజువు చేసుకొంటున్నా ఆయన్ను దేవుడిగా విశ్వసించడానికి వెనకాడుతారు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త కాదు, ఎంతోమంది ప్రవక్తలు తమ ప్రవచనాల్లో పేర్కొన్న ‘మెస్సీయా’ఆయన అన్న పరలోక మర్మాన్ని పేతురు ఒడిసిపట్టుకున్నాడు. ఆ మెస్సీయా ప్రబోధాలు, జీవితం, పాపక్షమాపణా సూత్రమే పునాదిగా చర్చిని యేసుప్రభువే స్వయంగా నిర్మించడానికి దారి తీసిన ఉపోద్ఘాతమిది. ఈ లోకసంబంధమైన విజ్ఞానం భూమి నుండి రాకెట్లో చంద్రమండలానికెళ్లడానికి పనికొస్తుంది. కాని పరలోకం నుండి భూమిపైకి దిగి వచ్చిన మెస్సీయాగా యేసును అర్థం చేసుకోవడానికి ఈ లోకజ్ఞానం ఎంతున్నా సరిపోదు. అది పరలోకజ్ఞానంతోనే సాధ్యమవుతుంది కాబట్టే పామరుడైన పేతురుకు కూడా ఆ వాస్తవం అర్ధమయ్యింది. మనిషి పుట్టుకతోనే ఆధ్యాత్మికంగా అంధుడని, అతనిలో ఆత్మీయనేత్రాలను దేవుడే తెరుస్తాడంటూ యేసుప్రభువు అత్యంత స్పష్టంగా బోధించాడు. పామరులేమో ‘ప్రభువునెరుగుతుంటే, మహాపండితులు’ఆత్మీయంగా అంధులుగా’ మిగిలిపోవడం వెనుక ఉన్న రహస్యమిదే!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆంతర్యంలోని ఆత్మీయతతోనే ఆశీర్వాదాలు...
అమ్మోరీయులనే శాపగ్రస్తుల సంతతికి చెందిన కనాను ప్రజలు గిబియోనీయులు. వాగ్దాన దేశమైన కనానులో యొహోషువా నాయకత్వంలో సాగుతున్న జైత్రయాత్రలో యొరికో, హాయి పట్టణాలు ధ్వంసమైనట్టే, తాము కూడా సంహారమవుతామని గ్రహించి శాంతి ఒప్పందం కోసం ఎక్కడో దూరదేశం నుండి వచ్చామంటూ గిబియోనీయులు కపట నాటకమాడి యొహోషువా శరణు కోరారు. దేవుని వద్ద విచారణ కూడా చెయ్యకుండానే, యొహోషువా వారికి ప్రమాణం చేశాడు. మూడు రోజుల తర్వాత వాస్తవం తెలిసి వారిని నిలదీస్తే, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ పక్షంగా గొప్ప కార్యాలు చేశాడని విని ఆయన శరణులో, మీ నీడలో బతకాలని నిర్ణయించుకున్నామని వారన్నారు. మాటిచ్చిన తర్వాత మడమ తిప్పకూడదన్న దేవుని పద్ధతికి లోబడి ఇశ్రాయేలీయులు తమ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. సంధి ఒప్పందానికి దేవుడు కూడా ఆమోదముద్ర వేశాడు. గిబియోనీయుల ఉదంతం విని ఆ వెంటనే మిగిలిన కనాను రాజులంతా కలిసి గిబియోనీయులతో సమిష్టిగా మహా యుద్ధం చెయ్యగా ఇశ్రాయేలీయులు కూడా వారికి అండగా నిలిచారు. దేవుడైతే ఒక రోజుపాటు సూర్యుణ్ణి ఉన్నచోటే నిలిపి మరీ వారికి ఘనవిజయాన్నిచ్చాడు(యొహో 10:12). ఇశ్రాయేలీయుల మధ్య పనివారుగా ఉండేందుకు అంగీకరించిన గిబియోనీయులకు, ఆలయంలో బలిపీఠం వద్ద కట్టెలు నరికే, నీళ్లు మోసితెచ్చే పనినిచ్చి, దేవుడు తన ఆరాధనా కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యాన్నిచ్చాడు. లేవీయులనే అర్చకులుండే పట్టణాల్లో దేవుడు గిబియోను పట్టణాన్నికూడా చేర్చాడు. దావీదు వద్ద ఉన్న 30 మంది మహా వీరుల్లో ఇష్మాయా అనే గిబియోనీయుడు కూడా ఉన్నాడని బైబిల్ చెబుతోంది. చక్రవర్తిగా సొలొమోను గిబియోనులో బలులర్పించినప్పుడు దేవుడు అక్కడే ప్రత్యక్షమై అతనికి వరాలనిచ్చాడు, బబులోను చెరనుండి తిరిగొచ్చిన వారిలో 95 మంది గిబియోనీయులు కూడా ఉన్నారని నెహెమ్యా రాశాడు. యెరూషలేము ప్రాకారాల పునర్నిర్మాణంలో కూడా గిబియోనీయుల ప్రస్తావన ఉంది. కాలగర్భంలో కలిసిపోవాల్సిన గిబియోనీయులకు దేవుడు ఇలా మహా చరిత్రనిచ్చాడు. కనానీయులంతా సంహారం కాగా. గిబియోనీయులు మాత్రం, దేవునికి తలవంచి, దేవుని ప్రజలతో సఖ్యత కోరుకొని తమ ప్రాణాలే కాదు, తమ ఉనికిని కూడా కాపాడుకున్నారు. పాముల వివేకం, పావురాల నిష్కపటత్వం విశ్వాసికుండాలన్న యేసుప్రభువు బోధకు గిబియోనీయలే ఉదాహరణ.తలుపు చిన్నదైతే తలవంచడమొక్కటే మార్గం. లేకపోతే తల బొప్పికట్టడం ఖాయం.అపకార దష్టితో కాక ప్రాణభీతితోనే గిబియోనీయులు కపట నాటకమాడారని దేవునికి ముందే తెలుసు. పైవేషాలను కాదు, ఆంతర్యంలో తన పట్ల వారికున్న విశ్వాసాన్ని, భయభక్తుల్ని దేవుడు చూశాడు. పైకి నీతిమంతుల్లాగా ఉన్నా ఆంతర్యంలో నిండా దుష్టత్వంతో జీవించేవాళ్లున్నారు. పైకి నాటకాలాడినా ఆంతర్యంలో ఆత్మీయత ఉన్నవాళ్లున్నారు. దేవుడు మాత్రం ఆంతర్యంలోని భక్తి, నీతి, పరిశుద్ధతను బట్టే ప్రతిస్పందిస్తాడు. కత్తితో తలపడటం కన్నా యుక్తితో మెలగడమే మెరుగనుకొని గిబియోనీయులు అలా గొప్ప ఉపద్రవం నుండి తప్పించుకోవడమే కాక, దేవుని ప్రజల్లో భాగమయ్యారు, దేవుని ఆశీర్వాదాలకూ పాత్రులయ్యారు. మనవాడు కదా, ఇలా చేయవచ్చా? అని ఇతరులను నిందించే ముందు, పైకి ఎంతో భక్తిగా, పవిత్రంగా, నీతిమంతుల్లాగా ప్రవర్తించే నా ఆంతర్యంలో లేదా మనవాళ్ళ ఆంతర్యంలో ఇంతటి మురికి కాలువలా? అని ప్రశ్నించుకునేవాడే నిజమైన విశ్వాసి. విశ్వాసి ఆంతర్యంలోని ఆత్మీయత, ఉదాత్తమైన ఆలోచనలను బట్టే దేవుడు అనూహ్యమైన విజయాలు, ఆశీర్వాదాలిస్తాడు, ఆ విశ్వాసినే కోట్లాదిమందికి ఆశీర్వాదంగా మార్చుస్తాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
దేవుని ఉద్యమ సారథులు వీళ్ళు...
దేవుడు ఉద్యమిస్తే ఎలాంటి దెయ్యమైనా జడిసి తోకముడవాల్సిందే!! మరి దేవుడు ఎప్పుడు ఉద్యమిస్తాడు? ఆ అవసరం ఎందుకొస్తుంది? పాలకుల చేతుల్లో తన ప్రజలు దుర్భరమైన అణిచివేతననుభవిస్తూ, క్రుంగి కృశించి, దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు దేవుడు వారి పక్షంగా ఉద్యమిస్తాడు. ఐగుప్తులో 430 ఏళ్ళ పాటు దుర్భర బానిసత్వంలో మగ్గిన ఇశ్రాయేలీయుల మొర విని దేవుడు మోషే ద్వారా ఉద్యమించి వారి కష్టాలు తీర్చాడు. మిద్యానీయులనే అతిక్రూరమైన శత్రువుల చేతిలో విలవిలలాడుతున్న తన ప్రజల హాహాకారాలు, ప్రార్థనలు విని దేవుడు గిద్యోను అనే మరో విశ్వాసిని ప్రేరేపించి తన ఉద్యమాన్ని సాగించి శత్రువులను మట్టి కరిపించి తన ప్రజలనాదుకున్నాడు. ఒకటి మాత్రం సత్యం. అత్యంత బలవంతుడైన దేవుడు, తన ప్రజల నిస్సహాయ స్థితిని భరించలేడు, వారినలా చూస్తూ ఉరుకోలేడు. కాకపోతే దేవుని సంకల్పానికి తలవంచే ఒక మోషే, ఒక గిద్యోను వంటి అసమాన విశ్వాసులు ఆయనకు కావాలి. గిద్యోను ఎంతో రోషమున్న వాడు, దేవుడంటే గొప్ప విశ్వాసమున్నవాడు. దేవుని మహిమను, ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవి చూసిన గిద్యోను తన పదివేలమంది సైన్యంతో యుద్ధానికి పోబోతే, ‘నేను నీతో ఉన్నానని తెలిసింది కదా? పదివేలమందితో కాదు, కేవలం మూడువందల మందితో అంత అసంఖ్యాకమైన శత్రువులనెదుర్కో’మన్నాడు. కావాలంటే శత్రు శిబిరంలోకి రాత్రివేళ మారువేషంలో వెళ్లి శత్రువులు నీ గురించి వాళ్ళేం మాట్లాడుకొంటున్నారో వినమని దేవుడు చెబితే గిద్యోను ఆదే చేశాడు. గిద్యోను దేవుడు చాలా బలవంతుడు, అందువల్ల గిద్యోను ఖడ్గానికి ఎదురు లేదు, అతన్ని ఎదుర్కొనేవారు ఇన్ని లక్షలమందిలో ఒక్కరూ లేరని వాళ్ళు నిస్పృహతో మాట్లాడుకోవడం విన్న గిద్యోను విశ్వాసంలో మరింత బలపడి కేవలం మూడువందలమందితోనే ఎంతో వ్యూహాత్మకంగా యుద్ధం చేసి శత్రువులను మట్టి కరిపించి ఘన విజయం సాధించాడు. శత్రువులు తమ ధనబలం, జనబలం, కండబలాన్ని చూసి అతిశయిస్తే, దేవుడెన్నుకున్న విశ్వాసులు తమ దేవుని బట్టి మాత్రమే అతిశయిస్తారు. ఆ యుద్ధంలో గిద్యోను సాధించిన ఘన విజయంతో ఇశ్రాయేలీయులు ఎన్నో ఏళ్ళు శాంతి సౌఖ్యాలు, ఆనందంతో జీవించారు. దేవుని ఉద్యమాల పర్యవసానమెప్పుడూ సర్వజన కల్యాణం, అసహాయులు, నిరుపేదల ఆనందమే!! బలహీనులు, అసహాయులైన తన ప్రజలనాదుకోవడానికి దేవుడెప్పుడూ సంసిద్ధుడే. అందుకాయన తన కోసం కొందరిని ప్రత్యేకించుకొని వారికి శ్రమల ద్వారా శిక్షణనిచ్చి తన ప్రజల సంరక్షణార్థం, వారి సంక్షేమం కోసం వాడుకొంటాడు. దేవుని పక్షంగా దీనప్రజల సంక్షేమం కోసం దేన్నైనా చెయ్యడానికి సదా సంసిద్ధులైన నిస్వార్థపరులను దేవుడు పురికొల్పి ఉద్యమ నాయకత్వాన్ని వారికిచ్చి నడిపిస్తాడు. దేవుడు అలాంటి వ్యక్తుల ద్వారానే తన గొప్ప కార్యాలు చేసి ప్రజలకు ఉరటనిస్తాడు. ‘స్పందించే సున్నిత హృదయం, ఆశ్రితులను ఆదుకునే బలమైన చేతులు’ దేవుడు తానెన్నుకున్న వాళ్ళకిచ్చే బహుమానాలు. దేవుడు ఉద్యమిస్తే ఆశీర్వాదాల ప్రవాహమే!!..కోట్లాదిమందిలో దేవుడు తన ఉద్యమం కోసం ఎవరో ఒకరినే ఎన్నుకుంటాడు, తన పనిని అతని ద్వారా సంపూర్ణంగా నెరవేరుస్తాడు. అప్పటి మోషే, గిద్యోను, దావీదు.. నిన్నటి ఒక మార్టిన్ లూథర్, డి.ఎల్. మూడీ, లివింగ్స్టన్, జార్జి ముల్లర్... వీళ్లంతా ప్రజల కష్టాలు, కన్నీళ్లకు దేవుడు కనుగొన్న పరిష్కార ద్వారాలు, దేవుని అభిషేక సాధనాలు, గుండెల్లో ప్రజల పట్ల ప్రేమ ఊటలున్న అత్యంత సాత్వికులు... ప్రజల సంకటాలను, దేవుని కళ్ళతో చూసి, దేవుని మనసుతో అర్ధం చేసుకొని, దైవాదేశాలతో, దైవిక శక్తితో ఎన్నో కష్టాలకోర్చి ప్రజలనాదుకున్న దైవాశీర్వాదాల ప్రవాహం వాళ్ళు... ప్రజలంతా వారికోసం ఎంతగా ప్రార్ధిస్తే వారి ప్రయత్నాలు అంతగా ఫలిస్తాయి. దేవుడు వాడుకునే ఆ సేవకులకు,సేవకుల కుటుంబాలకు కూడా భద్రతకు, ఆరోగ్యానికి, ఆశీర్వాదాలకు కొరత ఉండదు. యుగ యుగాలూ దేవునికే మహిమా, ఘనత, ప్రభావాలు... – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
భారీగా ‘ఓట్ల’ గల్లంతు
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుండారం, కల్లెపెల్లి గ్రామాల్లో సుమారు 350 మంది ఓట్లు గల్లంతయ్యాయి. శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు తమ ఓటు లేదని తెలియడంతో ఆవేదనకు గురయ్యారు. తాము పలు ఎన్నికల్లో ఓటు వేయగా ఇప్పుడు ఎలా గల్లంతవుతాయని అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. వికలాంగ వృద్ధుద్దురాలు జత్నం రత్తవ్వ గుండారంలో ఓటు వేసేందుకు రాగా అక్కడ అధికారులు ఇచ్చిన ఓటరు స్లిప్‌లో పేరు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రంలో లేకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగింది. గుండారం, దాని శివారులోని కొత్తగా ఏర్పడ్డ పెరుకబండలోనే సుమారు 250 వరకు ఓట్లు గల్లంతు కాగా.. మరణించిన పలువురి ఓట్లు కొత్త జాబితాలో ఉండటంతో ప్రజలు మండిపడుతున్నారు. కల్లెపెల్లిలో సుమారు 70 ఓట్లు గల్లంతయిన ట్లు తెలిపారు. ఖాజీపూర్‌లో 40 ఓట్లు గల్లంతు మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని ఖాజీపూర్‌లో సుమారు 40 మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఓటర్ల పేర్లు రికార్డుల్లో లేకపోవడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి బంధువులు అంగన్వాడీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యం కారణంగానే పేర్లు గల్లంతైనట్లు ఆరోపించారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇటిక్యాలలో 200 ఓట్లు..జగదేవ్‌పూర్(గజ్వేల్): గ్రామంలో 1709 ఓట్లు ఉండగా.. అందులో సుమారు 200 ఓట్లు గల్లంతయినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది తమ ఆధార్ కార్డులను, ఎన్నికల గుర్తింపు కార్డులను తీసుకెళ్లినా ఓటర్ లిస్టులో పేరు లేదనే కారణంతో ఓటు వేసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు ఎన్నికల కేంద్రం నుంచి ఇంటికి వెనుదిరిగారు. పీర్లపల్లిలో ఎంపీపీ రేణుక ఓటు హక్కును, నర్సన్నపేటలో జెడ్పీటీసీ రాంచం ద్రం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుబ్బాకలో...దుబ్బాకటౌన్: దుబ్బాక నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా చాలామంది ప్రజల ఓట్లు గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డులున్నా చాలామంది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో పరేషాన్ అయ్యారు. దుబ్బాక పట్టణంలోనే సుమారుగా నాలుగైదు వందల మందికి పైగా ఓట్లు గల్లంతయ్యాయి. దుబ్బాక పట్టణంలోని 38వ పోలింగ్ కేంద్రం వద్ద పట్టణంకు చెందిన అంకం రాజేశ్వర్, అంకం సత్తవ్వ, రేపాక సువర్ణ, రమ్యలకు చెందిన ఓట్లు గల్లంతు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆటోచార్జీలు పెంచడం తప్పదు
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పట్టణంలో నడుస్తున్న ఆటో చార్జీలను పెంచడం తప్పదని ఆటో యూనియన్ జేఏసీ నాయ కులు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీలో ఆటో యూనియన్ జేఏసీ సమావేశంలో రాములు, ఎస్ఏ శ్యామ్, శ్రీనివాసులు, అంబదాస్ మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టణంలో రూరల్ ఆటోలు తిరుగడం వల్ల పట్టణ ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న వారికి గిరాకీ తగ్గుతున్నాయనే భావన వస్తుందన్నాను. ఈ అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టణంలో చార్జీల పెంపుపై త్వరలోనే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చార్జీలు పెంచడానికి జేఏసీ తీర్మానించిందని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, వెంకట్, విజయ్‌కుమార్, సత్యం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కుశలమా.. నీవు కుశలమేనా?
ఒంగోలు టౌన్ : జిల్లాలోని ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారా..? లేకుంటే దుఖంగా ఉన్నారా..? అనే విషయమై జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టనుంది. హ్యాపీనెస్ సర్వే పేరుతో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు సర్వే నిర్వహించనుంది. వివిధ రంగాలకు చెందిన వారి నుంచి వివరాలను సేకరించనుంది. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1500 మందిని ఎంపిక చేసుకొని వారి నుంచి ఐదురకాల అంశాల ద్వారా వారి స్థితిగతులను తెలుసుకొని అత్యంత ఆనందంగా ఉన్నారా..? విచారంతో ఉన్నారా..?అనే వివరాలను తెలుసుకోనుంది. ఈ సర్వే నిర్వహణ బాధ్యతలను మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సహాయ గణాంకాధికారులుగా పనిచేస్తున్న వారికి అప్పగించింది. వారివద్ద ఉన్న ట్యాబ్‌లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు సర్వేకు సంబంధించిన అప్లికేషన్ అప్లోడ్ చేశారు. దీంతో సహాయ గణాంకాధికారులు ఏరోజుకారోజు తాము నిర్వహించిన సర్వే వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మూడురోజులపాటు జరగనున్న సర్వే ప్రక్రియను ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయ గణాంకాధికారులకు సలహాలు, సూచనలు అందించనున్నారు. సర్వే నిబంధనలు.. జిల్లాలో హ్యాపీనెస్‌కు సంబంధించిన నిర్వహించనున్న సర్వేలో ఐదురకాల అంశాలను ప్రామాణికంగా తీసుకొని సహాయ గణాంకాధికారుల బృందం వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న కుటుంబాలకు వెళ్లిన సమయంలో ఆ కుటుంబ యజమానితో మాట్లాడాలి. వివరాలు సేకరించే సమయంలో కుటుంబ యజమాని తప్పనిసరిగా ఉండాలి. సర్వేలో 50 శాతం పురుషులు, 50 శాతం మహిళలు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని సర్వే చేపట్టాల్సి ఉంది. ఎంపిక చేసుకున్న ఒక్కో గ్రామంలో ఆరు శాంపిల్స్ తక్కువ కాకుండా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. వివరాలు సేకరించే వ్యక్తుల వయస్సు 15 ఏళ్ల పైబడి ఉండాలి. ఒక ఉద్యోగి, ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి, నిరుద్యోగి తప్పనిసరిగా ఉండాలి. బేల్దారి మేస్త్రి మొదలుకొని హోల్‌సేల్ వ్యాపారం చేసేవారి అభిప్రాయాలు తప్పనిసరిగా సర్వేలోపొందుపరచాల్సి ఉంటుంది. వివరాలు సేకరించే ఐదు అంశాలు ఇవే.. సంతోషంగా ఉన్నారా..? లేదా? ఆర్థికపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తి బంధువులు లేదా స్నేహితులు ఏమైనా సహాయం చేస్తారా..? లేదా..? సంతృప్తికరంగా జీవిస్తున్నారా..? అసంతృప్తితో ఉన్నారా..? గడచిన నెలలో ఏదైనా ఛారిటీకి ఆర్థిక సహాయం చేశారా, ఏవరైనా ఇబ్బందుల్లో ఉంటే నగదు సహాయం అందించారా లేదా..? ప్రభుత్వ కార్యాలయాల్లో, వ్యాపార కార్యకలాపాల్లో ఎక్కడైనా అవినీతి జరుగుతోందా, ఒకవేళ జరుగుతుంటే ఏ స్థాయిలో జరుగుతోంది? సర్వే పక్కాగా నిర్వహించాలి.. జిల్లాలో హ్యాపీనెస్ సర్వేను పక్కాగా చేపట్టాలని ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య ఆదేశించారు. శనివారం స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని సహాయ గణాంకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేకు సంబంధించిన ప్రామాణికాలను కచ్చితంగా పాటించాలన్నారు. సమస్య తలెత్తకుండా నిర్ణీత వ్యవధిలోగా వివరాలు అందించాలని సూచించారు. -
‘ఆహార భద్రత’ అందేనా..!
ఆదిలాబాద్‌అర్బన్ : కొత్త రేషన్‌కార్డుల(ఆహార భద్రత)కు దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే వేల సంఖ్య లో దరఖాస్తులు స్వీకరించగా, చేర్పులు, మార్పు ల కోసం ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కానీ అధికారులు నూతన రేషన్ కార్డుల మంజూరుపై దృష్టి సారించలేకపోతున్నారు. గత పక్షం రోజుల క్రితం ప్రారంభమైన రైతుబంధు పథకం ఆర్థిక సాయం చెక్కులను రైతులకు పంపిణీ చేయడంలో యంత్రాంగం బీజీగా ఉంది. జిల్లా స్థాయి అధికారులు మండల ప్రత్యేక అధికా రులుగా వ్యవహరిస్తుండగా, మండలాల్లోని తహసీల్దార్‌తోపాటు వీఆర్ఏ, వీఆర్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పెట్టుబడి పథకంలో ప్రతి రోజు పాల్గొం టున్నారు. దీంతో నూతన రేషన్‌కార్డుల మంజూ రుకు వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తమకు ఆహారభద్రత కార్డు ఎప్పుడు మంజూరు అవుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త కార్డులకు వెల్లువలా.. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం జిల్లాలో 2015లో ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఈ లెక్కన జిల్లాలో 1,81,926 ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. కార్డు మంజూరు చేయడమే కాకుండా రేషన్ కార్డుకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది నిరంతర ప్రక్రియ అయినందున కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జిల్లాలో 2015 తర్వాత కూడా 1,425 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు ప్రస్తుతం ఆయా మండలాల తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్లు కార్డులు పొందడం, ఒక్కో కుటుంబానికి రెండు, మూడు కార్డులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం 2017 మే నెలలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. దీంతో గత రెండేళ్లుగా ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు కాలేదు. తాజాగా ప్రభుత్వం మళ్లీ ఆన్లైన్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించింది. అర్హులైన లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఇవీ ప్రస్తుతం ఆయా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో పెండింగ్... రేషన్‌కార్డులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా అవి ప్రస్తుతం రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,941 దరఖాస్తులు రాగా, తహసీల్దార్ స్థాయిలో 8, డీఎస్వో స్థాయిలో 4 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 4,929 దరఖాస్తులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. జిల్లాలోని 18 మండలాల్లో కొత్త రేషన్‌కార్డులకు ఏప్రిల్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆర్ఐ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించిన తర్వాత తహసీల్దార్ లాగిన్‌కు వస్తాయి. అక్కడి నుంచి డీఎస్వో లాగిన్లోకి వెళ్తాయి. డీఎస్వో పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయానికి పంపితే అక్కడ ఆమోదం పొంది కొత్త కార్డులు జారీ అవుతాయి. కానీ గత పక్షం రోజులుగా రెవెన్యూ యంత్రాంగం పెట్టుబడి చెక్కుల పంపిణీలో బీజీగా ఉంది. దీంతో కొత్త రేషన్ కార్డులవైపు అధికారులు చూడడం లేదని తెలుస్తోంది. ఇందుకు కొంత సమయం పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పెరగనున్న కోటా... జిల్లాలో ప్రస్తుతం 1,81,926 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు ప్రతి నెల 4,015 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. ప్రతి రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పరిమితి లేకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ అవుతున్నాయి. తాజాగా కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నందున రేషన్ కార్డుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. కొత్త కార్డులు మంజూరైతే జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుంది. జిల్లాకు కేటాయించనున్న కోటా సైతం పెరిగే అవకగాశం ఉంది. ప్రస్తుతం స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా కార్డులో పేర్లు చేర్చాలని, సభ్యుల పేర్లను తొలగించాలని, ఆధార్ అనుసంధానం చేయాలనే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఇంకొన్ని దరఖాస్తులు రేషన్‌కార్డు పేరు మార్పు కోసం రావడంతోపాటు కొత్త కార్డులకు సైతం వచ్చాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. -
ప్రకృతి విలయం..215 మంది మృతి
కెన్యా : గత కొద్ది నెలలుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కెన్యా ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. వరదల వల్ల ఇప్పటి వరకు దాదాపు 215 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 2లక్షల మంది ఇళ్లను కోల్పోగా దాదాపు 20 వేల మూగజీవాలు ప్రాణాలు విడిచినట్లు వారు తెలిపారు. మృతులలో ఎక్కువ మంది పసిపిల్లలు ఉండటం హృదయాలను కదిలించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాజాగా నైరోబిలోని ఓ డ్యాం పగలడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా మరి కొన్ని డ్యాంలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని తమను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రెండు గ్రామాల మధ్య పంక్షన్ తెచ్చిన తంటా
-
పంక్షన్ తెచ్చిన తంటా.. గ్రామాల మధ్య ఘర్షణ
సాక్షి, తూర్పు గోదావరి : మూడు రోజుల క్రితం ఓ ఫంక్షన్లో తలెత్తిన వివాదంతో మొదలైన ఘర్షణ నేటికి కొనసాగుతుంది. దీంతో జిల్లాలోని తొర్రేడు, వెంకటనగరం గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలివి.. తొర్రేడు గ్రామానికి చెందిన యువకులు ఆదివారం వెంకటనగరం వెళ్లడంతో గొడవ మళ్లీ మొదలైంది. అనంతరం ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో గ్రామస్తులతో పాటు వారిని చెదరగొట్టడానికి వచ్చిన పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు గ్రామాల ప్రజలను చెదరగొట్టారు. అంతేకాక పోలీసులు ఇరు గ్రామాల ప్రజల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో వెంకటనగరం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. -
ప్రజలకు సేవలందించడం వరం
గద్వాల : ప్రజలకు సేవలందించే అవకాశం తనకు భగవంతుడు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడి ప్రజలకు స్వయంగా సేవలందించే అవకాశం కలగడం వరంగా భావిస్తున్నానన్నారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి, వివిధ అభివృద్ధి పనులను చేపట్టి నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచేందుకు యత్నిస్తున్నానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా గ్రామాల్లో సామాజిక సేవలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండల పద్మావతి, గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, వైస్‌చైర్మన్ శంకర్, పార్టీ నాయకులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాల్, సలాం, బండల వెంకట్రాములు, రామంజనేయులు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డీకే అరుణకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 121 మంది రక్తదానం మొదట ఇంట్లో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే డీకే అరుణ కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకొన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన స్వగృహ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులతోపాటు పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు 121మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్తదానంతో కాపాడొచ్చన్నారు. రక్తదానాన్ని ఇతరులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీచుపల్లిలో ప్రత్యేక పూజలు.. ఇటిక్యాల (అలంపూర్) : తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆంజనేయస్వామి ఆలయ పూజారి మారుతీచారి, ఈఓ రామన్‌గౌడ్, వాల్మీకి పూజరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. -
డబల్... డబల్
జనం చెవుల్లో అరటి పూలు పూయించవచ్చునని అనుకుంటే, ఏదో రోజు జనం వారి చెవుల్లో కాగడాలు వెలిగిస్తారు. రాజకీయ నాయకులు రూరల్ ఓటర్ కోసం కొత్త కొత్త గాలాలు, సరికొత్త వలసంచీలు తీసుకు తిరుగుతూ ఉంటారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని మోదీ నమ్మపలికారు. పంచవర్ష ప్రణాళిక పూర్తి కావస్తున్నా, రైతుల మొహాన పొద్దు పొడవ లేదు. ఇంతకీ ఏ విధంగా రైతు ఆదాయం పెంచుతారో చెప్పనే లేదు. ఇంకో నాయకుడు పూర్తిగా శిథిలమైన పంచాయతీ వ్యవస్థని పునర్నిర్మి స్తానని చెబుతున్నారు. అధికార వికేంద్రీకరణకి రాజ కీయం తెల్సిన నాయకుడెవడూ మొగ్గుచూపడు. ఒకప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకి గ్రామ పంచాయతీలే మూలమని గుర్తొస్తుంది. ఇంకేవుంది ఆ దారిలో ఏలేద్దామనుకుంటారు. మన గ్రామ పంచాయతీలకి ఆదాయం లేదు. ముందు దాన్ని పెంచాలి. అన్ని లావాదేవీలపైన గ్రామాలకి వాటా పెట్టాలి. బళ్లు, గుళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వాటి విధుల్ని సక్రమంగా నిర్వర్తించేలా చూడాలి. గడచిన యాభై ఏళ్లుగా గ్రామాలు బస్తీలవైపు వెళ్తుంటే చూస్తూ కూర్చున్నాం. కులవృత్తులకు చెదపట్టింది. నేడు గ్రామాల్లో ఎనభై శాతం మంది పురుషులు మద్యానికి అలవాటుపడ్డారు. ప్రభుత్వాలు నిస్సిగ్గుగా మద్యం మీద బతుకుతున్నాయ్. రైతు ఆదాయం సబ్సి డీలతో పెంచుతారా? వాళ్లకి కూడా పింఛన్లు మంజూరు చేస్తారా? అదే మన్నా అంటే దళారీ వ్యవస్థని రూపు మాపుతామంటారు. అంతా వొట్టిది. అసలు మన రాజకీయ వ్యవస్థే అతిపెద్ద దళారీ వ్యవస్థ. ఆనాడు ఈస్టిండియా కంపెనీ ఏల కులు, లవంగాలు, ధనియాలు, దాసించెక్కలకి దళారీ హోదాతోనే దేశంలో అడుగుపెట్టింది. అందు కని మన నేతలకి అదొక దిక్సూచి. చిల్లరమల్లరగా ఓట్లు కొనుక్కుని ఓ ఎమ్మెల్యే తెర మీదికి వస్తాడు. అవసరాన్నిబట్టి ఆ ఎమ్మెల్యే ఏదో ధరకి అమ్ముడవుతాడు. పగ్గాల మీద ఆశ ఉన్న వారంతా కొనుగోళ్లమీద దృష్టి సారిస్తారు. ప్రత్యేకించి పాలసీలేమీ వుండవ్. అందరూ ప్రజాసేవ నినాదంతోనే సాగుతూ, వారి వారి ‘స్టామినా’ని బట్టి సొమ్ము చేసుకుంటూ ఉంటారు.ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తే కొన్ని కొన్ని ఆదాయ వనరులు గ్రామాల్లో కనిపిస్తాయ్. ధాన్యాలు, కూరలు, పండ్లు, మాంసం, చేపలు, పాలు– వీటన్నింటినీ ఉత్పత్తి చేసేది గ్రామాలే. దళారీలు కబళించకుండా గ్రామాల్ని కాపాడితే చాలు. దాంతోపాటు గ్రామాల్ని బస్తీలకు దగ్గర చెయ్యాలి. అంటే రవాణాకి అనువైన చక్కని రోడ్లు, జలమార్గాలని ఏర్పాటు చేయాలి. కేరళలో అతి చౌకగా జల రవాణా ఎలా సాగుతోందో గమనించవచ్చు. మనకి బొత్తిగా జవాబుదారీతనం లేకుండా పోయింది. నేతలకి సొంత మీడియా భుజకీర్తుల్లా అమరిన ఈ తరుణంలో ఎవర్నీ ఏమీ ప్రజలు ప్రశ్నించలేరు. అయిదువేలు జనాభా ఉన్న పంచాయతీలన్నింటికీ డ్రైనేజీ సౌకర్యం, పంచాయతీకి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేలా వెర్మి కంపోస్ట్ పరిశ్రమ మంజూరు చేసేశారు ఓ యువమంత్రి ఉదారంగా. జనం చెవుల్లో అరటి పూలు పూయించవచ్చునని అనుకుంటే, ఏదో రోజు జనం వారి చెవుల్లో కాగడాలు వెలిగిస్తారు. పాడుబడ్డ నూతులముందు నిలబడి నవ్వితే, తిరిగి నవ్వు వినిపి స్తుంది. అరిస్తే అరుస్తుంది. అడవుల్లో అజ్ఞానం కొద్దీ నక్కలు, ఎలుగులు అరుపు లతో వినోదిస్తూ ఉంటాయ్. నాయకులు మరీ ఆ స్థాయికి దిగకూడదు. ఈ నేల మీద పెట్రోలు, డీజిలు, గ్యాస్ లాంటి సహజ ఇంధనాలు పుష్కలంగా పండుతున్నాయ్. వాటిని చీడపీడలు అంటవు. అతివృష్టి అనావృష్టి సమస్యలు లేవు. గాలులు, గాలి వానలు చెరచలేవు. అయినా సామాన్య పౌరుడు ఈ నిత్యావసరాలను ఎంతకి కొంటున్నాడు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి! మనదొక పెద్ద దళారీ రాజ్యం. మన నాయకుల మాటలన్నీ దళారీ మాటలు. ఇది నైరాశ్యం కాదు, నిజం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రాజధాని ప్రజలు సంతోషంగా ఉంటే చాలా..?
కడప కార్పొరేషన్ : అమరావతిలో ప్రజలు సంతోషంగా ఉంటే చాలా, రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నా మీకు పట్టదా అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి. నారాయణ సీఎంను ప్రశ్నించారు. స్థానిక కార్పొరేషన్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏడో రోజు రిలే నిరాహార దీక్షల్లో ఆయన మాట్లాడారు కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషాతో కలిసి ఆయన దీక్షలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు రాష్ట్ర ప్రజలు కోరుకున్నవి కావని, అవి చట్టంలో చేర్చబడిన అంశాలేనన్నారు. బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ చెప్పారని, తిరుపతి సభలో చంద్రబాబు, మోదీ ఇద్దరూ వాగ్ధానం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇద్దరూ ప్లేటు ఫిరాయించారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వలేదని, కడప స్టీల్ ప్లాంటు గూర్చి అసలే పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తామని ఒక్కటీ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తుంటే ఆనందనగరం పేరిట సంబరాలు చేసుకోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలు చేయాలని ఈనెల 16వ తేదీ నిర్వహించే బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా బంద్‌లో పాల్గొనాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో పట్టుబడిన సీఎం హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే హక్కును వదులుకొని, అమరావతికి పారిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కరిముల్లా, ఎస్ఏ షంషీర్, చినబాబు, సాయిచరణ్ తదితరులు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్(బూస్ట్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షల్లో మణి, మహేష్ తదితరులు కూర్చొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అఫ్జల్ఖాన్, నాయకులు పాకా సురేష్‌కుమార్, రాజగోపాల్‌రెడ్డి, బోలా పద్మావతి, త్యాగరాజు, సీహెచ్ వినోద్, జాషువా, శివప్రసాద్, షఫీ, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రజలను వంచించారు
ప్రొద్దుటూరు : ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఇన్నాళ్లు తన పబ్బం గడుపుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించారని వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో రోడ్ల దిగ్బంధనం కార్యక్రమం చేపట్టారు. గంట పాటు జరిగిన ఈ కార్యక్రమంతో ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు, ఆర్టీపీపీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సోములవారిపల్లె గ్రామ పంచా యతీ వైఎస్సార్సీపీ నాయకుడు శేఖర్ యాదవ్, బంగారురెడ్డి, వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్ శివకుమార్ యాదవ్, పోసా భాస్కర్, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి వెల్లాల భాస్కర్, బూసం రవి, అర్కటవేముల సిద్ధి రమణారెడ్డి, గాదెగూడూరు ఎంపీటీసీ సభ్యుడు ఎర్రి రమణారెడ్డి, తొండలదిన్నె రాజారామిరెడ్డి, చిన్నశెట్టిపల్లె సర్పంచ్ రామకృష్ణ యాదవ్, శంకరాపురం నాగమునిరెడ్డి. 38వ వార్డు ఇన్చార్జి బద్రి రంగారెడ్డి, మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి దాదాపీర్, జ్ఞానా నందం, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున ప్రసాద్, చౌడం రవీంద్ర, ఆర్సీ సుబ్రహ్మణ్యం, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, నాగభూషణం, చెన్నకేశవరెడ్డి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మనోహర్, వార్డు మెంబర్ సుబ్బ రాయుడు, నంద్యాల వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐలు చంద్రశేఖర్, మధుమల్లేశ్వరరెడ్డి తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉలిక్కిపడిన మక్తల్
మక్తల్ : మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలో నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం రాత్రి 7 గం టల నుంచి దాదాపు 9 గంటల వరకు పోలీసు బృందాలు ఇళ్లలోకి వచ్చి తనిఖీలు చేపట్టడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 26 వాహనాలు, 20 తులాల బంగారం, 9 కిలోల వెండిని స్వా ధీనం చేసుకున్నారు. అలాగే గుట్కాలు, జీపులను స్వాధీనపరుచుకున్నారు. పట్టణంలోని ఎల్లమ్మకుంట, రాఘవేంద్రకాలనీల్లో ప్రతి ఇంటిలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పట్టణంలో రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతు న్న పలువురు వ్యక్తుల ను అదుపులోకి తీ సుకుని వేలిముద్రలను సేకరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజల రక్షణే ధ్యేయం.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో పేట డీఎస్పీ శ్రీధర్ మా ట్లాడుతూ ప్రజల రక్షణే కార్డెన్ సెర్చ్ ప్ర ధాన లక్ష్యమన్నారు. కొత్తగా ఎవరైనా వ్య క్తులు ఇళ్లలో అద్దెకు వచ్చినా వారికి సం బంధించిన పూర్తి వివరాలు సేకరించాలన్నారు. కార్డెన్ సెర్చ్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆభరణాలకు సంబం ధించి యజమానులు సరైన పత్రాలు చూ యించి తీసుకెళ్లాలన్నారు. విడతల వారీ గా అన్ని ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేపడు తామన్నారు. తనిఖీల్లో సీఐ వెంకట్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రామకృష్ణ, మరో ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 141 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధిని చూసే పార్టీలోకి..
ఆసిఫాబాద్‌క్రైం : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే తమ పార్టీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో వాంకిడి మండలంలోని కనర్గాం గ్రామానికి చెందిన ప్రజలను ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు మెచ్చి పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వాపోయారు. గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు, రెబ్బన ఎంపీపీ సంజీవ్, ఎంపీటీసీ రవీందర్, నాయకులు గాదవేణి మల్లేశ్, సుదర్శన్‌గౌడ్, జాడి రేణుక బాయి, రాజు బాయి, నందు, కిరణ్, జీవన్ తదితరులున్నారు. -
కల.. నెరవేరిన వేళ
నిర్మల్‌రూరల్ : ఆదిలాబాద్ జిల్లాలోనే తొలి మోడల్ బెడ్రూం ఇళ్లను నిర్మల్‌రూరల్ మండలంలోని తన సొంత ఊరైన ఎల్లపెల్లిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. 45మంది లబ్ధిదారుల ఇళ్లను స్వయానా ప్రారంభించి అందించారు. 125 గజాల స్థలాన్ని ఒక్కో ఇంటికి కేటాయించి 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇంటిని నిర్మించారు. ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షల(రూ. 5.04 లక్షలు ఇంటినిర్మాణానికి, రూ.లక్షా 25వేలు మౌలిక సదుపాయాల కోసం) ఖర్చు చేశారు. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఎనిమిది నెలల స్వల్ప కాలవ్యవధిలోనే 45 ఇళ్ల నిర్మాణం పూరైంది. గ్రామ సభ ద్వారా 45నిరుపేద కుటుంబాలను లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారికి ఇళ్లను అందజేశారు. ప్రతీ ఇంటికి రెండు పడక గదులు, హాల్, కిచన్‌తో పాటు ప్రత్యేకంగా వాషింగ్ ఏరియా, కామన్ బాత్రూంతో పాటు పడక గదికి అటాచ్డ్ బాత్రూంను కూడా నిర్మించారు. సొంతింటి కల నెరవేరుస్తాం: మంత్రి జిల్లాలో ప్రతీ నిరుపేద ‘సొంతింటి’ కల నెరవేరుస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎల్లపెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష 70వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. ఈ నిర్మాణాల కోసం ఇసుకను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు సిమెంట్, స్టీల్‌ను కూడా మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకు అందిస్తున్నామన్నారు. షేర్వాల్ టెక్నాలజీతో త్వరితగతిన డబుల్ ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ టెక్నాలజీతో కేవలం పది రోజుల్లోగా 10 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయవచ్చనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే వాటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఓర్వలేని తనంతో విమర్శలు చేస్తున్నాయన్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎల్లపెల్లి మొదటి ‘డబుల్ మోడల్ కాలనీ’ అని పేర్కొన్నారు. గేటెడ్ కమ్యూనిటీ తలపించేలా : కలెక్టర్ ఎల్లపెల్లిలో లబ్ధిదారులకు అందజేసిన డబుల్ ఇళ్లు గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా ఉందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, మంత్రి సతీమణి విజయలక్ష్మి, గృహనిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ సత్యమూర్తి, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు దేవేందర్‌రెడ్డి, రాజ్ మహ్మద్, ఎంపీపీ దౌలాన్బీ, భూదాత సంపత్‌రెడ్డి, కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీధర్‌రెడ్డి, సర్పంచ్ పిట్ల భీంరావు, ఎఫ్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ యువ నాయకుడు గౌతమ్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలలో కూడా ఊహించలేదు.. ఇసుంటి ఇల్లు కట్టుకుంటామని మేము కలలో కూడా ఉహించలేదు. ఇండ్లు చాలా బాగున్నాయి. డబుల్ బెడ్ రూం, హాల్, కిచన్ ఎంతో అందంగా, నాణ్యతతో నిర్మించిఇచ్చారు. ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. -
ముందుంది ముప్పు !
గద్వాల : ఎండాకాలం ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు పనిచేయడం లేదు. రిజర్వాయర్లు వట్టిపోయాయి. కృష్ణానదిలో నీటి ప్రవాహం కనిపించడం లేదు. చెరువులు, కుంటలు, బావులు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఫలితంగా జిల్లాలోని గద్వాల, అయిజ మున్సిపాలిటీల పరిధిలో వేసవికి ముందే తాగునీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయినా, ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు కరువయ్యాయి. తీరా అత్యవసర సమయంలో నిధులు మంజూరుకాకపోవడం, కేటాయింపు అరకొరగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు వేసవి రాకముందే పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు అరకొర నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలో రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తుండగా.. మరికొన్ని ప్రాం తాల్లో ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అయిజలో తాగునీటి సమస్య జఠిలం అయిజలో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. అక్కడ ఉన్న బోరుబావులు అ డుగంటాయి. భూగర్భజలాలు వేగంగా పడిపోతుండటంతో తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీరు సరిపోవడంలేదు. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. గద్వాల పట్టణ ప్రజలకు తాగునీటిని అందించడానికి కృష్ణా ఫిల్టర్‌బెడ్, జమ్ములమ్మ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. నదిలో నీరు లేకపోవడంతో కృష్ణా ఫిల్టర్ బెడ్ ద్వారా సరఫరా అయ్యే కాలనీలకు తాగునీరు అరకొరగా అందనుంది. జమ్ములమ్మ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో అడుగంటే పరిస్థితి ఉంది. ఇప్పటికే జూరాల కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతోపాటు గద్వాల పట్టణ శివారులో తాగునీటి ఇక్కట్లు నెలకొన్నాయి. ఇక్కడ తాగునీటి సరఫరా అరకొరగా ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక పట్టణాల గుర్తింపేదీ? గద్వాల, అయిజ పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖ అధికారులు గుర్తించాల్సి ఉండగా... ఆ దిశగా కార్యాచరణ చేయలేదు. గతేడాది మాత్రం ఆయా పట్టణాల్లో తాగునీటి కోసం ఎక్కువగా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ ఏడాది ముందుగానే ఎద్దడి మొదలైన తాగునీటి అవసరాలపై చర్యలు లేకపోవడం ఆ ప్రాంతవాసులకు ఆందోళన కలిగిస్తోంది. మిషన్ భగీరథ మీదనే భారం... నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీరు ఇవ్వడానికి మిషన్ భగీరథ కిందనే నీటిని అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆ నీటిని తీసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. జూరాల దగ్గర ఉన్న గ్రిడ్ ద్వారా ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశారు. మిషన్ భగీరథ ద్వారా నీటిని మున్సిపాలిటీలకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గద్వాల పట్టణ శివారులో నిర్మించిన ట్యాంకులు, సంపుల్లోకి నీటిని తీసుకొని, అక్కడి నుంచి పాత పద్ధతిలోనే నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టారు. అయిజ పట్టణానికి మాత్రం భగీరథ నీరు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నీటి అవసరాలు తీరేనా? గద్వాల, అయిజ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి అవసరాలు తీవ్రంగా మారగా.. అధికారులు మాత్రం ఈ వేసవిలోనే మిషన్‌భగీరథ కింద నీటిని అందించాలని నిర్ణయించారు. నీటి అవసరాలు తీర్చే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటికీ అనుమానంగా ఉంది. అయితే ప్రతి వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఆయా పట్టణాల్లో కనిపించడం లేదు. ప్రతిపాదనలు పంపిస్తాం నీటి ఎద్దడి నివారణ చర్యలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. గతేడాది తరహాలోనే ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు నివేదిస్తాం. మిషన్ భగీరథ కింద నీటిని ఇవ్వడానికి సైతం ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. – ఇంతియాజ్ అహ్మద్, డీఈ, గద్వాల మున్సిపాలిటీ సమస్య తీరడంలేదు తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా పట్టించుకోవడంలేదు. తాగునీరు సరఫరా కాకపోవడంతో చాలామంది అయిజలో ఫిల్టర్ నీటిని కొని తాగుతున్నారు. దుర్గానగర్‌కు ఇంతవరకు కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. చేతిపంపులు ఎండిపోయాయి. ఒకటే బోర్‌వెల్‌లో నీళ్లున్నాయి. దానికి పవర్మోటార్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేస్తున్నారు. మోటార్ కాలిపోయినప్పుడల్లా నీళ్లు దొరకవు. ఎండాకాలంలో అధికారులు వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – మాణిక్యమ్మ, దుర్గానగర్, అయిజ -
మావోయిస్టుల ప్రతీకారేచ్ఛ..!
‘‘పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం ఉంటుంది. నెత్తుటి బాకీ తీర్చుకుంటాం. అమరులైన వీరులకు నివాళులర్పిస్తాం...’’ ఇది, మార్చి 3న, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ చేసిన హెచ్చరిక (ఆడియో టేప్). అంతకు ముందు రోజు (మార్చి 2న) మన రాష్ట్ర సరిహద్దులోగల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారికాంకేర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పదిమంది మావోయిస్టులు మృతిచెందారు. ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు అన్నంత పని చేస్తున్నారు. హత్యాకాండ సాగిస్తూనే ఉన్నారు. చర్ల : ఇప్పటికి 12. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇది. ఇందులో పదిమంది జవాన్లు, ఇద్దరు సామాన్యులు. పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు కారకులని ఆరోపిస్తూ, చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామస్తుడు ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్‌ను, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసురు పోలీస్ స్టేషన్ పరిధిలోగల చినఊట్లపల్లికి చెందిన సోడి అందాల్ అలియాస్ నందు అలియాస్ రఘును మావోయిస్టులు బుధవారం సాయంత్రం చంపేశారు. అక్కడ లేఖలు వదిలారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించిన మూడో రోజునే హత్యాకాండ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా దోర్నపాల్ సమీపంలో నాలుగు బస్సులను దహనం చేశారు. ఓ బస్సులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్‌ను చంపేశారు. మార్చి 13న మరో దారుణానికి తెగబడ్డారు. ఇదే జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోగల పాలోడు బేస్ క్యాంపునకు జవాన్లు వెళుతున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేశారు. ఈ దాడిలో తొమ్మిదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, బీజాపూర్ జిల్లాలోని చినఊట్లపల్లి గ్రామ సమీపంలోగల తాలిపేరు వాగు వద్ద పూసుగుప్పకు చెందిన ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్‌ను, చినూట్లపల్లికి చెందిన సోడి అందాల్ అలియాస్ నందు అలియాస్ రఘును చంపేశారు. దీంతో, ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టులు చంపిన వారి సంఖ్య 12కు చేరింది. రాష్ట్ర సరిహద్దుల్లో బలగాలు కూంబింగ్ సాగిస్తున్నాయి. మావోయిస్టులు కూడా ఇలా హత్యలు, ఇతరత్రా దుశ్చర్యలు (బస్సులు, లారీలు, జేసీబీలు, పొక్లెయిన్లు, కాంక్రీట్ మిల్లర్లను దహనం చేయడం) సాగిస్తూనే ఉన్నారు. ఎన్కౌంటర్లు, ప్రతీకార దాడులు, హత్యల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతందోనని ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. బలగాలు ఒకవైపు విస్తృతంగా కూంబింగ్ సాగిస్తుండగానే, మావోయిస్టులు మరోవైపు హత్యలు–దుశ్చర్యలకు దిగుతుండడంతో తీవ్ర ఆందోళన–అయోమయం నెలకొంది. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ జరిగిన నెల కూడా పూర్తవలేదు. ఇంతలోనే 12మందిని మావోయిస్టులు బలిగొన్నారు. మున్ముందు ఇంకెంతగా రెచ్చిపోతారో.. ఎవరెవరిని బలి గొంటారో.. సరిహద్దుల్లో సర్వత్రా ఇదే చర్చ. -
కోదండరాం పార్టీకి మద్దతు ఇవ్వాలి
భువనగిరి : జేఏసీ చై ర్మన్ కోదండరాం ఏ ర్పాటు చేయనున్న పార్టీకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఉస్మానియ యూనివర్సిటీ జేఏసీ ఆధ్యక్షుడు మాలిగ లింగస్వామి అన్నారు. బుధవారం స్థానిక ఎస్వీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా టీజేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాలకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పే శక్తి కోదండరాంకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అ«ధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ బల్లి దయాకర్, పట్టణ కన్వినర్ డి. రఘువీర్, మండల కన్వినర్ కె. శ్రీశైలం, నరేష్, మల్లేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసమే పోలీసులు
భీమారం : పోలీసులు పనిచేసేది ప్రజల కోసమేనని జైపూర్ ఏసీపీ సీతారాములు అన్నారు. మండల కేంద్రంలోని బోయగూడెంలో పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన స్థలంలో స్థానిక కుటుంబాలతో బుధవారం ఆయన మాట్లాడారు. 411 సర్వే నెంబర్లో 19 గుంటల భూమిని ప్రభుత్వం పీఎస్‌కు కేటాయించిందన్నారు. దీనిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. సుపారిపాలన కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందులో కొత్తగా ఏర్పాటైన భీమారాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఉంటేనే ఆ కార్యాలయాలకు కళ వస్తుందన్నారు. దసరా పండుగ సందర్భంగా జంబి పూజలు, మరోవైపు బతుకమ్మ ఆడుకుంటారని, ఇందుకోసమే అడ్డుకుంటున్నామని స్థానికులు తెలిపారు. వాటి కోసం మరోచోట స్థలం చూపించి ఇక్కడ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఉన్న స్థలంలో కొంత భాగాన్ని బతుకమ్మ, జంబి చెట్టు కు కేటాయిస్తామని ఏసీపీ హామీఇచ్చారు. చెన్నూరు సీఐ కిశోర్, ఎస్సై మంగీలాల్ æరాజ్‌కుమార్‌నాయక్, ఎంపీపీ మెండె హేమలత, సర్పంచ్ ఎల్కటూరి శంకరమ్మ తదితరులు ఉన్నారు. ఆరెపల్లిలో కార్డెన్‌సెర్చ్ మండలంలోని ఆరెపల్లి గ్రామంలో బుధవారం ఉదయం జైపూర్ ఏసీపీ సీతారాములు ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వాహనపత్రాలు లేని 10 ద్విక్ర వాహనాలతోపాటు టాటా ఏసీ, 9 ఆటోరిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి నిర్భంద తనిఖీ చేశారు. చెన్నూరు సీఐ కిశోర్, భీమారం ఎస్సై మంగీలాల్, శ్రీరాంపూర్ ఎస్సై రవిప్రసాద్, ఏఎస్సైలు గంగన్న, నజీర్ ఉన్నారు. -
లోయలో పడ్డ ఆటో..
టేకులపల్లి : ఎదురుగా వచ్చిన పశువులను తప్పించబోయి కల్వర్టు లోయలో ఆటో పడిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని బోడు పంచాయతీ ఎర్రాయిగూడేనికి చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు సోమవారం రోళ్లపాడు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. సామ్యాతండా సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఎదురుగా కొన్ని ఎడ్లు పొడుచుకుంటూ ఆటో మీదకు దూసుకొచ్చాయి. దీంతో అదుపు తప్పిన ఆటో కల్వర్టు లోయలో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఊకే అశ్విని అనే యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం యువతి కోలుకుంది. మిగిలిన ప్రయాణికులు కోటేశ్వరరావు, సునీత, అపర్ణ, ఇద్దరు చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. లోయలో పడిన వారిని బయటకు తీసుకువచ్చారు. -
మండుతున్న ఎండలు– అల్లాడుతున్న ప్రజలు
ఎచ్చెర్ల : మార్చి నెల ప్రారంభమే నడినెత్తిన సూరీడు చుర్రు మంటున్నాడు. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండతీవ్రతతో పాటు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మండలంలో చెరువులు, బావులు, తాగునీటి బోర్లలో నీరు అడుగంటుతున్నాయి. భూగర్భజలాలు ఇంకిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు వేసవి తీవ్రతను తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శీతలపానీయాలు, కొబ్బరిబొండాలు, కర్భూజా పండ్లకు గిరాకీ ఏర్పడింది. -
ప్రకటనలకే పరిమితం..
బొండపల్లి : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడానికి... వలసల నివారణకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదు. వేతనదారులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ మొదట్లో వంద రోజుల పని కల్పించాలని నిర్ణయించారు. తర్వాత 150 పని దినాలను కల్పిస్తామని అధికారులు, పాలకులు ప్రకటనలు గుప్పించారు. దీంతో వేతనదారులు ఎంతో సంతోషించారు. అయితే టీడీపీ సర్కార్ పథకం అమలు పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వేతనదారులకు కూడా 150 రోజుల పని కల్పించలేకపోయారు. దీంతో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న వారు పనికి దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. 150 రోజుల ఉపాధి పని ప్రకటనలకే పరిమితం కావడంతో వేతనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 16,452 వేతనదారులు జాబ్‌కార్డులు కలిగి ఉండగా వీరంతా పనులకు వెళ్తున్నారు. వీరిలో సుమారు పది వేల మంది వంద రోజుల పని పూర్తి చేసుకోగా... మిగిలిన వారు వంద రోజుల పని కూడా పూర్తి చేసుకోలేదు. వంద రోజుల పని పూర్తి చేసుకున్న వారు తమకు 150 రోజుల పని కల్పించాలని కోరుతుండగా, మిగిలిన వారు ప్రస్తుతం పనులకు వెళ్తున్నారు. అందని బిల్లులు అనుకున్న ప్రకారం పనులు కల్పించలేని అధికారులు మరో పక్క చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేకపోతున్నారు. మండలంలోని దేవుపల్లి, బొండపల్లి, గ్రహపతిఅగ్రహారం, ఎం. కొత్తవలస, బి.రాజేరు, సీటీపల్లి, మరువాడ, జే గుమడాం, వెదురువాడ, ఒంపల్లి, కొండకిండాం, రాచకిండాం, కనిమెరక, రయింద్రం, గరుడబిల్లి, గొట్లాం, ముద్దూరు, నెలివాడ, గొల్లుపాలెం, తదితర గ్రామాల్లో ఎక్కువ మంది వేతనదారులు ఉపాధి పనులపైనే ఆధారపడుతున్నారు. ఇందులో చాలా గ్రామాలకు చెందిన వేతనదారులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పనులు కల్పించడం లేదని, అలాగే చేసిన పనులకు సంబంధించి బిల్లులు కూడా మంజూరు చేయడం లేదని వేతనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేతనదారులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించడంతో పాటు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని వేతనదారులు కోరుతున్నారు. కరువు మండలాల్లోనే.. కరువు మండలాల్లోనే 150 రోజులు పనిదినాలు కల్పిస్తున్నారు. బొండపల్లి మండలంలో 100 రోజులు పనిదినాలు మాత్రమే కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు కూడా 100 రోజులు పనిదినాలే కల్పిస్తున్నాం. కె.రవిబాబు,ఏపీఓ,బొండపల్లి మండలం -
లీకేజీలతో తాగునీటి కష్టాలు
గోదావరిఖనిటౌన్ : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12 డివిజన్లో నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎండలు ముదరకముందే నీటి కష్టాలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని స్థానికి ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన తాగు నీటి పైపులు చాలా చోట్ల లీకేజీ కావడంతో నీరు లీకేజీ అవుతోంది. దీంతో ఇక్కడి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదు. దూర ప్రాంతాల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నామని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సర కాలం నుంచి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలందరికీ తాగునీరు అందించాలని కోరుతున్నారు. నీటి కలుషితం.. తాగు నీటి పైపులు లీకేజీ కావడంతో బురద, మట్టి, ఇతర కాలుష్య వస్తువులు కలవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల కొంతమంది డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడ్డామని స్థానికులు అంటున్నారు. లీకేజీలు అరికట్టి స్వచ్చమైన తాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. సంవత్సరాలు గడిచినా పట్టించుకోవడం లేదు తాగు నీటి పైపులు లీకేజీ అవుతున్నాయని సంవత్సరాల నుంచి అధికారులకు, పాలకులకు వినతి పత్రాలు అందించినా పట్టించుకోవడం లేదు. నీటి కాలుష్యంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. – బొద్దుల నరేందర్ తాగునీటి కోసం రోజూ ఇబ్బందే.. తాగు నీటి కోసం ప్రతి రోజూ ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజు 5 కిలోమీటర్ల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నాం. నీరు తెచ్చుకోవడం దిన చర్యలో భాగమైంది. ఎండా కాలంలో మరింత ఇబ్బంది పడుతున్నాం. కాలుష్యం లేని నీరు అందించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి. – రాజేశం, స్థానికుడు -
ప్రజారోగ్యంలో వ్యత్యాసాలు
విశ్లేషణ మన రాజకీయ నేతలు వైద్య చికిత్సల కోసం దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకూ, విదేశీ ఆసుపత్రులకూ వెళుతుండటం నిత్యకృత్యమే. తాము ఏర్పర్చిన ప్రజారోగ్య వ్యవస్థలు అత్యంత నాసిరకంగా ఉన్నాయన్న ఎరుకే దీనికి కారణం. మనం మొదట ఈ నాలుగు ఉదంతాలను అర్థం చేసుకుందాం. 1. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు చెన్నైకి ఎయిర్ అంబులెన్స్‌లో హుటాహుటిన బయలు దేరారు. అక్కడే ఆయన తర్వాత మరణించారు. ఆయనకు లివర్ కేన్సర్ ఉంది. 2. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవలే చెన్నయ్ ఆసుపత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్ష చేయించుకున్నారు. 3. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చికిత్స కోసం మొదట ముంబై ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత వెల్లడి కాని వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లారు. 4. సోనియా గాంధీ కూడా ఇదే విధంగా అమెరికా వెళ్లారు. ఆమె వ్యాధి స్వభావం గురించి కానీ, ఆమె చికిత్స చేయించుకున్న ఆసుపత్రి వివరాలు కానీ దాచి ఉంచారు. పై ఉదంతాలను కింది వాటితో పోల్చి చూద్దాం. 1. ప్రసవానికి చేరువైన ఒక గర్భిణిని ఉదంపూర్ లోని ఆసుపత్రిలో చేర్చడానికి అంబులెన్స్ సౌకర్యాన్ని నిరాకరించారు. దీంతో ఆమె ప్రైవేట్ అంబులెన్స్‌ని ఉపయోగించాల్సి వచ్చింది. తర్వాత ఆసుపత్రిలో ఆమెను మూడుగంటల పాటు ఏ డాక్టరూ పట్టించుకోలేదు. గర్భంలోనే పాప మరణించింది. ఆ పాప మృతదేహాన్ని ఒక అట్టపెట్టెలో ఉంచి వెనక్కు పంపించారు. 2. ముంబైలోని ఎల్ఫిన్స్టన్ బ్రిడ్జిలో తొక్కిసలాట ఘటనలో రైలు ప్రయాణికుల విషాద మరణం తర్వాత చనిపోయిన వారి నుదుటిపై స్కెచ్ పెన్‌తో మృతుల సంఖ్యను వరుసగా రాశారు. మృతుల గౌరవానికి భంగం కలిగించినందుకు హైకోర్టు ఆగ్రహం ప్రదర్శించింది. 3. ఒక వ్యక్తి, వైద్యులు తొలగించిన తన కాలిని పరుపుపై దిండుగా ఉపయోగించుకున్న ఘటన ఝాన్షీ ఆసుపత్రిలో సంభవించింది. 4. పాట్నాలో తొమ్మిదేళ్ల కుమార్తె మృతదేహాన్ని ఆమె తండ్రి తన భుజాలపై మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమెను గ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదు. ఆమెను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించడానికి చేపట్టాల్సిన విధివిధానాల విషయంలో చాలా జాగు చేశారు. (మున్నాబాయ్ సిని మాలో దీనిపైనే నిరసన తెలిపారని గుర్తుంచుకోవాలి). ఈ రెండు రకాల ఉదంతాలు కొట్టొచ్చినట్లుగా మన ఆరోగ్య సంరక్షణ సంపన్నులకు, శక్తిమంతులకు అనుకూలంగా ఉందనే ఒక దయనీయ కథనాన్ని చెబుతున్నాయి. అత్యంత మొరటైన విషయం ఏమిటంటే, తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో వైద్యపరమైన అసౌకర్యాలను పట్టించుకోని ముఖ్యమంత్రులు బయటి రాష్ట్రాలకు వెళ్లి వైద్య సహాయం కోసం ప్రయత్నించడమే. ఇటీవలే అమితాబ్ బచ్చన్ భుజం నొప్పికి చికిత్స చేయడానికి వైద్యుల బృందం ఒకటి జైపూర్‌కు హుటాహుటిన చేరుకుంది. ఇంత సూపర్ సంపన్నుడికి అందుబాటులో లేనిదంటూ ఏదీ ఉండదు. వారు పతాక శీర్షికల్లో కనిపిస్తుంటారు. సగటు మనిషి తన బాధలతో కుములుతుంటాడు. మనలాంటి వారి బాధలు, ఇబ్బందులు మన చేతులకంటే పొడవుగా కొనసాగుతుంటాయి. నిజానికి వాటికి అంతం అనేది ఉండదు. ఇక్కడ వర్ణించిన రెండు రకాల ఉదంతాలూ అవేవో సర్వసాధారణం అన్నరీతిలో ప్రధాన శీర్షికల్లో వస్తుం డటం ఒక మినహాయింపు. అదే సమయంలో దేశం ఇలాంటి వ్యత్యాసాలను ప్రదర్శించే తదుపరి ఉదంతాల వైపు సాగిపోతుంటుంది. గుర్తించాల్సింది ఏమిటంటే రాజకీయ ప్రముఖులు తమ రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపర్చడానికి ఏ ప్రయత్నమూ చేస్తున్నట్లు కనిపించదు. ఎందుకంటే దేశంలోని రాజకీయ ప్రముఖులంతా సంపన్నులూ, శక్తిమంతులూ కాబట్టే వీరిలో ఏ ఒక్కరికీ సగటు మనిషి బాధలు, వ్యధలు పట్టవు. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఆసుపత్రుల్లో వైద్యసేవలు మెరుగొందుతున్నట్లుగా మంచి గణాంకాలను మాత్రం చూపుతుం టారు. మనుషులు గణాంకాలుగా మాత్రమే కనబడుతున్న వైనాన్ని ఇది సూచిస్తుంది. ఆందోళన, ఆగ్రహం తప్పిస్తే ప్రజానీకం దీనిపట్ల పెద్దగా స్పందించడం జరగదు. ప్రముఖులు భారత్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళతారని, పారికర్, సోనియా వంటి కొందరు విదేశాలకు వెళతారని ప్రజలకు తెలుసు. ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఈ ప్రముఖులకు ఏమాత్రం నమ్మకం లేదని ఇది సూచి స్తుంది. ప్రజావైద్య వ్యవస్థను మెరుగుపర్చడానికి తాము పెద్దగా ప్రయత్నించలేదని వారికి తెలుసన్న వాస్తవం మనకు బోధపడుతుంది కూడా. సంవత్సరానికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున బీమాను పది కోట్ల కుటుంబాలకు కల్పిస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనను కూడా పై నేపథ్యంలో అనుమానాస్పదంగానే చూడాలి. ఎందుకంటే దేశంలో ప్రైవేట్ రంగం మాత్రమే మెరుగైన సౌకర్యాలను కలిగి ఉంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఆసుపత్రుల్లోనే పేదలకు కొన్ని విభాగాలను ఏర్పర్చి ఉంచారు కానీ కార్పొరేట్ ఆసుపత్రుల్లోలాగా నడుస్తున్న ఈ విభాగాలు సైతం పేదలకు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. ఎదుగుతున్న మధ్యతరగతితో సహా ఇలాంటి విభాగాల్లో వైద్యసేవలు పొందడానికి కూడా శక్తిలేని వారు శిలకు, బండరాయికి మధ్య నలిగిపోతుంటారు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేశ్ విజాపుర్కర్ -
పాజిటివ్ ఇమేజ్ కోసం ఎంతైనా!
లండన్ : సోషల్ మీడియాలో పాజిటివ్ ఇమేజ్ కోసం ఎంత డబ్బునైనా వెచ్చించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌కు చెందిన లండ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్తలు ముందుగా పలువురు వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. అనంతరం, ఒక గ్రూపు వారిని సెల్ఫీలు తీసుకోవాలని కోరారు. తర్వాత రెండుగ్రూపుల వారిని సహకార పద్ధతిలో అజ్ఞాతవ్యక్తితో పరిశోధన నిర్వహించి, ఫలితాలను విశ్లేషించారు. అజ్ఞాతవ్యక్తితో వారు పంచుకున్న పలు విషయాలను ఆన్లైన్లో పబ్లిష్ చేయకుండా ఉండేందుకు ఎంత ఖర్చునైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకున్న గ్రూప్ వారిలో ఇదీ ఎక్కువగా కనిపించిందని వర్సిటీకి చెందిన ఆర్థికవేత్త హోమ్ తెలిపారు. -
వినతుల వెల్లువ
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్దంకి నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయనకు సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు అడుగడుగునా వేచి ఉన్నారు. రైతులు, విద్యార్థులు, వికలాంగులు, నిరుపేదలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ అభిమాన నేతకు కన్నీటి పర్యంతరమవుతూ విన్నవించారు. పార్టీ శ్రేణులు సైతం టీడీపీ నాయకుల నుంచి తామెదుర్కొంటున్న ఇబ్బందులు ఏకరువుపెట్టారు. టీడీపీ ప్రభుత్వం వల్లే నిధులు రావడం లేదు ఉలవపాడు: తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకంగా మారి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రానీయకుండా చేస్తుంది. అందుకే ప్రత్యేక హోదా, పరిశ్రమలు రావడంలేదని దొనకొండకు చెందిన బొమ్మిరెడ్డి బ్రహ్మారెడ్డి జగన్‌ను కలసి విన్నవించారు. ప్రకాశం జిల్లా వెనుకబడి ఉందని దొనకొండలో పరిశ్రమలు ఏర్పాటు అని చెప్పిమరలా పట్టించుకోవడం లేదని తెలిపారు. జిల్లా అభివృద్ధి జరిగేలా చూడాలని విన్నవించారు. – బ్రహ్మారెడ్డి స్కాలర్షిప్ రాక ఆగిన చదువు పీసీపల్లి: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాను. స్కాలర్‌షిప్‌ల కోసం గత రెండు సంవత్సరాలుగా దరఖాస్తు చేస్తున్నాను. అయితే ప్రభుత్వం మంజూరు చేయలేదని అద్దంకికి చెందిన యు.ప్రతిభ వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందించింది. అప్పుచేసి ఎంబీబీఎస్ చదువుతున్నానని, ఫీజు రీయింబర్స్మెంట్ ట్రజరీలో సమస్య ఉండడం వల్ల రావడంలేదని కాలేజీ యాజమాన్యం చెబుతుందని వాపోయింది. – యు.ప్రతిభ బాబు పాలన అంతమయ్యే రోజులొస్తున్నాయి... ఉలవపాడు: చంద్రబాబు పాలన అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సంతమాగులూరు మండలం మిన్నకల్లుకు చెందిన దివ్యాంగుడు కంభంపాటి వెంకటరావు, జగన్‌ను కలసి తెలియచేశారు. దివ్యాంగులు చంద్రబాబు పాలన అంటేనే భయపడుతున్నారని 2019లో మీరు ముఖ్యమంత్రి అయి మా సమస్యలు తీర్చాలని కోరారు. – వెంకటరావు పెద్దాయన జ్ఞాపకాలు మరువలేనివి చీరాల అర్బన్: ముండ్లమూరుకు చెందిన బి.లక్ష్మణరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి ఆయనకు సంబంధించిన పేపర్ కటింగ్స్, మరణానంతరం జరిగిన సంఘటన ఫొటోలతో కూడిన బుక్‌ను తయారు చేసి ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించేందుకు వచ్చారు. పెద్దాయన జ్ఞాపకాలు మరచిపోలేమని వాపోయాడు. అలానే ప్రజాసంకల్పయాత్రకు సంబంధించి ఫొటోలతో కూడిన ప్రత్యేక బుక్‌ను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. – వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధించిన ఫొటోలతో కూడిన బుక్ రైతులను మోసం చేస్తున్నారయ్యా... ఉలవపాడు: కంది రైతులు ఈ ప్రభుత్వంలో దారుణంగా మోస పోతున్నారని కుంకుపాడుకు చెందిన గూడా అంజిరెడ్డి, జగన్‌ను కలసి విన్నవించాడు. తనపొలంలో కంది పంట వేశానని ఎకరాకు రెండు క్వింటాళ్లు పండితే తేమ 12 శాతం లేదని తీసుకోవడం లేదని అదే దళారులు తీసుకెళితే మాత్రం తీసుకుంటున్నారని తెలిపారు. తమ గ్రామంలో ఫ్లోరిన్ ప్రభావం వల్ల గత పదేళ్ల కాలంలో 40 ఏండ్ల లోపు వారు 30 మంది పైగా చనిపోయారని తెలిపారు. 14 కి.మీలో గుండ్లకమ్మ జలాశయం ఉన్నా నీరు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తమ సమస్యలు వివరించారు. – అంజిరెడ్డి, రైతు జగన్‌ను చూడడానికి వచ్చాం... ఉలవపాడు: పాదయాత్రలో ఉన్న జగన్ ఎలా ఉన్నాడా అని చూడడానికి పులివెందుల నుంచి వీరయ్య, ఎల్లమ్మ దంపతులు వచ్చి జగన్ ను కలిశారు. కేవలం జగన్ ఎలా ఉన్నాడని చూడడానికే ఇప్పటికి నాలుగు సార్లు ప్రజా సంకల్పయాత్రకు వచ్చినట్లు తెలిపారు. – వీరయ్య, ఎల్లమ్మ దంపతులు గుండ్లకమ్మ నదిపై చెక్‌డ్యాం నిర్మించాలి చీరాల అర్బన్: గుండ్లకమ్మనదిపై చెక్‌డ్యాం నిర్మించాలని అద్దంకి మండలం తిమ్మాయిపాలెం, రామాయిపాలెం గ్రామస్తులు పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అర్జీ ఇచ్చేందుకు వచ్చారు. చెక్‌డ్యాం నిర్మించడం వల్ల çసుమారు 1200 ఎకరాలకు నీరందుతుందని రైతులు తెలిపారు. దీని ద్వారా ఆ ప్రాంత భూగర్భజలాలు పెరిగి పంటలు పండుతాయని, తాగు, సాగునీరుకు ఇబ్బందులు తీరుతాయని తెలిపారు. – వినతిపత్రం అందించేందుకు వచ్చిన రైతు మా అమ్మ పింఛన్ తొలగించారయ్యా.. ఉలవపాడు: మా అమ్మ పింఛన్‌ను అన్యాయంగా తొలగించారని యల్.బాలకృష్ణ జగన్‌కు తమ సమస్యను తెలియచేయడానికి వచ్చారు. తాళ్లూరు మండలంలో రమణాలవారిపాలెంనకు చెందిన సుబ్బులుకు వైఎస్సార్ సమయంలో íపింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పింఛన్‌ను తొలగించారు. – బాలకృష్ణ మా కుటుంబానికి దిక్కెవరు... ఒంగోలు వన్‌టౌన్: తాళ్ళూరుకు చెందిన దివ్యాంగుడు కోలా ఆనందరావుకు భార్య, నలుగురు పిల్లలున్నారు. ఆనందరావు భార్య అంజమ్మ రోజు వారీ కూలికి వెళ్ళి రూ. 200 సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తుందని, వికలాంగుడినైన నాకు, నా కుటుంబానికి ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందటం లేదంటూ పాదయాత్రలో వైఎస్ జగన్‌హన్‌రెడ్డిని కలవటానికి వచ్చారు. – కోలా ఆనందరావు, దివ్యాంగుడు టీడీపీ నేతలు వేధిస్తున్నారు ఒంగోలు వన్‌టౌన్: జె.పంగులూరు మండలం రాంకూరు గ్రామానికి చెందిన ఆసోదా బంగారుబాబు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేశాడు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి కార్యకర్తగా పని చేస్తున్న బంగారుబాబుపై కక్ష్య కట్టిన స్థానిక టీడీపీ నాయకులు నాలుగు సంవత్సరాల క్రితం ఇంటిని తగులబెట్టారని ఇప్పటికీ తనను వేధిస్తున్నారంటూ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించటానికి వచ్చాడు. – ఆసోదా బంగారుబాబు బీమా సొమ్మును సంక్షేమ నిధికి జమ చేయాలి పర్చూరు: చంద్రన్న బీమాకు వాడిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంక్షేమ నిధికి జమ చేయాలని అద్దంకి తాపీమేస్త్రీల సంఘం ప్రెసిడెంట్ పి.వెంకట్రావు వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద మొర పెట్టుకున్నాడు. సభ్యులు దురదృష్టవశాత్తు మరణించిన వయస్సుతో సంబంధం లేకుండా రూ. 5 లక్షలివ్వాలని కోరారు. విదేశీ చదువులకు స్కాలర్షిప్లు, సంక్షేమ నిధి నుంచి మంజూరు చేయాలని కోరారు. – పి.వెంకట్రావు, అద్దంకి తాపీమేస్త్రీల సంఘం ప్రెసిడెంట్ -
అలుపెరుగని నడక జనమంతా వెనుక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అడుగడుగునా ఘన స్వాగతాలు..సమస్యల వినతులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర సాగుతోంది. 15వ రోజు ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలోని దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో సాగింది. ఆదివారం 8 గంటల సమయంలో దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు శివారులో నుంచి కొనసాగిన యాత్ర కొద్దిసేపటికి కుంకుపాడు వద్ద అద్దంకి నియోజకవర్గంలోని ప్రవేశించింది. నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెంచు గరటయ్య, ఆయన కుమారుడు కృష్ణ చైతన్యలతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పార్టీ జెండాలతో యువకులు ఆకర్షణగా నిలిచారు. జగన్‌ను కలిసేందుకు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువతతో పాటు మహిళలు ఆసక్తి చూపించారు. పలువురు ప్రజలు సమస్యలపై జగన్‌కు వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక మోసం చేసిందని వాపోయారు. అర్హులకు రేషన్‌కార్డు, పింఛన్లు ఇవ్వటం లేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వటం లేదని, డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధులు కూడా ఇవ్వలేదని జగన్‌కు ఫిర్యాదులు చేశారు. రైతులకు రుణమాఫీ అందలేదని, పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించలేదని పలువురు రైతులు జగన్ దృష్టికి తెచ్చారు. మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వస్తూనే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని వైఎస్.జగన్మోహన్రెడ్డి జనానికి భరోసానిచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో తొలిరోజు యాత్ర కుంకుపాడు, శ్రీరామ్‌నగర్ కాలనీ, పార్వతీపురం మీదుగా మధ్యాహ్నానికి తిమ్మాయిపాలెం చేరుకుంది. భోజన విరామం అనంతరం అక్కడి నుంచి అద్దంకి వరకు కొనసాగింది. అనంతరం జగన్ అద్దంకి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదిస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే నవరత్నాలతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని జగన్ జనానికి భరోసానిచ్చారు. 15వ రోజు వైఎస్ జగన్ 15.3 కి.మీ. మేర పాదయాత్ర సాగించారు. జగన్‌తో కలిసి నడిచిన నేతలు: 15వ రోజు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌తో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్, అద్దంకి సమన్వయకర్త చెంచు గరటయ్య, వైఎస్సార్సీపీ నేతలు వై.వి.భద్రారెడ్డి జగన్‌తో కలిసి నడిచారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విభాగం వాణిజ్య విభాగం కుప్పం ప్రసాద్, జిల్లా నేతలు రామానాయుడు, ప్రసాద్, ఒంగోలు పట్టణ అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
ఆదిలాబాద్‌రూరల్ : మండలంలోని చాందా–టి గ్రామంలో ఇళ్లపై నుంచి వెళ్తున్న 33 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో ప్రజలు ప్రతి రోజు భయందోళనకు గురవుతున్నారు. ఈదురుగాలులు వచ్చినప్పుడు ఎక్కడ ఇళ్లపై పడుతాయోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుంటున్నారు. ఈ విద్యుత్‌లైన్ ఆదిలాబాద్‌లోని 132/33 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ఈ లైన్ చాందా మీదుగా జైనథ్, బేల మండలాలకు వెళ్తుంది. ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను గత 40 సంవత్సరాల కిందట వేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు జరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. విద్యుత్లైన్లు తొలగించాలని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ విద్యుత్ లైన్ తొలగించాలంటే గ్రామ పంచాయితీ లేదా సంబంధిత ఇంటి యజమానులు దానికి అయ్యే ఖర్చు భరించాల్సి ఉంటుందని, అప్పుడే వాటిని తొలగించడానికి సాధ్యమవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. భయందోళనతో బతుకులు.. చిన్న విద్యుత్ తీగ ఇంటికి దగ్గర ఉంటేనే ప్రజలు భయపడిపోతారు. అలాంటిది ఏకంగా పెద్ద లైనే ఇడ్లపై నుంచి వెళ్తుంటే ఇంకెంత భయడిపోతారు అర్థం చేసుకోవచ్చు. చాందా–టి గ్రామంలోని ఇడ్లపై నుంచి వెళ్తుండడంతో నిత్యం భయంభయంగా బతుకుతున్నారు. వర్షకాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. గాలిదుమారం ఎక్కువగా ఉంటే తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. తమ సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధుతలో పాటు మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని వాపోతున్నారు. భయపడుతున్నారు.. ఇంటిపై వెళ్తున్న విద్యుత్ లైన్‌తో నిత్యం మా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అధికారులకు ఈ విషయాన్ని తెలిపిన స్పందడం లేదు. విద్యుత్‌లైన్‌ను తొలగించి సమస్యను పరిష్కరించాలి. – రవి, చాందా (టి) ఎవరు బాధ్యత వహిస్తారు తమ ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్‌లైన్ తొలగించాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. జరగరానిది ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కరించమంటే ఎవ్వరు రావడం లేదు. – ప్రశాంత్, చాందా(టి) అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. తమ గ్రామంలో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తొలగించాలని గతంలో విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన. సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. – బొజ్జ అడెల్లు, సర్పంచ్, చాందా–టి తొలగించేందుకు పేమెంట్ చేయాలి... చాందా–టి గ్రామంలో చాలా సంవత్సరాల కిందట 33 కేవీ విద్యుత్లైన్లను వేశారు. ఆ సమయంలో ఖాళీ ప్రాంతం ఉండడంతోనే విద్యుత్‌లైన్ వేయడం జరిగింది. ప్రస్తుతం వాటిని తొలగించాలంటే షిప్టింగ్‌కు సంబంధించిన చార్జీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. – శ్రావణ్‌కుమార్, విద్యుత్‌శాఖ ఏఈ, ఆదిలాబాద్ రూరల్ -
అడుగడుగునా సమస్యలే..
ఖమ్మంఅర్బన్ : నగరంలోని మమత వైద్యశాల రోడ్డులోని కాలనీల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ‘పైన పఠారం, లోన లొటారం’ అన్న చందంగా మారింది. రోడ్డుకు ఇరువైపుల పదుల సంఖ్యలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. వారంతా క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు లోఓల్టేజీ సమస్యను తీర్చాలనే అభిప్రాయంతో ఏడాదిన్నర కిందట సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం రూ.కోటి నిధులు కేటాయించి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ స్థలం కోర్టు వివాదంతో పనులు నిలిచి పోవడంతో సమస్య తీరలేదు. పరిసరాల కాలనీల పరిధిలో లోఓల్టేజీ సమస్యతోపాటు తరచూ అంతరాయం జరుగుతూ ఇబ్బంది పడుతున్న నివాసులు వాపోతున్నారు. కాలనీలో అందమైన భవనాలు ఉన్నాయి. కొన్ని రహదారులకు డ్రెయిన్లు ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా శుభ్రం చేయక పోవడం వల్ల కంపచెట్లు అల్లుకుని ఆనవాళ్లు లేకుండా పోయాయి. కచ్చా డ్రెయిన్లు ఉన్న వీధుల్లో మురుగునీరు పోయే విధంగా లేక పోవడంతో ఎక్కడి మురుగు అక్కడ నిలిచి కంపు కొడుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. మురుగునీరు నిలవడంతో దోమలు, పశువులు స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. రోడ్లు కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదని, ఖాళీ స్థలాల్లో కూడా పెద్ద పెద్ద కంపచెట్లు పెరిగి చిన్న పాటి అడవిని తలపిస్తున్నాయి. రాఘవయ్యనగర్, వరదయ్యనగర్, ఒయాసిస్రోడ్డు తదితర 22వ డివిజన్, 10వ డివిజన్, 11వ డివిజన్ పరిధిలోని నివాసులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఈ కాలనీల పరిధిలో నుంచి లకారం చెరువుకు నీరు అందించే మేజర్ కాలువ లైనింగ్ లేకపోవడంతోపాటు ఇళ్లు ఆనుకొని ఉండటం వల్ల నీరు కలుషితం కావడంతోపాటు నీరు నిలిపివేసి తర్వాత సమీపంలోని నివాసాల వాడకం నీరు చేరి మురుగు కంపు కొడుతోందని గృహ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేదు.. డ్రెయిన్లు లేవు... తమ కాలనీలో రోడ్డు లేదు. డ్రెయిన్లు లేకపోవడం వల్ల మురుగుకంపు వస్తోంది. ఖాళీ స్థలాల్లో కంపచెట్లు పెరిగి భయంకరంగా మారాయి. పారిశుద్ధ్య కార్మికులు రాక పోవడం వల్ల డ్రెయిన్లు అధ్వానంగా మారుతున్నాయి. పన్నులు మాత్రం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. కానీ, కార్పొరేషన్ నుంచి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. -మందడపు వెంకటేశ్వరరావు, కాలనీవాసి సబ్‌స్టేషన్ పూర్తయితే విద్యుత్ సమస్య ఉండదు మమత వైద్యశాల రోడ్డులో సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు దాదాపు ఉండక పోవచ్చు. ప్రస్తుతం రోటరీనగర్ సబ్ స్టేషన్ నుంచి ఇవ్వాల్సి వస్తోంది. దీంతో అధికలోడు కారణంగా అప్పుడప్పుడు సమస్య ఎదురవుతోంది. తాత్కాలికంగా సమస్యల నుంచి గట్టెక్కడానికి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 160 కేవీగా మార్చేందుకు 3 ట్రాన్స్ఫార్మర్ల కోసం ప్రతిపాదనలు పంపాం. కొత్తగా మరో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 10 మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. అవి మంజూరైతే సమస్య చాలా వరకు తగ్గుతుంది. -జె.శ్రీధర్‌రెడ్డి, విద్యుత్ ఏఈ -
మధ్యతరగతిపై పన్నుల భారం
కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విభిన్న రకాల వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపారని, ప్రభుత్వ ఉద్యోగుల సహితం బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరపలేదని, ప్రజలపై భారాలు మోపుతుందంటున్నారు. పెట్టుబడి దారులకు కొమ్ముకాసే బడ్జెట్ కల్లూరురూరల్: కేంద్రం ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్మిక సంక్షేమాన్ని తుంగలో తొక్కి పెట్టుబడి దారులకు ఊతం ఇచ్చేలాగా వుందని సీపీఎం మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో పేదలకు ఎటువంటి మేలు జరిగే అవకాశం లేదని, అంకెల గారడితో ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసగించిందన్నారు. రెతులకు ఎలాంటి ఉపయోగం కలగదన్నారు. – తన్నీరు కృష్ణార్జునరావు, సీపీఎం మండల కార్యదర్శి మద్దతు ధరతో రైతుకు మేలు తల్లాడ: బడ్డెట్లో కనీస మద్దతు ధర కల్పించడం హర్షదాయకం. పత్తి, మిర్చి వంటి పంటలు ప్రతి ఏటా మద్దతు ధర లేక రైతాంగం నష్ట పోతుంది. రైతుల పరిస్థితి, వారి కష్టాలను చూసిన కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించింది. వ్యవసాయం రంగంలో రుణాలు ఇప్పించడానికి రూ.11 లక్షల కోట్లు కేటాయించినట్లు ప్రకటించటం మంచిదే. రైతులకు ఉపయోగ పడే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. – దగ్గుల శ్రీనివాసరెడ్డి, రైతు, తల్లాడ మాలాంటోళ్లకు ధైర్యం కలిగించింది మాది పేద కుటుంబం. కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు దారులకు సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని బడ్జెట్లో చెప్పటం మాలాంటోళ్లకు ధైర్యం కలిగించింది. – ఎం.నాగబాబు, సత్తుపల్లి ఆరోగ్య బీమా మంచిది చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామనటం చాలా మంచిది. వీటితో పిల్లలను మంచిగా చదించటానికి అవకాశం లభిస్తుంది. – చిత్తలూరి నర్సింహారావు, సత్తుపల్లి నిరుద్యోగులకు నిరాశే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు నిధులు కేటాయించకపోవటం దారుణం. నిరుద్యోగులకు నిరాశే కలిగించింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒనగూరిందేమీ లేదు. ఇది ధనులకు ఉపయోగపడేవిధంగా ఉంది. – భీమిరెడ్డి పుల్లారెడ్డి, వేంసూరు గ్యాస్ పొయ్యి ఇస్తే పొగ బాధ తప్పినట్లే కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. కట్టెల పొయ్యి మీద పొగతో వంట చేసుకునే మాలాంటి వాళ్ళకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే పొగ కష్టాలు తీరుతాయి. – జినుగు రాణి, పెనుబల్లి -
తాగునీటి కటకట
నేరడిగొండ : అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. నేరడిగొండ మండలంలోని రాజు గ్రామపంచాయతీ పరిధిలో గల ఇస్పూర్ చిన్నగోండుగూడలో సమస్యలు తిష్ట వేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 50 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వ్యవస్థ అధ్వానంగా మారడంతో ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కట్లు గ్రామంలో శీతాకాలంలోనే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నీటిని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. అయినా మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించిన దాఖలాలు లేవని వారు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన చేతిపంపు పనిచేయకపోవడంతో అదే గ్రామానికి చెందిన సిడాం రాము రూ.3లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేయించినా తాగునీటి సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గ్రామ సమీపంలో చెలిమె ఏర్పాటు చేసుకొని కలుషిత నీటినే తాగాల్సి దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి విద్యుత్ సమకూర్చినా ఇంటికి విద్యుత్ తీసుకోవడానికి అనువుగా లేకపోవడంతో గ్రామస్తులందరు ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ తీసుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో అధ్వానంగా వీధులు గ్రామంలో పలు వీధులు అధ్వానంగా మారడంతో ఉండడానికి అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. వేసవికాలం వచ్చిందంటే తాగునీటి సమస్య జఠిలమవుతుందని, అధికారులకు విన్నవించినా మా గ్రామానికి ఇప్పటివరకు ఏ అధికారి వచ్చిన దాఖలాలు లేవని వారు వాపోతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలి గ్రామంలో తాగునీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నీరే దిక్కవుతుంది. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా తాగునీటిని అందించి ఆదుకోవాలి. – సిడాం జయవంత్‌రావు, గ్రామస్తుడు దినమంతా చెలిమెల వద్దే ఉదయం నుంచి సాయంత్రం వ రకు చెలిమెల వద్దే ఉంటున్నాం. గత్యంతరంలేక కలుషితమైన నీటినే తాగుతున్నాం. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలి. – సిడాం కవిత, గ్రామస్తురాలు సమస్య మా దృష్టికి రాలేదు ఇస్పూర్ చిన్నగోండుగూడలో ఉన్న తాగునీటి సమస్య మా దృష్టికి రాలేదు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తాం. ఇతర సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – ప్రభాకర్, ఈవోపీఆర్డీ, నేరడిగొండ -
మా ‘సర్వే’ నిజమైంది: పీపుల్స్ పల్స్
హైదరాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ‘పీపుల్స్ పల్స్’ చేపట్టిన సర్వే అంచనాలు.. ఫలితాలతో దాదాపు సరిపోలాయి. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్‌కు పది రోజుల ముందే సర్వే పూర్తిచేశామని ఆ సంస్థ తెలిపింది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. హిమాచల్‌లో బీజేపీకి 39–44 సీట్లు, కాంగ్రెస్‌కు 19–24 సీట్లు, ఇతరులకు 2–4 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. సోమవారం విడుదలైన హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 44, కాంగ్రెస్ 21, ఇతరులు మూడు చోట్ల గెలుపొందారు. పీపుల్స్ పల్స్ సర్వేకు తగ్గట్లే సీపీఎం ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక, గుజరాత్లో పట్టణ ప్రాంతాల్లో బీజేపీ, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని సర్వే తేల్చింది. ఫలితాల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. బీజేపీ 44.8శాతం, కాంగ్రెస్ 43.3శాతం ఓట్లు సాధిస్తాయని సర్వేలో తేలింది. ఫలితాల్లో బీజేపీకి 49.1శాతం, కాంగ్రెస్‌కు 42.4 శాతం ఓట్లు పోలయ్యాయి. -
బాబు టూర్‌తో కాకినాడ ప్రజలకు కష్టాలు
-
చుక్కలు చూపిస్తున్న కరెంట్ బిల్లులు
-
చాపరాయి మృతులు గుర్తుకురాలేదా?
స్పీకర్ కోడెలకు ఎమ్మెల్యే వంతల సూటిప్రశ్న ప్రభుత్వ చర్యల వల్లే గిరిజనులకు ఈ దుస్థితి అని ఆగ్రహం రంపచోడవరం : ఏజెన్సీ పర్యటనకు వచ్చిన శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చాపరాయిలో జ్వరాలతో చనిపోయిన గిరిజన కుటుంబాలను ఆ గ్రామానికి వెళ్లి కనీసం పలకరించాలని అనిపించలేదా అని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక విలేకరులకు ఆమె ఈ మేరకు ఒక ప్రకటన అందజేశారు. జ్వరాలతో గిరిజనులు చనిపోతుంటే మూఢ నమ్మకాల వల్ల చనిపోయారని అంటారా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వం గిరిజనుల విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు అందని దయనీయ పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం తీరు సరిగా లేదని ఆరోపించారు. ఏజెన్సీలో గిరిజనుల మరణాలు సీఎంకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కనీసం సీఎం ఇప్పటి వరకు రంపచోవరం ఏజెన్సీకి రాలేదంటే మీ ప్రభుత్వం తీరు ఏ పరిస్థితిలో ఉందో అర్ధమవుతోందన్నారు. ప్రభుత్వం తీరును గిరిజనులు గమనిస్తున్నారని, వారు మూఢ నమ్మకాల్లో లేరని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఉన్నారని తెలిపారు. గిరిజనులను చిన్న చూపు చూస్తే సహించేది లేదన్నారు. ఏజెన్సీలో వైద్య సేవలు అందక గిరిజనులు చనిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మందులు సరిగా అందుబాటులో లేవన్నారు. మీరు చేసే తప్పులకు గిరిజనులు బలవుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో తక్షణం వైద్య శిబిరాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. -
కలెక్టర్‌ను చుట్టుముట్టిన ప్రజలు
-నీటి సమస్య తీర్చాలని మొర - ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లెపిలుపు- కలెక్టర్ కోడుమూరు రూరల్ : తాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణను కోడుమూరులో ప్రజలు చుట్టుముట్టారు. పదిరోజులకోసారి కూడా నీళ్లు రావడం లేదని, హంద్రీనదికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించాలని మొరపెట్టుకున్నారు. శుక్రవారం కోడుమూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో పల్లెపిలుపు కార్యక్రమం నిర్వహించారు. ఆయన రాగానే ప్రజలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వర్షాభావ పరిస్థితుల వల్ల గాజులదిన్నె ప్రాజెక్టులో తగినంత నీరు లేదని, నీళ్ల సమస్య పరిష్కారానికి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఆయా కాలనీలకు మంచినీళ్లను సరఫరా చేయిస్తామని హామీచ్చారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కొత్త ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు అర్హత గల వారందరికీ త్వరలో మంజూరవుతాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే పల్లె పిలుపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బడి ఈడు పిల్లలనంతా బడిలో చేర్పించాలని చెప్పారు. జూలై 1నుంచి అన్న అమృతహస్తం కింద గర్భిణిలకు అంగన్వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనం పెడతామన్నారు. 2016 సంవత్సరంలో పంటలు నష్టపోయిన రైతుల కోసం జిల్లాకు రూ.325కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరైందని, త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అనంతరం ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని మండల అధికారులను ఆదేశించారు. అంతకుముందు పట్టణంలో నెలకొన్న నీటి సమస్యపై గ్రామ సర్పంచు సీబీ లత, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కృష్ణ, సీపీఎం డివిజన్ కార్యదర్శి సోమన్న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం వెల్దుర్తి రోడ్డులో నిర్మిస్తున్న చెత్తశుద్ధి కేంద్రాన్ని, ఎస్బీఐ బ్రాంచ్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అర్హత గల కౌలురైతులకు, రైతులకు పంట రుణాలివ్వాలని బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్‌కు సూచించారు. కార్యక్రమంలో నోడలాఫీసర్ భాస్కర్‌రెడ్డి, డీఎల్పీఓ విజయకుమార్, ఎంపీడీఓ అదెయ్య, తహసీల్దార్ రామకృష్ణ, ఏపీడీ రాఘవేంద్ర, ఏపీఎం వీరన్న, ఏపీఓ మోదీన్‌బాషా, ఎంఈఓ అనంతయ్య, ట్రాన్స్‌కో, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు ప్రియాంక, ఫారుక్హుసేన్, మల్లికార్జున, ఈఓఆర్డీ రామకృష్ణ, ఆర్ఐ మధుమతి తదితరులున్నారు. -
పాత సిమ్‌కార్డులతో జర జాగ్రత్త
మహబూబ్‌నగర్ క్రైం: ఏవరి వద్ద చూసిన రెండు లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో జనాభా సంఖ్య 7లక్షలు ఉంటే.. 6లక్షలమేర వివిధ కంపెనీల ఫోన్లు విని యోగిస్తుంటే..8లక్షల సిమ్‌కార్డులను వాడుతున్నారు. ఒకప్పుడు కేవలం 3లక్షలలోపు పరిమితమైన ఈ సంఖ్య గడిచిన మూడేళ్ల కాలంలో ఈ స్థాయిలో పెరిగింది. ఇది ఆయా కంపెనీలకు శుభవార్త అయినప్పటికీ.. ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు సిమ్‌కార్డులు వినియోగించటం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉచితం పెరిగింది.. గడిచిన నాలుగైదేళ్ల నుంచి సిమ్‌కార్డులను పలు కంపెనీలు ఉచితంగా అందించాయి. దీనివల్ల ఒక్కొక్కరు ఒకే కంపెనీకి చెందిన ఐదు సిమ్‌లను కూడా తీసుకుంటున్నారు. గతంలో రూ.500 చెల్లించిన సిమ్‌కార్డు దొరికేది కాదు. పోటీలో కంపెనీలు ఆఫర్స్ ప్రకటించడంతో పాటు అంతర్జాల సేవల వినియోగం పెరగటంతో అమాంతం సిమ్‌కార్డుల విక్రయాలు పెరిగాయి. దుర్వినియోగం ఇష్టారాజ్యంగా సిమ్‌కార్డులను జారీ చేయడంతో అంతకు రెండింతలు దుర్వినియో గం అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా నేరాలకుపాల్పడే వారితో పాటు ప్రముఖులకు బెదిరింపు కాల్ చేసేవారు ఎటువంటి ఆధారాలు లేకుండా సిమ్‌కార్డులు పొందుతున్నారు. అదేలా సాధ్యమన్నది గతంలో అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. కానీ తాజాగా తప్పుడు పేర్లమీద సీమ్‌కార్డులు తీసుకొని నేరాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొత్త సిమ్‌కార్డు కొనుగోలు చేసే సమయంలో పాత సిమ్‌కార్డును బ్లాక్ చేయకపోతే చేయని నేరంలో ఇరుక్కునే అవకాశం ఉంది. -
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ట్రావెల్స్
-
మోసం..చంద్రబాబు నైజం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆత్మకూరు: ప్రజలను మోసగించడమే సీఎం చంద్రబాబు నైజమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్ర సందర్భంగా ఆత్మకూరు పట్టణం గౌడు సెంటర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తప్పుడు హామీలతో రాష్ట్ర ప్రజలను టీడీపీ అధినేత మోసగించి అధికారం దక్కించుకున్నారన్నారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసి 80శాతం పూర్తి చేస్తే.. తాను పూర్తిచేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జిల్లాలోని పలు ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాలన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువేనన్నారు. టీడీపీ నేతలు ఈ విషయాన్ని మరువరాదన్నారు. చంద్రబాబు పాలనలో కరువు చంద్రబాబు పాలన అంటేనే కరువు అని వైఎస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కరువు కాటకాలతో రైతులు తల్లడిల్లారని గుర్తుచేశారు. మళ్లీ మూడేళ్లలోగా అదే పరిస్థితులు పునరావృతమయ్యాయన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసగించారని, వడ్డీ రుణాల పేరుతో మహిళలను ఆర్థికంగా చిదిమేశారన్నారు. పొదుపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ. 3వేలు మాత్రమే ఇవ్వడం సిగ్గు చేటన్నారు. విద్యార్థులను, ఉద్యోగులను మోసగించిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. పార్టీ మారడం సిగ్గుచేటు వైఎస్సార్సీపీ జెండాపై గెలిచిన కొందరు నాయకులు.. టీడీపీ ప్రభోలాలకు లొంగి డబ్బులకు అమ్ముడుబోయి మరో పార్టీలో చేరడం హేయమైన చర్య అని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. గౌడ్ సెంటర్లోని బహిరంగ సభా ప్రాంగణంలో మాట్లాడుతూ పార్టీలు ఫిరాయించడం ప్రజలను మోసగించడమేనన్నారు. వైఎస్సార్సీపీ అంటే పాండవుల లాంటి పార్టీ అనానరు. పాండవులు పరిపాలిస్తే కరువు కాటకాలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారన్నారు. కానీ రాష్ట్రంలో కౌరవుల పాలన ఉండడం వల్ల కరువు కాటకాలతో తల్లడిల్లుతున్నారన్నారు. టీడీపీ పాలనకు చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ వైఎస్సార్సీపీదే టీడీపీ పాలనకు ప్రజలు చమర గీతం పాడాలని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్ వైఎస్సార్‌సీపీదేనన్నారు. అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్లు, పక్కాగృహాలు అందాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రాష్ట్ర ప్రజలు మంచి పాలన కావాలంటే అది వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. -
నిరసనలు..నిలదీతలు!
- జన్మభూమి సభలు రసాభాస - సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ప్రజల మండిపాటు - గత అర్జీలకు దిక్కులేదంటూ ధ్వజం కర్నూలు(అగ్రికల్చర్): నిరసనలు.. నిలదీతలు..అసంతృప్తులు..వాగ్వాదాలతో జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. సోమవారం నాల్గో విడత జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైంది. కల్లూరు మండలం తడకనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి రోజు 96 గ్రామ పంచాయతీలు, 28 వార్డుల్లో మొత్తంగా 124 జన్మభూమి సభలు జరిగాయి. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో మొదటి రోజు ప్రజాప్రతినిధులు పాల్గొనలేదు. పలు మండలాల్లో గ్రామసభలు జనాలు లేక వెలవెలబోయి. కొన్ని చోట్ల మొక్కుబడిగా జరిగాయి. మూడు విడతల్లో వినతి పత్రాలు ఇచ్చినా.. పరిష్కారం కాకపోవడంతో ప్రజలు నోడల్ అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్లను నిలదీశారు. పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు, నీటి సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. గత జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన వినతులకు పరిష్కారం లేకపోవడంతోనే ఈ జన్మభూమి గ్రామ సభల్లో వినతులు భారీగా వచ్చినట్లు స్పష్టం అవుతోంది. అయితే జన్మభూమి గ్రామ కమిటీ సభ్యులు గ్రామ సభల్లో అంతా తమదే అన్నట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసే కార్యక్రమంగా జన్మభూమి గ్రామ సభలు జరిగాయి. ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ పూర్తిగా పార్టీ కార్యకర్తలే ఎక్కువగా కనిపించారు. మొదటి రోజు ఇలా.. హొళగుంద మండలం మార్లమడికి మజరా గ్రామమైన వన్నూరు క్యాంపులకు రోడ్డు, బస్సు సదుపాయం లేదు. బస్సు వసతి కల్పించాలని గత జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. అధికారులు కూడా హామీ ఇచ్చారు. కాని ఇప్పటికి సౌకర్యం లభించలేదు. నాలుగో విడత జన్మభూమి సభలో ప్రజలు మూకమ్మడిగా అధికారులను నిలదీశారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపని జన్మభూమి కార్యక్రమాలు ఎందుకు... దండగా అంటూ ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు మండలం ఇ.తాండ్రపాడు గ్రామంలో ఫించన్లు, రేషన్ కార్డులు రాలేదని ప్రజలు నిరసన తెలిపారు. గత జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి మంజూరు కాలేదని మండిపడ్డారు. మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన వారనే ఉద్దేశంతో పింఛన్లు ఇవ్వడం లేదని గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు కేవలం తెలుగుదేశం వారికేనా అంటూ నిలదీశారు. ఆత్మకూరు మండలం బాపునంతపురం గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లకు బిల్లులు ఇవ్వకపోవడంపై ప్రజలు.. అధికారులను నిలదీశారు. బిల్లులు ఇవ్వనపుడు..మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎందుకు చెప్పాలి అంటూ ప్రశ్నించారు. ఆళ్లగడ్డ, అవుకు, ఆలూరు, కోడుమూరు, బనగానపల్లె, ప్యాపిలి, బేతంచెర్ల తదితర మండలాల్లో జనాలు లేక జన్మభూమి సభలు వెలవెలబోయాయి. -
నోట్ల రద్దు ఓ నాటకం
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ విమర్శ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు నోట్లను రద్దు చేసి నాటకం ఆడుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ విమర్శించారు. కేంద్రంలోని మంత్రులు, వారి అనుకూల వ్యాపారులకు ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్సుల నుంచే కొత్తగా ముద్రించిన నోట్లు వెళ్తున్నాయంటే ఎంతో లోపకారీ ఒప్పందాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంతవరకు బ్యాంకుల ముందు పేదలే క్యూలలో నిలబడి డబ్బులు తీసుకుంటున్నారని, ఒక్క ధనవంతుడు బ్యాంకు ముందు నిలబడ్డాడని ఆయన ప్రశ్నించారు. తమ ఖాతాల్లో ఉన్న డబ్బులను తీసుకోవడానికి వెళ్లిన వృద్ధులు, వయోజనులు, పేదలు నూరుమందికిపైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య భవన్లో టి. రమేష్‌కుమార్ అధ్యక్షత సీపీఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. జిల్లాలో పార్టీ నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలను రూపొందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కే.ప్రభాకరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ.రాజశేఖర్, బీ.రామాంజనేయులు, పీఎస్ రాధాకృష్ణ పాల్గొన్నారు. -
ప్రజా చైతన్యంతోనే అవినీతి నిర్మూలన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రజా చైతన్యంతోనే అవినీతి నిర్మూలన సాధ్యమని జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక దేహదారుఢ్య పరీక్షలను పరిశీలించారు. అనంతరం అవినీతి వ్యతిరేక వారోత్సవాల ముగింపును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులతో అవినీతికి వ్యతిరేకంగా నడుచుకుంటామని పేర్కొంటూ ప్రతిజ్ఞ చేయించారు. విధి నిర్వహణలో పేద ప్రజలకు అండగా ఉంటామని, విలువలను పాటించి పోలీసు వృత్తికి కీర్తిప్రతిష్టలు తెస్తామని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, డీఎస్పీలు వెంకటాద్రి, హుస్సేన్‌పీరా షరీఫ్, పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ సలాం, ఆర్ఐ జార్జీ పాల్గొన్నారు. జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి సంవత్సరాంతంలో దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ పోలీసులకు సూచించారు. శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో సివిల్, ఏఆర్ పోలీసులు నిర్వహించిన పరేడ్, కవాతును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చైన్ స్నాచింగ్, ఇతర నేరాలపై నిఘా ఉంచాలన్నారు. విధుల్లో వ్యక్తిగత క్రమశిక్షణను పాటించాలని, ఆరోగ్యం కోసం వ్యాయామం, నడక, యోగా, సైక్లింగ్‌లను అలవాటు చేసుకోలని సూచించారు. విధి నిర్వహణలో ఏమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తక్కువ వడ్డీతో లభించే భద్రత రుణాలకు అర్హులైన ప్రతి పోలీసు ఇళ్లు లేదా ఇంటి స్థలం తీసుకోవాలని సూచించారు. అనంతరం పోలీసు జాగీలలకు వసతి సౌకర్యాలపై డాగ్ స్కా్వడ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామచంద్ర, సీఐ నాగరాజారావు, ఆర్ఐ రంగముని పాల్గొన్నారు. -
సర్వం కంగాళీ
-
బ్యాంకులు తెరవకపోవడంతో జనం పాట్లు
-
హర్తాల్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు
రాజంపేట టౌన్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీ వామపక్షాలు తలపెట్టిన హర్తాల్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇందులోపాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్బీఐ అధికారులతో మాట్లాడానని, రాష్ట్రానికి వేలకోట్లు వచ్చేస్తున్నాయని ప్రకటనలు ఇస్తున్నారన్నారు. ఈ క్లిష్ట తరుణంలో కూడా బాబు ప్రజలను మోసగించడం దారుణమన్నారు. దాదాపు 18 రోజులుగా ప్రజలు నగదు లభించక కష్టాలు పడుతున్నారని, వీటిని తొలగించేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆకేపాటి డిమాండ్ చేశారు. హర్తాల్ శాంతియుతంగా చేపట్టే కార్యక్రమమని, ప్రతిఒక్కరూ గాంధేయ మార్గాన కష్టాలను ప్రభుత్వాలకు తెలపాలని ఆకేపాటి కోరారు. -
ఏపీజీబీ బ్యాంకుల్లో నోక్యాష్
రాజుపాళెం: మండలంలోని రాజుపాళెం, కొర్రపాడు గ్రామాల్లో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో (ఏపీజీబీ) బుధ, గురు, శుక్ర వారాల్లో నోక్యాష్ అని బోర్డులు పెట్టారు. దీంతో ఉదయాన్నే డబ్బులు తీసుకునేందుకు వచ్చిన రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నోక్యాష్ అని బ్యాంకు అధికారులు బోర్డు పెట్టడంతో ఆందోళన చెందారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. -
రూ.2000 నోటుపై ప్రజల అభిప్రాయాలు
-
ఇదీ ..జన ‘చైతన్యం’
– పెంచికలపాడులో ఎమ్మెల్యే మణిగాంధీకి చుక్కెదురు – నగరూరులో జెండాను ఆవిష్కరించి వెనుదిరిగిన జెడ్పీటీసీ – నంద్యాలలో భూమా, శిల్పా వేర్వేరు యాత్రలు – వెల్దుర్తి మండలంలో ప్రజల నిలదీత కర్నూలు(అర్బన్): జనంలో చైతన్యం వచ్చింది .. చైతన్య యాత్రల పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న టీడీపీ నాయకులను అడుగడుగునా నిలదీస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీంతో సభలను వాయిదా వేసుకొని టీడీపీ నేతలు వెనుదిరుగుతున్నారు. ఇటీవలి కాలంలో అనేక మంది వృద్ధుళ/, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు నిలిచిపోయాయి. దీంతో బాధితులు టీడీపీ నాయకులను చుట్టుముట్టి ప్రశ్నల వర్శం కురిపిస్తున్నారు. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. – కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మణిగాంధీని ఎస్సీ కాలనీ ప్రజలు నిలదీశారు. మంచి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని పట్టుబట్టారు. గుడిపాడు గ్రామంలో కూడా ఎస్సీ కాలనీకి కొత్త తాగునీటి పైప్‌లైన్ వేయాలని, సీసీ రోడ్డు, డ్రైనేజీ, ఉన్నత పాఠశాలకు ప్రహరీగోడ నిర్మించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా, ప్రజలు వినిపించుకోలేదు. – సి. బెళగల్ మండలం ముడుమాల గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వీరు కూడా పెన్షన్ల కోసం స్థానిక నేతలను నిలదీశారు. కొండాపురం గ్రామంలో జరిగిన సభకు ప్రజలెవ్వరు హాజరు కాకపోవడంతో నేతలు సభను ఉదయం వాయిదా వేసుకున్నారు. – ఆస్పరి మండలం నగరూరు గ్రామంలో జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ సభకు జనం లేకపోవడంతో కేవలం పార్టీ జెండాను ఆవిష్కరించి వెనుదిరిగారు. – నంద్యాల నియోజకవర్గంలో శిల్పా, భూమా వర్గాలు వేర్వేరుగా జనచైతన్య యాత్రలను చేపట్టడంతో కార్యకర్తలు ఎక్కడ హాజరు కావాలో తేల్చుకోలేక అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే భూమా యాళ్లూరు మండలంలో చేపట్టగా, శిల్పా గోస్పాడు మండలంలో చైతన్యయాత్రల్లో పాల్గొన్నారు. – వెల్దుర్తి మండలం సర్పరాజపురం, నరసాపురం, ఎల్ తాండాల్లో జరిగిన జనచైతన్య యాత్రలు జనం లేక బోసి పోయాయి. హాజరైన కొద్ది మంది కూడా రేషన్‌కార్డులు, పెన్షన్లపై నిలదీశారు. – శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంటలో జరిగిన చైతన్యయాత్రకు స్పందన కరువైంది. -
కొత్త జిల్లాలతో జనాల తికమక
-
ఎటపాక మండలంలోనూ కాళ్లవాపు లక్షణాలు
నెల్లిపాక : ఏజెన్సీలో ఆందోళన కలిగిస్తున్న కాళ్లవాపు వ్యాధి లక్షణాలు ఎటపాక మండలంలో కూడా కనిపిస్తున్నాయి. గౌరిదేవిపేట పంచాయతీలోని బాడిసవారి గుంపులోని ముగ్గురు గిరిజనులకు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాళ్లవాపుతో వీఆర్‌పురం మండలంలో వరుస మరణాలు సంభవిస్తుండడంతో బాడిసవారి గుంపు వాసులు ఆందోళన చెందుతున్నారు. మాజీ సర్పంచ్ కారం వెంకట్రావుకు కొన్ని రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గింది. అప్పటి నుంచీ కీళ్ల నొప్పులతో పాటు, పది రోజులుగా కాళ్లవాపు కూడా ఉందని ఆయన తెలిపారు. అదేవిదంగా మడకం భద్రమ్మ, గుండి రాంబాబులకు కూడా కాళ్లు వాపుగా ఉన్నట్టు కనపడుతున్నాయి. కాళ్లు, చేతులు, కీళ్లు తీవ్రమైన నొప్పిగా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పటి నుంచీ నొప్పులు, వాపులు ఉన్నాయని తెలిపారు. ఆందోళన కలిగిస్తున్న కాళ్లవాపు లక్షణాలు ఇవే అయి ఉంటాయని వారు భయపడుతున్నారు. వైధ్యశాఖ అధికారులు తక్షణమై గ్రామాన్ని సందర్శించి తమకు పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలని కోరుతున్నారు. -
రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన ఖచ్చితంగా అమలు
-
కేసీఆర్.. శాశ్వత సీఎంను అనుకోవద్దు!
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తానే శాశ్వత సీఎంగా ఉంటానని అనుకుంటే ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. గతంలో తామే శాశ్వతం అని భావించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ సీఎం ఎన్టీరామారావులను ప్రజలు ఎన్నికల్లో ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధికోసం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ఆడడం మానేయాలని అన్నారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
ఆదివాసీలను విడదీయొద్దు
ములుగును జిల్లా చేయాలి సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో ములుగు : షెడ్యూల్డ్ ప్రాంతంలోని ఆదివాసీలను విడదీసే హక్కు ప్రభుత్వానికి లేదని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్ అన్నారు. మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై పాఠశాల విద్యార్థులతో కలిసి గురువారం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ భూభాగాన్ని విభవించరాదని రాజ్యాంగం, చట్టాలు చెబుతున్నా అవేమీ పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. జిల్లాల పునర్విభజన ప్రజాభిప్రాయాల మేరకు జరగాల్సి ఉన్నా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యమాలే ఉండవని చెప్పిన కేసీఆర్ నేడు జిల్లాల కోసం జరుగుతున్న ఉద్యమాలను ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. అన్ని అర్హతలు ఉన్న ములుగును కాదని బొందలగడ్డ భూపాలపల్లిని జిల్లా చేయడం రాజకీయ లబ్ధికోసమేనని ఆరోపించారు. ములుగును జిల్లా చేయకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆందోళనకు వైఎస్సార్ సీపీ నాయకుడు కలువాల సంజీవ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ములుగు డివిజన్ ఇన్చార్జీ చెట్టబోయిన సారంగం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాస్, నాయకులు కాకి రవిపాల్, ఎండబి. మునీంఖాన్, గుగులోతు సమ్మన్న, కనకం దేవాదాసు, మల్లేశ్, ఈర్ల నర్సింహస్వామి, అజ్మీరా హరీశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
కలెక్టరైనా నేతలవేపే
– సీపీఎం జిల్లా కార్యదర్శి ఆరోపణ – బదిలీ చేయాలని డిమాండ్ కర్నూలు సిటీ: ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన జిల్లా కలెక్టర్...కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నానో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అడ్డుపడకుండా ఉంటే గ్రామాల్లో రోడ్లు వేయిస్తాం, మురుగు కాల్వలు నిర్మిస్తామంటూ కంపెనీ యాజమానులకు అనుకూలంగా కలెక్టర్ మాట్లాడడాన్మిన బట్టి ఆయన యాజమాన్యంతో కుమ్మక్కయ్యారన్న అనుమానం వస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏ ఒక్కరు వ్యతిరేకం కాదని, అయితే ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిశ్రమలు మాత్రం పెట్టవద్దన్నారు. దీనిపై రైతులు అడ్డుకుంటే కలెక్టర్ కేసులు పెట్టించడం ఎంటని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని చుట్టంలా చేసుకుని నిత్యం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ పైశాచికానందం పొందుతున్నారని కలెక్టర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వేలాది రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి కలెక్టర్.. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన బివి.రాఘవులను శకునాలకు పోకుండా రాత్రికి రాత్రే అక్కడ 144 సెక్షన్ పెట్టడం సరికాదన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఈ ‘తూర్పు’నకు ఏమైంది?
పట్టిపీడిస్తున్న డెంగీ, మలేరియా విజృంభిస్తున్న ప్రాణాంతక వ్యాధులు మృత్యువాత పడుతున్న రోగులు ప్రత్యేక దృష్టి సారించని జిల్లా యంత్రాంగం ఒకవైపు డెంగీ.. మరోవైపు మలేరియా.. ఇంకోవైపు విషజ్వరాలు.. ఇలా జిల్లాను ప్రాణాంతక వ్యాధులు కుదిపేస్తున్నాయి. ఏజెన్సీ, మారుమూల గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాలనూ ఈ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. అనేక గ్రామాల్లో పరిస్థితులు చేజారుతున్నప్పటికీ.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో బ్లీచింగ్ చల్లించి చేతులు దులుపుకొంటున్నారు. వందలాది మంది రోజుల తరబడి జ్వరాలతో బాధపడుతున్నా.. అనేక మంది అంతుచిక్కని రోగాలకు బలవుతున్నా.. జిల్లా యంత్రాంగం సరైన స్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో నానాటికీ ప్రాణాంతక వ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించాల్సిన ఆవశ్యకతపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఎం.కొత్తూరు (రౌతులపూడి) : వారం రోజులుగా ఎం.కొత్తూరు ప్రజలు వ్యాధులతో మంచానపడ్డారు. సుమారు 30 మంది మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాల వంటి ప్రాణాంతక వ్యాధులకు గురై, ఆస్పత్రుల బాటపట్టారు. ఆరోగ్య సిబ్బంది ఇస్తున్న కొద్దిపాటి మందుబిళ్లలతో వ్యాధులు తగ్గుముఖం పట్టడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో గత ఆరు మాసాలుగా ఎలాంటి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టకపోవడంతో క్రిమి కీటకాలు వ్యాపించి, ప్రజలు అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు. వారం రోజులుగా గ్రామానికి చెందిన గిరిజనులు యరగడ చక్రమ్మ, యరగడ దేవి, వంతు దాలియ్యదొర, వంతు చినబుల్లి, గంటిమళ్ల దేవుడమ్మ, వంతు మాతయ్యదొర, గంటిమళ్ల గంగరాజు, యరగడ రాంబాబు తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. కూలీ పనులు చేసుకునే తాము జ్వరాలతో ఆస్పత్రులకు తిరుగుతూ, పూటగడవక నానా అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మలేరియా లక్షణాలతో యువతి మృతి ఇదే గ్రామానికి చెందిన ఎం.ప్రియ(21) అనే యువతి మలేరియా లక్షణాలతో ఆదివారం రాత్రి మరణించింది. రాఖీ పండగ మరుసుటి రోజు తలనొప్పి, జ్వరం, వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను రౌతులపూడిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తుని, అక్కడి నుంచి విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించిందని ఆమె తండ్రి ఎం.రాజు విలపించాడు. వివాహితను బలిగొన్న డెంగీ మలికిపురం : మలికిపురానికి చెందిన పూసి అనిల్‌కుమారి(35) అనే వివాహిత డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మరణించింది. రెండు రోజులుగా జ్వరంతో ఉన్న ఆమెను బంధువులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమెకు డెంగీ జ్వరమని వైద్యులు తేల్చినట్టు బంధువులు సోమవారం తెలిపారు. కాగా రామరాజులంక, దిండి గ్రామాల్లో కూడా అనేక మంది డెంగీ లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన కొప్పాడి సిరి(7) వారం రోజుల క్రితం ప్లేట్లెట్లు గణనీయంగా తగ్గి మరణించిన సంగతి విదితమే. బాలికను కాటేసిన డెంగీ? ర్యాలి(ఆత్రేయపురం) : డెంగీ లక్షణాలతో బాధపడుతూ విద్యార్థిని మరణించిన ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. ర్యాలి గ్రామానికి చెందిన కత్తుల సుందరరావు మనవరాలు కుసుమే కీర్తి (15) పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులకు దూరంగా ఆమె కొన్నేళ్లుగా ర్యాలి గ్రామంలో తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటోంది. మూడు నెలల క్రితం ఆమెకు జ్వరం సోకడంతో, పలుచోట్ల చికిత్స చేయించారు. జ్వరం తీవ్రం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైద్యం అందించారు. అప్పటీకీ జ్వరం తగ్గకపోవడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె రక్తంలో ప్లేట్లెట్లు పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో సోమవారం చనిపోయింది. తమ పాపకు డెంగీ సోకడంతోనే మరణించిందని ఆమె బంధువులు చెబుతున్నారు. మూడు నెలల నుంచి విపరీతమైన జ్వరం, ఇతరత్రా శారీరక వ్యాధులు తలెత్తడంతో తమకు దక్కకుండా పోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. డెంగీ అని చెప్పలేం.. ఇటీవల కాలంలో వాతావారణంలో మార్పుల కారణంగా అనేక మంది జ్వరాలు బారిన పడుతున్నారు. నిత్యం జ్వర పీడితులు వైద్యశాలకు వస్తున్నారు. ఎవరికీ డెంగీ లక్షణాలు కనిపించలేదు. కొన్ని విషజ్వరాల వల్ల ప్లేట్లెట్లు తగ్గిపోతాయి. అంతమాత్రాన డెంగీగా నిర్ధారించలేం. మా వైద్యశాలకు డెంగీ కేసులు రాలేదు. – ఝాన్సీలక్ష్మి, వైద్యాధికారి, ర్యాలి -
జల పర్వం.. జనసంద్రం
జిల్లాలోని 11 రోజుల్లో 13,24,743 మంది భక్తులు – రోజుకు సగటున 1,20,431 పుణ్య స్నానాలు – ఐదు ఘాట్లలోనూ భక్తిపారవశ్యం – సీఎం పర్యటన నేపథ్యంలో స్తంభించిన ట్రాఫిక్ – రెండున్నర గంటల పాటు భక్తులు అవస్థలు – సీఐ ఘటనతో అప్రమత్తమైన పోలీసు శాఖ – ఆది పుష్కర ముగింపునకు భారీ ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. జిల్లాలో ఐదు ఘాట్లు ఉండగా.. మొత్తం 11 రోజుల్లో 13,24,743 మందికి పైగా పుష్కరస్నానం ఆచరించారు. ఈ లెక్కన సగటున రోజుకు 1,20,431 మంది భక్తులు కృష్ణమ్మ దీవెనలందుకున్నారు. భక్తులకు తగిన సంఖ్యలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు లేకుండానే పుష్కర సందడి కొనసాగింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం లింగాలగట్టులోని దిగువఘాటుకు రావడంతో అటు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం వస్తున్న సందర్భంగా గంటన్నర పాటు.. వెళ్లే సమయంలో ఒక గంట పాటు మొత్తం రెండున్నర గంటలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఫలితంగా పుష్కరభక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కార్డ్అండ్ సెర్చ్‌లో ఒక మహిళతో సీఐ పట్టుబడిన ఘటన నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమయింది. ఐజీ శ్రీధర్‌రావు.. జాగ్రత్తగా ఉండాలని పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. ఈ ఒక్క ఘటన మినహా పుష్కర సందడి ఇప్పటి వరకు సాఫీగానే సాగింది. ఇకపోతే చివరిరోజు పుష్కరాలకు ఘనంగా ముగింపు పలికేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధమయింది.. చివర్లో తెలుగు తమ్ముళ్ల సందడి పుష్కర సందడి మొదలై 10 రోజులు గడిచినప్పటికీ అటువైపు కొద్ది మంది మినహా తెలుగు తమ్ముళ్లు పెద్దగా ఎవ్వరూ సహాయ కార్యక్రమాలు చేపట్టలేదు. అయితే, సోమవారం సీఎం వస్తున్న సందర్భంగా ఎవరికి వారు భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక ఎమ్మెల్యే మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను పంచిపెట్టగా.. మరో నేత కుంకుమ, పసుపు, రవికెలను పంపిణీ చేశారు. అప్పటికప్పుడు ఫ్లెక్సీలను పెట్టి హంగామా చేసే ప్రయత్నం కనిపించింది. కష్టపడ్డ జిల్లా యంత్రాంగం పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడంలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసింది. ప్రధానంగా పోలీసు యంత్రాంగం సేవా కార్యక్రమాల్లో ముందుండగా.. రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు భారీగా చేసింది. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడా చెత్త కనపడకుండా రేయింబవళ్లు కష్టపడ్డారు. ఏకంగా రాత్రి సమయాల్లోనూ కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఘాట్ల వద్దకు వెళ్లి శుభ్రపరిచే ఏర్పాట్లను చేశారు. గత నాలుగు రోజులుగా కలెక్టర్, ఎస్పీ కలియతిరుగుతూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మొత్తం మీద జిల్లా యంత్రాంగం కష్టానికి తగిన గుర్తింపు లభించింది. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వరించింది. -
ప్రజావసరాలకు అనుగుణంగా రైతుబజార్లు
సీఈవో రమణమూర్తి కాకినాడ సిటీ : ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతుబజార్లలో సేవలు అందేలా చర్యలు చేపడుతున్నట్టు సీఈవో బీవీ రమణమూర్తి తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతుబజార్లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో నిర్మించిన షెడ్ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. రమణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 10 రైతుబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. రైతుబజార్లన్నింటికీ పటిష్టమైన షెడ్లు నిర్మించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ జగన్నాథపురంలోని జిల్లా పరిషత్‌కు చెందిన స్థలంలో రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. తొలుత జిల్లాలోని రైతుబజార్ల పనితీరును జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సీఈవోకు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్ఎన్ కిషోర్, డీఈఈ ఎస్ఎస్వీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల చేత శభాష్ అనిపించుకుందాం
– మెరుగైన సౌకర్యాలు కల్పించండి – 24గంటలు కలెక్టర్, ఎస్పీలు అందుబాటులో.... – పుష్కర విధులు నిర్వహించడం మహాపుణ్యకార్యం – డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి శ్రీశైలం: భక్తుల చేత శభాష్ అనిపించుకునేలా శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణా పుష్కరాలను అధికారులు విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం రాత్రి శ్రీశైలం చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం పుష్కరఘాట్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, ఈఓ భరత్‌గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి తదితరులతో కలిసి పాతాళగంగ ఘాట్లను పరిశీలించారు. అనంతరం చంద్రావతి కల్యాణ మండపంలో పుష్కర విధులపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుని పుష్కరాల ఆరంభానికి శుభసూచకంగా కృష్ణమ్మ సంకేతాన్ని పంపిందని అన్నారు. ప్రత్యేక విధులపై హాజరైన ప్రతి ఒక్కఅధికారి తమకు కేటాయించిన విధులను సక్రమంగా అమలు పరిచి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. గత కొన్ని వారాలుగా జిల్లా కలెక్టర్ పుష్కరాల విధుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా పని చేయాలి, అనే విషయాలను విశదీకరించి ఉంటారని అన్నారు. అలాగే డీఐజీ, ఎస్పీలు భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజెప్పి ఉంటారని ఈవిధి నిర్వహణలో ఉన్న వారంతా తప్పనిసరిగా ఆ నిబంధనలు పాటించి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. ఆదివారం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలు శ్రీశైలాన్ని కేంద్ర కార్యాలయంగా చేసుకుని విధులు నిర్వహిస్తారని చెప్పారు. కృష్ణా జలాలు రావడంతో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఎస్‌ఆర్‌బీసీలకు నీటిని వదిలే అవకాశం కలిగిందని ఇది కూడా శుభపరిణామంగా పేర్కొన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా నదీ పుష్కరాలలో ఈ ఏడాది శ్రీశైలం, సంగమేశ్వరంలలో విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది భక్తులకు తమ సేవలను అందించడం ద్వారా ఎంతో పుణ్యం చేసుకున్నారని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. -
మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తొర్రూరు : రాష్ట్రంలోని రాచరిక, అరాచక కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై మిలిటెంట్ పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని అమ్మాపురంలో సీపీఐ నియోజకవర్గ నాయకుడు ముద్దం శ్రీనివాస్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు ప్రథమ వర్థంతి సభను నిర్వహించారు. ముందుగా శ్రీనివాస్‌రెడ్డి విగ్రహాన్ని వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ సుధాకర్‌రావు ఆవిష్కరించారు. అనంతరం గ్రామ సీపీఐ కార్యదర్శి భూర్గు యాదగిరి అధ్యక్షతన జరిగిన వర్థంతి సభలో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటూ అనేక ఉద్యమాలు చేసిన గొప్ప విప్లవకారుడు శ్రీనివాస్‌రెడ్డి అని కొనియాడారు. నల్లదనం వెలికితీత హామీలు ఏమయ్యాయి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే నల్లధనాన్ని వెలికితీస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అమరవీరులు ముద్దం శ్రీనివాస్‌రెడ్డి, శంకరబోయిన మల్లయ్య స్తూపాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని ఇతర దేశాలు తిరగడం తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ రెండేళ్లుగా పిట్టకథలు, మాయమాటలు, దగాకోరు హామీలతో పాలన సాగిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్ళపెల్లి శ్రీనివాస్‌రావు, విజయసార«థి, తమ్మెర విశ్వేశ్వర్రావు, సుబ్బారావు, ఓమ భిక్షపతి, ముద్దం మహబూబ్‌రెడ్డి, శ్రీమన్నారానాయణ, మల్లయ్య, ఎల ్లయ్య, ఉప సర్పంచ్ బంగారమ్మ, ఎంపీటీసీ యాకలక్ష్మి బ్రహ్మయ్య, కార్మికులు, కళాకారులు పాల్గొన్నారు. -
నిధులు మంజూరైనా నిర్మాణంలో నిర్లక్ష్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మండలంలోని వివిధ గ్రామాలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వర్షాకాలంలో పనుల నిమిత్తం ఇంటి నుంచి పక్క గ్రామాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని నర్సాపూర్ వాగుపై బ్రిడ్జిని నిర్మించి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అప్పటిప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో నర్సాపూర్‌తో పాటు బీరెల్లి గ్రామస్తులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బ్రిడ్జి నిర్మా ణం చేపట్టేందుకు ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని ముందుకు వచ్చిన ప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో పనులు ప్రారం భించలేదని స్థానికులు తెలిపారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అవతలి గ్రామాల్లోని పాఠశాలకు ఉపాధ్యాయులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఏటా ఇబ్బందులే – చింత సాంబయ్య, గ్రామస్తుడు, గోనెపల్లి జంపన్నవాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు ప్రతీ ఏటా వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలు బాగా కురిసినప్పుడు గోనెపల్లి వాగు పొంగుతోంది. ఈ సమయంలో నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఎరువులు, వైద్య సేవల కోసం అవస్థలు పడుతున్నం. పదేళ్ల క్రితం వాగు వరద దాటుతూ గ్రామానికి చెందిన ఒకరు నీటిలో మునిగి చనిపోయారు. వాగు ఉధృతి తగ్గే వరకు బయటి ప్రపంచాన్ని చూడలేకపోతున్నాం. అధికారులు తక్షణమే గోనెపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలి. అధికారుల అలసత్వంతోనే తిప్పలు – ఈసం సమ్మయ్య, గ్రామస్తుడు, ఎల్లాపూర్ నర్సాపూర్ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్షాకాలంలో వాగు ఉప్పొంగుతుండడంతో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు పడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యం కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా పినపాక మండలానికి వెళ్తున్నాం. వర్షాలు తగ్గిన వెంటనే బ్రిడ్జి నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. -
ఉచిత వైద్యమెక్కడ ?
తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ప్రకటిస్తున్న వరాలు నోరూరిస్తున్నాయి. అందనంత ఎత్తులో ఉండి రారమ్మంటున్నాయి. చేతికి మాత్రం అందడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఉచిత వైద్యం. సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో అధిక శాతం ప్రజలు కూలీలే. వీరికి ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందిస్తానంటూ హామీలు గుప్పించింది. భూములు సమీకరించిన ఏడాది అనంతరం ఉచిత విద్యపై జీవో విడుదల చేసింది. ఉచిత వైద్యం మీద మాత్రం ఎటువంటి సూచనలు చేయలేదు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని ప్రాంత వాసులకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పింది. గతంలో ఉన్న ఆరోగ్యశ్రీనే ప్రస్తుత ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకంగా మార్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందిన వైద్యం ఇప్పుడు ఎక్కడా అమలు కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో రైతులు వ్యవసాయం చేసే సమయంలో 29 గ్రామాల్లో 9 వేల మందికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం అందినట్టు ప్రభుత్వ వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద రాజధాని ప్రాంతంలో ఒక్కరి నాడీ పట్టిన దాఖలాలు మాత్రం లేవు. సరైన వైద్యశాల లేదు తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో సరైన వైద్యశాలే లేదు. ఈ నేపథ్యంలో ఉచిత వైద్యం ఎంతమేర అందుతుందోనని బాధితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉచిత వైద్యం ఎక్కడ చేయించుకోవాలి, ఏ అధికారిని సంప్రదించాలి, అనారోగ్యం వచ్చిన వారి వివరాలు ఎవరు సేకరిస్తారు? ఎవరి ద్వారా చికిత్స పొందవచ్చు అనే అంశాలపై స్పష్టత లేదు. సీఆర్డీఏ అధికారులు కానీ, ఇతర శాఖలవారుగానీ దీనిపై సమాచారం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెల్లకార్డు ఉన్న వారికి కొన్ని జబ్బులకే వైద్యం అందిస్తున్న ఈ పరిస్థితుల్లో రాజధాని ప్రాంత వాసులకు ఉచిత వైద్యం అనే ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదు రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రైతుల నుంచి భూములు తీసుకుని ఏడాది కావస్తున్నా నేటికీ విద్య, వైద్యంపై నిర్ణయం తీసుకోలేదు. రాజధాని నిర్మాణంతో రైతుల బిడ్డలు కూలీలుగా మారే పరిస్థితి ఏర్పడింది. 29 గ్రామాల్లో అన్నదాతల పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే అరకొర లబ్ధి వారి హాస్టల్ ఖర్చుకు కూడా రాదు. - ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే, మంగళగిరి ఇదంతా ప్రభుత్వ కుట్ర రాజధానిలో ప్రభుత్వ అరాచకాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. రైతుల దగ్గర భూములు తీసుకునేటప్పుడు హామీల వర్షం కురిపించింది. భూములు ప్రభుత్వం చేతికి వచ్చిన తరువాత వారి గురించి ఆలోచించడమే మానేసింది. భవిష్యత్తులో భూములిచ్చిన రైతులు రాజధానిలో ఉండకూడదనే లక్ష్యంతో విద్య, వైద్యం అందుబాటులో లేకుండా ప్రభుత్వ కుట్ర పన్నుతోంది. - ఎం రవి, సీపీఎం రాజధాని ప్రాంత కమిటీ సభ్యుడు -
వారికి నీటి సరఫరా అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతుంటే.. ప్రభుత్వం శీతల పానీయాలు, బీరు తయారీ కంపెనీలకు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తోందని, దీనిని అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిల్ కావడంతో దీనిని వెకేషన్ కోర్టులో విచారించడం సాధ్యం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మౌఖిక ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ తన వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్లతో పాటు పలు శీతల పానీయాలు, బీరు తయారీ కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆ నీటిని ప్రజలకు మళ్లించండి శీతల పానీయాలు, బీరు తయారు కంపెనీలకు ప్రభుత్వం రోజుకు 1,512 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తోందని, ఐపీఎల్ కోసం రోజుకు 60 మిలియన్ లీటర్ల నీటిని ఇస్తోందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. జాతీయ నీటి విధానం ప్రకారం నీటి సరఫరా విషయంలో మొదటి ప్రాధాన్యత తాగునీటికి, పశువుల అవసరాలకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కంపెనీలకు సరఫరా చేసే నీటిని ప్రజలు తాగేందుకు, ఇతర అవసరాలకు, పశుపక్ష్యాదులకు, వ్యవసాయ అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రేవంత్ తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. -
ఎండలతో ప్రజలు బేజార్
ఎండలకు తట్టుకోలేకపోతున్న వృద్ధులు, చంటి పిల్లలు తల్లాడ: మండుతున్న ఎండలతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే మే నెల ఎండలను తలపిస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చంటి పిల్లలు ఎండలకు తట్టుకోలేక అల్లాడి పోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎండలకు భయపడి జనం బయటకు రావటం లేదు. పది గంటలలోపే తమ పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లి పోతున్నారు. సాయంత్రం 5గంటల తర్వాత మళ్లీ మండల కేంద్రానికి వస్తున్నారు. దీంతో జన సంచారం కన్పించటం లేదు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి ఎండలు కాస్తుండటంతో జనం అల్లాడి పోతున్నారు. ఈ నెలలోనే ఎండలు భగ్గుమంటుంటే మే నెలలో ఎంత తీవ్రంగా ఉంటాయోనని హడలి పోతున్నారు. అంగన్ వాడీల్లో చిన్నారుల ఇక్కట్లు.. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అంగన్వాడీ కేంద్రాలు రేకుల షెడ్లు, ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నందున ఉక్క పోతకు చిన్నారులు గురౌతున్నారు. అంగన్ వాడీల సమయ వేళల్లో మార్పు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కరీంనగర్ కలెక్టరేట్లో స్థానికుల ఆందోళన
-
పాకిస్తాన్లో ఆత్మహుతిదాడి