SP
-
నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు
నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్‌ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
ఇండియా కూటమిలో లుకలుకలు!, ఈసారి..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలుఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్‌కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది -
నాలుగుసార్లు ఎంపీ.. ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్
బీహార్: కొందరు రాజకీయ నేతలు అక్రమ దందాలు సాగిస్తున్నారనే వార్తలను మనం అప్పుడప్పుడు వింటుంటాం. అయితే నాలుగు సార్లు ఎంపీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధి ఇప్పుడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడంటే ఒక పట్టాన నమ్మలేం. కానీ ఇది నిజం. యూపీకి చెందిన ఒక నేత ప్రజాప్రతినిధి అనే పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు.రాజకీయాల్లో విజయంకల్తీ మద్యం కేసులో నిందితుడైన యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్ రాజకీయాల్లో పలు విజయాలను అందుకున్నారు. అజంగఢ్ నుంచి నాలుగు సార్లు ఎంపీ, ఫూల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో మహూల్లో చోటుచేసుకున్న విషపూరిత మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్న ఆయన రెండేళ్లకు పైగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు రమాకాంత్ యాదవ్ ఐఆర్-42 గ్యాంగ్‌గా జాబితాలో చేరారు.1985లో రాజకీయ ప్రవేశంఫుల్పూర్ ప్రాంతంలోని అంబారి నివాసి రమాకాంత్ యాదవ్ 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆఫుల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో అజంగఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. 2019లో బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి 2022లో ఫూల్పూర్ పోవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.బీఎస్పీ అభ్యర్థిపై దాడి1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందు రమాకాంత్ యాదవ్ బీఎస్పీ అభ్యర్థి అక్బర్ అహ్మద్ డంపీపై దాడి చేసినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2022లో మహుల్‌లో విషపూరిత మద్యం ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ కేసులో రమాకాంత్ యాదవ్ హస్తమున్నట్లు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.ఐఆర్ -42 ముఠా జాబితాలో..వారణాసి జోన్ ఏడీజీ హత్య, కల్తీ మద్యం తయారు చేయడం, లైసెన్స్ పొందిన దేశీయ మద్యం షాపులో దానిని విక్రయించడం లాంటి నేరాలకు పాల్పడి, జైలుకెళ్లిన ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్, అతనితో సంబంధం ఉన్న 15 మంది సభ్యులను ఐఆర్ -42 ముఠా జాబితాలో పోలీసులు చేర్చారు. ఇతనితో పాటు ఇతని ముఠా సభ్యులపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద పోలీసులు చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
Ambati: సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
-
వేధింపులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీమంత్రి అంబటి
-
‘అయోధ్య దీపోత్సవ్‌కు ఆహ్వానం అందలేదు’
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్‌కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
నెలకు ఒకసారే ఇంటికి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)లో లీవ్ (సెలవు) మాన్యువల్ మరోసారి చర్చనీయాంశం కానుంది. గతంలో 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటమే ఇందుకు కారణం. వచ్చే నవంబర్ 1 నుంచి కొత్త మాన్యువల్ అమలు కానుండగా, తాజా నిబంధనలపై కానిస్టేబుళ్లలో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వారి కుటుంబాలు ప్రభుత్వం, అధికార వర్గా లపై మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ శ్రమ దోపి డీయేనని, బ్రిటిష్ కాలంనాటి చట్టాలను సవరించాల్సిందిపోయి, ఒత్తిడి మరింత పెంచేలా కొత్త విధానా లకు శ్రీకారం చుట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ పాత విధానం!హైదరాబాద్‌తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 13 టీఎస్ఎస్పీ బెటాలియన్లు ఉన్నాయి. దాదాపు 8 వేల మంది పోలీసులు వివిధ ర్యాంకుల్లో పనిచేస్తున్నారు. బెటాలియన్లలోని ప్రతి 12 మందిని ఒక ప్లటూన్ లేదా సెక్షన్ అని పిలుస్తారు. వీరిలో నలుగురు హెడ్‌క్వార్టర్‌కు అందుబాటులో ఉంటారు. మిగిలిన 8 మందికి ఈ లీవ్ మాన్యువల్ వర్తిస్తుంది. ఒకరు సెలవు తీసుకుంటే ఏడుగురు కచ్చితంగా విధుల్లో ఉండాలి. ఈ ఏడుగురు ఒకరి తర్వాత మరొకరు నాలుగు రోజుల చొప్పున సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 నుంచి 7వ కానిస్టేబుల్ వరకు నాలుగు రోజుల చొప్పున లీవు తీసుకున్నాక 8వ కానిస్టేబుల్‌కు అవకాశం వస్తుందన్నమాట. అంటే 28 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజుల సెలవు దొరుకు తుందన్నమాట. అంటే ప్రతి కానిస్టే బుల్ 28 రోజులకు ఒకసారి ఇంటికి వెళతారన్నమాట. ఒక వేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే ఈ క్రమం దెబ్బతిని తదుపరి వ్యక్తి తీసుకోవాల్సిన సెలవు మరింత ఆల స్యం అవుతుంది. 2012 వరకు ఇలాంటి నిబంధనలే ఉండేవి. అయితే 2012 ఆగస్టు 5వ తేదీన తమ భర్తలు ఇంటికి రావడం లేదంటూ కొండాపూర్ బెటాలియన్ ఎదుట కానిస్టే బుళ్ల భార్యాపిల్లలు భారీయెత్తున ధర్నా నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లకు లీవుల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాన్యువల్‌లో మార్పులు చేసి ఒకసారి ఒక్కరిని కాకుండా ముగ్గురికి అవకా శం ఇవ్వడం ప్రారంభించారు. ఫలితంగా ప్రతి నెలా రెండుసార్లు అంటే 15 రోజులకు ఒకసారి ఇంట్లో వారిని చూసే అవకాశం కానిస్టేబుళ్లకు దక్కేది.అగచాట్లు తప్పవా?⇒ దాదాపుగా పాత పద్ధతి తరహాలోనే ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటంతో కానిస్టేబుళ్లతో పాటు వారి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వారాలకు వారాలు భర్తలు తమకు, పిల్లలకు దూరంగా ఉండేలా చేస్తు న్న నిబంధనలపై భార్యలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కాపురాల్లో కలహాలకు కారణమై విడాకుల వరకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే కుటుంబసభ్యులు అనా రోగ్యంతో బాధ పడుతున్నా ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉంటున్నామని కానిస్టే బుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాజా ఆదేశాలు అమలైతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అంటున్నారు. ఇంకోవైపు వీరికి స్థిరంగా విధులు ఎక్కడా ఉండక పోవడం కూడా వారిలో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రతి వారానికి లేదా 15 రోజులకు అప్పుడప్పుడూ ప్రతి రోజూ మారతాయి. ఇక సాధారణ ఎన్నికలు, విపత్తులు, అల్లర్లు చెలరేగినపుడు వీరంతా సెలవులు రద్దు చేసుకుని మరీ బందోబస్తు విధుల్లో కొనసాగాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త మాన్యువల్‌పై కానిస్టేబుళ్ల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్రిటిష్ కాలంలో రూపొందించిన చట్టాలను మార్చాలంటూ మరోసారి కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకోవాలి⇒ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ బాధల్ని అసెంబ్లీ వేదికంగా లోకానికి చాటిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం సీఎం, హోంమంత్రిగా ఉన్నారని, ఆయన గతాన్ని గుర్తుచేసుకుని తమ విషయంలో పెద్దమనసు చేసుకో వాలని వారు కోరుతున్నారు. 26 రోజులకు ఒకసారి లీవు విధానం అమలు చేయకుండా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని, టీఎస్ఎస్పీ, సివిల్, ఏఆర్ బెటాలియన్లను కలిపి తమిళనాడు, కర్ణాటక తరహాలో ‘ఏక్ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేయాలని, కుటుంబాలతో ఒకేచోట 3 నుంచి ఐదేళ్లపాటు కలిసి ఉండే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ టు ఐపీఎస్.. సేవలోనే సంతృప్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మా నాన్న బాలాజీ పవార్. ఆయన డాక్టర్. ఎప్పుడూ ప్రజలతో మేమేకం అయ్యేవారు. ఆయనను చూశాక నాకూ అలాగే ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేయాలనిపించేది. అంతేకాదు.. కలెక్టర్లు, ఎస్పీల గురించి నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. నాన్న స్ఫూర్తితోనే సివిల్స్ వైపు వచ్చాను’ అని చెప్పారు యువ ఐపీఎస్ అధికారి శరత్చంద్ర పవార్. నల్లగొండ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన.. ఐపీఎస్ సాధించడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలను, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉద్యోగ జీవితంలో అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. నా బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. పదో తరగతి వరకు మహీంద్రాహిల్స్‌లోని ఆక్జిలియం హైసూ్కల్లో చదువుకున్నాను. నారాయణగూడలోని రత్న జూనియర్ కాలేజీలో ఇంటరీ్మడియట్ పూర్తిచేశా. ఆ తరువాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబేలో సీటు సాధించా. అక్కడ బీటెక్ పూర్తి చేశాక ఏడాది పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేసి.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ స్టార్టప్‌ను అభివృద్ధి చేసి, రెండేళ్లపాటు నిర్వహించా. అయినా, చిన్నతనంలోనే నా మనస్సులో నాటుకున్న సేవ అనే బీజం అక్కడ ఉండనీయలేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. నా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం చేకూరిస్తే ఎంతో సంతృప్తి ఇస్తుంది.సాఫ్ట్‌వేర్‌లో ఉంటూనే సివిల్స్‌పై దృష్టిస్టార్టప్లో ఉండగా సివిల్స్‌పై దృష్టిపెట్టాను. సాఫ్ట్‌వేర్‌తో వచ్చే డబ్బులతోనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవాడిని. రెండుసార్లు అటెంప్ట్ చేశా. ఇక మూడోసారి మరింత సీరియస్‌గా తీసుకొని పూర్తిగా సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాను. 2015లో సివిల్స్ మూడోసారి రాశాను. 2016లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. శిక్షణ పూర్తయ్యాక 2018 డిసెంబర్లో ఏటూరునాగారం అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్ వచ్చిది. ఆ తరువాత రామగుండం ఓఎస్డీ, మహబూబాబాద్ ఎస్పీగా పనిచేశా. ఆ తరువాత పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా, సెంట్రల్ జోన్ డీసీసీగా, నార్కొటిక్స్ ఎస్పీగా చేశా. అక్కడి నుంచి నల్లగొండ ఎస్పీగా వచ్చా.బాధితులకు న్యాయం చేస్తే ఎంతో తృప్తిఐఏఎస్ లేదా ఐపీఎస్ అయితే నేరుగా ప్రజలకు సేవ చేయొచ్చు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. మా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం ఎంతో సంతృప్తి ఇస్తోంది. ఇప్పుడు వచ్చే జీతం.. అప్పుడు సాఫ్ట్‌వేర్‌లో వచ్చే జీతం కంటే తక్కువే అయినా.. ప్రజలకు సేవలందించడం ద్వారా ఇప్పుడు కలిగే తృప్తి ముందు అది తక్కువే అనిపిస్తుంది. మహబూబాబాద్‌లో ఎస్పీగా ఉన్నప్పుడు రెండు జాబ్ మేళాలు నిర్వహించాను. దాదాపు 1200 మంది గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పించగలిగా. అది ఎంతో సంతృప్తి ఇచ్చింది. నల్లగొండలో కూడా త్వరలో జాబ్ మేళాలు నిర్వహిస్తాం. ప్రస్తుతం యువత గ్రూప్స్‌కు ప్రిపరేషన్లో ఉంది. అవి పూర్తయ్యాక జాబ్‌మేళా నిర్వహిస్తాం.కుటుంబ నేపథ్యం ఇదీ..ఎస్పీ శరత్చంద్ర పవార్ తండ్రి బాలాజీ పవార్ ప్రభుత్వ వైద్యుడు. ఆయన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఎక్కువ కాలం నిజమాబాద్‌లో పనిచేశారు. ఆ తరువాత సంగా రెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ అధికారిగా పనిచేశారు. తల్లి గృహిణి. శరత్చంద్ర భార్య పూజ ఇంటీరియర్ డిజైనర్. వారికి ఇద్దరు పిల్లలు. సంవ్రీత్, ఐరా. ‘పోలీసు వృత్తిలో రోజూ ఏదోరకమైన ఒత్తిడికి లోనవుతుంటామని, ఎంత ఒత్తిడి ఉన్నా పిల్లలతో కాసేపు గడిపితే అన్నీ మర్చిపోతా..’ అంటున్నారు ఎస్పీ శరత్చంద్ర పవార్.అధిక వేతనం.. అయినా లోటుఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్మెంట్లో సన్‌టెక్ బిజినెస్ సొల్యూషన్స్‌లో జాబ్ వచ్చింది. త్రివేండ్రం వెళ్లి అక్కడ ఏడాదిపాటు ఆ సంస్థలో ఇన్నోవేషన్ అనలిస్ట్‌గా పనిచేశా. ఆ తరువాత స్టార్టప్ ప్రారంభించాం. ఫుడ్ ఎన్ బ్రేవరేజెస్ ఇండస్ట్రీలో (ఎఫ్ఎన్బీ) రిసోర్స్ ఆప్టిమైజేషన్ చేశాను. రెండేళ్ల పాటు కొనసాగింది. మొదట ఏడాది జాబ్ చేసినప్పుడు వేతనం బాగానే వచ్చేది. స్టార్టప్‌లో ఉన్నప్పుడు బాగానే ఉంది. అయినా ఏదో వెలితిగా ఉండేది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. నాన్న చూపిన బాటలో నడిచేందుకు సివిల్స్ వైపు మళ్లాను. -
వంద మందిని తీసుకురండి.. బీజేపీకి అఖిలేష్ యాదవ్ చురకలు
ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి భంగపాటు ఎదురవడంతో ఎన్నికల ఫలితాలపై కాషాయ పార్టీ మేథోమథనం నిర్వహించింది.సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ నాయకత్వంలో లుకలుకలు మొదలైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు భేదాభిప్రాయాలు బయటపడుతున్న వేళ ప్రతిపక్ష ఎస్పీఅధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీపై సెటైర్లతో విరుచుకుపడ్డారు.బీజేపీకి ‘మాన్సూన్ ఆఫర్’ ఇచ్చారు. ‘‘మాన్సూన్ ఆఫర్: వందమందిని తీసుకొచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేయండి’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ ఈ పోస్టు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ పార్టీ యూనిట్లో అంతర్గత పోరు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తుందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఈ ప్రభుత్వంలో ఎవరూ లేరని ఆరోపించారు.मानसून ऑफ़र: सौ लाओ, सरकार बनाओ!— Akhilesh Yadav (@yadavakhilesh) July 18, 2024 కాగా.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 33 మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనికితోడు కేశవ్ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో దిల్లీలో ఒంటరిగా భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీ అధినాయకత్వం రాష్ట్ర శాఖలో సమూల మార్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే యూపీకి చెందిన ముఖ్య నేతలను ఒక్కొక్కర్నీ ఢిల్లీకి పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడుతున్నట్లు సమాచారం.ఇక లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన సీట్లు రాకపోవడానికి అగ్నిపథ్ స్కీమ్, పేపర్ లీక్స్, రాజ్‌పుత్‌లలో అసంతృప్తి వంటి పది కారణాలను పార్టీ గుర్తించింది. యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడానికి దారితీసిన పలు అంశాలను 15 పేజీల నివేదికలో రాష్ట్ర పార్టీ చీఫ్ భూపేంద్ర చౌధరి వివరించారు. -
ఎస్పీలకు మెజిస్టీరియల్ పవర్స్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు ఉత్పన్నమైనపుడు, పరిస్థితులను తమ ఆ«దీనంలోకి తెచ్చుకునేందుకు పోలీసులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారాలను కొత్త నేర న్యాయ చట్టాలు కల్పించనున్నాయి. గతంలో ఇలాంటి మెజిస్టీరియల్ పవర్స్ కేవలం జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోల చేతిలో ఉండేవి. ఉదాహరణకు 144 సెక్షన్ అమలు చేయాలన్నా వారి అనుమతి తప్పనిసరి. కానీ, ఇప్పుడు ఆ అధికారాలను జిల్లాల్లో ఎస్పీలకు, నగరాల్లో డీసీపీ ర్యాంకు అధికారులకు కల్పిస్తూ కొత్త న్యాయ నేర చట్టాలను రూపొందించారు. ఈ చట్టాలు దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి పూర్తిస్థాయిలో అమలుకానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు యూనిట్లలో కొత్త చట్టాలపై రేపటితో శిక్షణ కార్యక్రమాలు ముగియనున్నాయి. కానిస్టేబుళ్ల నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంకు ఆఫీసర్ల వరకు సంబంధిత యూనిట్ పరిధిలో శిక్షణ ఇస్తున్నారు. ఏసీపీ ఆపై ర్యాంకు అధికారులకు మాత్రం తెలంగాణ పోలీసు అకాడమీ (టీజీపీఏ)లో ట్రైనింగ్ ఇచ్చారు. కొత్తగా ఏ మార్పులు రానున్నాయి? జూలై 1 నుంచి ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లన్నీ కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా అధియాం (బీఎస్ఏ)లు రాబోతున్నాయి. బ్రిటిష్ కాలంలో రూపొందించిన ఈ చట్టాలను మరింత బలోపేతం చేయడం, శాస్త్రీయ పద్ధతిలో మెరుగైన విధానంలో దర్యాప్తు జరపడం, నేరాలకు కఠిన శిక్షలు విధించడం, సెక్షన్లు లేని కొన్ని రకాల నేరాలకు ప్రత్యేక సెక్షన్లు తీసుకురావడం, దర్యాప్తు కాలానికి నిర్దేశిత కాలపరిమితి విధించడం, వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేకూర్చడం వంటి లక్ష్యాలతో కొత్త నేర న్యాయ చట్టాలకు అంకురార్పణ జరిగింది. పెట్టీ నేరాలకు కమ్యూనిటీ సర్విస్.. కొత్త నేర న్యాయ చట్టాల ప్రకారం.. ఇకపై చిన్నతరహా (పెట్టీ క్రైమ్స్) నేరాలకు సమాజ సేవ చేసేలా శిక్షలు రూపొందించారు. ఉదాహరణకు న్యూసెన్స్, ఈవ్ టీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, కొట్లాటలు తదితర చిన్న నేరాలకు గతంలో జైలు, జరిమానాలు ఉండేవి. కొత్త చట్టాల ప్రకారం.. కమ్యూనిటీ సర్విస్ (సమాజసేవ) చేసేలా తీర్పులు రానున్నాయి.మనిషి మానసికంగా పరివర్తన చెందేలా ఈ శిక్షలు ఉండనున్నాయి. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి తాగి నడిపితే జరిగే నష్టాలపై ప్రచారం, ఈవ్ టీజింగ్ చేస్తే మహిళల ఔన్నత్యం తెలియజేసేలా నిందితుల్లో సామాజిక, మానసిక మార్పునకు దారి తీసేలా తీర్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. కొత్త సెక్షన్లు.. భారీ శిక్షలు గతంలో అనేక నేరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక సెక్షన్లు ఉండేవి కావు. ఉదాహరణకు గొలుసు దొంగతనాలు, మూకదాడులు, హిట్ అండ్ రన్, ఉగ్రవాద కార్యకలాపాల్లో సరిగ్గా సరిపోయే సెక్షన్లు ఉండేవి కావు. కానీ, జూలై 1 నుంచి ఇలాంటి నేరాలకు తగిన సెక్షన్లు రాబోతున్నాయి. వాటి ఆధారంగా గతంలో విధించిన జైలు శిక్ష కంటే రెట్టింపు కూడా ఉండనుంది. ఉదాహరణకు గతంలో హిట్ అండ్ రన్ కేసుల్లో గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడేది. తాజా చట్టాలతో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడనుంది. » పోలీసు కస్టడీ కూడా మరింత పెరగనుంది. గరిష్టంగా 15 రోజుల వరకు నిందితులను రిమాండ్‌లోకి తీసుకోవచ్చు. రిమాండ్ అయిన 60 రోజుల్లోగా ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు పోలీసులకు కలగనుంది. » దర్యాప్తులో శాస్త్రీయ, నిపుణులు ఇచ్చే రిపోర్టులకు పెద్దపీట వేయనున్నారు. » కేసు దర్యాప్తును కూడా నిర్దేశిత కాలంలో పూర్తి చేయనున్నారు. ఉదాహణకు పోక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి. మిగిలిన కేసుల్లో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిïÙటు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకపరిస్థితుల్లో మాత్రం ఈ కాలపరిమితికి మినహాయింపు దక్కనుంది. »ఇక స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడ నుంచైనా జీరో ఎఫ్ఐఆర్ నమోదు, ఆన్లైన్లో వారంట్ జారీ » పిల్లలు, వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యం ఉన్న వారు స్టేషన్ హాజరు నుంచి మినహాయింపు పొందవచ్చు. -
రాత్రి గస్తీ పెంచండి
కూడేరు: రాత్రి పూట గస్తీని పెంచి చోరీలను అరికట్టాలని ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు. కూడేరు ఎస్సీ కాలనీ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రూ.18,41,300 ఎత్తుకెళ్లిన విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె చోరీ జరిగిన ఏటీఎం సెంటర్‌ను తనిఖీ చేశారు. సీసీ కెమెరా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన రహదారి పక్కన ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఐ శివరాముడుని ఆదేశించారు. దేవాలయాలు, ఏటీఎం సెంటర్లపై నిఘా పెంచాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు. -
25 ఏళ్లకే ఎంపీలుగా రికార్డుకెక్కిన పుష్పేంద్ర, ప్రియా
న్యూఢిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన అత్యంత పిన్నవయసు్కలు, అత్యంత వృద్ధుడు ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులుగా కౌశంబీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పుష్పేంద్ర సరోజ్, మచిలీషహర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రియా సరోజ్ విజయం సాధించారు. వారిద్దరి వయసు 25 ఏళ్లే కావడం విశేషం. వీరిద్దరే ఈసారి అత్యంత పిన్నవయసు్కలైన ఎంపీలుగా రికార్డు సృష్టించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి టి.ఆర్.బాలు సులువుగా నెగ్గారు. 82 ఏళ్ల టి.ఆర్.బాలు ఈ ఎన్నికల్లో అత్యంత వృద్ధుడైన ఎంపీగా రికార్డుకెక్కారు. -
పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
సాక్షి, అమరావతి: ఎన్నికల రోజు ఉదయం నుంచి సాయంత్రం 7గంటల వరకు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్‌పై మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలు ఫిర్యాదు చేసినా జిల్లా ఎస్పీ బేఖాతర్ చేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను గురువారం కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచకాలు, హింసపై ఈసీ సరైన రీతిలో స్పందించకుంటే హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయన్నారు.ఈ అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిందని, 60కి పైగా కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని కోరామన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారిపై టీడీపీ మూకలు దాడులకు తెగబడటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదన్నారు. ఎన్నికల ముందు పోలీస్ అధికారులను ఈసీ ఆకస్మికంగా బదిలీ చేయడంతో హింస చెలరేగిందని చెప్పారు. దీనికి బీజేపీ, టీడీపీ, ఈసీ పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. టీడీపీ గూండాలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బదిలీలతో చెలరేగిన హింస.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి ముందుగానే ఈసీ దృష్టికి తెచ్చామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా తగిన భద్రత కలి్పంచాలని కోరామన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో టీడీపీ బరి తెగించి రిగ్గింగ్, దాడులకు తెగబడిందన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో ఈసీ అధికారులను బదిలీ చేసిన చోట్ల హింస చెలరేగిందన్నారు. రిగ్గింగ్, ఓటర్లను బెదిరించడం, బూత్‌ల క్యాప్చరింగ్ తదితరాలపై పోలింగ్ రోజే టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.16 నియోజకవర్గాలకు సంబంధించి 60 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ జరపాలని కోరామన్నారు. రీ పోలింగ్ కోరుతున్న బూత్‌లలో లైవ్ వెబ్ క్యాస్టింగ్ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పాల్వాయి గేట్, తుమృకోట, చింతపల్లి, ఒప్పిచర్ల, జెట్టిపాలెం, వెల్దుర్తిలో టీడీపీ విధ్వంసకాండపై ఈసీకి పోలింగ్ రోజే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పారు. వీడియో ఫుటేజీల ఆధారంగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, ఇతర అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి, పానుగంటి చైతన్య పాల్గొన్నారు. -
ఎస్పీ కి వైఎస్ఆర్సీపీ నేతల విజ్ఞప్తి
-
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
సాక్షి, విజయవాడ: వివాదాస్పద ఎస్పీలపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అభియోగాలపై నోటీసులు జారీ చేసింది. ఈసీ సస్పెండ్ చేసిన ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్, బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్‌కు నోటీసులు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల లో ఎస్పీల వైఫల్యం, పాత్రపై విచారణ జరగనుంది. ఎస్పీల వివరణ ఆనంతరం నేరుగా విచారించే అవకాశం ఉంది.ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. -
ఈసీ సీరియస్..కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
-
టీడీపీ అరాచకం.. తలలు పగిలినా, ఎస్పీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్
-
బీజేపీలో సస్పెన్స్.. బ్రిజ్ భూషణ్‌కు టికెట్ దక్కేనా?
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. మరోవైపు మొదటి దశ పోలీంగ్ సైతం సమీపిస్తోంది. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేస్తోంది. యూపీలో కీలకమైన ఈ రెండు స్థానాలు.. వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్, రాయ్‌బరేలీ. ఈ రెండు స్థానాలకు మే 20 పోలింగ్ జరగనుంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ మే 3. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ.. మోదీ హవా కొనసాగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే ఆమె ప్రస్తుతం రాజాస్తాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పార్టీ ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతోంది’ అని కాంగ్రెస్ నేత మనీష్ హిందవి తెలిపారు. బీజేపీ నిర్ణయంపై మిగతా పార్టీలు.. కైసర్‌గంజ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళ రెజ్లర్ల చేసిన లైగింక వేధింపుల ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో రెజ్లర్ల సమాఖ్యకు కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే 2019లో ఇక్కడ ఆయన సుమారు 2,60,000 మెజార్టీతో విజయం సాధించారు. కైసర్‌గంజ్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ కాకుండా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సైతం తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి నిర్ణయంపై మిగతా పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్‌భూషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు బ్రిజ్‌భూషన్ బీజేపీ బహిష్కరించింది. అనంతరం ఆయన ఎస్పీలో చేరారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు. ఎస్పీలో సందిగ్ధం.. ‘కైసర్‌గంజ్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం. ఇక్కడ ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం. ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని బహ్రైచ్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు రామ్ వర్ష యాదవ్ తెలిపారు. మరోవైపు.. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఎస్పీ కూడా సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కైసర్‌గంజ్ టికెట్ బ్రిజ్ భూషణ్‌కు దక్కేనా..? బీజేపీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బహ్రైచ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ పాండే స్పష్టం చేశారు. బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరిస్తే మళ్లీ ఆయన ఎస్పీలోకి పార్టీ మారుతారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. హర్యానా, పశ్చిమ యూపీలో కీలకమైన జాట్ సాజికవర్గంలో రెజ్లర్లపై వేధింపుల విషయంలో బ్రిజ్‌భూషన్‌పై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉన్న మొత్తం ఓటర్లలో జాట్లు నాలుగింట ఒక వంతు ఉన్నారని ఓ బీజేపీ నేత తెలిపారు. ఇక.. ఏప్రిల్ 19, 26 తేదీల్లో లోక్‌సభకు పోలింగ్ జరగనున్న పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో జాట్లు ఉన్నారు. అయితే వారిని దూరం చేసుకోడాన్ని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
‘వారి అదృష్టం కొన్ని గంటలే’.. మరోసారి ఎస్పీ అభ్యర్థుల మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్‌పట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్’లో షేర్ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్ సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్‌పై సమాజ్‌వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్‌సింగ్‌ను పోటీకి నిలబెట్టింది. పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్ ప్రధాన్ ‘ఎక్స్’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్పట్లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్‌పాల్ శర్మను బరిలోకి దింపింది. ప్రత్యర్థుల విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. -
3 జిల్లాల ఎస్పీలు వివరణ ఇచ్చారు
సాక్షి, అమరావతి: నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో జరిగిన హత్యలు, పల్నాడు జిల్లాలో కారు దహనంపై ఆ మూడు జిల్లాల ఎస్పీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వివరణ ఇచ్చారు. సీఈవో మీనా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీరా రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలోని సీఈవో కార్యాలయానికి వచ్చారు. అక్కడ సీఈవో ముఖేష్ కుమార్ మీనా, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ ఎదుట హాజరై ఆ సంఘటనలకు దారి తీసిన పరిస్థితులు, అనంతరం తాము చేపట్టిన చర్యలపై నివేదికలు అందజేశారు. అనంతరం సీఈవో మీనా విలేకరులతో మాట్లాడుతూ గిద్దలూరులో జరిగినది రాజకీయ హింసేనని ఎస్పీ నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆళ్లగడ్డలో జరిగిన హత్య కుటుంబ కక్షల వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ వివరించారన్నారు. మాచర్లలో రెండు వర్గాల ఘర్షణ సందర్భంగా కారు దహనం జరిగిందని, గురువారం రాత్రిలోగా నిందితులను అరెస్ట్ చేస్తామని పల్నాడు ఎస్పీ చెప్పినట్లు తెలిపారు. ఎస్పీలు ఇచ్చిన నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, రీపోలింగ్ లేకుండా నిర్వహించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయ హింసను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చెక్కులు పంపిణీ చేస్తే కోడ్ ఉల్లంఘనే నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరినట్లు మీనా తెలిపారు. డబ్బులు పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చేపట్టిన పరామర్శ యాత్ర కొనసాగించవచ్చని, కానీ చెక్కులు పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరిందని మీనా తెలిపారు. ఈ సభలో భద్రత వైఫల్యంపై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సభలో జరిగిన సంఘటనలపై వాస్తవాలను సమర్పించాలని ఈసీ కోరిందని, త్వరలోనే పూర్తి వివరాలను తెప్పించుకొని నివేదిక పంపుతామని తెలిపారు. -
యూపీలో రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ
ఉత్తరప్రదేశ్‌లో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజ్ వాది(ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వీరిలో ఎస్పీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు రాకేశ్ పాండే, అభయ్ సింగ్, రాకేష్ ప్రతాప్ సింగ్, మనోజ్ పాండే, వినోద్ చతుర్వేది, మహారాజీ ప్రజాపతి, పూజా పాల్, పల్లవి పటేల్ ఉన్నారు. దీంతో ఎస్పీలో చీలికలు వచ్చాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే కొన్ని కారణాలతో ఈ ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేకపోయారని, ఈ విషయాన్ని ముందుగానే పార్టీ అధిష్టానానికి తెలియజేశామని ఎస్పీ నేతలు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా నేడు (మంగళవారం) జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. మరోవైపు బీజేపీ దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేలకు లోక్ భవన్ ఆడిటోరియంలో శిక్షణ సమావేశాన్ని నిర్వహించింది. సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేశారు. బీజేపీ ఓటింగ్ శిక్షణ సమావేశానికి మిత్రపక్షాలైన అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ, సుభాఎస్పీ నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సరైన ఓటింగ్ విధానాన్ని అధికారులు వారికి వివరించారు. -
ఇండియా కూటమి..యూపీలో పొత్తుకు బ్రేక్ ?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమికి బీటలు వారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఇచ్చే స్థానాలపై సమాజ్‌వాద్ పార్టీ కొంత కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రెండు పార్టీల నేతల మధ్య జరిగిన సీట్ షేరింగ్ చర్చల్లో మొరాదాబాద్ డివిజన్లోని మూడు సీట్లపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం. ఈ మూడు సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేది లేదని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హస్తం పార్టీ నేతలకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. కాగా, సీట్ల పంపిణీ విషయంలో రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగే వరకు రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేది లేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర యూపీలోనే కొనసాగతున్న విషయం తెలిసిందే. మరోవైపు పొత్తులో భాగంగా రాష్ట్రంలో మొత్తంగా 17 సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అఖిలేశ్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం -
YSR: ఆ కంటైనర్లలో అసలు ఏముందంటే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
కాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సీఎం రేవంత్ భేటీ
-
AP: రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ
సాక్షి, విజయవాడ: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రెండో రోజు సీఈసీ బృందం సమావేశం కొనసాగుతోంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష జరుపుతోంది. మొదటి రోజు ఎన్నికల సన్నద్దతపై 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేడు సీఈసీ బృందానికి ఎన్నికల సన్నద్దతపై నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంత, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, రీపోలింగ్ కేంద్రాల పరిస్ధితి, భద్రతా చర్యలు, బందోబస్తు తదితర వాటిపై సమీక్ష చేయనున్నారు. చెక్ పోస్టులు.. తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. సమస్యాత్మక.. సున్నిత ప్రాంతాల్లో భద్రతాపై సమీక్ష చేపట్టారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని తొలి రోజు సమావేశంలో సీఈసీ బృందం హెచ్చరించింది. రాజకీయ పార్టీల ఫిర్యాదులపైనా సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం.. బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై వివరాలు తెలుసుకుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీలతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది. -
‘ప్రసాద్ తల్లిని కూడా హత్య చేయాలనుకున్నారు’
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురు హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఆమె మంగళవారం కేసు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతానికి తీసకువెళ్లి హత్య చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసు నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత్‌తో పాటు గుగులోతు విష్ణు, బానోతు వంశీ, వడ్డమ్మ, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 29 రోజు ప్రసాద్‌ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. ఈ హత్యలు చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు చెప్పారు. ఆ ఫొన్లు కూడా మృతి చెందినవారివిగా గుర్తించామని అన్నారు. వారి ప్రణాళిక ప్రకారం ప్రసాద్ వాళ్ల అమ్మను కూడా హత్య చేయాలనుకున్నారని తెలిపారు. ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రథమిక విచారణ అన్నారు. ఈ కేసులో అన్నివైపుల నుంచి లోతుగా తదుపరి దర్యాప్తు కొనస్తామని తెలిపారు. చదవండి: ఇంటిపై కన్నేసి ఇంటిల్లిపాదినీ బలిగొన్న స్నేహితుడు -
ఎస్పీని బదిలీ చేయాలని బీఎస్పీ పట్టు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎస్పీ సురేశ్‌కుమార్‌ను బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పట్టుబట్టడం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మూడురోజుల క్రితం ఆర్ఎస్పీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సురేశ్‌కుమార్ ఎస్పీగా కొనసాగితే జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ ప్రెస్‌మీట్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ ఐపీఎస్ అధికారి.. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారిపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో అటు పోలీస్‌శాఖ, రాజకీయ, వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఎస్పీ సురేశ్‌కుమార్ స్పందిస్తూ.. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను తాను సన్మానించిన ఫొటోలు పాతవని, షెడ్యూల్ విడుదలయ్యాక పక్కాగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్నట్లు ఎస్పీ సురేశ్‌కుమార్ వివరించారు. అయితే బీఎస్పీ మాత్రం అందుకు సంతృప్తి చెందక ఎస్పీని బదిలీ చేయాలంటూ పట్టుబడుతోంది. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అధికారవర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆరా? ఎస్పీని బదిలీ చేయాలని ఫిర్యాదు రావడం, అందులో కొన్ని ఆధారాలు కమిషన్‌కు ఇవ్వడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. అలాగే రాష్ట్ర పోలీస్‌శాఖ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటికే సమాచారం తీసుకుంది. ఈ ఫిర్యాదులో వాస్తవమెంత? అనే కోణంలో ఆధారాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సిర్పూర్ ఎమ్మెల్యేగా బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్పై రాజకీయ కోణంతో పాటు ఇతర కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్షణం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ష న్ కమిషన్ అధీనంలోనే పని చేయాల్సి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌తో పాటు ఎస్పీ కూడా కమిషన్ ఆదేశాలు పాటించాల్సిందే. బదిలీలు, ఇతర చర్యలు తీసుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్‌లు అధికార పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పది మంది ఐపీఎస్‌లు, నలుగురు కలెక్టర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తప్పించి బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో వేరే అధికారులను నియమించింది. ఈ క్రమంలో జిల్లాలో ఎస్పీ పైనా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ జిల్లా ప్రజల్లో నెలకొంది. -
నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ కసరత్తు.. హైదరాబాద్ సీపీ రేసులో ఉన్నది వీరే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఈ క్రమంలో నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ అంజనీకుమార్ కసరత్తు ప్రారంభించారు. సీఈసీకి పంపే లిస్ట్‌ను డీజీపీ సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ రేసులో మహేష్ భగవత్, షికా గోయల్, శివధర్‌రెడ్డి, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి, సజ్జనార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముగ్గురి పేర్లతో సీఈసీకి ప్రభుత్వం లిస్ట్ పంపనుంది. ప్రతి పోస్టుకు ముగ్గురు పేర్లతో జాబితాను ప్రభుత్వం పంపనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఆయా పోస్టుల్లో ఈసీ ఎంపిక చేయనుంది. రాష్ట్ర సర్కార్ పంపిన ముగ్గురి జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే ఈసీ తిరస్కరించే అవకాశం ఉంది. మళ్లీ కొత్తగా పేర్లు ప్రతిపాదన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరనుంది. ఈసీ ఫైనల్ చేసిన తర్వాత ఆయా నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. -
ఎస్పీ రమణకుమార్ బదిలీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్పీ ఎం.రమణకుమార్‌కు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11 మంది నాన్‌క్యాడర్ ఐపీఎస్‌లను బదిలీ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఆయనకు బదిలీ అయ్యింది. 2021 జూలై 30 ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సుమారు రెండేళ్ల మూడు నెలలపాటు విధులు నిర్వర్తించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు జారీకి ముందు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించింది. కీలకమైన శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఈసీ ఉన్నతాధికారులు రాష్ట్రంలో కీలక పదవుల్లో నాన్‌కేడర్ అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాగా ఉన్నతాధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అడిషనల్ ఎస్పీ అశోక్‌కు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది. -
‘అనంత’లో పనిచేయడం గొప్ప అనుభూతి
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జిల్లాలో తక్కువ కాలం పని చేసినా.. తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని, ఇది మరువలేనిదని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయిన ఆయనకు బుధవారం పోలీసు పరేడ్ మైదానంలో ఏఆర్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పోలీసు క్వార్టర్సులో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలు, సిబ్బంది చూపించిన ప్రేమాభిమానాలను మరువలేనన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తాను పని చేసినా ఎక్కడా ఇంతటి సంతృప్తికరమైన విధులను చూడలేదన్నారు. నేరాలను ఛేదించే క్రమంలో పనిని సవాళుగా తీసుకోవడం, టీమ్ వర్క్ చేయడం లాంటి అనేక అంశాల్లో సిబ్బంది చూపిన ఆత్మస్థైర్యం స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. అనంత వాసుల్లో మానవత్వం ఎక్కువగా ఉందన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ రోడ్డు ప్రమాద సమయంలో అనిత ఆరోగ్యంపై అనంత వాసులు స్పందించిన తీరును కొనియాడారు. కష్టం ఎవరికి వచ్చినా కరిగిపోయి ఆపన్న హస్తాలందించే వ్యక్తిత్వం అనంత వాసుల సొంతమన్నారు. మంచి వాతావరణంలో పని చేశానన్నా సంతృఫ్తితో వెళుతున్నానన్నారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఆయన కుటుంబసభ్యులు, సెబ్ అదనపు ఎస్పీ జి.రామకృష్ణ, డీఎస్పీలు శ్రీనివాసులు, గంగయ్య, నర్శింగప్ప, శివారెడ్డి, మునిరాజ్, జి. ప్రసాద్‌రెడ్డి, సీఐలు జాకీర్ హుస్సేన్, ఇందిర, విశ్వనాథచౌదరి, దేవానంద్, రెడ్డప్ప, శివరాముడు, ధరణీకిషోర్, ప్రతాప్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, నాగార్జునరెడ్డి, ఆర్ఐలు హరికృష్ణ, రాముడు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్థన్‌రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు పాల్గొన్నారు. -
Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్ గుండేటిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకస్మికంగా జరిగిన ఎస్పీ బదిలీపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించగా.. ఊహించని విధంగా బదిలీ కావడానికి ‘రేఖా నాయక్ ఎఫెక్ట్’ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ Ajmeera Rekha Nayak ఎస్పీకి స్వయాన బిడ్డను ఇచ్చిన అత్తగారు. ఈసారి ఆమెకు టికెట్ రాకపోగా, ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖా నాయక్‌పై కోపంతో ఆమె అల్లుడిని ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతానని ప్రకటించిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం
సాక్షి, మహబూబాబాద్: జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్‌ను బదిలీపై జిల్లాకు పంపారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక బదిలీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. 2021 డిసెంబర్ 26న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ.. ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా 20 నెలల్లో బదిలీ కావడం.. దీని వెనుక ఏం జరిగింది అనేది అటు అధికారులు.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఆకస్మిక బదిలీతో షాక్.. జిల్లా పోలీస్‌బాస్ ఆకస్మిక బదిలీతో ఆశాఖ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదు. దీంతో ఆయన ఎన్నికల వరకు ఉంటారని అందరు భావించారు. అయితే కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయ పరిణామాలే ఆయన బదిలీకి కారణం అని కొందరు చెబుతుండగా.. ఎస్పీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ తీసుకున్న నిర్ణయం అని మరికొందరు చెబుతున్నారు. కుటుంబ రాజకీయ పరిణామాలే కారణమైతే ఎస్పీ బదిలీతోనే ఆగిపోతుంది. అలా కాకుంటే ఎస్పీతో పాటు మరికొందరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని పలువురు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్పీ బదిలీ వార్తతో ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులు మాత్రం ఆందోళనగానే ఉన్నట్లు సమాచారం. ఆ కోపమేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తన బిడ్డను ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం లేదు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీంతో ఆమె మనస్తాపం చెందిగా.. భర్త శ్యాం నాయక్ ఉద్యోగం వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమేరకు నేడో రేపో రేఖానాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమె పార్టీ మారకుండా ఉండేందుకు పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రేఖానాయక్‌పై కోపంతో ఆమె అల్లుడు ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు మానుకోటలో ప్రచారం జరుగుతోంది. -
పుంగనూరు కేసులో అదే కీలకాధారం: చిత్తూరు ఎస్సీ
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో పోలీసులపై దాడి కేసుకు సంబంధించిన 500 మంది నిందితులను గుర్తించామని.. వీళ్లలో 92 మందికి ఇప్పటివరకు అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు వివరాలను సాక్షికి తెలిపారాయన. ‘‘ఫ్రీ ప్లాన్ గా పోలీసులపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పీఏ గోవర్ధన్ రెడ్డి, డ్రైవర్ నరీన్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో అంగీకరించారు. ఈ కేసులో ఇదే కీలక ఆధారం. వీడియో పుటేజి ఆధారంగా మొత్తం 500 మంది నిందితులను గుర్తించాం, ఇప్పటి వరకు 92 మందిని అరెస్ట్ చేశాం, 408 మందిని ట్రేస్ చేయాల్సి ఉంది. ‘‘ఈనెల 1వ తేదీ నాడు పోలీసులు పై దాడికి ప్లాన్ చేశారు, ముందుగా సమావేశం అయ్యారు. అనుకున్న విధంగా ఈనెల 4వ తేదీన దాడి చేశారు,విధ్వంసం సృష్టించారు. పక్కాగా ప్రీ ప్లాన్డ్‌గానే ఈ దాడి చేశారు. నిందితులిద్దరూ రిమాండ్ రిపోర్ట్‌లో ఈ విషయాన్నే అంగీకరించారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు దక్షిణాది రాష్ట్రాల్లో లొకేషన్స్ మారుస్తున్నారు. అయినా అతిత్వరలో అరెస్ట్ చేస్తాం. చల్లా బాబు హైకోర్టు లో బెయిల్ కోసం అప్లై చేస్తే.. న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం అని ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: పవన్‌పై క్రిమినల్ కేసులో కీలక పరిణామం -
మణిపూర్ హింస: సీబీఐ దర్యాప్తు బృందంలో 29 మంది మహిళా అధికారులు
మణిపూర్ అల్లర్లలో వెలుగుచూసిన లైంగిక హింస వీడియో కేసును సీబీఐకి కేంద్రం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించడానికి సీబీఐ దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్ల నుంచి 53 మంది అధికారులను నియమించింది. వీరిలో 29 మంది మహిళా అధికారులు ఉన్నారు. ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్, నిర్మలాదేవి, మోహిత్ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్వీర్ సైతం ఉన్నారు. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్‌లు 53 మంది సభ్యుల బృందంలో ఉన్నారు. వీరంతా మొత్తం దర్యాప్తును జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు తమ నివేదికను నివేదించనున్నారు. కాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో మహిళా అధికారులను తీసుకోవడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలకు సంబంధించినవని, వీటిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే ఇలాంటి కేసుల్లో డీఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండటం సాధ్యం కానందున దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ ముగ్గురు డీఐజీలను ఒక ఎస్పీని నియమించినట్లు పేర్కొన్నారు. చదవండి: మధ్యప్రదేశ్‌లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్ ఈ బృందంలో 16 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులను సీబీఐకి అప్పగించాల్సి వస్తే సిబ్బందిని సమకూర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సంబంధిత రాష్ట్రంపై ఆధారపడి ఉంటుందని, అయితే కానీ మణిపూర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇరు వర్గాల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా ఉందేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు కేసులో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి. మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో సంస్థ విచారించనున్న మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.ఈ కేసులో కాకుండా మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన మరే ఇతర కేసులను కూడా ప్రాధాన్యత ఆధారంగా విచారిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మార్చి 3న మణిపూర్ హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.మే 4న కుకి జాతికి చెందిన ఓ గ్రామంపై దాడి చేసిన దుండగులు.. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి, ఊరేగించారు. ఓ ఫేక్ వీడియోను చూసి, కోపంతో ఈ దారుణానికి ఒడిగనట్టు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జులై 26 వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం.. -
లైగింక వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు
తిరువళ్లూరు: ఉన్నత ఉద్యోగుల నుంచి తరచూ ఎదురవుతున్న లైగింక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాధిత యువతులు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా తొడుగాడు గ్రామంలో కార్లకు బ్రేక్, తాళం తయారు చేసే సంస్థ ఉంది. ఈ సంస్థకు దక్షణ కొరియాకు చెందిన కియాంగ్ జూ లీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఽహేమావతి, ధనశేఖర్ తదితరులు మేనేజర్లుగా పని చేస్తున్నారు. కంపెనీలో సుమారు 100 మంది యువతులు పని చేస్తున్నారు. కాగా కంపెనీలో పని చేసే యువతులకు కియాంగ్ జూలీ తరచూ లైగింక వేధింపులకు గురి చేస్తున్నాడని యువతులు వాపోయారు. వేధింపులపై ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అనంతరం అదనపు ఎస్పీ మీనాక్షికి వినతి పత్రం సమర్పించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
వేటాడి.. వెంటాడి..
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): పన్నెండేళ్ల బాలికకు తీరని అన్యాయం.. కొంతమంది మోసగాళ్ల చేతికి చిక్కి వ్యభిచార కూపంలో మగ్గిపోయింది.. ఆఖరుకు ఎలాగో తప్పించుకుని ఒక మహిళా అధికారి వద్దకు చేరుకుంది. బాలిక పట్ల మృగాళ్లు వ్యవహరించిన తీరు.. పలువురు మహిళలు చేయించిన అఘాయిత్యాలను చూసిన ఆ అధికారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎలాగైనా సరే నిందితులకు శిక్షలు పడేదాక విశ్రమించకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో చూపిన ప్రతిభకు గాను గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కొర్లకుంట సుప్రజకు కేంద్ర ప్రభుత్వం ‘సెంట్రల్ హోం మినిస్టర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్’ అవార్డును ప్రకటించింది. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన కేసు విచారణ బాధ్యతలను అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఉన్న ప్రస్తుత ఏఎస్పీ కె.సుప్రజకు అప్పగించారు. అన్నీ తానై ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వయంగా విచారణ జరిపారు. తన నాలుగు నెలల పసిబిడ్డను తీసుకుని.. ఆఖరుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనంలోనే ఆ చిన్నారికి ఊయల కట్టి వెళ్లిన పరిస్థితులున్నాయి. కేసులో వ్యభిచారం చేయించిన నిర్వాహకులు, వ్యభిచారానికి పాల్పడిన 80 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందాక సైతం ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజతోనే విచారణ చేయించాలని కోర్టు ఆదేశించటంతో పాటు, కేసులో భారీ పురోగతి సాధించిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఈ కేసులో సుమారు 500 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. మరో బాలికకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్న పట్టుదలతో ఉన్నతాధికారుల సహకారంతో విచారణ చేసినట్టు ఏఎస్పీ సుప్రజ చెప్పారు. -
గాంధీనగర్ ఎస్పీగా తెలుగు యువకుడు
డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ: గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఎస్పీగా మన తెలుగువాడు నియమితుడు కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మామిడికుదురు మండలం పెదపట్నంలంకకు చెందిన వాసంశెట్టి రవితేజను గాంధీనగర్ ఎస్పీగా నియమించారు. రవితేజ సోమవారం బాధ్యతలు స్వీకరిస్తాడని అతని తండ్రి వాసంశెట్టి నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. రవితేజ తండ్రి నాగేశ్వరరావు, తల్లి మల్లికాదేవి తెలంగాణ హైకోర్టు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. 2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవితేజ విధి నిర్వహణలో ఉత్తమ సేవలకు గాను గతంలో డిప్యూటీ సీఎం నవీన్ పటేల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ పోలీస్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. అక్కడ పని చేస్తూ ఎస్పీగా పదోన్నతి పొందారు. -
అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు
కేబీసీ కరోడ్‌పతి రవి మోహన్ సైనీ గుర్తున్నారా. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన టాప్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి టెలివిజన్ షో 2001లో రవి పెద్ద నేషనల్ సెన్సేషన్. కేవలం 14 సంవత్సరాలకే కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్ని రవి మోహన్ సైనీ గెలుచుకున్నారు.15 కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అప్పట్లో పెద్ద సంచలనం రేపాడు. అంతేనా దయాగాడి దండయాత్ర అన్నట్టు రవి విజయ పరంపర ఆగిపోలేదు. కేబీసీ జూనియర్ విజేత మాత్రమే కాదు, ఆ తరువాత డాక్టర్ అయ్యాడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్‌గా ఆ తర్వాత వార్తల్లో నిలిచాడు. 20 ఏళ్ల తర్వాత 34 ఏళ్ల వయసులో 2021లో గుజరాత్లో పోరుబందర్‌కి ఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఊహించని విజయాలతో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న రవిసైనీ విజయగాథ ఇది. కేబీసీ నాటికి రవి 10వ తరగతి చదువుతున్నాడు. మెగాస్టార్ అబితాబ్‌ని కలవాలన్న కలతో పాటు షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని తానే ఒక స్టార్‌గా నిలిచాడు. అప్పటికే మంచి విద్యార్థి ,ఎప్పుడూ టాపర్ అయిన రవిలో ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జైపూర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రవి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఎలాంటి కోచింగూ తీసుకోకపోవడం మరో విశేషం. (టీసీఎస్‌లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!) 2012 లో మెయిన్స్‌ను క్లియర్ చేయలేకపోయాడు. దీంతో 2013లో, భారత తపాలా శాఖ ఖాతాలు, ఆర్థిక సేవలకు ఎంపికయ్యాడు. ఆ తరువాత మెడికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే 2014లో, ఆల్ ఇండియా ర్యాంక్ 461తో అర్హత సాధించాడు. తండ్రి నేవీ అధికారి స్ఫూర్తితోనే ఐపీఎస్‌లో చేరానంటారు ఎస్పీ డా. రవి మోహన్ సైనీ. પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્વારા વાવાઝોડાથી સંભવિત નુકશાન થઈ શકે તેવા હાર્બર મરીન અને સુભાષ નગર જેટી વિસ્તારની મુલાકાત લઈ નાગરિકો અને સ્ટાફને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.@GujaratPolice@dgpgujarat@sanghaviharsh@Harsh_office @CMOGuj@Igp_jnd_range pic.twitter.com/pNSqC2Oh84 — SP Porbandar (@SP_Porbandar) June 13, 2023 మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
పుష్పారెడ్డికి నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా, ట్రాపిక్, అడ్మిన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేస్తున్న కర్రి పుష్పారెడ్డికి శుక్రవారం ప్రభుత్వం నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. 2012 గ్రూప్–1 బ్యాచ్‌కి చెందిన పుష్పారెడ్డి 2014 నుంచి హైదరాబాద్ సీఐడీ, సైబర్ క్రైమ్ డీఎస్పీగా, 2018లో కల్వకుర్తి డీఎస్పీగా, 2019 నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2020లో సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేశారు. ఈ మేరకు పుష్పారెడ్డికి సీపీ రంగనాథ్‌తోపాటు పలువురు పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. -
తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవు
-
తనకంటే ముందే పూలమాల వేయడంపై ఎమ్మెల్యే కంచర్ల అభ్యంతరం
-
భూమి కబ్జాచేసి చంపేస్తామంటున్నారు.. పరిటాల శ్రీరామ్ నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): తెలుగుదేశం నాయకుడు పరిటాల శ్రీరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చెరుకూరి వెంకటరాముడు సోమవారం ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేయడమేగాక దాన్ని రాసి ఇవ్వమంటున్నారని, లేకపోతే చంపేస్తామని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని తెలిపారు. పరిటాల సునీత కబ్జాచేసిన తన భూమిని తనకు ఇప్పించాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ‘నా ఆస్తిని కబ్జా చేశారు. నన్ను కిడ్నాప్ చేశారు. ఆ ఆస్తి రాసిస్తాననడంతో వదిలేశారు. కానీ తర్వాత నేను నా ఆస్తి ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో నన్ను హత్యచేసేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అండతోనే ఆయన అనుచరులు ఇలా చేస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలి..’ అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో ఆయన ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి రెవెన్యూ లో 141–2 సర్వే నంబరులో 9.81 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి 1930 సంవత్సరం ముందు నుంచి వెంకటరాముడు పూర్వీకుల పేరిట ఉంది. తర్వాత మూడు భాగాలుగా పంచుకున్నారు. అందులో మూడోవంతు.. అంటే 3.27 ఎకరాలు చెరుకూరి వెంకటరాముడుకు దక్కింది. అందులో 1.63 ఎకరాలను ఆయన ఇతరులకు విక్రయించారు. మిగిలిన 1.64 ఎకరాల భూమిని తమకు రాసివ్వాలంటూ పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం 9.81 ఎకరాల భూమి ఇంకా సబ్ డివిజన్లు కాకపోవడంతో మొత్తం భూమిపై పరిటాల కుటుంబం కన్నేసింది.. అని వెంకటరాముడు పేర్కొన్నారు. గత నెల 17న కిడ్నాప్ భూమి విషయమై గత నెల 17వ తేదీన ధర్మవరంలో ఉన్న వెంకటరాముడును కిడ్నాప్ చేశారు. పరిటాల అనుచరులు దాదా ఖలందర్, చింతలపల్లి మహేశ్‌నాయుడు, ఎల్.నారాయణచౌదరి, లిక్కర్ సుధాకర్‌నాయుడు ప్రోద్బలంతో కుంటిమద్ది అక్కులప్ప తన గ్యాంగ్‌తో వచ్చి కిడ్నాప్ చేసినట్లు అప్పట్లోనే వెంకట రాముడు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లి తనను తీవ్రంగా కొట్టారని, వారు కోరుకున్నట్లుగా భూమి రాసిస్తానని చెప్పిన తర్వాత అదేరోజు సాయంత్రం ప్రాణాలతో వదిలారని ఆ ఫిర్యాదులో తెలిపారు. చదవండి: టీడీపీ ‘సామాజిక’ చిచ్చు -
శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ జాషువా
-
గన్నవరంలో 144 సెక్షన్.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు:ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జూషువా తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి.. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురి గొల్పడం, బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఈ ఘటనలో గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. 'పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. సుమోటోగా రియటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ జాషువా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. చదవండి: గన్నవరం రణరంగం.. ఎమ్మెల్యే వంశీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు -
వీరసింహరెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరణ వార్తల్లో నిజం లేదు
-
జనాన్ని ఎక్కువ సేపు నిలబెట్టిన కారణంగానే తొక్కిసలాట : జిల్లా ఎస్పీ
-
కందుకూరు సంఘటన దురదృష్టకరం : నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
-
మాచర్లలో పథకం ప్రకారం రెచ్చిపోయిన టీడీపీ ముఠా
-
ఎస్పీ చెంతకు ఎలుక పంచాయితీ..ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: కర్రీ పాయింట్లో కొనుగోలు చేసిన పప్పులో ఎలుక వచ్చిందని ప్రశ్నించిన పాపానికి తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను బాధితులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురం నగరంలోని కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే ఊటకూరి దుర్గాంజలి దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2.56 గంటలకు దుర్గాంజలి... ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్లో రూ.30 చెల్లించి పప్పు, రూ.20 చెల్లించి చెట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లి అన్నంలోకి పప్పు వేసుకోగా అందులో చచ్చిన ఎలుక వచ్చింది. వెంటనే ఆ ప్లేటును తీసుకెళ్లి కర్రీపాయింట్ నిర్వహిస్తున్న యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అది చూసిన వారు హోటల్లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు పడడం సర్వ సాధారణమంటూ సమాధానం ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో కక్షకట్టిన ముత్యాలరెడ్డి కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు) -
20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇటీవల ప్రభుత్వం 20 మంది పోలీసు అధికారులకు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ప్యానల్‌ను ఆమోదించింది. వారికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా పోస్టింగులు ఇవ్వడంతోపాటు మరో ఎస్పీని బదిలీ చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్‌గుప్తా బుధవారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ అయిన 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల జాబితా ఇదీ.. (1) బి.లక్ష్మీనారాయణ.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (2) కేఎం మహేశ్వరరాజు.. ఎస్పీ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో), పల్నాడు జిల్లా, (3)ఎ.సురేశ్‌బాబు.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (4)కె.శ్రీనివాసరావు.. డీసీపీ(ట్రాఫిక్), విజయవాడ (5) కె.శ్రీధర్.. ఎస్పీ(ఎస్ఐబీ), (6) కె.తిరుమలేశ్వరరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (7) ఎం.సత్తిబాబు.. డీసీపీ, విజయవాడ, (8) ఎంవీ మాధవరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (9) జె.రామమోహన్‌రావు.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ, (10) ఎన్.శ్రీదేవిరావు.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (11) ఇ.అశోక్‌కుమార్.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (12) ఎ.రమాదేవి.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ (13)కేజీవీ సరిత.. ఎస్పీ, సీఐడీ (14) కె.ఆనందరెడ్డి.. డీసీపీ, విశాఖపట్నం (15) కె.చక్రవర్తి.. ఎస్పీ, ఆర్ఎస్ఏఎస్టీఎఫ్, తిరుపతి (16) కె.ఈశ్వరరావు.. ఏడీసీ, గవర్నర్ (17) కె.చౌడేశ్వరి.. ఎస్ఆర్పీ, గుంతకల్(18) ఇ.సుప్రజ.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ(19) కేవీ శ్రీనివాసరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్, (20) కె.లావణ్యలక్ష్మి.. ఎస్పీ, ట్రాన్స్‌కో (21) ఎం.సుందరరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్ -
గది ఖాళీ చేయమంటే.. చంపుతామంటున్నారు
సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలోని నందినీ హోటల్ ఎదురుగా ఉన్న జేసీ ట్రావెల్స్ గదిని ఖాళీ చేయకుండా తమను తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి బెదిరిస్తున్నారని మల్లికార్జున ఆచారి దంపతులు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌కు హాజరైన వారు తమ ఆవేదనను ఎస్పీకి విన్నవించుకున్నారు. గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి పిటీషన్లు స్వీకరిస్తున్న ఎస్పీ తమ షాపును 2000లో బాబాయ్య అనే వ్యక్తికి బాడుగకు ఇచ్చామని, అయితే తమ నుంచి అద్దెకు తీసుకొని అతను షాపును తాడిపత్రి జేసీ ట్రావెల్స్‌కు అద్దెకు ఇచ్చాడన్నారు. ఇప్పుడు వారిద్దరు కుమ్మక్కై నాకు బాడుగ ఇవ్వకుండా ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని తెలిపారు. నేరుగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలిశామని, స్పందించాల్సిన పెద్దమనిషి బెదిరించారన్నారు. షాపు పగల గొడతా, మర్డర్ చేస్తానన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానిక కమలానగరులో ఇండిపెండెంట్ బిజినెస్ కన్సల్టర్ సెంటర్ (ఐబీసీసీ) పేరుతో పేద విద్యార్థులకు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మతి హనుమంతురెడ్డి, ఏపీఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 97 మంది నుంచి ఎస్పీ పిటీషన్లు స్వీకరించారు. అనంతం ఎస్పీ మాట్లాడుతూ ఆస్తులు కాజేయడం, కబ్జాలకు తెగబడటం, డబ్బు ఆశ చూసి చీటింగ్‌కు పాల్పడటం వంటి మోసాలకు పాల్పడివారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వంచకులపై ఫిర్యాదులు అందితే తాట తీస్తామని హెచ్చరించారు. చదవండి: (మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో..) -
బాహుబలి సినిమాలో మాదిరి ఈ స్టేజ్ కదలాలా..బీటలు వారాలా!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నినాదం వివాదంగా మారింది. ‘జయహో జగదీశన్న’అంటూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని పొగిడి విద్యార్థులచే నినాదాలు చేయించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అంతకుముందు పట్టణంలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘మంత్రి జగదీశ్‌రెడ్డికి జై జై.. ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు ఈతరం మంత్రికి రుణపడి ఉండాలి. మీ అందరికీ ఆకలవుతుందా.. ఆకలేస్తే కేకలు వేయాలన్నారు శ్రీశ్రీ.. అది అందరికీ గుర్తుందా.. అయితే ఇలా నినాదాలు చేయండి.. జయహో జగదీశన్న’అంటూ నినాదాలు చేయించారు. ‘అందరూ బాహుబలి సినిమా చూశారా.. బాహుబలి వచ్చిననప్పుడు వేదిక కదిలిన విధంగా మీ నినాదాలతో ఈ స్టేజీ కదలాలా.. బీటలు వారాలా..’అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్పీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డిని పొగుడుతూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ విద్యార్థులతో నినాదాలు చేయించడం సిగ్గుచేటని, గౌరవప్రతిష్టలు కలిగిన యూనిఫాం సరీ్వసుకే అగౌరవమని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్లు సీఎం కాళ్లు మొక్కడం, ఆ తర్వాత వారిని ఎమ్మెల్సీగా చేయడం చూశామని గుర్తుచేశారు. ఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: బాబాసాహెబ్ కలల సాకారంలో... -
అవాక్కయ్యే ఘటన.. ‘జయహో జగదీష్‌రెడ్డి’.. జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు. వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్.. ‘జయహో జగదీష్‌రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ ఎస్పీ.. ‘‘జయహో జగదీష్‌రెడ్డి’’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వేదిక ముందున్నవారితో కూడా ఎస్సీ.. ‘జయహో జగదీషన్న’ అంటూ నినాదాలు చేయించారు. జిల్లా పోలీస్ బాస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
అనంతపురం ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు
సాక్షి, అనంతపురం: సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాస్తవానికి ప్రకాష్‌ను రెండు రోజుల క్రితమే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లలో 5 క్రిమినల్ కేసులు కానిస్టేబుల్ ప్రకాష్‌పై నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు, దాడి, అక్రమ ఆయుధాల సరఫరా వంటి కేసులు ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళను లొబర్చుకొని ఆమె నుంచి రూ.10లక్షల నగదు, 30 తులాల బంగారు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రకాష్‌పై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. ఆరోపణలు నిజమని తేలడంతో కానిస్టేబుల్ ప్రకాష్‌ను డిస్మిస్ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (పోలీసులపై తప్పుడు కథనాలు.. ఈనాడుకు ఎస్పీ ఫకీరప్ప నోటీసులు) డిస్మిస్ వెనుక కక్ష సాధింపు ఉందని ఎల్లో మీడియా ద్వారా ప్రకాష్ అసత్య ప్రచారం చేశాడు. సీఎం జగన్ చెన్నేకొత్తపల్లి పర్యటన సమయంలో ప్రకాష్.. ఎస్పీ ఆపీస్ సేవ్ ఏపీ పోలీస్ అంటూ ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశాడు. అందుకే ప్రకాష్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారంటూ ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన ఎస్పీ ఫక్కీరప్ప ప్రకాష్ ప్రవర్తన బాగాలేకపోవడంతో డిస్మిస్ చేసినట్లు స్పష్టం చేశారు. అయితే కక్ష సాధింపుతోనే డిస్మిస్ చేశారని ప్రకాష్ ఆరోపించారు. ఎస్పీతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలను డిఐజీ రవిప్రకాస్ చూస్తున్నారు. -
చాట్-బాట్ సేవలకు ప్రతిష్టాత్మక అవార్డు
-
సాఫ్ట్వేర్ లవ్‌స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..
సాక్షి, తిరుపతి: రక్షణ కల్పించాలంటూ తిరుపతి ఎస్పీని ప్రేమ జంట ఆశ్రయించింది. అమ్మాయి తల్లిదండ్రులు నుండి తమకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు అంగీకరించలేదు. చంద్రగిరి మండలం మల్లయ్యగారి పల్లికి చెందిన పవన్, అదే గ్రామానికి చెందిన నీరజను ప్రేమించి బెంగళూరులో వివాహం చేసుకున్నాడు. ఇరువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో యువతిపై మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును విచారించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా? -
ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్: అనంతపురం ఎస్పీ ప్రకటన
సాక్షి, అనంతపురం: ప్రత్యర్థుల కుట్ర భగ్నమైంది. వైఎస్సార్సీపీని, ఆ పార్టీ నేత.. హిందూపురం ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌ను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నాం ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్‌ను.. వీడియో తీసి పోస్ట్ చేశారు అని ఆయన వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఐ.టీడీపీ వాట్సాప్ గ్రూపులో మొదట వచ్చింది. 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నెంబర్ నుంచి పోస్ట్ చేశారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్‌తో వీడియో అప్లోడ్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నాం. వీడియో ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం వల్ల అది ఒరిజినల్ అని గుర్తించలేకపోతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేమని, అలాగే ఒరిజినల్ వీడియో దొరికే దాకా ఏం చెప్పలేమని ఎస్పీ తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ -
అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు
-
ఏపీలో పలువురు ఎస్పీల బదిలీ
-
వైఎస్‌ను అలా చూస్తూ ఉండిపోయా.. సీఎం జగన్ ఆప్యాయతకు మారుపేరు
ఓ మారుమూల పల్లె.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. తండ్రి ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి.. తల్లి గృహిణి.. ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమారుడు. నీళ్లు లేక ఊళ్లో అప్పటికే పొలాలు పండని దైన్యం. నాన్న ముగ్గురు బిడ్డలకూ ఒక్కటే మాట పదేపదే చెప్పారు. చదువు.. చదువు.. చదువు.. ఆ ముగ్గురికీ అదే తారకమంత్రమైంది. మిషినరీ, సర్కారు బడులు, కాలేజీల్లో చదువుకున్నప్పటికీ ముగ్గురూ గ్రూప్–1, 2 ఉద్యోగాలు సాధించారు. ఆ ముగ్గురిలో ఓ విద్యార్థి డాక్టర్ అవ్వాలనుకున్నారు.. ఇంటర్లో బైపీసీ తీసుకున్నారు.. కానీ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్‌కి డొనేషన్ కట్టాలి.. అంత సొమ్ము లేకపోవడంతో ఏమీ నిరుత్సాహపడలేదు.. చక్కగా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పీజీ వైపు చూడలేదు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టం ఫలించి మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–1 పరీక్షల్లో స్టేట్ 8వ ర్యాంక్ సాధించారు. డీఎస్పీ అయ్యారు.. సర్వీస్‌లోకి వచ్చిన కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ఏకంగా ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వరకు ఎదిగారు.. ఆయనెవరో కాదు.. తిరుపతి జిల్లా ఎస్పీ పోతన్నగారి పరమేశ్వరరెడ్డి. ఆ స్ఫూర్తిదాయక ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, తిరుపతి మాదో చిన్న పల్లెటూరు. ఐదు వందల గడపలు మాత్రమే ఉంటాయి. నాన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)లో చిరుద్యోగిగా పని చేశారు. అమ్మ గృహిణి. మేం ముగ్గురు పిల్లలం. అక్క శ్రీలక్ష్మి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి. చెల్లి నాగజ్యోతి గ్రూప్–2 ఆఫీసర్. వ్యవసాయ నేపథ్యంలో కలిగిన మా కుటుంబంలో ఎస్ఎస్ఎల్సీ చదివిన ప్రథమ వ్యక్తి మా నాన్నే. సాగునీరు సరిగా లేక, బీడు భూముల్లో వ్యవసాయం చేయలేక ఊళ్లో రైతుల కష్టాలను కళ్లారా చూసిన వ్యక్తిగా ఆయన మాకె ప్పుడూ చదువు విలువను తెలియజేస్తూ ఉన్నత విద్య దిశగా నడిపించారు. కేజీ నుంచి డిగ్రీ వరకు మిషినరీ, సర్కారు కళాశాలలే.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అనంతపురం పట్టణంలోని సెయింట్ అగస్టీన్ స్కూల్లో విద్యనభ్యసించా. ఆరు నుంచి పదో తరగతి వరకు ఎల్‌ఆర్‌జి హైస్కూల్లో, ఇంటర్లో బైపీసీ తీసుకుని శ్రీసత్యసాయిబాబా జూనియర్ కళాశాలలో చదివాను. ఎంబీబీఎస్‌లో చేరేందుకు ఎంసెట్ రాసినా డొనేషన్‌తో చేరే ర్యాంక్ వచ్చింది. కానీ నాన్నకు ఆర్థిక భారం కాకూడదనుకున్నా. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీలో బీఎస్సీ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోసం వెంపర్లాడలేదు. డిగ్రీ పూర్తి కాగానే గ్రూప్స్‌కు సిద్ధమయ్యాను. స్ఫూర్తినిచ్చిన ఆర్ట్స్ కాలేజీ.. అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి ఇక్కడే చదువుకున్నారు. సంజీవరెడ్డి అయితే ఇక్కడ అధ్యాపకులుగా కూడా పనిచేశారు. డీజీపీలుగా పనిచేసిన జేవీరాముడు, అరవిందరావు కూడా ఇక్కడే చదివారు. ఇలా ఎందరో విద్యార్థులు ఇక్కడ చదివి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా దేశవ్యాప్తంగా సేవలు అందించారు. ఆ స్ఫూర్తితోనే కళాశాలలో డిగ్రీ చదువుతుండగానే గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఇక కళాశాలలో చదువుతున్న రోజుల్లో అనంతపురం ఎస్పీగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రకి పబ్లిక్‌లో ఉన్న క్రేజ్ చూసి పోలీసైతే బాగుండని అనుకున్నా. వైఎస్‌ను అలా చూస్తూ ఉండిపోయా.. 2008లో గ్రూప్–1కి ఎంపికైన అభ్యర్థులను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఆయనలోని రాజసం, ముఖంపై చిరునవ్వు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయా. ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ప్రభుత్వోద్యోగం. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేయాలని ఆయన చెప్పిన మాటలు, ఆయన్ను చూసిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు. ఆయన ఆప్యాయతకు మారుపేరు ముఖ్యమంత్రి సీఎస్ఓగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం అందరికీ రాదు. అరుదుగా వచ్చే ఈ అవకాశం నాకు త్వరగా వరించిందనే చెప్పాలి. తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరి పట్ల సీఎం వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఉద్యోగుల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూస్తారు. ప్రశాంతత ముఖ్యం విద్యార్థి దశ చాలా కీలకం. ఆ సమయంలో ప్రశాంతంగా.. ప్రణాళికా బద్ధంగా చదివితే ఉన్నత లక్ష్యాలను సులువుగా అందుకోవచ్చు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, లక్ష్యం గురితప్పిందనో నిరాశ చెందకూడదు. కనీస సౌకర్యాలు లేని గ్రామాల నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఎందరో గొప్ప వ్యక్తులే మనకు ఆదర్శం. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం(ఫైల్) ఇష్టదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మా కుటుంబానికి ఇష్టదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. నేడు అదే స్వామి వారి పాదాల చెంత జిల్లా ఎస్పీగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీ వారి ఆశీస్సులతోనే నాకు ఈ జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చిందనుకుంటున్నా. కుటుంబ నేపథ్యం పేరు: పోతన్నగారి పరమేశ్వరరెడ్డి పుట్టిన తేది: 30.07.1983 తల్లిదండ్రులు: నాగలక్ష్మి, నారాయణరెడ్డి సొంతూరు: పులేటిపల్లె గ్రామం, సీకేపల్లి మండలం, అనంతపురం జిల్లా భార్య: సాయిప్రసన్న(ప్రకాశం జిల్లా) పిల్లలు: ధాత్రిసాయిరెడ్డి, వైభవ్ విద్యాభ్యాసం: డిగ్రీ హాబీలు: సినిమాలు చూడటం ఉద్యోగ ప్రస్థానం: 2008లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంక్ వచ్చింది. శిక్షణ పూర్తయిన తర్వాత 2011లో మొదటి పోస్టింగ్ కృష్ణా జిల్లా గుడివాడ డీఎస్పీగా వచ్చింది. ఆ తర్వాత వరుసగా.. ►గ్రేహౌండ్స్ కమాండర్ ►కరీంనగర్ జిల్లా జగిత్యాల డీఎస్పీ ►తెలంగాణాలో సీఐడీ డీఎస్పీ ►నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ►2018: ఏఎస్పీగా పదోన్నతి. నెల్లూరులోనే అడ్మిన్ ఏఎస్పీగా బాధ్యతలు ►2019: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం ముఖ్య భద్రతాధికారిగా అవకాశం. రెండేళ్ల పాటు విధులు. ►2021: ఐపీఎస్కి ఎంపిక. ►2022: తిరుపతి జిల్లా ఎస్పీగా నియామకం. -
ధైర్యం చెప్పి.. థింసా స్టెప్పులేసి.. పిల్లలతో సరదాగా గడిపిన ఎస్పీ
భువనేశ్వర్: ఆమె ఓ జిల్లాకు పోలీస్ బాస్. నిత్యం నేర సమీక్షలు, శాంతి, భద్రతల పరిరక్షణ, సిబ్బంది విధులపై పర్యవేక్షణ, ఫిర్యాదుదారులతో నిత్యం క్షణం తీరికలేకుండా ఉంటారు. ఐపీఎస్‌గా ఉన్నా.. ఆశ్రమ చిన్నారులతో కలిసి ఆడిపాడారు. నేనున్నానంటూ వారిలో మానసిక ధైర్యం నింపారు. ఆమె.. నవరంగ్‌పూర్ జిల్లా ఎస్పీ ఎస్.సుశ్రీ. నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపం లోని ప్రభుత్వ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న దీనదయాల్ ఆశ్రమాన్ని ఎస్పీ గురువారం సందర్శించారు. ఆమెతో పాటు కలెక్టర్ కమలోచన్ మిశ్రా ఉన్నారు. వీరిద్దరూ బాలికలకు మిఠాయిలు, మామిడి పళ్లు పంచిపెట్టారు. ఎస్పీ చొరవ కల్పించుకొని బాలికలలో ఒకరిగా కలసిపోయి కులాశాగా కబుర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్నారులంతా కొరాపుటియా థింసా నృత్యం చేయగా.. సుశ్రీ కూడా వారితో జత కలిసి, స్టెప్పులేశారు. స్వయానా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తమతో డ్యాన్స్ చేస్తుండటంతో బాలికలు మరింత ఉత్సాహంగా ఆమెకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసిన వారంతా ఎస్పీ చొరవను అభినందిస్తున్నారు. చదవండి: వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ.. -
బరితెగించిన సీఐ.. ఏకంగా రూ.15లక్షలతో..
సాక్షి, కర్నూలు: కర్నూలు అర్బన్ తాలూకా సీఐ కంబగిరి రాముడిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఈ నెల 19వ తేదీన సెబ్ తనిఖీల్లో రూ.75 లక్షల నగదు పట్టుబడింది. ఈ నగదుకు తగిన ఆధారాలు చూపినప్పటికి ఎస్పీకి మామూళ్లు ఇవ్వాలంటూ సీఐ కంబగిరి రాముడు రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఓర్వకల్లుకు చెందిన గౌరీశంకర్ ద్వారా మామూళ్ల వ్యవహారం నడిచింది. హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలుకు చెందిన భాస్కర్‌రెడ్డి ఇందుకు సహకరించడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచగా, సీఆర్పీసీ 41 నోటీసు జారీ చేసి పంపాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. పరారీలో ఉన్న కంబగిరి రాముడి కోసం గాలిస్తున్నారు. సీసీఎస్ సీఐగా ఉన్న శేషయ్యకు కర్నూలు అర్బన్ తాలుకా బాధ్యతలు అప్పగించారు. తప్పు చేస్తే తప్పించుకోలేరు: ఎస్పీ హెచ్చరిక ‘ఎవరు ఎలా పనిచేస్తున్నారో తెలుసు. తప్పు చేసి తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. చట్ట పరిధిలో సక్రమంగా పనిచేస్తే సహకరిస్తా. అక్రమాలకు పాల్పడితే ఇంటికి పంపుతా’ అంటూ ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి పోలీస్ అధికారులను హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం నెల వారీ సమీక్ష నిర్వహించారు. హత్యలు, అత్యాచారాలు, పోక్సో కేసులపై ప్రధానంగా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘బాధితులకు న్యాయం జరగాలి. నిందితులకు శిక్షలు పడాలి’ అనే లక్ష్యంతో పని చేయాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో వాటి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను స్టేషన్ల వారీగా సమీక్షించి వచ్చే సమావేశం నాటికి వాటి సంఖ్యను సగానికి తగ్గించాలని ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ అధికారులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి కేసును కచ్చితమైన ప్రణాళికతో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. రెండు సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులపై చర్చించారు. నంద్యాలలో జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాట్లపై కూడా ఆ ప్రాంత అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. డీపీఓ కార్యాలయ సిబ్బందికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సందర్భంగా చర్చించి పరిష్కార సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీలు చిదానందరెడ్డి, రాజేంద్ర, డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకటాద్రి, వెంకటరామయ్య, శ్రీనివాసులు, వినోద్‌కుమార్, యుగంధర్‌బాబు, రామాంజినాయక్, శ్రీనివాసరెడ్డి, శ్రుతి, జిల్లాలోని వివిధ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
Sakshi Cartoon: ప్రపంచంలో అతి పెద్ద అబద్ధాల పార్టీ..
దానికి అంత పెద్ద అబద్ధమాడాలని అంటున్నార్సార్! -
మాతో పెట్టుకుంటే మడతడిపోద్దీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సింహాసనాన్ని ఎవరు అధిరోహించాలన్నది నిర్ణయించడంలో యువతే కీలక భూమిక పోషించనుంది. తమ భవిష్యత్తు అవసరాలను తీర్చగలవని నమ్మిన పార్టీలను ఎన్నుకుంటూ వస్తూనే.. తమ కలలను నెరవేర్చని ప్రభుత్వాలను కూలదోస్తూ.. ప్రతి ఎన్నికలో కీలకంగా మారింది. అందుకే యూపీ జనాభాలో పావు శాతానికిపైగా ఉన్న యువతే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే.. ఏకంగా యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టోనే విడుదల చేసింది. నిర్ణయాత్మకంగా మారడంతో.. యూపీలో ప్రస్తుత ఎన్నికల్లో 15.02 కోట్ల మంది ఓటు వేయనుండగా.. అందులో ఏకంగా 4 కోట్ల మంది 18–39 ఏళ్ల మధ్య వయసున్న యువతే. అందులోనూ కొత్తగా 19.89 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న యువత ఓట్లను దృష్టిలో పెట్టుకొనే అన్ని రాజకీయ పార్టీలు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఆకట్టుకునే హామీలతోపాటు, మెజార్టీ సంఖ్యలో సీట్లను కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2007 నుంచి ప్రతి ఎన్నికలో సుమారు 70 మంది యువ ఎమ్మెల్యేలు యూపీ అసెంబ్లీకి వస్తున్నారు. ప్రస్తుతం ముగుస్తున్న అసెంబ్లీలోనూ 71 మంది ఎమ్మెల్యేల వయసు 40 ఏళ్లకన్నా తక్కువే కావడం గమనార్హం. ఇక 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఎమ్మెల్యేలు ఏకంగా 128 మంది వరకు ఉన్నారు. హామీ మరిస్తే ఇంటికే.. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకున్నా, నిధుల కేటాయింపులో ప్రాధాన్యం తగ్గినా యువత తమ సత్తా చూపిస్తోంది. 2007లో మాయావతి (బహుజన సమాజ్ పార్టీ–బీఎస్పీ) యువత లక్ష్యంగా.. ఉద్యోగాల కల్పన, విద్యా ఖర్చుల తగ్గింపు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి వంటి హామీలు ఇచ్చారు. దానితో దళిత, ముస్లిం యువత మొత్తం ఆమె వెంట నడిచింది. ఆమె మొత్తం 403 సీట్లకుగాను 206 సీట్లు గెలుపొందారు. కానీ ఆమె అధికారంలోకి వచ్చాక 18–30 ఏళ్ల యువత కోసం ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేదు. ఐదేళ్ల పాలనా కాలంలో 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారు. పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు హామీ నీరుగారింది. దీనిపై ఆగ్రహించిన యువత బీఎస్పీకి దూరమైంది. ఫలితంగా 2012లో బీఎస్పీకి 80 సీట్లు మాత్రమే వచ్చాయి, 2017 నాటికి 19 సీట్లకు పడిపోయాయి. ►సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్‌యాదవ్.. 2012 ఎన్నికల్లో 3.8 కోట్ల మంది యువ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని, తమ మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించారు. 10వ తరగతి పిల్లలకు ట్యాబ్లెట్, 12వ తరగతి పాసైన వారికి ల్యాప్‌టాప్, బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి కింద ప్రతి ఏటా రూ.12 వేలు వంటి హామీలు ఇచ్చారు. యువత మద్దతుగా నిలవడంతో ఎస్పీ ఏకంగా 224 సీట్లు గెలుచుకొని అధికారంలో వచ్చింది. అఖిలేష్‌యాదవ్ అధికారంలోకి వచ్చాక.. విద్యార్థులకు ట్యాబ్లెట్లు, ల్యాప్‌ట్యాప్‌ల పంపిణీ నామమాత్రంగానే సాగింది. ఆయన ఐదేళ్ల పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఇతర హామీలూ పూర్తిగా అమలుకాలేదు. దానితో 2017 ఎన్నికల్లో యువత దూరమై.. ఎస్పీ కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. ►2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్, ఐదుగురు యువకులు అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్లింది. నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. కానీ హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాల కల్పనలో బీజేపీ సఫలం కాలేకపోయింది. పైగా నిరుద్యోగం పెరగడంతో యువత రోడ్లెక్కారు. ప్రయాగ్‌రాజ్, లక్నోలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. మరోవైపు టెట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశం సుమారు 20లక్షల మంది యువతను ఇబ్బందుల్లో నెట్టడంతో బీజేపీ సర్కారు అపఖ్యాతి పాలైంది. ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకు బీజేపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందులో రవికిషన్, గౌతమ్ గంభీర్, బబితా ఫోగట్, తేజస్వి సూర్య వంటి నాయకులకు ప్రాతినిధ్యం కల్పించి.. యువ, ప్రగతిశీల ఓటర్లలో బీజేపీని విస్తరించేలా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రత్యేక మేనిఫెస్టోతో కాంగ్రెస్.. యువత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఏకంగా యూత్ మేనిఫోస్టోనే తెరపైకి తెచ్చింది. రెండు రోజుల కింద కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దీనిని ఆవిష్కరించారు. ‘భారతీ విధాన్’ పేరుతో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఇందులో 8లక్షల ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు. గతంలో 25–30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేసి విఫలమైందని.. కాంగ్రెస్ అమలుచేసి చూపించి యువత విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని వారు పేర్కొన్నారు. -
దారిదోపిడీలకు పాల్పడుతున్న మూఠా అరెస్టు
-
సాయిబాబా కాలేజీ విద్యార్థిని జయలక్ష్మికి ఎస్పీ ఫక్కీరప్ప అభినందనలు
-
యూపీ అసెంబ్లీ ఎన్నికలు, అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సోమవారం ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)తో పొత్తును ఖరారు చేసిన ఆయన సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని తాజాగా చెప్పారు. అయితే యూపీ ముఖ్యమంత్రి బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో అఖిలేష్ ప్రకటన సంచలనం రేపింది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూతో పోల్చడం దుమారాన్ని రాజేస్తోంది. గత ఎస్పీ ప్రభుత్వం చేపట్టిన పనుల పేరు మార్చడం, యూపీ ప్రభుత్వం కొత్తగా చేసేందీమీ లేదు, 'బాబా ముఖ్యమంత్రి' అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆతిద్యనాథ్పై అఖిలేష్ మండిపడ్డారు. ఆదివారం జరిగిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చడం సిగ్గుచేటని యూపీ సీఎం స్పందించారు. ఇది విభజనను నమ్మే తాలిబానీ మనస్తత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలో ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నిర్మాణ కృషి జరుగుతోందని యోగి పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో తమ అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భారీ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు తమ చేజారిపోయిన కంచుకోటను ఎలాగైనా దక్కించు కోవాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా లఖీంపూర్ ఖేరీ హింస తరువాత కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సుడిగాలి పర్యటనలతో సందడి చేస్తున్నారు. మహిళలకు 40 శాతం రిజర్వేషన్, అమ్మాయిలకు స్కూటీలూ లాంటి వాగ్దానాలతో తన వేగాన్ని పెంచిన సంగతి తెలిసిందే. -
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం: ఎస్పీ విజయరావు
-
రేవంత్‌రెడ్డి పోలీసులను కించపరిచేలా మాట్లాడారు: ఎస్పీ రాజేష్‌చంద్ర
-
మావోయిస్టు కుటుంబాల యోగక్షేమాలు తెలుసుకున్న ఎస్పీ
సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): జిల్లాలోని అండర్ గ్రౌండ్ కేడర్ కలిగిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను ఎస్పీ అమిత్ బర్దార్ సోమవారం కలిసి యోగక్షేమా లు అడిగి తెలుసుకున్నారు. ఉద్దానంలోని బాతుపు రం గ్రామానికి చెందిన యూజీ కేడర్ గల మావోయిస్టులైన మెట్టూరు జోగారావు, చెల్లూరి నారాయణరావుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అవ్వా.. బాగున్నావా అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ వారి జీవనోపాధి సాగుతున్న తీరు, కుటుంబ నేపథ్యం, పిల్లల చదువు, ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. మీకు మీ కుటుంబ స భ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు. మావోయిస్టుల తల్లులు మెట్టూ రు చిన్న పల్లెమ్మ, చెల్లూరి నీలమ్మలకు దుప్పట్లు, చీర, మెడికల్ కిట్‌తో పాటు పండ్లు, నిత్యావసర స రుకులను అందజేశారు. పోలీసులు ప్రజలతో స్నే హంగా ఉండాలని సూచించారు. పర్యటనలో ఆయ న వెంట కాశీబుగ్గ రూరల్ సీఐ డి.రాము, స్థానిక ఎస్ఐ కూన గోవిందరావు తదితరులు ఉన్నారు. జనజీవన స్రవంతిలో కలవండిఅడవి బాటను వీడి మావోయిస్టులు జన జీవన స్ర వంతిలో కలవాలని ఎస్పీ పిలుపు నిచ్చారు. అజ్ఞాత జీవనం గడుపుతున్న మావోయిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రస్తుతం కరోనా వచ్చి అడవిలో ఉంటున్న వారు జనజీవన స్రవంతిలో కలిస్తే మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. -
కుప్పంలో విగ్రహాల ధ్వంసం: చంద్రబాబుపై ఎస్పీ ఫైర్..
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని పురాతన విగ్రహాల ధ్వంసం ఘటనను పోలీసులు ఛేదించారు. కుప్పం మండలం గోనుగురు సమీపంలోని దేవతామూర్తుల విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు సంఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మతిస్థిమితం లేని ఓ మహిళ విగ్రహాలు ధ్వంసం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. గుడి చాలా మారుమూల ప్రాంతంలో ఉందని, వారానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయని తెలిపారు. మతిస్థిమితం లేని మహిళ ఈ ఘటనకు కారణమని తేలిందన్నారు. విగ్రహాల ధ్వంసం చేసిన విషయాన్ని జ్యోతి అనే మహిళ ఒప్పుకుందన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసే సమయంలో మహిళ మద్యం మత్తులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా కేసులు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే, పోలీసులు, పీస్ కమిటీకి వెంటనే తెలియజేయాలని తెలిపారు. చదవండి: అడుగడుగునా మేసేశారు -
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
-
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరుపతిలో చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్భన్ ఎస్పీ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని అన్నారు. కానీ ఆయన వినకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని, అందుకే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. కాగా తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సోమవరాం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎయిర్పోర్ట్ లాంజ్‌లో పోలీసులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. నిరసన తెలిపేందుకు అనుమతి లేదంటూ నోటీసులు అందజేశారు. అయినప్పటికీ వినని చంద్రబాబు.. లాంజ్‌లోని ఫ్లోర్‌పైనే బైటాయించి నానా హంగామా సృష్టించారు. ఈ మేరకు ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పినా తిరుపతిలో బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట ధర్నాకు పూనుకున్నారని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు సమీపంలో గాంధీ విగ్రహం ఉందని, వారు ఎంపిక చేసుకున్న స్థలం భక్తులతో నిండి ఉంటుందన్నారు. అక్కడ ధర్నా చేస్తే తిరుమలకు వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని చెప్పి టీడీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. జన సమీకరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ధర్నాలు, ర్యాలీలు ఎన్నికల నియమావళికి, కోవిడ్ నిబంధనలకు విరుద్ధమని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడి ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. 5 వేల మందితో ధర్నా చేస్తున్నట్లు నిన్న రాత్రి లెటర్ ఇచ్చారని, అనుమతి ఇవ్వమని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు.చిత్తూరు నడిబొడ్డులో ధర్నాకు అనుమతి కోరారని, సిటీ బయట అయితే చేసుకోవచ్చని చెప్పినట్లు తెలిపారు.అయినా వినకుండా ఈ రోజు ఉదయం కొందరు టీడీపీ నేతలు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారని వారందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతితో వస్తే అనుమతి ఇస్తామని, పంచాయితీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా బాబుకు చిత్తూరు జిల్లాలో మనుగడ లేదు: పెద్దిరెడ్డి -
స్నేహలత హత్య కేసు: ఇద్దరు అరెస్ట్
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బడన్నపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఎస్బీఐలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని స్నేహలత (19) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియుడు గుత్తి రాజేష్, కార్తీక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 302,201 కింద కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ బి.సత్యయేసు గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. గత నాలుగేళ్లుగా స్నేహలత-రాజేశ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు. ఇతర వ్యక్తులతో సంబంధాలున్నాయని రాజేశ్ వేధించాడని, ఈ క్రమంలో రాజేష్ మంగళవారం స్నేహలతను తన బైక్ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పారు. (యువతి దారుణ హత్య) బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడయాని అనంతరం తల్లిదండ్రులు ఫిర్యాదుతో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులపై త్వరగా ఛార్జ్‌షీట్ వేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. స్నేహలతపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కాగా స్నేహలత హత్య కేసు స్థానికలంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్థానిక ఎస్పీ పర్యవేక్షణలో కేసు విచారణ జరిగింది. దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. (స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు) -
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ కీలక ప్రకటన
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీపావళీ పండగ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. 2022లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అమలు చేయబోయే వ్యూహాన్ని వెల్లడించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడిన కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి కూటమిగా ఏర్పాటు కాబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం దీపావళి పండగ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. కొన్ని రోజులుగా లక్నో, ఏటవాలో పార్టీ ప్రముఖలతో పలు భేటీలు జరిపాము. అన్ని ప్రాంతాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. బీజేపీ అభివృద్ధి పనులు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైంది’ అన్నారు. రానున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో కూటమిగా ఏర్పడదని, కేవలం చిన్న పార్టీలతో మాత్రమే కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయిని తెలిపారు. చదవండి: (అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం: మాయావతి) ఈ విషయాన్ని పలు వేదికలపై తెలిపానని ఆయన గుర్తు చేశారు. మరో వైపు జస్వంత్‌నగర్ విషయంలో ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీతో సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ 2017 ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీగా అభ్యర్థిగా జస్వంత్‌నగర్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఎస్పీ నుంచి బయటకు వచ్చి 2019లో సొంతంగా ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ నీ స్థాపించారు. ఇక ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, 2022లో జరగనున్నాయి. -
వారితో కూడా యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పాజిటివిటీ రేట్ 12.0 నుంచి 8.3కి తగ్గిందని తెలిపారు. టెస్టులు పెరిగాయని, కేసులు కూడా తగ్గుతున్నాయని సీఎం పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. కోవిడ్ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనమని, కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. జనవరికల్లా వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు. ‘‘104 నంబర్‌కు ఫోన్ కొడితే టెస్ట్‌లు, హాస్పిటల్స్ వివరాలు అందాలి. ఈ నంబర్‌కు మాక్ కాల్స్ చేసి నెంబర్ పనిచేస్తుందా లేదా పీరియాడికల్‌గా చెక్ చేయండి. ఎక్కడైనా లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలి. ప్రతీ రోజూ మానిటర్ చేయండి. ఈ నంబర్‌కు ఫోన్ చేయగానే అరగంటలోనే బెడ్ అందుబాటులో ఉందో లేదో చెప్పాలి. కాబట్టి ఈ నంబర్ పక్కాగా పనిచేయాలని’’ అధికారులకు సీఎం ఆదేశించారు. (చదవండి: ప్రభుత్వ సేవలు.. హెల్ప్‌లైన్ నంబర్లు) కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్ చేస్తున్న రాష్ట్రం మనదేనని, కోవిడ్ హాస్పిటల్స్ లిస్ట్ గ్రామ సచివాలయాల్లో ఉండాలన్నారు. ఎంప్యానల్ హస్పిటల్స్ లిస్ట్ కూడా అందుబాటులో ఉండాలని తెలిపారు. 104కు ఎవరు ఫోన్ చేసినా కోవిడ్ ట్రీట్మెంట్కు సంబంధించిన అన్ని వివరాలు అందాలని చెప్పారు. రిక్రూట్ చేసిన వారంతా కూడా కరెక్ట్‌గా డ్యూటీకి వెళుతున్నారా లేదా తనిఖీ చేయాలని సీఎం పేర్కొన్నారు. (చదవండి: ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు) ‘‘పీరియాడికల్లీ చెకప్ ఉండాలి. దాదాపు 30 వేల మందిని కొత్తగా తీసుకొస్తున్నాం. వీరందరినీ మానిటర్ చేయాలి. 37000 వేల బెడ్స్, 240 హాస్పిటల్స్‌లో ఫుడ్, శానిటేషన్, ఇన్ఫ్రా, స్టాఫ్ వీటిపై మానిటరింగ్ పక్కాగా ఉండాలి. ప్రతీ రోజూ కలెక్టర్లు, జేసీలు మానిటర్ చేయాలి. ఈ నాలుగు కరెక్ట్‌గా ఉంటే చికిత్స కరెక్ట్‌గా అందుతుంది. కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఫుడ్, శానిటేషన్, మెడికేషన్ కచ్చితంగా జరగాలి. అక్కడ కూడా హెల్ప్ డెస్క్ ఉండాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కిట్లు ఇస్తున్నామా లేదా ప్రతీ ఒక్కరూ దృష్టి పెట్టాలి. కిట్లు రాలేదంటే ఖచ్చితంగా కలెక్టర్లు, జేసీలు బాధ్యత వహించాలి. ఏఎన్ఎంలు, లోకల్ డాక్లర్లు మ్యాపింగ్ చేయాలి. డాక్టర్ కూడా ఆ ఇంటికి వెళ్ళి చూడాలి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, పిహెచ్సీ డాక్టర్ ముగ్గురూ కచ్చితంగా వారితో మాట్లాడాలి. 104 నంబర్ పబ్లిసిటీ కూడా బాగా జరగాలి. దానితో పాటు లోకల్ కంట్రోల్‌రూమ్ నంబర్ కూడా పబ్లిసిటీ చేయాలని’’ సీఎం సూచించారు. కోవిడ్ బాధితులను త్వరగా గుర్తించడం వలనే మరణాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ‘‘మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాదు, నెగిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్న ఎల్లో మీడియాతో కూడా యుద్దం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. మనం ఎంత మంచి చేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారు. అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం, నెగిటివ్ వార్తలు చదువుదాం. మనం కరెక్ట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందాం, వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదాం’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంట చేతికొస్తుంది కాబట్టి, అక్టోబర్ 15 నుంచి ధ్యాస పెట్టాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆర్బీకేల ద్వారా మన ప్రొక్యూర్మెంట్ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలని, ఈ క్రాపింగ్ ప్రతీ పంటకు కంప్లీట్ కావాలన్నారు. ఈ క్రాపింగ్ ఎక్కడా కూడా పెండింగ్ ఉండకూడదని, దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►ఈ క్రాపింగ్ తర్వాత రైతుల రిజిస్ట్రేషన్ జరగాలి, తర్వాత లిస్ట్ ఆర్బీకేలలో పెట్టాలి ►ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి. సోషల్ ఆడిట్ చేయాలి. మిస్ అయితే వెంటనే నమోదుచేయాలి ►ఫామ్‌గేట్ అనేది ప్రతీ పంటకూ చేయాలి ►కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్ చేస్తామని చెప్పాలి ►ఎక్కడా కూడా మ్యాన్యువల్ సర్టిఫికెట్ ఉండకూడదు, ఈ క్రాపింగ్ తప్పనిసరిగా జరగాలి ►సీఎం యాప్ ద్వారా మానిటరింగ్ జరగాలి ►అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంటనే అలర్ట్ చేయాలి ►జేసీలు వెంటనే రైతుకు మార్కెటింగ్ సౌకర్యం చూపాలి ►ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అనేది అక్టోబర్ 1 న రిలీజ్ చేస్తాం.. అక్టోబర్ 5 కల్లా అన్ని ఆర్బికేలలో డిస్ప్లే చేయాలి ►కనీస గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ రేట్‌కు మనం అమ్మించగలగాలి ►రైతుకు పూర్తిగా తోడు నిలబడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు, జేసీలు పూర్తిగా ధ్యాస పెట్టండి ►స్టేట్‌లెవల్ అడ్వైజరీ కమిటీ, జిల్లా, మండల, ఆర్బీకేల స్ధాయి కమిటీలు వెంటనే ఏర్పాటుచేయాలి ►ఏ పంట గ్రామంలో వేయాలి, ఏ పంట వేయద్దు అనే అంశాలు కూడా కమిటీలు చర్చించాలి ►కలెక్టర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రైతు అనే వ్యక్తి నష్టపోతే అందరూ నష్టపోతారు. ఫార్మర్స్ ఈజ్ హయ్యెస్ట్ ప్రయారిటీ. వరద పరిస్థితిపై సమీక్ష.. భారీ వర్షాలు, పంట, ఆస్తినష్టం అంచనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదల పరిస్థితిని సీఎం సమీక్షించారు. పంట, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపించాలని సీఎం ఆదేశించారు. ఆర్బీకే లెవల్లో ఎన్యూమరేషన్ ఆఫ్ ఫార్మర్స్ డిస్ప్లే చేయాలన్నారు. ఇప్పటివరకు వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందని.. వారి కుటుంబాలకు వెంటనే రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
వారి జీవితాల్లో నిజమైన పరివర్తన
‘‘నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. కృష్ణాజిల్లా ఎస్పీ సారు నిర్వహించిన జాబ్ మేళాలో నాకు కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.10 వేలు ఇస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది’’ అంటోంది శ్రావణి. కృష్ణాజిల్లా పోలీసులేమిటి, జాబ్‌మేళా నిర్వహించడం ఏమిటీ అని అనుమానం వస్తోంది కదా... అదేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా ఆ జిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో ఏం జరుగుతోందో, అటువంటి వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందో తెలుసుకుందాం. కృష్ణాజిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో వందలాది కుటుంబాలు నాటుసారా తయారీనే జీవనోపాధిగా చేసుకుని దశాబ్దాలుగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. దొరికిన ప్రతిసారి కటకటాల పాలవడం... బయటకు రాగానే మళ్లీ సారా తయారీ చేయడం.. అమ్ముకోవడం వారికి కులవృత్తిగా మారిపోయింది. దీంతో ఆ గ్రామాల నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాదు చివరకు పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాని వివక్షకు గురయ్యారు. ఇలా దశాబ్దాలుగా ఇలాంటి వారు పడిన వెతలకు చెక్ పెడుతూ వారి జీవితాల్లో ‘నవోదయం’ తెచ్చేందుకు ప్రభుత్వం ‘పరివర్తన’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది మిగిలిన జిల్లాలకు భిన్నంగా కృష్ణాజిల్లా పోలీసులను ఆలోచింపజేసేలా చేసింది. అరెస్టులు, కేసుల కంటె వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమార్గంగా తలచి ఆ దిశగా అడుగులు వేశారు. వారిలో మార్పునకు బీజం వేశారు. సైనికుల్లా పనిచేసిన ఆ పోలీసుల కథేమిటో.. వారి కృషివల్ల వీరి జీవితాల్లో వచ్చిన ‘పరివర్తన’ ఏమిటో చూద్దాం. వారిలో ‘పరివర్తన’కు బీజం పైన చెప్పుకున్నట్లుగా కృష్ణాజిల్లా చాట్రాయి మండలం పోతనపల్లికి చెందిన శ్రావణి ఒక్కతే కాదు, ఆ పల్లెల్లో వందలాది నిరుద్యోగ యువత రేపటి భవిష్యత్ కోసం ఆశగా అడుగులు వేస్తోంది. చీకట్లను చీల్చుకుంటూ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.‘సారా’ గ్రామాలుగా ముద్రపడిన ఆ పలెల్లో ‘పరివర్తన’ తెచ్చే దశగా ఏడాది క్రితం అడుగులు పడ్డాయి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టింది మొదలు రవీంద్రనాథ్‌బాబు తరచూ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలాలని నిర్ణయించుకున్నారు. వారిలో పరివర్తనకు బీజం వేశారు. వారిచ్చిన భరోసాతో చాట్రాయి, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో నాలుగు దశాబ్దాలుగా సారానే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న ఏడు గ్రామాల్లోని 431 ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సారాకు దూరంగా ఉంటామని ప్రతిన బూనారు. గిరిజనులకు భూములు.. యువతకు ఉద్యోగాలు సారాకు దూరంగా ఉంటామని ముందుకొచ్చిన 200 గిరిజనకుటుంబాలకు గిరిజన భూములపై హక్కులు కల్పిస్తున్నారు. చదువులేని నిరుద్యోగులకు, పనులు చేయగలిగే మహిళలకు స్థానిక కంపెనీల్లో దినసరి వేతన కూలీలుగా అవకాశాలు కల్పించారు. ఇక కొద్దో గొప్పో చదువుకున్న నిరుద్యోగ యువత కోసం పీవీఎన్ఆర్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు 12కు పైగా కార్పొరేట్ కంపెనీలను ఒక వేదికపైకి తీసుకొచ్చి మెగా జాబ్‌మేళాలు నిర్వహించారు. అలా సారా ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువతలో దాదాపు 150 మందికి వారు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కలలో కూడా ఊహించని రీతిలో కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఆఫర్ లెటర్లు చేతికి రావడంతో వారిలో పట్టరాని ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన పరివర్తనతో ఆ పల్లెల్లో వెలుగు పూలు పూస్తున్నాయి. – పంపాన వరప్రసాదరావు, ఫొటోలు: అజీజ్ జుజ్జవరపు సాక్షి, మచిలీపట్నం మా జీవితాల్లో వెలుగులు నింపారు.. మా తాతముత్తాల నుంచి గత్యంతరం లేక ఈ పని చేస్తున్నాం. మా అబ్బాయి ఏడుకొండలును డిగ్రీ వరకు చదివించాం. ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ మా పని వల్ల వాడికి ఉద్యోగం రాలేదు. జిల్లా ఎస్పీ దొరగారు నిర్వహించిన జాబ్‌మేళాలో మా అబ్బాయికి చెక్ పోస్టులో ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – మల్లవోలు శ్రీనివాసరావు, చినగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం -
పోలీసు కోసం జనం పోరాటం!
ముంబై: సాధారణంగా పోలీసులకు, ప్రజలకు మధ్య అంత సత్సబంధాలు ఉండవు. సినిమాలో మాత్రమే నిజాయితీ గల పోలీసు ఆఫీసర్‌కు ఏదైన జరిగితే జనం పోరాడటం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే... నిజాయితీగా పనిచేస్తున్న పాల్ఘర్ జిల్లా ఎస్పీని మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆయనను వెనక్కి తీసుకురావాలంటూ పాల్ఘర్ గ్రామస్థులు ఆన్లైన్లో క్యాంపెయిన్ నిర్వహిస్తూ సంతకాలు స్వీకరిస్తోన్నారు. పాల్ఘర్ మూక దాడులకు సంబంధించి ఎస్పీ గౌరవ్ సింగ్‌ని 5 రోజుల క్రితం అత్యవసర సెలవు తీసుకొని వెళ్లాల్సిందిగా మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే గౌరవ్ వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇసుక మాఫీయా, గుట్కా, లిక్కర్ మాఫియాని అన్నింటిని అరికట్టారని పాల్ఘర్ ప్రజలు తెలిపారు. ఆయన వచ్చినప్పటి నుంచే ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి బంధం ఏర్పడిందని చెప్పారు. గౌరవ్ వారందరి ఆస్తి అని, ఆయన సూపర్ కాప్ అని పేర్కొన్నారు. (ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్!) అయితే పాల్ఘర్లో మూకదాడి జరిగిన వెంటనే ప్రభుత్వం అయనను వెంటనే మే 8 తేదీన సెలవు మీద పంపించేసింది. ఆయనను మళ్లీ వెనక్కి రప్పించడానికి సుజిత్‌సింగ్, సామాజిక కార్యకర్త కరణ్ చౌదరి ఆధ్వర్యలో ఒక ఆన్లైన్ క్యాంపెయిన్‌ను నడిపిస్తూ సంతకాలు కూడా స్వీకరిస్తోన్నారు. ఇప్పటి వరకు 350 మంది దీని మీద సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాఖ్రేకి గౌరవ్‌సింగ్‌ని వెనక్కి తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేస్తోన్నారు. పాల్ఘర్ మూకదాడులలో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కేసుకు సంబంధించి రాష్ట్ర క్రిమినల్ ఇన్వేస్టిమెంట్ డిపార్ట్మెంట్ 12 మందిని అరెస్ట్ చేసింది. వారిలో ఒక మైనర్ కూడా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన నిందితుల సంఖ్య 146 కి చేరింది. (సుప్రీంలో తొలిసారి ఏకసభ్య ధర్మాసనాలు) -
వరినాట్లు వేస్తున్న ఎస్పీ
సాక్షి, చిత్తూరు: ఏందబ్బా! ఈయనెరో పోలీసాయన్లా ఉండాడే.. వరినాట్లేస్తాండేందబ్బా.. అని అట్లా కళ్లార్పకుండా చూస్తాండారా!? పైన కనిపిస్తున్న ఫొటోలో ఉండేదంతా నిజమే..ఆ సారు తిరుపతి ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి. మంగళవారం మిట్ట మజ్జానం ఎలబారి ఏర్పేడు మండలానికొచ్చినాడు..రాజులపాలెం ఊర్లో సరుకులు పంచేదానికి. ఆ ఊరికాడ రోడ్డు పక్కనే మడికయ్యల్లో వరినాట్లేస్తున్న కూలోల్లు, రైతుల్ని ఆయన్జూసినాడు. అప్పుడు టయిం ఒకటీ ముక్కాలైంది. నడినెత్తిన ఎండ సుర్రుమంటున్నా పనులు చేసేది చూసినాడు. ఆయన ఇస్కూలు సదివే టయింలో పొలం కాడ చేసిన పనులు గాపకం వచ్చినాయేమో!? కాలిబూట్లు తీసేసినాడు. మోకాలిదాకా ప్యాంటు ఎగదీసి, కయ్యలో దిగినాడు. పగ్గాలు పట్టుకుని ఎస్పీ సారు అదిలించేకాడికి కాడెద్దులు ముందుకు కదిలినాయి. కొంచేపు నల్లమాను పనులు చేసినాడు. కొంచేపటికి వరినాట్లు ఏసేది మొదలుబెట్టినాడు. ఆడ పనికొచ్చిన కూలీలు ఎస్పీతో కలిసి ఖుషీగా నాట్లేసినారు. ఆ తర్వాత ఎస్పీ వాళ్లందరికీ నిత్యావసర సరుకులు, అరటిపండ్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. తానూ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానన్నారు. పుట్టుకతో పిల్లలకు భాష నేర్పించేందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో వ్యవసాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ పల్లెలన్నీ పచ్చదనంతో కరోనాకు దూరంగా ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. వ్యవసాయ కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎస్పీ రమేష్ రెడ్డి -
ఇర్ఫాన్ కాల్ కోసం ఎదురు చూస్తా
సాక్షి, జైపూర్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంపై ఆయన చిన్ననాటి స్నేహితుడు భరత్ పూర్ (రాజస్థాన్) ఎస్పీ హైదర్ అలీ జైదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తన స్నేహితుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. ఇర్ఫాన్ గొప్ప మనిషి అని వ్యాఖ్యానించిన ఆయన ఏ క్షణమైనా అతడినుంచి ఫోన్ వస్తుందని ఇప్పటికీ ఎదురు చూస్తున్నానంటూ కంటతడి పెట్టారు. ఇంతటి విషాదాన్ని తట్టుకునే ధైర్యం ఆ కుటుంబానికి కలగాలని ప్రార్థించారు. ఇర్ఫాన్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన జైదీ ఈ సందర్భంగా ఇర్ఫాన్ జీవితానికి సంబంధించి ఒక విషయాన్ని పంచుకున్నారు. ఇర్ఫాన్ ఉపాధ్యాయుడు కావాలని ఆమె తల్లి కోరుకున్నారని జైదీ గుర్తు చేసుకున్నారు. (ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత) క్యాన్సర్ బారిన పడిన ఇర్ఫాన్ ఖాన్ లండన్ లో కొంతకాలం చికిత్స పొందారు. ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన ఇర్ఫాన్ తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. కాగా గత వారం, ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) జైపూర్‌లో కన్నుమూశారు. అయితే లాక్ డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. Irrfan Khan's friend, Haider Ali Zaidi, the SP of Bharatpur, shares a video after coming to know of his death pic.twitter.com/IsZhRVAWEq — Jayadev (@jayadevcalamur) April 29, 2020