love couples
-
హైదరాబాద్ కూకట్ పల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య
-
Valentines Day 2023: నువ్వుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా
ప్రేమ.. అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ.. వెలకట్టలేని సంపద. నిస్వార్థమైన, నిజాయతీతో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది..శక్తివంతమైనది. ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించే భావోద్వేగమే ప్రేమ. ఏ బంధమైన వికసించాలన్నా..చిరకాలం నిలవాలన్నా ప్రేమ ఒక్కటే మార్గం. అది ఇద్దరు వ్యక్తుల మధ్య అయి ఉండవచ్చు.. లేదా కుటుంబం, సమాజం మీద అయి ఉండవచ్చు. నిజమైన ప్రేమ ధనంతో.. బలంతోనే దక్కించుకునేది కాదు. నిజమైన ప్రేమను నిజంగా ప్రేమించడం ద్వారానే జయించగలం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది తమ నిజమైన ప్రేమతో జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. ప్రేమను గెలిపించి.. పెళ్లి బంధంతో ఏకమై ప్రేమానుభూతులను ఆస్వాదిస్తున్నారు. నువ్వుంటే నా జతగా... నేనుంటా నీ ఊపిరిగా అంటూ దేహాలు వేరైనా మన ప్రేమ ఒక్కటే అంటూ ముందుకు సాగుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో కొంతమంది ప్రేమానుభూతులు వారి మాటల్లో.. అలుపెరగని ప్రేమ జన్నారం: మండలంలోని పొనకల్‌కు చెందిన మూల భాస్కర్‌గౌడ్, రేణుక ఇంటర్‌లోనే ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒక్కటే అయినా వయస్సు రీత్యా మైనర్లు కావడంతో ఐదేళ్లపాటు ఆగి ఆతర్వాత పెద్దలను ఒప్పించి 1980 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. ప్రేమించడమే కాకుండా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నప్పుడే ఆ ప్రేమ చిరకాలం నిలుస్తుందని, తల్లిదండ్రులను బాధపెట్టవద్దన్నది మా ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు. – భాస్కర్‌గౌడ్, రేణుక పెద్దలను ఒప్పించి.. చెన్నూర్‌రూరల్: పట్టణంలోని మంగళి బజార్లో నివాసం ఉంటున్న కారెంగుల శ్రావణ్ పటేల్, మానసరాణి దంపతులది ప్రేమ వివాహం. 2011లో మానస కాలేజీకి వెళ్తుండగా చూసిన శ్రావణ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. సుమారు ఐదేళ్లపాటూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కావడంతో యువతి ఇంటికి వెళ్లి పెద్దలతో మాట్లాడాడు. పెళ్లికి ఒప్పుకోవడంతో 2016లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమారులు జన్మించారు. శావణ్ సోదరుడు సందీప్‌ది కూడా ప్రేమ వివాహమే. విజయ అనే యువతిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. – కారెంగుల శ్రావణ్, మానస రాణి నమ్మకమైన బంధానికి ప్రతిరూపం గుడిహత్నూర్: నమ్మకమైన బంధానికి ప్రతి రూపమే ప్రేమ అని.. ఇది లేకుండా మనిషి సంఘ జీవుడు కాలేడని చెప్తున్నారు ఉపారపు సత్యరాజ్–పార్వతి దంపతులు. మండలంలోని లింగాపూర్‌కు చెందిన సత్యరాజ్ 2017లో హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా అక్కడే పనిచేస్తున్న ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని గోయగాంకు చెందిన పార్వతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరుకావడంతో ఇరువురి పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గతేడాది జనవరి 25న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – సత్యరాజ్, పార్వతి ప్రేమలో గెలిచి.. బోథ్: మండల కేంద్రానికి చెందిన కట్ట పల్లవి, భూమేశ్ దంపతులది ప్రేమ వివాహం. ఒకే కాలనీలో ఉంటున్న ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇరువురి కులాలు వేరుకావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో 2011లో తలమడుగు మండలం కజ్జర్ల శివారులోని శివాలయంలో స్నేహితుల మధ్య వివాహం చేసుకున్నారు. వివాహమైన వారం రోజులకే ఇరువురి కుటుంబసభ్యులు కలిసిపోయారు. అప్పటినుంచి వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది. ఏడాడూ వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదని దంపతులు పేర్కొంటున్నారు. – కట్ట పల్లవి, భూమేశ్ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొని.. తాంసి: తాంసి మండల కేంద్రానికి చెందిన రేండ్ల అజయ్, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన అనూష హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2010లో వివాహం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూనే చదువును పూర్తి చేశారు. అజయ్ ఎంబీఏ పూర్తి చేసి ఫార్మా కంపనీలో మార్కెటింగ్ ఉద్యోగంలో చేరాడు. రెండేళ్ల క్రితం అల్‌మైటి ఫార్మా కంపనీ ప్రారంభించాడు. అనూషను సైతం జీఎన్ఎం శిక్షణ పూర్తి చేయించడంతో హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్లో సీనియర్ నర్స్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దీంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యాయి. సమాజసేవలో సైతం ముందుండి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. – రేండ్ల అజయ్, అనూష చదువు అండగా నిలిచింది నిర్మల్‌చైన్‌గేట్: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్న సమయంలో ఆదిలాబాద్‌కు చెందిన కేంద్రీ సోనీతాయ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పీజీ పూర్తి చేసిన రెండేళ్ల తర్వాత ఇద్దరం హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఉద్యోగంలో చేరాం. ఇద్దరి కులం ఒక్కటైనా భాష వేరుకావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. సెప్టెంబర్ 26, 2015న నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయంలో వివాహం చేసుకున్నాం. మేము చదివిన చదువు మాకు అండగా నిలిచింది. ప్రస్తుతం ఇద్దరం నిర్మల్‌లోనే లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాం. 2018లో పాప జన్మించింది. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు మా ప్రేమను అర్థం చేసుకొని మాతో కలిసిపోయారు. – బలాస్ట్ శివరామకృష్ణ, కేంద్రీ సోనీతాయ్ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొని.. తాంసి: తాంసి మండల కేంద్రానికి చెందిన రేండ్ల అజయ్, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన అనూష హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2010లో వివాహం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూనే చదువును పూర్తి చేశారు. అజయ్ ఎంబీఏ పూర్తి చేసి ఫార్మా కంపనీలో మార్కెటింగ్ ఉద్యోగంలో చేరాడు. రెండేళ్ల క్రితం అల్‌మైటి ఫార్మా కంపనీ ప్రారంభించాడు. అనూషను సైతం జీఎన్ఎం శిక్షణ పూర్తి చేయించడంతో హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్లో సీనియర్ నర్స్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దీంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యాయి. సమాజసేవలో సైతం ముందుండి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. – రేండ్ల అజయ్, అనూష -
లేటు వయసులో ఘాటు ప్రేమ.. లవర్‌కు ఆస్తి రాసిచ్చేశాడు.. తర్వాత ట్విస్ట్
సేలం: ‘‘కురువృద్ధుడైన నా భర్త అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట వేసి, మా ఆస్తిని మాకు అందించండి లేకుంటే కారుణ్య మరణానికైనా అమతివ్వండి’’ అంటూ 82 ఏళ్ల వృద్ధురాలు తన 90 ఏళ్ల భర్తపై కలెక్టర్‌కు మంగళవారం ఫిర్యాదు పేర్కొంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సేలం జిల్లా ఓమలూరు తాలూకా డేనిస్పేట పెరియవడాగపట్టికి చెందిన పళనియప్పన్ (90). ఇతని భార్య పొన్నమ్మాల్ (82). ఈమె తన కుమార్తె కమలా (65)తో మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చింది. అందులో.. తనకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారన్నారు. అనారోగ్యంతో కుమారుడు 70 ఏళ్ల వయసులో మరణించాడని పేర్కొంది. అయితే తన భర్త పళనియప్పన్ కుప్పాయి (70) అనే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించింది. అక్రమ సంబంధాన్ని వదులుకోవాలని పలుమార్లు తాము చెప్పినా పళనియప్పన్ వినిపించుకోలేదని వాపోయింది. పైగా ఇటీవల పళనియమ్మాల్ (70) అనే మరో మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పేర్కొంది. తమకు సొంతమైన లక్షల విలువ చేసే 6.5 ఎకరాల భూమిని పళనియమ్మాల్ పేరుతో రాసేశాడని ఆరోపించింది. అదేమిటని ప్రశి్నస్తే తాము మనవడితో నివసిస్తున్న ఇంటిని కూడా కూల్చివేస్తానని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వయసులో కూలి పనికి వెళ్లి పని చేసుకుంటూ కష్ట పడుతున్నానని, భర్త అక్రమ సంబంధాలను అడ్డుకుని, తన ఆస్తిని తిరిగి ఇప్పించి భద్రత కలి్పంచాలని కోరుతున్నాను.. అలా వీలుకాని పక్షంలో కారుణ్య మరణానికైనా అనుమతివ్వాలని వేడుకున్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టి తగిన న్యాయం చేయాలని పోలీసు శాఖను కలెక్టర్ కార్యాలయం ఆదేశించింది. -
ఇద్దరిదీ ఒకే ఊరు.. సినిమాను తలపించే లవ్‌స్టోరీ.. పోలీస్‌స్టేషన్‌లో ప్రేమజంట..
పొన్నూరు(గుంటూరు జిల్లా): ప్రేమజంట పోలీసులను ఆశ్రయించిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రేమజంట తెలిపిన వివరాలు మేరకు.. వడ్డిముక్కల గ్రామానికి చెందిన శీలం అవినాష్, అదే గ్రామానికి చెందిన జె.ఏస్తేర్రాణి ఒకరినొకరు ప్రేమించుకొని ఆదివారం వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలతో తమకు హాని ఉందని రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ప్రేమజంటకు చెందిన ఇరుకుటుంబాలతో ఎస్ఐ భార్గవ్ మాట్లాడి అబ్బాయి అవినాష్ తల్లిదండ్రులతో ప్రేమజంటను పంపించారు. చదవండి: బ్రష్ చేయడం కూడా మరిచిపోతున్నారా?.. అయితే కారణం ఇదే.. -
సాఫ్ట్వేర్ లవ్‌స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..
సాక్షి, తిరుపతి: రక్షణ కల్పించాలంటూ తిరుపతి ఎస్పీని ప్రేమ జంట ఆశ్రయించింది. అమ్మాయి తల్లిదండ్రులు నుండి తమకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు అంగీకరించలేదు. చంద్రగిరి మండలం మల్లయ్యగారి పల్లికి చెందిన పవన్, అదే గ్రామానికి చెందిన నీరజను ప్రేమించి బెంగళూరులో వివాహం చేసుకున్నాడు. ఇరువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో యువతిపై మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును విచారించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా? -
విషాదాంతమైన ప్రేమ పెళ్లి
-
ప్రేమజంట పరారుతో ఉద్రిక్తత
జగ్గంపేట(తూర్పు గోదావరి జిల్లా): ఒక ప్రేమజంట ఈ నెల 27న తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోవడంతో గండేపల్లి మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత నెలకొంది. అబ్బాయి తండ్రిపై అమ్మాయి కుటుంబ సభ్యులు ఆదివారం దాడి చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జగ్గంపేట సీఐ సూరి అప్పారావు అందించిన వివరాలు ఇలా వున్నాయి. ఉప్పలపాడుకు చెందిన పిల్లి కృష్ణకుమార్ సీతానగరం మండలం ఇనుగంటివారి పేటకు చెందిన అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి అమ్మమ్మగారి గ్రామమైన ఉప్పలపాడు వచ్చి వెళుతున్న నేపథ్యంలో కృష్ణకుమార్‌కు ఆమెకు పరిచయం ఏర్పడిగా ప్రేమగా మారింది. సంక్రాంతికి అమ్మాయి ఉప్పలపాడు వచ్చి అమ్మమ్మగారి ఇంటి వద్ద ఉన్న నేపథ్యంలో ఈ నెల 27న ప్రేమజంట కనిపించకుండా పోయింది. ఆదివారం అబ్బాయి తండ్రి పిల్లి గోవింద్ ఇంటి వద్ద ఉన్న సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు అక్కడ చేరుకుని అమ్మాయి ఆచూకీ కోసం ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో అమ్మాయి తరఫు వారు అబ్బాయి తండ్రి గోవింద్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ గోవింద్‌ను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి గండేపల్లి ఎస్సై శోభన్‌కుమార్ తరలించారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. గోవింద్ పై దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేశారు. -
ముందు ప్రేమ, ఆపై దూరం.. తట్టుకోలేక ఒకరినొకరు పొడుచుకున్న ప్రేమికులు
సాక్షి, చెన్నై: పెళ్లికి నిరాకరించిన ప్రియురాల్ని ప్రియుడు కత్తితో పొడిచాడు. అతడి నుంచి తప్పించుకునే ›క్రమంలో ఇంట్లో ఉన్న కత్తితో ప్రియురాలు కూడా దాడి చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు మరణించగా, ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాలు.. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరులో ఓ ప్రైవేటు నూలు పరిశ్రమ ఉంది. ఇక్కడ ఉత్తరాదికి చెందిన కార్మికులు అధికంగా పనిచేస్తున్నారు. ఇందులో చత్తీస్‌గడ్‌కు చెందిన తులసి (20), రూపేష్ కుమార్(24) కూడా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు తొలుత ప్రేమించుకున్నారు. తర్వాత అతడిని ఆమె దూరం పెట్టింది. చదవండి: కేపీహెచ్‌బీ కాలనీ: హాస్టల్లో యువతి ఆత్మహత్య దీంతో ఆగ్రహించిన రూపేష్‌కుమార్ తనను పెళ్లి చేసుకోవాలని తులసిపై ఒత్తిడి తెచ్చాడు. ఈక్రమంలో శనివారం రాత్రి విధుల్ని ముగించుకుని తులసి తమకు కేటాయించిన క్వార్టర్స్‌లోని ఇంట్లోకి వెళ్లగానే, రూపేష్‌కుమార్ కూడా చొరబడి.. కత్తితో ఆమెపై దాడి చేశాడు. తనను తాను రక్షించుకునేందుకు ఇంట్లో ఉన్న కత్తి తో తులసి ఎదురు దాడి చేసింది. చివరికి కత్తిగాట్ల తో తులసి ఘటనాస్థలంలోనే మరణించింది. గాయ పడిన రూపేష్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నామక్కల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. పెద్దలకు తెలియడంతో -
విశాఖ అమ్మాయి..ఐర్లాండ్ అబ్బాయి
మధురవాడ(భీమిలి): ప్రేమ..ఖండాంతరాలను దాటింది. విశాఖలోని మధురవాడకి చెందిన అమ్మాయి..ఐర్లాండ్ దేశ అబ్బాయి పెద్దలను ఒప్పించి..గురువారం ఒక్కటయ్యారు. జీవీఎంసీ 6వ వార్డు మధురవాడ రేవళ్లపాలేనికి చెందిన పిళ్లా శ్రీమన్నారాయణ, నిర్మల దంపతుల కుమార్తె డాక్టర్ చాముండేశ్వరి చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తుంది. ఐర్లాండ్‌కు చెందిన డాక్టర్ రాబర్ట్ చారల్స్ పవర్ జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మనిషి పుట్టుక పూర్వోత్తరాలు, జబ్బులు తదితర అంశాలపై పరిశోధనలు చేస్తున్నాడు. ఏయూ నుంచి డాక్టరేట్ కూడా పొందాడు. 2016లో హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. 2018లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2019లో వీరి నిశ్చితార్థం జరగ్గా వివాహం విశాఖలోని సాగర్‌నగర్ బే లీఫ్ రిసార్ట్‌లో గురువారం రాత్రి జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వరుడు పూజా కార్యక్రమాలు పూర్తి చేశాడు. -
విషాదం: రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య
యర్రగొండపాలెం(గుంటూరు జిల్లా): వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని శతకోడుకు చెందిన షేక్.ఆదాం (22) మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన శ్యామలత (20) గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇంటర్ పూర్తి చేసింది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలని భావించి పెద్దలకు చెప్పారు. అందుకు వారు అంగీకరించలేదు. ఇంతలోనే ఆదాంకు తన సామాజికవర్గానికి చెందిన అమ్మాయితో ఈ నెల 4వ తేదీ వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. దీనిని ప్రేమికులిద్దరూ జీర్ణించుకోలేకపోయారు. సోమవారం పని మీద వెళ్తున్నామంటూ ఇంట్లో చెప్పి ఇద్దరూ వేర్వేరుగా వినుకొండ చేరుకున్నారు. అక్కడే రైలు కిందపడి తనువు చాలించారు. ఘటనపై నరసరావుపేట రైల్యే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మేమిద్దరం చనిపోతున్నాం..సెల్ఫీ వీడియో వైరల్..!
సాక్షి,కదిరి: ఓ ప్రేమ జంట బుధవారం కదిరి ప్రాంతంలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు కావడంతో అప్రమత్తమైన ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు కదిరి డీఎస్పీ భవ్యకిశోర్, పోలీసులు వారి ఆచూకీ కనుగొని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారు పురుగుల మందు కలిపిన స్ప్రైట్ బాటిల్ పడేసి, పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ప్రేమజంట పోస్టు చేసిన వివరాలు పోలీసులు వెల్లడించారు. ‘నా పేరు శివప్రత్యూష, నాకు 18 ఏళ్లు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి గ్రామం. నా ప్రియుడితో కలిసి నేను ఇల్లు వదిలి వచ్చినప్పుడు నాకు 18 ఏళ్లకు రెండు నెలలు తక్కువగా ఉండేది. అప్పుడు మేము పెళ్లి చేసుకోవడానికి నా వయసు అడ్డంకిగా మారింది. అందుకే మా తల్లిదండ్రులు అక్కడ నన్ను ఎవరో కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టినట్లు తెలిసింది. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లినా మళ్లీ మా తల్లిదండ్రులు మమ్మల్ని విడదీయడం ఖాయం. అందుకే స్ప్రైట్ బాటిల్లో పురుగుల మందు కలుపుకుని తాగేసి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాం’ అంటూ ఆ యువతి మాట్లాడుతుంటే... ఇరువురూ కనబడే విధంగా ఆ బాటిల్‌ని పైకెత్తి గుటగుట తాగడం ఆమె ప్రియుడు సెల్ఫీ వీడియో తీసి సామాజిక మా«ధ్యమాల్లో పోస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్న వారి కోసం సీఐ నిరంజన్‌రెడ్డి, సిబ్బంది గాలిస్తున్నారు. -
పెళ్లికి నిరాకరణ.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, యువతి మృతి
లింగంపేట (ఎల్లారెడ్డి): ఇంట్లో పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారని మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన దివ్య అలియాస్ బ్యాగరి మాధవి (17), నీరడి రాజు (23) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇంటి పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గత నెల 30న గ్రామ శివారులోని పంట చేనుకు వెళ్లి గడ్డి మందు తాగారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇరువురిని చికిత్స నిమిత్తం హైదరాబాలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మాధవి మృతి చెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉంది. మాధవి 10వ తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. రాజు 10వ తరగతి పూర్తి కాగానే దుబాయి వెళ్లాడు. అక్కడ రెండేళ్లు ఉన్న అనంతరం కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్డౌన్లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలు తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ఆత్మహత్యకు ముందు వీడియో తీసి..
హాలియా (గుంటూరు జిల్లా): ఆ ఇద్దరూ మూగవారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతనితో యువతి ప్రేమలో పడింది. అయితే.. యువకుడికి ఇప్పటికే పెళ్లయ్యింది. ఇద్దరి మతాలు వేరుకావడం, యువకుడికి అప్పటికే పెళ్లికావడం.. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో కలిసి జీవించలేమని భావించి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేట గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలీ (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. అతనికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. (చదవండి: అయ్యో.. ఎంత ఘోరం!) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నిజామాబాద్ జిల్లా ఎడవెల్లి మండలం జక్కంపేట గ్రామానికి చెందిన నందిపాటి అశ్విని (20) కూడా అతనితో పాటే అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ చెవిటి, మూగవారు. ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన అశ్విని కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో పాటు ఇదివరకే మస్తాన్‌వలీకి పెళ్లయి భార్య కూడా ఉండడంతో ఇరు కుటుంబాలూ వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి షేక్ మస్తాన్ వలీ, అశ్విని ద్విచక్ర వాహనంపై నాగార్జునసాగర్‌కి వచ్చారు. ఈనెల ఏడో తేదీన ఇంటినుంచి బయటకు వెళ్లిన అశ్విని తిరిగి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కాలువలో 8 కిలోమీటర్లు కొట్టుకుపోయి..) నాగార్జునసాగర్‌లో బుధవారం రాత్రి వరకు ఉన్న ప్రేమజంట ఆ తర్వాత అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై అనుముల మండలంలోని పాలెం స్టేజీ సమీపంలో ఉన్న రైతు కర్ణం శేషయ్య పొలం వద్దకు వచ్చారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. అయితే అంతకుముందు నాగార్జునసాగర్‌లో ఉన్నప్పుడే తాము చనిపోతున్నట్టు (సైగల ద్వారా) వారు సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపారు. దీంతో మస్తాన్‌వలీ, అశ్విని ఆచూకీ కోసం వారి స్నేహితులు సాగర్‌కి వచ్చారు. గూగుల్ లొకేషన్ ద్వారా ఆరా తీసుకుంటూ గురువారం ఉదయం అనుముల మండలంలోని పాలెం స్టేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ వ్యవసాయ పొలంలో విగతజీవులుగా పడివున్న ప్రేమజంటను చూసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ మృతుల ఆధార్, ఐడీ కార్డులు లభించడంతో వాటి ఆధారంగా షేక్ మస్తాన్‌వలీ, అశ్వినిగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. -
పిల్లల పెళ్లి.. ఆ జంట మళ్లీ జంప్!
సూరత్ : వరుడి తండ్రితో వధువు తల్లి పారిపోయిన ఘటన మరో మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం ఇంటికి తిరిగొచ్చిన ప్రేమికుల జంట మరోసారి పారిపోయింది. పిల్లలకు పెళ్లి చేయాల్సిన ఆ జంట నెలరోజుల గ్యాపులో రెండు సార్లు ఇంటి నుంచి పారిపోవటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సూరత్‌కు చెందిన హిమ్మత్ పాండవ్(46), నవ్సారికి చెందిన శోభ్న రావల్(43)లు చిన్నతనంలో ఒకే ఊర్లో కలిసి ఉండేవారు. ఇద్దరు ప్రేమించుకున్నప్పటికి కొన్ని అనివార్యకారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ తర్వాత శోభ్నకు పెళ్లి జరగటంతో ఆమె నవ్సారికి వెళ్లిపోయింది. చాలా ఏళ్ల తర్వాత తమ పిల్లలకు పెళ్లి చేయటానికి ఈ జంట కలిసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిమధ్యా పాత జ్ఞాపకాలు పురులు విప్పాయి, మళ్లీ ప్రేమ చిగురించింది. ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఖరారై పనులు కూడా శరావేగంగా జరిగిపోతున్నాయి. పెళ్లికి ఇంకో వారం ఉందనగా జనవరి 10న హిమ్మత్, శోభ్నలు ఇంటినుంచి పారిపోయారు. దీంతో కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. రెండు వారాల తర్వాత ఆ ఇద్దరు ఇళ్లుకు తిరిగొచ్చారు. అయితే శోభ్న భర్త ఆమెను ఇంట్లోకి రానివ్వక పోవటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఈ శనివారం ప్రేమికులిద్దరూ మరోసారి ఇళ్లనుంచి పారిపోయారు. వీరి విషయం తెలిసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా, ప్రేమికుల జంట సూరత్‌లోని ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నట్లు సమాచారం. ( వరుడి తండ్రితో వెళ్లిపోయిన వధువు తల్లి..! ) -
రహస్యంగా ప్రేమజంటల వీడియోలు..
కర్ణాటక, కృష్ణరాజపురం : కబ్బన్‌పార్కులో రహస్యంగా ప్రేమజంటల వీడియోలు చిత్రీకరిస్తున్నాడనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులుఓ వ్యక్తిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుధీర్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కబ్బన్‌పార్కు అంతటా కలియతిరుగుతూ ఉన్నాడు. ఇది గమనించిన కొంతమంది వ్యక్తులు పార్కులోని ప్రేమజంటలు, యువతీ యువకులను మొబైల్లో రహస్యంగా చిత్రీకరిస్తున్నాడని భావించారు. దీంతో సుధీర్‌పై హఠాత్తుగా రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న కబ్బన్‌పార్కు పోలీసులు సుధీర్‌ను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గాయపడిన సుధీర్ -
ప్రేమజంటపై దాడి.. యువతిపై సామూహిక లైంగికదాడి
చెన్నై ,వేలూరు: వేలూరు కోటలోని పార్కులో మూడు రోజుల క్రితం ప్రేమజంటపై దాడి చేసి యువతిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మంగళవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో వేలూరు కస్పాలోని వసంతపురానికి చెందిన ఆడైమణి(41), శక్తివేల్(19), అజిత్(19) ఉన్నారు. వీరు రోజూ గంజాయి, మత్తు పదార్థాలు సేవించి పార్కుకు వచ్చే పర్యాటకుల వద్ద దోపిడీలకు పాల్పడేవారు. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి దోపిడీలకు పాల్పడుతు న్న వారి జాబితాను తయారు చేశారు. వారిని తమదైన శైలిలో విచారించగా ముగ్గురు యువకులు దొరికారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ‘ఈ నెల 18వ తేది రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురు నిందితులు గంజాయి మత్తులో కోట పార్కులో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ ప్రేమ జంట కోట గాంధీ విగ్రహం వెనుక ఉన్న గేటు ఎక్కి లోనికి ప్రవేశించారు. సుమారు 200 మీట ర్ల దూరంలో చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నారు. వీరిని గమనించిన నిందితులు వారిపై దాడి చేశారు. యువతి ధరించిన కమ్మలు, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ప్రియుడి మెడపై కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించారు. అనంతరం యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. నింతులపై గతంలోనే కేసులు.. ఇదిలా ఉండగా ఈ కేసులో అరెస్టయిన అజిత్, శక్తివేల్‌పై నార్త్ పోలీస్‌స్టేషన్‌లో పలు దారి దోపిడి కేసులున్నాయి. రెండేళ్ల నుంచే వీరు కోట పార్కుకు వచ్చే పర్యాటకుల వద్ద దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో శక్తివేల్, అజిత్‌లు మైనర్లు (17) కావడంతో వారిని అరెస్ట్ చేసేందుకు కుదరలేదని పోలీసులు తెలిపారు. ప్రేమ జంటలకు అనుమతి నిరాకరణ.. ప్రేమజంటపై వేలూరు కోటలోని పార్కులో యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్కులో పోలీసులు నిఘా పెట్టారు. రాత్రి సమయాల్లో జంటలు అటువైపు రాకుండా చూస్తున్నారు. -
ఆత్మహత్యకు పాల్పడిన నూతన్, అపూర్వ
కర్ణాటక, యశవంతపుర : తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి వివాహం చేసుకున్న ప్రేమజంట తుదకు జీవితాన్ని చాలించింది. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలుకాలో జరిగింది. నూతన్(25) అపూర్వ(22)లు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను అంగీకరించి వాహం చేయాలని పెద్దలను కోరారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇటీవల పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అయినా పెద్దలు ఒప్పకొంటరాని ఎంతోగానో ఎదురు చూశారు. అయితే పెద్దలు వారి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో రెండు రోజుల క్రితం ప్రేమజంట తాము నివాసం ఉంటున్న అద్దె ఇంటిలోనే విషం సేవించారు. ఇరు కుటుంబాల వారు గమనించి వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నూతన్, అపూర్వలు బుధవారం మృతి చెందారు. ఘటనపై ఒణకల్, గోణిబీడు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమజంటలే టార్గెట్
నేరేడ్మెట్: నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతున్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న నకిలీ పోలీసును రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నేరేడ్మెట్లోని సీపీ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. ఉప్పల్ పరిధిలోని మేడిపల్లి(బుద్దానగర్)కు చెందిన చింతల చందు అలియాస్ చంద్రశేఖర్ మేడిపల్లిలో ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. గతంలో అతడి సోదరిని ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడు. అప్పటి నుంచి ప్రేమికులపై ద్వేషం పెంచుకున్నాడు. 2002లో ఓఆర్ఆర్ సమీపంలో ఓ ప్రేమ జంటను బెదిరించి వారి నుంచి రూ.2వేల నగదు దోచుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హయత్‌నగర్ పోలీసులు అదే రోజు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత కొన్నాళ్లు తన స్వస్థలమైన మల్లాపూర్‌కు వెళ్లిన చంద్రశేఖర్ చేపల వ్యాపారం చేసి భారీగా నష్టపోయాడు. మళ్లీ నగరానికి వచ్చిన అతను సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఏకాంతం కోసం ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలకు వచ్చే ప్రేమ జంటలను దోచుకునేందుకు పథకం పన్నాడు. వారి వద్దకు వెళ్లి పోలీసునని బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు లాక్కునేవాడు. బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్ సర్వీస్ రోడ్లో అనుమానాస్పదంగా కనిపించిన చంద్రశేఖర్‌ను ఎల్బీనగర్ సీసీఎస్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ పోలీసు గుట్టురట్టయ్యింది. రెండేళ్లుగా అతను అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పోచంపల్లి, హయత్‌నగర్, ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట్ ఠాణాల పరిధిలో సుమారు 30 దోపిడీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 9.5 తులాల బంగారం, రూ.3లక్షల నగదు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో క్రైం డీసీపీ రాంచంద్రారెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఎల్బీనగర్ సీసీఎస్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పాల్గొన్నారు. -
ప్రేమ జంటలను ఉపేక్షించేది లేదు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: బహిరంగ నేరాలను పోలీసులు అడ్డుకుంటారు. మరి వివాహేతర సంబంధాల నేపథ్యంలో చాటుమాటు ఘాతుకాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రికార్డుల ఆధారంగా గడిచిన పదేళ్లలో తమిళనాడులోని 1,459 హత్యలు వివాహేతర సంబంధాల వల్లనే జరిగినట్లు స్పష్టమైంది. సేలం జిల్లాకు చెందిన ఒక గృహిణి కనిపించకుండాపోయిన తన 19 ఏళ్ల తన కుమార్తెను కోర్టులో ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ అడ్కొనర్వు పిటిషన్‌ను ఇటీవల దాఖలు చేసింది. పెళ్లయి, పిల్లలు కలిగిన తన మేనమామ లోకనాథన్తోనే ఆమె కుమార్తె వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే యువతిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. సినీ నటీమణులు కనిపించకుండా పోతే నే గాలింపు చేస్తారా, సాధారణ యువతులను పట్టించుకోరా అని న్యాయమూర్తులు పోలీసులకు ప్రశ్నించారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచా రణకు వచ్చింది. కోర్టు ఆదేశాలతో చెన్నై లా అండ్ ఆర్డర్ ఐజీ ఒక పిటిషన్ దాఖలు చేశారు. గత పదేళ్లలో చెన్నైలో వివాహేతర సంబంధాల వల్ల 1,459 హత్యలు జరిగాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పదేళ్లు అంటే 3,650 రోజులు. 3,650 రోజుల్లో 1,459 హత్యలు అంటే రెండురోజులకో హత్య జరిగిందన్నమాట. ఈ హత్యలన్నీ వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన వే కారణం గమనార్హం. యువత పెడదారి పట్టడానికి ఇంట ర్నెట్, సెల్ఫోన్లలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అశ్లీల వెబ్సైట్లే ప్రధాన కారణమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ ఖుద్దూస్ అవేదన వ్యక్తం చేశారు. ఐజీ కోర్టుకు సమర్పించిన వివరాలను పరిశీలించి కంగుతిన్న న్యాయమూర్తులు.. సమాజంలో పె చ్చుమీరిపోయిన వివాహేతర సంబంధాల సం స్కృతికి మూలకారణం అరచేతిలో (సెల్ఫోన్లు) అశ్లీల వెబ్సైట్లు అందుబాటులోకి రావడమేనని వ్యాఖ్యానించారు. కొన్ని సినిమాలు సైతం యువతను పెడదారి పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. రైల్వేస్టేష్టన్లలో ‘మూడో కన్ను’ ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్లకు చేరుకునే జంటలను ఉపేక్షించేది లేదని పోలీస్‌శాఖ హెచ్చరించింది. 136 రైల్వేస్టేషన్లలో ‘మూడో కన్ను’ ఏర్పాటుతో ప్రేమజంటలపై నిఘా పెడుతున్నామని పేర్కొంది. చెన్నై నగరం, శివార్లలోని పలు ప్రాంతాలను కలుపుతూ పయనించే లోకల్ రైళ్లలో రోజుకు 8 లక్షల మందికి పైగా ప్రయాణిస్తుంటారు. చెన్నై నగరంలోని మాంబళం, తాంబరం తదితర పలులోకల్ స్టేషన్లలో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆగుతాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం వేరే రైల్వే ట్రాక్ కూడా ఉంది. రైలు ప్రయాణికుల వసతి కోసం అనేక కుర్చీలను ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఈ కుర్చీల్లో ప్రయాణికుల కంటే ప్రేమ జంటలే ఆక్రమించుకుని ఉంటారు. గంటల తరబడి ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇదే కోవలో చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో 2016లో స్వాతి అనే ఐటీ ఉద్యోగిని ఒక యువకుడు ముచ్చట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆగ్రహం చెందిన యువకుడు వేటకొడవలితో స్వాతిపై దాడిచేసి దారుణహత్య చేశాడు. అలాగే ఈరోడ్‌కు చెందిన తేన్మొళి అనే ప్రభుత్వ ఉద్యోగినిపై చెన్నై చెట్పట్ రైల్వేస్టేష్టన్‌లో పదిరోజుల క్రితం హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు ఈనెల 21వ తేదీన ప్రాణాలు విడిచాడు. చెన్నై లోకల్ రైల్వేస్టేషన్లలో ప్రేమజంటలు గంటల కొద్దీ బాతాఖాని కొట్టే దృశ్యాలను చూస్తున్న నగరవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్‌కు వచ్చే జంటలపై చర్యలు చేపడతామని పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రేమ జంటలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు నిఘాపెట్టి ఎక్కువ సేపు కూర్చుని ఉంటే రైల్లో ఎక్కించడమో లేక స్టేషన్ నుంచి వెళ్లగొట్టడమో చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన విద్యార్థులు, ఉద్యోగుల గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకుని కమిషనర్ కార్యాలయంలో అప్పగించాలని, సదరు విద్యాసంస్థలకు, కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలని కింది స్థాయి పోలీసులకు ఆదేశాలందాయి. స్వాతి హత్య జరిగిన నుంగంబాక్కం రైల్వేస్టేషన్ సహా 82 స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే చెన్నై చేట్‌పట్‌లో చోటుచేసుకున్న తాజా హత్యాయత్నం తరువాత ప్రేమజంటల కదలికలపై నిఘా పెట్టేందుకు మరో 136 రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. -
పది నిమిషాల్లోనే కిడ్నాపర్ల ఆటకట్టు
అడ్డగుట్ట: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంలో అమ్మాయి కుటుంబసభ్యులు అబ్బాయిపై కక్ష కట్టారు. కిడ్నాప్ చేసి బెదిరించాలని చూశారు. అయితే వారి పాచిక పారలేదు. స్థానికుల సహకారంతో పోలీసులు పది నిమిషాల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించారు. సమాచారం అందించిన వ్యక్తిని సన్మానించి, కిడ్నాపర్లను రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, లాలాగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. సిద్దిపేట జిల్లా పొన్నాల మండలం బత్తిరామన్నపల్లి గ్రామానికి చెందిన శనిగరం శ్రీనివాస్(22), అదే గ్రామానికి చెందిన ఆవాల తితిక్ష(20)లు నాలుగు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరి కుటుంబసభ్యులు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో ఈ నెల 15న నగరంలోని బోయిన్పల్లి ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకొని 16వ తేదీన సిద్దిపేట పోలిస్‌స్టేషన్‌కు వెళ్లి తమ కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రేమజంట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నూతన జంట సిద్దిపేట నుంచి హైద్రాబాద్‌కు వచ్చి లాలాపేటలో నివాసముంటున్నారు. నాలుగు రోజుల క్రితం వీరు లాలాపేటలో ఉంటున్నట్లు అమ్మాయి కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. అమ్మాయి అన్న గోపి(22), అతని స్నేహితులు దశరథమ్(38), క్రాంతికుమార్(25)లతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ తన చిన్నమ్మ కొడుకుతో కలిసి షాపునకు వెళ్లేందుకు బయటకు రాగా వెంటనే టీఎస్ 09ఈయూ 4365 అనే నంబర్ స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చి శ్రీనివాస్‌ను కారులో బలవంతంగా ఎక్కించుకొని పరారయ్యారు. గమనించిన స్థానిక వ్యక్తి వెంటనే శ్రీనివాస్ భార్య తితిక్షకు విషయం చెప్పాడు. ఆమె స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. కారు నెంబర్ ఆధారంగా లాలాగూడ సీఐ శ్రీనివాస్ అన్ని చెక్ పాయింట్లను అలర్ట్ చేశారు. బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో స్విఫ్ట్ కారును అడ్డుకొని శ్రీనివాస్‌ను కాపాడారు. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే కేసును చేందించిన లాలాగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌ను ఏసీపీ శ్రీనివాసరావు అభినందించారు. అదే విధంగా కారు నెంబర్, ఇతర సమాచారం ఇచ్చిన వ్యక్తికి పోలీసులు సన్మానించారు. అనంతరం, కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తుల్లో ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ప్రేమికులపై దాడి
-
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగదళ్ కార్యకర్తలు
-
ప్రేమ జంటపై దాడి : జ్యోతి హత్యకేసులో పురోగతి
-
ప్రేమ వ్యవహారం విషాదాంతం
చెన్నై ,టీ.నగర్: సేలం సమీపాన ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. సేలం జిల్లా, గెంగవల్లి తొడావూరు ప్రాంతానికి చెందిన దినేష్ (20) బీఎస్సీ చదువుతున్నాడు. ఇతను కొన్నేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన సెల్వమణి (20)ను ప్రేమిస్తూ వచ్చాడు. వీరి ప్రేమ విషయం గత నెల ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన దినేష్ గత మూడో తేది ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి స్పృహతప్పాడు. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి చికిత్సలు అందిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సెల్వమణి ఇంట్లో ఉన్న ఎలుకల మందు తిని స్పృహతప్పింది. ఆమెను సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్సలు పొందుతూ ఆమె ఈనెల 9న మృతిచెందింది. ఇదిలాఉండగా కోవై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన దినేష్ మంగళవారం మృతిచెందాడు. దీనిగురించి గెంగవల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విద్యార్థి ఆత్మహత్య: చెన్నై, టీ.నగర్‌లోని భవనం మూడో అంతస్తు నుంచి దూకి కళాశాల విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మదురై జిల్లా, మేలూరుకు చెందిన ఇస్మాయిల్ కుమారుడు షారుక్‌ఖాన్ (19). ఇతను మదురైలోని సెంట్రల్ ప్లాస్టిక్ టెక్నాలజీ కళాశాలలో మూడో ఏడాది చదువుతూ వచ్చాడు. కళాశాల 50వ వార్షికోత్సవం చెన్నైలో జరుగుతోంది. ఇందుకోసం మదురై నుంచి అందరూ మంగళవారం రాత్రి చెన్నై చేరుకున్నారు. ఆ సమయంలో వారు టీ.నగర్, ప్రశాంత్ కాలనీలోగల పేయింగ్ గెస్ట్ పద్ధతిలో అద్దెకు గది తీసుకుని బసచేశారు. ఇదిలాఉండగా షారుక్‌ఖాన్ హఠాత్తుగా భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
శ్రీకాకుళం రూరల్: మండలంలోని బట్టేరు గ్రామానికి చెందిన ప్రేమికులు తమకు భద్రత కల్పించాలంటూ శుక్రవారం శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. బట్టేరుకు చెందిన వి.కామేశ్వరి అదే గ్రామానికి చెందిన కె.రవికుమార్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు వీరి ప్రేమను అడ్డుకున్నారు. కొన్నాళ్లుగా కామేశ్వరికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేమికులిద్దరూ గురువారం మధ్యాహ్నం ఇళ్ల నుంచి వచ్చేసి శ్రీకాకుళం నగరంలోని శ్రీరాఘవేంద్ర స్వామి దేవస్థానాన్ని ఆశ్రయించారు. అదేరోజు రాత్రి అమ్మాయి బంధువులు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఆలయ ధర్మకర్త, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరావు వీరిద్దరినీ శుక్రవారం రూరల్ పోలీస్టేషన్‌కు తీసుకొచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. -
ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంటలు
తమిళనాడు, వేలూరు: రక్షణ కల్పించాలని కోరుతూ ఒకేరోజు మూడు ప్రేమజంటలు గురువారం వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ ఎస్పీ కార్యాలయానికి చేరుకొని రక్షణ కోరారు. అదే విధంగా నాట్రంబల్లి సమీపంలోని పచ్చూరు గ్రామానికి చెందిన జయశ్రీ ప్రవేట్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె పాతపేటకు చెందిన మయిల్ వాణన్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మయిల్‌వాణన్ ఒడిసా రాష్ట్రంలోని ప్రవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరి వివాహానికి ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారు 13వ తేదీన వివాహం చేసుకున్నారు. రక్షణ కల్పించాలని ఎస్పీ కార్యాలయంలో విన్నవించారు. అదే విధంగా ఆంబూరు బీకస్పా ప్రాంతానికి చెందిన దివ్యభారతి ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకలేదు. దివ్య భారతికి వేరే వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇద్దరూ 11వ తేదీన తిరువణ్ణామలైలోని ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. -
ఫేస్బుక్లో పరిణయం లైవ్
తుమకూరు: ఇప్పుడు సోషల్ మీడియా సర్వస్వం అయిపోయింది. ఏ కార్యక్రమాన్నైనా ఆన్లైన్లో నిర్వహిస్తూ యువత హడావుడి చేస్తోంది. దానికి తాజా ఉదాహరణే ఈ పెళ్లి. ఒక ప్రేమ జంట ఫేస్బుక్ లైవ్‌లో పరిణయం చేసుకున్నారు. తుమకూరు జిల్లాలోని మధుగిరి పట్టణానికి చెందిన కిరణ్ అదే ప్రాంతానికి చెందిన అంజన ప్రేమించుకుంటున్నారు. రాజకీయ నాయకుడైన యువతి తండ్రి వారి ప్రేమకు అడ్డుచెప్పడంతో జంట రెండు రోజుల క్రితం ఇళ్ల నుంచి పారిపోయింది. శుక్రవారం ఈ జంట ఒక ఆలయంలో పెళ్లి చేసుకుంది. అంతేకాదు వరుడు తన ఫేస్బుక్ ఖాతాలో పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదుతో మధుగిరి పట్టణ పోలీసులు ప్రేమికుల కోసం గాలిస్తున్నారు. -
రక్షణ బలగంలో రాక్షసుడు
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరిలోని నిర్మానుష్య ప్రాంతంలో తిష్టవేసి, ప్రేమ జంటలపై దాడులకు పాల్పడటమే కాకుండా యువతులపై అఘాయిత్యాలు చేస్తున్నది బిహార్‌కు చెందిన బ్రిజేశ్‌కుమార్ యాదవ్‌గా తేలింది. ప్రస్తుతం ఆర్మీలో సిపాయిగా పని చేస్తున్న ఇతను.. గత డిసెంబర్లో ఆర్మీ మాజీ అధికారి కుమార్తె(మైనర్)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ కేసులో పోలీసులకు చిక్కలేదు. సోమవారం ఓ యువతిపై అత్యాచారయత్నం చేస్తూ గస్తీ పోలీసులకు దొరికాడు. రెండు ఘటనల మధ్య ఉన్న సారూప్యతలతో పాటు డీఎన్ఏ నివేదిక ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి, బేగంపేట ఏసీపీ ఎస్.రంగారావులతో కలసి బుధవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏడాదిన్నరగా నగరంలో విధులు... బిహార్‌లోని రాణిపూర్‌కు చెందిన బ్రిజేశ్‌కుమార్ ఏడాదిన్నరగా సికింద్రాబాద్‌లోని 54 ఇన్ఫాంట్రీ డివిజన్ సిగ్నల్ రెజిమెంట్‌లో సిపాయిగా పని చేస్తున్నాడు. భార్య, కుమార్తెతో కలసి నేరేడ్మెట్ పరిధిలో నివసిస్తున్న ఇతను నిత్యం తిరుమలగిరి ఠాణా పరిధిలోని ఆమ్ముగూడ రైల్వే ట్రాక్ సమీపంలో తిష్ట వేస్తుండేవాడు. సమీపంలోని ఖో–ఇ–ఇమామ్ దర్గా చుట్టుపక్కలకు వచ్చే ప్రేమ జంటల్ని టార్గెట్ చేసేవాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న వారి వద్దకు వెళ్లి యువకులపై దాడి చేసి, యువతులను భయపెట్టి అత్యాచారానికి ఒడిగట్టేవాడు. గత డిసెంబర్ 12న రాత్రి ఆ ప్రాంతంలో ఉన్న ఓ జంటపై దాడి చేశాడు. యువకుడిని తరిమేసి బాలికపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికి ఆ దారి వెంట వెళ్తున్న వారు స్పృహతప్పి పడి ఉన్న బాలికను గుర్తించి వివరాలు ఆరా తీసి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు ఎన్ని కోణాల్లో ప్రయత్నించినా కేసు కొలిక్కి రాలేదు. మళ్లీ యత్నించి పట్టుబడ్డాడు... సోమవారం అదే ప్రాంతంలో బ్రిజేశ్ మరో అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఇంకో ప్రేమజంటను టార్గెట్‌గా చేశాడు. కార్ఖానాకు చెందిన యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో అక్కడకు రాగా వారిని అడ్డగించాడు. యువకుడిపై దాడి చేయడంతోపాటు యువతిని కొట్టి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆమె ఆర్తనాదాలు చేసింది. ఇది విన్న తిరుమలగిరి ప్రాంత పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు వెళ్లి.. బ్రిజేశ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గత డిసెంబర్ నాటి ఘటన అదే ప్రాంతంలో జరగడం, ఆ బాధితురాలు చెప్పిన వివరాలతో పాటు ఇతడి ఆహార్యాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆ నేరానికి ఇతడే బాధ్యుడని అనుమానించారు. పక్కా ఆధారాలతో నిర్ధారణ... గత డిసెంబర్లో, సోమవారం నేరాలు జరిగిన ప్రాంతంతోపాటు దాడి తీరు ఒకేలా ఉండటంతో ఆ కోణంలో పోలీసులు బ్రిజేశ్‌ను ప్రశ్నించారు. అయినా డిసెంబర్ నాటి నేరంతో తనకు సంబం«ధం లేదన్నాడు. దీంతో ఇతడి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి ఫోరె న్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. ప్రత్యేక కేసు కావడంతో 24 గంటల్లోనే ప్రొఫైలింగ్ చేసిన నిపుణులు బాధితురాలి నుంచి సేకరించిన నమూనాలతో పోల్చి డిసెంబర్ నాటి అఘాయిత్యానికి బ్రిజేశే బాధ్యుడని నివేదిక ఇచ్చారు. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై ఆర్మీకి అధికారిక సమాచారం ఇస్తామని పోలీసులు చెప్పారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
చీరాల రూరల్ : పెద్దలు తమ పెళ్లి నిరాకరించారని మనస్తాపంతో ఓ ప్రేమజంట పురుగులమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఈ సంఘటన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మండల పరిధిలోని పిట్టువారిపాలెంకు చెందిన ధర్మరాజు, 300 కాలనీకి చెందిన రాధ కావూరిపాలెంలోని ఓ రొయ్యల కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంలేదు. దీంతో ఇద్దరు పురుగులమందు కొనుగోలు చేసి సేవించారు. అనంతరం రాధ నివాసముండే కాలనీకి వచ్చి జరిగిన విషయం చెప్పారు. దీంతో ఇద్దరిని 108 వాహనంలో చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ఇరువురికి చికిత్సలు చేయడంతో యధాస్థితికి వచ్చారు. ఇదిలా ఉండగా ధర్మరాజు మాత్రం ఆమెను నేను ప్రేమించడం లేదని, ఆమె తనను ప్రేమిస్తున్నానని వెంటపడుతుండేదని తెలిపాడు. అయితే రాధ మాత్రం అతడే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడని, తనకు న్యాయం చేయాలని వేడుకొంటుంది. రంగంలోకి దిగిన పెద్దలు సరిచేసే పనిలో పడ్డారు. -
ప్రేమజంటను చితకబాదిన దుండగుల ముఠా
-
వినుకొండలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం
-
ప్రేమజంటకు హత్యా బెదిరింపులు
అన్నానగర్: కులాంతర వివాహం చేసుకున్న తమకు హత్యా బెదిరింపులు ఎదురవుతున్నాయని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం తిరుప్పూర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మహిళ భర్తతో కలిసి వినతి పత్రం ఇచ్చింది. తిరుప్పూర్ జిల్లా కాంగేయం ముళ్లిపురం కాలనీకి చెందిన రంజిత (22). ఈమె భర్త కదిరేశన్ (25), కుమార్తె నిశాంతి(2) తో పాటు బుధవారం తిరుప్పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చి అక్కడున్న అధికారులకు వినతి పత్రం ఇచ్చింది. అందులో.. 2015లో తాను, కదిరేశన్ ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నామని ప్రస్తుతం రెండేళ్ల కుమార్తె ఉన్నట్టు తెలిపారు. తమ ప్రాంతానికి చెందిన జానకి, విజయ్, చెన్నయప్పన్‌లు గత 25వ తేదీ ఇంట్లోకి చొరబడి వెంటనే ఇక్కడినుంచి ఖాళీ చేయాలని బెదిరించి, తన భర్తపై దాడి చేసి హత్య బెదిరింపులు చేశారని వివరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీఇచ్చారు. -
రక్షణ కల్పించండి
నెల్లూరు(క్రైమ్): కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. సోమవారం వారు నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. వివరాలిలా ఉన్నాయి. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంకు చెందిన జి.రామచంద్రయ్య రెండో కుమార్తె సుమతి నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ నగరంలోని హరనాథపురంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం రాపూరుకు చెందిన కారు డ్రైవర్ మాతయ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో సుమతి కుటుంబసభ్యులు వారి ప్రేమను నిరాకరించారు. దీంతో ఈనెల రెండో తేదీన సుమతి, మాతయ్యలు రాపూరులో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. సుమతి హాస్టల్లో లేదన్న విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు గాలించారు. ఫలితం లేకపోవడంతో నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాతయ్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రేమజంట జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని తమకు రక్షణ కల్పించాలని ఏఎస్పీని కోరారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆయన నాలుగో నగర పోలీసులను ఆదేశించి ప్రేమజంటను ఆ స్టేషన్‌కు పంపారు. ఇన్స్పెక్టర్ వి.సుధాకర్‌రెడ్డి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమతి తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా నిరాకరించింది. తన ఇష్ట్రపకారామే వివాహం చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఇరుకుటుంబాల పెద్దలకు కౌన్సిలింగ్ చేశారు. -
పోలీసుల సమక్షంలో ఏకమైన ప్రేమికులు
సాలూరురూరల్(పాచిపెంట): ఓ ప్రేమ జంట పోలీసుల సమక్షంలో ఏకమైంది. ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లికి అబ్బాయి తరపు వాళ్లు అడ్డుపడి, వేరే అమ్మాయితో పెళ్లికి ముహుర్తం కూడా తీసేశారు. విషయం తెలుసుకున్న అమ్మాయి స్థానికంగా ఉన్న స్ఫూర్తి మహిళా మండలి సభ్యులను ఆశ్రయించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు ప్రేమపక్షుల పెళ్లి జరిగింది. ఎస్టీ,ఎస్సీ సెల్ డీఎస్పీ గురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..పాచిపెంట మండలం పి.కోనవలస పంచాయతీ గంగందొరవలస గ్రామానికి చెందిన పండిక వరలక్ష్మీ అనే అమ్మాయి, అదే మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర భానుప్రకాశ్ అనే వ్యక్తి ఏడాదిన్నరగా ప్రేమించుకున్నారు. అమ్మాయి ఎస్టీ, అబ్బాయి బీసీ సామాజిక వర్గాలకు చెందినవారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తల్లిదండ్రులు వేరే పెళ్లికి సిద్ధమవడంతో అమ్మాయి. స్థానిక స్ఫూర్తి మహిళా మండల అధ్యక్షురాలు బలగ రాధను ఆశ్రయించారు. ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సన్యాసినాయుడు ఇరువర్గాల పెద్దలను స్టేషన్‌కు పిలిపించారు. అబ్బాయి తరపు వాళ్లు అంగీకరించనప్పటికీ ఇద్దరు మేజర్లు కావడంతో తొలుత అమ్మాయి ఇంటి వద్ద గంగందొరవలసలో వివాహం చేసి, తర్వాత సాలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేయించారు. -
ప్రేమ జంటపై దుండగులు దాడి
-
ప్రేమజంటపై దుండగుడి దాడి
-
ప్రేమజంటపై దుండగుడి దాడి
నూజివీడు : పట్టణంలోని సిలువగట్టు ప్రాంతంలో ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని పోలీసులు బుధవారం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని మాడుగులపల్లికి చెందిన గల్లిపోగు సాల్మాన్‌రాజు (23) గతంలో నూజివీడు డీఏఆర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఈనెల 7న పరీక్ష ఉంది. 5 తేదీనే నూజివీడు పట్టణంలోని అజరయ్యపేటలో ఉన్న తన మేనమామ కలపాల రామారావు ఇంటికి వచ్చాడు. ఇతనికి ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని (18)తో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 6న పరీక్ష రాసిన విద్యార్థిని ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం 5.30 గంటల సమయంలో నూజివీడు బస్టాండ్ వద్దకు వచ్చింది. సాల్మాన్‌రాజు, విద్యార్థిని కలిసి సిలువగట్టు ప్రాంతానికి సాయంత్రం 6గంటల సమయంలో వెళ్లారు. గట్టుపైన ఉన్న మేరీమాత గుడి వద్ద కూర్చొని ఉండగా దుండగుడు కట్టెదుంగతో వచ్చి డబ్బులు ఇవ్వాలని జంటను కోరాడు. వారు తమ దగ్గర లేవని సమాధానం చెప్పడంతో చేతిలో ఉన్న దుంగతో దాడి చేశాడు. విద్యార్థిని తన వద్ద ఉన్న రూ.3వేలు దుండగుడికి ఇచ్చింది. అవి తీసుకుని దుండగుడు వెళ్లిపోయాడు. వీరిద్దరూ దెబ్బలకు స్పృహతప్పి పడిపోయారు. బుధవారం ఉదయం 10గంటల సమయంలో కొందరు సిలువగట్టుపైకి ఎక్కుతుండగా అపస్మారక స్థితిలో ఉన్న జంట కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, సీఐ మేదర రామ్‌కుమార్ సందర్శించారు. దాడిచేసిన దుండగుడు ఎర్రగా, పిల్లికళ్లు కలిగి ఉన్నాడని బాధితులు చెపుతున్నారు. పట్టణ ఎస్ఐ–2 పీ ఏసుపాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల్లో రెండో సంఘటన రెండు నెలల కాలంలో ఈ సంఘటన రెండోది కావడం గమనార్హం. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ముసునూరు మండలానికి చెందిన జంట విజయవాడ నుంచి వస్తూ సిలువగట్టు వద్దకు వెళ్లగా దుండగుడు కర్రదుంగతో వ్యక్తి తలపై బలంగా కొట్టడంతో పడిపోయాడు. అతని వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్ బ్యాగ్, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. మళ్లీ ఇదే తరహాలో సంఘటన ఇప్పుడు చోటుచేసుకోవడం గమనార్హం. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
రొంపిచెర్ల: తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని ప్రేమజంట రొంపిచెర్ల పోలీ సులను ఆశ్రయించారు. వారు చెప్పిన వివరాల మేరకు.. కలకడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన బాలినేని శీనయ్య కుమార్తె శ్రావణి(21) హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. రొంపిచెర్ల మండలం చెంచెంరెడ్డిగారిపల్లె దళితవాడకు చెందిన నారాయణ కుమారుడు గణెష్(26) హైదరాబాదులో ప్రయివేటు అడిటర్ దగ్గర పనిచేస్తున్నారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఫిబ్రవరి 8వ తేదీన హైదరాబాదులో వివాహం చేసుకున్నారు. తమకు శ్రావణి కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదముందని, రక్షణ కల్పిం చాలని రొంపిచెర్ల ఎస్ఐ నాగార్జునరెడ్డికి వారు మొరపెట్టుకున్నారు. -
ప్రేమకు ఒక రోజు సెలవు ఇవ్వాలి..!
సాక్షి, బెంగళూరు: ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా యావత్తు ప్రపంచం సెలబ్రేట్ చేస్తోంది. ఈ వాలంటైన్స్ డేకు కర్ణాటక రక్షణ వేదిక ఆశ్చర్యకరమైన పద్ధతితో మద్దతు తెలిపింది. ప్రేమకు మద్దతుగా కమిటీ వారు రెండు గొర్రెలకు వివాహం చేశారు. ఈ సందర్భంగా రక్షణ వేదిక సభ్యుడు నాగరాజు మాట్లాడుతూ.. ప్రేమకు ఎటువంటి కులం, మతం, వర్గం అని భేదం లేదని అన్నారు. అలాంటిది మనం వాలంటైన్స్ డేకి అభ్యంతరం చెప్పకూడదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రేమ కోసం ఒక రోజును సెలవుగా ప్రకటించాలని ఆయన కోరారు. అంతేకాక రాష్ట్రం ప్రభుత్వం కూడా ప్రేమ వివాహం చేసుకున్న జంటలకు సహాయం చేయాలన్నారు. ఆ జంటకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50వేల నుంచి లక్ష రూపాయాలు ఆర్థికంగా అదుకోవాలని వారు కోరారు. -
కులం అడ్డొచ్చినా.. పెద్దలను ఒప్పించాం
అక్షరానికి అంతు పట్టనిదే ప్రేమ! దీనికి అర్థం ఎక్కడా దొరకదు. ఒకవేళ అర్థం చేసుకున్నా.. దానిని గుర్తించడం చాలా కష్టం. అటుఇటూ తిరిగి గుర్తించినా.. ఆ భావాన్ని వర్ణించలేరు. ఒకవేళ వర్ణించినా.. దానికి అంతు అంటూ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అంటే అందరిలో ఉండేదే.. అయితే కొందరికి మాత్రమే దక్కుతుంది. మనసుకు మాటంటూ వస్తే అది పలికే తొలి మాట ఏమిటో తెలుసా? నువ్వంటే ఇష్టమని.... కులమతాలు, పేద ధనిక తారతమ్యాలను అధిగమించి.. ప్రేమను గెలిపించుకున్న వారెందరో జిల్లాలో ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో పాటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరెందరో. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరి తీపి జ్ఞాపకాలు మీ కోసం.. డీఎన్బీ చేసేందుకు 2010లో హైదరాబాద్లోఏని యశోద ఆసుపత్రిలో చేరా. అక్కడ సింధు మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. సబ్జెక్టు విషయంలో ఇద్దరూ చర్చించుకునేవాళ్లం. ఆ సమయంలోనే యూఎస్ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనేది తన కల అని చెప్పింది. నాలాగే ఆలోచించే వ్యక్తి తోడు కావడంతో అప్పటికే నేను కూడా విదేశాలకు వెళ్లాలనుకున్న విషయాన్ని ఆమెతో చెప్పా. ఇద్దరం పోటీపడి చదివాం. ఈ క్రమంలోనే మా మధ్య ప్రేమ చిగురించింది. విషయాన్ని మా నాన్న శేషారెడ్డికి చెప్పగా సరేనన్నారు. ఇక సింధు తన తల్లిదండ్రులతో చెప్పగా తమిళియన్స్ కాస్త వెనుకంజ వేశారు. సింధు మాత్రం తన నిర్ణయానికే కట్టుబడింది. ఎట్టకేలకు ఇరువైపుల తల్లిదండ్రులను ఒప్పించి 2011లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం ఎండీ పూర్తి చేశాం. నేను న్యూరో ఫిజీషియన్‌గా, తను గైనకాలజిస్టుగా సేవలందిస్తున్నాం. మా ప్రేమకు ప్రతిరూపమే నాలుగేళ్ల గమ్య. లైఫ్ చాలా సంతోషంగా సాగిపోతోంది. ప్రేమకు ఓపిక తప్పనిసరి. ప్రేమ వివాహం చేసుకోవడంతో పాటు జీవితంలో లక్ష్యాన్ని ఏర్పర్చుకొని గుర్తింపును సొంతం చేసుకోవాలి. ప్రేమలో ఓడిపోయామనే బాధతో ఆత్మహత్యకు పాల్పడటం తగదు. ఉన్నతస్థాయికి చేరుకుని తల్లిదండ్రులను మెప్పించి ప్రేమను గెలుచుకోవాలి.’’ – డాక్టర్ కృష్ణకాంత్ రెడ్డి,డాక్టర్ ఆర్.సింధూ దంపతులు పాతికేళ్ల కిందట కర్నూలు మెడికల్ కళాశాలలో మేమిద్దరమూ కలిసి చదువుకున్నాం. అభ్యుదయ భావాలు కలిగిన మా మనసులు కలిసి పెళ్లి చేసుకున్నాం. 1989లో అనంతపురంలో ప్రజా వైద్యశాల ప్రారంభించి, నామమాత్రపు ఫీజులతో రోగులకు సేవలందిస్తూ వస్తున్నాం. ప్రేమించడం అనేది యువత సహజ లక్షణం. అది తప్పు కూడా కాదు. కానీ ప్రేమ పేరుతో ఒకరినొకరు వంచన చేసుకోవడం మంచిది కాదు. – డాక్టర్ గేయానంద్ (మాజీ ఎమ్మెల్సీ),డాక్టర్ ప్రసూన(మాజీ కార్పొరేటర్) పెద్దలను ఒప్పించి.. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలంటే పెద్దల అంగీకారం తప్పనిసరి అని భావిస్తాం. 2003లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో మా మధ్య ప్రేమ చిగురించింది. కులాలు వేరు కావడంతో మా ప్రేమ మా చదువులకు ఇబ్బందిగా మారుతుందని భయపడ్డాం. దీంతో ఇద్దరమూ మా ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలిపాం. రెండు కుటుంబాల్లోనూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. – కోటి సూర్యప్రకాష్‌బాబు(ఎంపీపీ, బత్తలపల్లి),కోటి సుధ ( జెడ్పీటీసీ మాజీసభ్యురాలు) పెద్దలను ఒప్పించగలిగాం మా ఊళ్లో చీమల దొడ్డప్ప అనే పెద్దమనిషి ఉన్నారు. ఆయన మేనకోడలు లావణ్య. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఆమె ఇంటర్మీడియట్ చదువుకునేందుకు మేనమామ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో మా మధ్య పరిచయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మా ఇంటిలో పెద్దలు వేరొకరితో పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. నేను వద్దని చెప్పి, లావణ్య గొప్ప మనసు గురించి ఇంట్లో వాళ్లకి చెప్పి వారిని ఒప్పించాను. కానీ మా పెళ్లికి లావణ్య వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చాలా బాధపడ్డాను. ఒక సంవత్సరం పాటు లావణ్య తల్లిదండ్రులకు మా బంధువుల ద్వారా చెప్పిస్తూ వచ్చాను. ఎట్టకేలకు వారిని ఒప్పించగలిగాను. 2004 ఏప్రిల్ 20న మా పెళ్లి జరిగింది. ప్రస్తుతం మాకు ముగ్గురు అమ్మాయిలు. ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. – కొండా యాదవ్, లావణ్య, కల్లూరు వీడి ఉండలేక... మా సొంత ఊరు బుక్కరాయసముద్రం మండలం జంతులూరు. 2005లో మా మధ్య ప్రేమ మొదలైంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవాళ్లం. మా విషయం పెద్దలకు తెలిసి కోప్పడ్డారు. మా పెళ్లికి ఒప్పుకోలేదు. అదే ఏడాది ఇంటి నుంచి బయటపడి పెళ్లి చేసుకున్నాం. హైదరాబాద్‌కు చేరుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాం. చాలా కష్టపడ్డాం. జీవితంలో నిలదొక్కుకున్నాం. ఆ తర్వాత చాలా రోజులకు మా రెండు కుటుంబాల పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రశాంతంగా జీవిస్తున్నాం. – నాగలింగ, ఆదిలక్ష్మి, హైదరాబాద్ ఛాలెంజ్‌గా తీసుకుని.. మాదీ కులాంతర వివాహమే. 2010లో గుంతకల్లు నివాసి రాబియాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. మా పెళ్లికి ఇరువైపులా పెద్దలు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఏం చేయాలో మాకు పాలుపోలేదు. ఇద్దరమూ నిరుద్యోగలమే. అయినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి దీంతో పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత మాకు పెద్దల పట్ల మరింత గౌరవ భావం పెరిగింది. బతుకును ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ఎలాంటి ఒడిదుడకులు ఎదురైనా విడిపోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాం. 2011లో కానిస్టేబుల్‌గా నేను ఎంపికయ్యాను. రాబియా కూడా పట్టుదలతో టీచర్‌గా ఉద్యోగం సాధించుకుంది. మేము జీవితంలో స్థిరపడడంతో మా పెద్దలకు మాపై నమ్మకం కలిగింది. మమ్మల్ని మనసారా ఆశీర్వదించారు.– టి. ప్రేమ్‌కుమార్ (కానిస్టేబుల్),రాబియా (టీచర్) జీవితంలో గెలవాలి ప్రేమే జీవితం కాదు. జీవితంలో గెలిచినప్పుడే ప్రేమ కచ్చితంగా దొరుకుతుంది. చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోలేక ప్రేమ వివాహం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత జీవితాన్ని గెలవలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నమ్మి వచ్చిన భాగస్వామికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడంలోనే నిజమైన ప్రేమ ఉంది. రాప్తాడులో మా ఇళ్లు పక్కనే ఉండడంతో కాలేజీకి వెళ్లే సమయంలో ప్రేమలో పడ్డాం. పెద్దలను కాదని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాం. – దండు మురళి, దివ్య భారతి, రాప్తాడు. ప్రేమ వివాహంలోనే ఆనందం కులాల అడ్డుగోడల్ని కూల్చి 22 సంవత్సరాల క్రితం మేము పెళ్లి చేసుకున్నాం. వాస్తవానికి మా ఇద్దరి తల్లిదండ్రులు బాల్య స్నేహితులు. అయినా మా ప్రేమకు ఇరువైపులా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పెద్దలకు చెప్పకుండా 1995లో ఇంటినుంచి చెక్కేసి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఎలాంటి మాట పట్టింపులు రాలేదు. పెద్దలు చేసిన పెళ్లిళ్లు ఎన్ని సక్రమంగా నిలుస్తున్నాయి? సర్దుబాటు చేసుకుంటేనే వివాహ బంధాలు నిలబడతాయని మా నమ్మకం. ఆందుకే ప్రేమ పెళ్లిలోనే ఆనందం ఉంది.– చిట్రా మనోహరబాబు (లెక్చరర్), గాయత్రి, ఆకుతోటపల్లి, అనంతపురం రూరల్ మండలం ఆకర్షణ కాదు.. నమ్మకం ప్రేమంటే ఆక్షరణ కాదు.. ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకం. అదే మమ్మల్ని కలిపింది. హిందూపురంలో డిగ్రీ చదువుతున్న సమయంలో మా మధ్య ప్రేమ చిగురించింది. మా పెళ్లికి కులాల పేరుతో పెద్దలు అంగీకరించలేదు. తమ్ముడు, స్నేహితులు సహకరించారు. తర్వాత అనంతపురానికి చేరి ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్లుగా చేరాం. తర్వాత నాకు ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. కానీ నచ్చక వదిలేశా. అరుణ ప్రస్తుతం ఉరవకొండలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. మా పెద్దలు కూడా కలిసిపోయారు. – శ్రీనివాసులు, అరుణ (లెక్చరర్), చిలమత్తూరు బాధ్యతతో కూడుకున్నది... మా ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు తెలిసిన తర్వాత మొదట్లో కాదన్నారు. అతి కష్టంపై వాళ్లను ఒప్పించి 2008లో పెళ్లి చేసుకున్నాం. ప్రేమ వివాహాలు చాలా బాధ్యతతో కూడుకున్నవి. ఏ సమస్య వచ్చినా స్వయంగా పరిష్కరించుకోవాలి. పెద్దల సహకారం ఉండదు. రక్షణ ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. – కంచుకుంట శేఖర్ (కానిస్టేబుల్), మౌనిక, రాప్తాడు -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. గొంతు కోసి హత్య
-
ప్రేమించి పెళ్లి చేసుకున్నారని..
సిరిసిల్ల: ప్రేమించి పెళ్లి చేసుకుని తమ పరువు తీశారనే ఆగ్రహంతో ప్రేమ జంటను దారుణంగా హత్యచేశారు. తమ చేతుల మీదుగా పెంచిన మేనకోడలిని, ఆమె భర్తను మేనమామలే గొంతు కోసి చంపేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బాలరాజ్‌పల్లిలో గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రేమ జంట నేదూరి హరీశ్ (24), రచన (22) అక్కడికక్కడే మృతి చెందారు. నిందితులు పరారయ్యారు. పెంచిన చేతులతోనే చంపేశారు చందుర్తి మండలం రామన్నపేటకు చెందిన దమ్ము లక్ష్మణ్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె రచన. తండ్రి లక్ష్మణ్ అనారోగ్యంతో చాలా కాలం కిందే మరణించగా.. తల్లి కొన్నేళ్ల కింద కన్నుమూసింది. దాంతో బాలరాజ్పల్లెకు చెందిన మేనమామలు శేఖర్, అశోక్, నాగరాజులు కలసి రచనను పెంచి, చదివించారు. డిగ్రీ చదువుతున్న ఆమె కొంతకాలంగా మేనమామల ఇంటికి సమీపంలో ఉండే నేదూరి హరీశ్ (24)ను ప్రేమించింది. వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమే అయినా రచన మేనమామలు పెళ్లికి అంగీ కరించలేదు. దీంతో రెండు నెలల కింద ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయి హరీశ్‌ను వివాహం చేసుకుంది. వారు హరీశ్ ఇంట్లోనే కాపురం పెట్టారు. అయితే రచన ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ పరువు పోయిందని ఆమె మేనమామలు ఆగ్రహం పెంచుకున్నారు. పథకం ప్రకారం వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం మేనమామలు నేదూరి శేఖర్, అశోక్, నాగరాజు కుమారుడు మనోజ్ (చింటు) ముగ్గురు కత్తులు చేతబట్టుకుని హరీశ్ ఇంట్లోకి వెళ్లారు. రచనను, హరీశ్‌ను గొంతుకోశారు. అక్కడే ఉన్న హరీశ్ తల్లి వజ్రవ్వ రోదిస్తూ ఆపేందుకు ప్రయత్నించినా వినలేదు. రచన, హరీశ్ రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే మరణించారు. అనంతరం నిందితులు ముగ్గురూ పరారయ్యారు. వేములవాడ సీఐలు శ్రీనివాస్‌రావు, మాధవిలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కడే కుమారుడు హత్యకు గురైన హరీశ్ తండ్రి ఎల్లయ్య, తల్లి వజ్రవ్వ వ్యవసాయ కూలీలు. వయసు మీదపడటంతో వారు కుమారుడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు హరీశ్ హత్యకు గురికావడంతో ఆవేదనతో కుప్పకూలిపోయారు. -
తాడేపల్లికి చేరిన ‘బెజవాడ బ్లేడ్ బ్యాచ్’
►రైలు వంతెనలను అడ్డాగా చేసుకున్న వైనం ►ప్రేమజంటలు, పాదచారులే లక్ష్యం తాడేపల్లి రూరల్: బెజవాడ బ్లేడ్ బ్యాచ్ తమ మకాం ను తాడేపల్లికి మార్చింది. ఒంటరిగా కనిపించిన వారిపై దాడిచేసి నిలువుదోపిడీ చేయడం, ప్రతిఘటిస్తే బ్లేడ్లతో శరీరంపై కోతలు పెట్టడం ఈ బ్యాచ్ పని. ఈ బ్యాచ్ ఆగడాలను భరించలేని విజయవాడ పోలీసు కమిషనర్ హార్ట్కోర్గా గుర్తించిన కొందరికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. అలా బహిష్కరణకు గురైనవారు నగరంలో కనిపిస్తేచాలు, నేరం చేసినా, చేయకపోయినా కటకటాలు లెక్కించాల్సిందే. ఇలా నగర బహిష్కరణకు గురైన బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు సమీపంలోని తాడేపల్లి మహానాడులో ఉంటూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది రైల్వే వంతెనలను అడ్డాగా చేసుకున్నారు. రైలు వంతెనలపై వెళ్లే పాదచారులు, కృష్ణా నదికి ఇసుక తిన్నెలు, రైలు వంతెనలపైకి విహారానికి వచ్చే ప్రేమికులను టార్గెట్ చేసి బ్లేడ్ బ్యాచ్ తమ కార్యకలాపాలను యథేచ్చగా సాగిస్తోంది. వారి కర్కశత్వానికి ఆదివారం ఓ యాచకుడు కరాట సురేష్ గాయాలపాలైన సంఘటన చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానంచేసి రైలు వంతెన కింద నుంచి ఆంజనేయస్వామి ఆలయానికి వస్తుండగా బ్లేడ్‌బ్యాచ్ కంటపడ్డాడు. ఆ బ్లేడ్‌బ్యాచ్ తనను తీవ్రంగా కొట్టి, బ్లేడుతో బెదిరించి, తన వద్ద ఉన్న సొమ్మును లాక్కొని చేతులు విరగదీసినంత పనిచేసిందని బాధితుడు సురేష్ వాపోయాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చుగా అని స్థానికులు సూచించగా, ఫిర్యాదు చేస్తే చంపేస్తారేమో అని భయం వ్యక్తంచేయడం బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలను తెలియజేస్తోంది. తాను మెదక్ జిల్లా నుంచి వచ్చానని, ఎలా ఫిర్యాదు చేయగలనని బాధితుడు వాపోవడం గమనార్హం! కొద్ది రోజుల క్రితం కృష్ణానది వంతెనలపై బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణలో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ నగర బహిష్కరణకు గురైన రవి అనే బ్లేడ్‌బ్యాచ్ లీడర్ మహానాడుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. రవి కోసం అయన స్నేహితులు రోజూ 25 మంది నుంచి 30 మంది దాకా మహానాడుకు వచ్చి పోతుంటారు. ఇందుకు దగ్గరి దారిగా ఉన్న కృష్ణా నది రైలు వంతెనలను రాకపోకలకు వాడుతూ, తమలాగే ఈ వంతెనలపై నుంచి అనేకమంది రావడం పోవడం గమనించి వారిని దోచుకోవడం ప్రారంభించారు. ఈ రైలు వంతెనల పరిధి రైల్వే పోలీసులది కావడం, రైల్వే పోలీసుల పహారా తక్కువగా ఉండడం బ్లేడ్ బ్యాచ్‌కు కలిసి వచ్చింది. అది తమ పరిధిలోది కాకపోవడంతో తాడేపల్లి పోలీసులు ఈ వంతెనలపై దృష్టి సారించరు. జనసంచారం అంతగా లేకపోవడం, బ్రిడ్జికి అటుఇటు రైల్వే పోలీసులు గస్తీకి వస్తే పారిపోయేందుకు ముందస్తు హెచ్చరికలు చేసేవీలుంది. ఏకాంతం కోరుకునే జంటలు రైల్వే వంతెనలపైకి ఊసులాడుకుంనేందుకు వచ్చి ఈ ముఠా బారిన పడి అవమానాల పాలైన ఘటనలు లేకపోలేదు. గత నెల చివరిలో విజయవాడకు చెందిన ఓ యువజంటను బెదిరించి నగలు, నగదు అపహరించడమే కాకుండా యువకుడిపై వికృత చేష్టలకు దిగడం గమనార్హం! వినోద్ అనే రైల్వే వెండర్‌పై పలుమార్లు దాడులు చేయడం, ఆయన, అతని స్నేహితులు ఈ ముఠాతో ఘర్షణకు దిగడంతో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితం ఇదే ముఠాకు చెందిన ఓ యువకుడిని స్థానికులు ప్రతిఘటించి పట్టుకోబోయారు. ఆ యువకుడు తన వద్దవున్న బ్లేడుతో చేతులపై కోసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. బ్లేడ్‌బ్యాచ్‌ల అరాచకాలను అరికట్టేందుకు పోలీసులు చొరవచూపాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రేమజంట ఆత్మహత్య
టీనగర్,న్యూస్‌లైన్: పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తిరువారూరు జిల్లాలో చోటుచేసుకుంది. నీడామంగళం సమీపంలోగల వయ్యగళత్తూర్ గ్రామం దక్షిణ వీధికి చెందిన జయరామన్. ఇతని కుమారుడు రంజిత్‌కుమార్ (25) పట్టభద్రుడు. అదే ప్రాంతానికి చెందిన మదియళగన్ కుమార్తె జయప్రియ (20). వీరు ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. దీంతో జీవితంలో ఒకటి కాలేమని, చావులోనైనా ఒక్కటయ్యేందుకు నిర్ణయించారు. బుధవారం ఒం టరిగా ఇంట్లో ఉన్న రంజిత్‌కుమార్ జయప్రియను ఇంటికి రప్పించి ఆమెకు తాళికట్టి పెళ్లాడాడు. వెంటనే దంపతులు ఇద్దరూ క్రిమి సంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు వారిని నీడామంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రంజిత్‌కుమార్, జయప్రియ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంటలు
చిత్తూరు(క్రైమ్/కొంగారెడ్డిపల్లె), న్యూస్‌లైన్: పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని గురువారం వేర్వేరుగా రెండు ప్రేమజం టలు ఎస్పీ కాంతిరాణాటాటాను కలసి విన్నవించాయి. మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన శ్రీరాములు కుమార్తె ఉమాదేవి(23) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోం ది. 6 నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం ముళబాగల్ తాలూకా సిద్దంపల్లెకు చెందిన లక్ష్మీపతితో ఉమాదేవికి పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో పెద్దల కు తెలియకుండా కోలారులోని ఓ దేవస్థానంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి అమ్మాయి తరఫు బంధువులు చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అలాగే పుత్తూరుకు చెందిన మరో ప్రేమజంట ఎస్పీని కలిసి రక్షణ కోరిన అనంతరం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. పుత్తూరుకు చెందిన ఆర్.పద్మజ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. అదే కంపెనీలో తనతోపాటు పనిచేస్తున్న పుత్తూరుకు చెందిన పి.హరికృష్ణను ప్రేమించింది. వీరు ఈ నెల 8 వ తేదిన పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో పద్మజ కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించకుండా బెదిరిస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వారు కోరారు.