ప్రజా చైతన్యంతోనే అవినీతి నిర్మూలన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రజా చైతన్యంతోనే అవినీతి నిర్మూలన సాధ్యమని జిల్లా ఎస్పీ ఆర్‌కే రవికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఏపీఎస్‌పీ రెండో బెటాలియన్‌లో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక దేహదారుఢ్య పరీక్షలను పరిశీలించారు. అనంతరం అవినీతి వ్యతిరేక వారోత్సవాల ముగింపును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులతో అవినీతికి వ్యతిరేకంగా నడుచుకుంటామని పేర్కొంటూ ప్రతిజ్ఞ చేయించారు. విధి నిర్వహణలో పేద ప్రజలకు అండగా ఉంటామని, విలువలను పాటించి పోలీసు వృత్తికి కీర్తిప్రతిష్టలు తెస్తామని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, డీఎస్పీలు వెంకటాద్రి, హుస్సేన్‌పీరా షరీఫ్, పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ సలాం, ఆర్‌ఐ జార్జీ పాల్గొన్నారు.
జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
సంవత్సరాంతంలో దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్‌కే రవికృష్ణ పోలీసులకు సూచించారు. శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో సివిల్, ఏఆర్ పోలీసులు నిర్వహించిన పరేడ్, కవాతును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చైన్ స్నాచింగ్, ఇతర నేరాలపై నిఘా ఉంచాలన్నారు. విధుల్లో వ్యక్తిగత క్రమశిక్షణను పాటించాలని, ఆరోగ్యం కోసం వ్యాయామం, నడక, యోగా, సైక్లింగ్‌లను అలవాటు చేసుకోలని సూచించారు. విధి నిర్వహణలో ఏమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తక్కువ వడ్డీతో లభించే భద్రత రుణాలకు అర్హులైన ప్రతి పోలీసు ఇళ్లు లేదా ఇంటి స్థలం తీసుకోవాలని సూచించారు. అనంతరం పోలీసు జాగీలలకు వసతి సౌకర్యాలపై డాగ్ స్కా్వడ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామచంద్ర, సీఐ నాగరాజారావు, ఆర్‌ఐ రంగముని పాల్గొన్నారు.