
సాక్షి, తిరుపతి: రక్షణ కల్పించాలంటూ తిరుపతి ఎస్పీని ప్రేమ జంట ఆశ్రయించింది. అమ్మాయి తల్లిదండ్రులు నుండి తమకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు అంగీకరించలేదు.
చంద్రగిరి మండలం మల్లయ్యగారి పల్లికి చెందిన పవన్, అదే గ్రామానికి చెందిన నీరజను ప్రేమించి బెంగళూరులో వివాహం చేసుకున్నాడు. ఇరువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో యువతిపై మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును విచారించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు.
చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా?
Comments
Please login to add a commentAdd a comment